రాడ్లు, కర్రలతో వైద్యుడిపై దాడి
మాల్దా: అప్పుడే పుట్టిన పసికందు చనిపోయిందని ఆగ్రహంతో ఊగిపోయిన ఓ గ్రామస్థులు వైద్యుడిని చితక్కొట్టారు. ఇనుపరాడ్లు, కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని మాల్దాలో చోటుచేసుకుంది. జయదీప్ మజుందార్ అనే వైద్యుడు మాల్దాలోని మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో బ్లాక్ మెడికల్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఆయనవద్దకు ఓ మహిళ పురిటి నొప్పులతో రాగా ఆమెను మానిక్ చౌక్ అనే రూరల్ ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా మజుందార్ చెప్పారు. దీంతో ఆయన సూచనమేరకు వారు మానిక్ చౌక్ ఆస్పత్రికి ఆస్పత్రిలో వెళుతుండగా మార్గం మధ్యంలో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, పుట్టిన వెంటనే ఆ పసిపాప ప్రాణాలు విడిచింది. దీంతో తీవ్ర కోపానికి లోనైన సదరు కుటుంబీకులు కొందరు గ్రామస్తులు కలిసి రాడ్లు కర్రలతో చితక్కొట్టారు.