dodla dairy
-
Stock Exchange : కిమ్స్, దొడ్ల... శుభారంభం
ముంబై : స్టాక్ ఎక్సేంజ్‌లో దొడ్ల డెయిరీ, కిమ్స్ హస్పిటల్స్‌కి సంబంధించిన షేర్లు దూసుకుపోతున్నాయి. ఇటీవల ఈ రెండు సంస్థలు ఐపీవోను జారీ చేశాయి. అనంతరం జూన్ 28న తొలిసారిగా స్టాక్మార్కెట్లో లిస్టయ్యాయి. ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే ఈ రెండు సంస్థలకు చెందిన షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఉత్సాహాం చూపించారు. కిమ్స్ సానుకూలం కిమ్స్ హాస్పిటల్ సంస్థ షేరు రూ. 825తో మొదలవగా కాసేపట్టికే 25 శాతం పెరిగి రూ. 1034 దగ్గర గరిష్ట స్థాయికి చేరుకుంది. నేషనల్ స్టాక్ ఎక్సెంజీలో రూ. 1036 వరకు చేరుకుంది. కిమ్స్ షేర్ల ట్రేడింగ్ పట్ల మార్కెట్ సానుకూలంగానే ఉంది. సౌతిండియాలో కిమ్స్ ఆధ్వర్యంలో 9 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉన్నాయి. 3,064 బెడ్ల సామర్థ్యం ఉంది. దొడ్ల షేర్ ఇలా తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ డైయిరీ సంస్థైన దొడ్ల సైతం ఈ రోజు స్టాక్ మార్కెట్ తొలి సారి లిస్టయ్యింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో దొడ్ల షేర్ 475 -525 మధ్యన ట్రేడ్ అవుతోంది. ఒక దశలో షేర్ వాల్యూ 33 శాతం పెరిగి రూ. 575 దగ్గర నమోదైంది. ఎన్ఎస్సీలో రూ. 572 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ రెండు సంస్థలకు సంబంధించి ఐపీవోలు జూన్ 16 నుంచి 18వరకు ముగిశాయి. చదవండి : Mahindra XUV 700: మేఘాలలో తేలిపోమ్మనది -
దొడ్ల ప్రైస్ బ్యాండ్ రూ. 421-428
ముంబై: దక్షిణ భారత్‌లోని ప్రైవేట్ డెయిరీలో ఒకటైన దొడ్ల తొలిసారిగా పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. జూన్ 16 నుంచి 18 వరకు ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) అందుబాటులో ఉంటుంది. షేర్‌బ్యాండ్ విడ్త్‌ని రూ. 421 నుంచి 428గా నిర్ణయించారు. మొత్తంగా ఒక కోటి తొమ్మిది లక్షల షేర్లు ఐపీవోలకి రానున్నాయి. ఐపీవో వివరాలు దొడ్ల జారీ చేసిన ఐపీవోలు 50 శాతం షేర్లను క్వాలిఫైడ్ ఇన్సిస్టిట్యూషన్ బయ్యర్స్‌కి కేటాయించారు. మిగిలిన షేర్లలో 35 శాతం రిటైల్, మిగిలిన 15 శాతం వాటాలను నాన్ ఇన్సిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రలలో దొడ్ల డైయిరీ పాల ఉత్పత్తుల వ్యాపారం చేస్తోంది. 2021 మార్చి నాటికి సగటున రోజకు పది లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేయగల సామర్థ్యం ఉన్నట్టు దొడ్ల డెయిరీ ప్రకటించింది. చదవండి : stockmarkets: రికార్డుల మోత -
దొడ్ల డెయిరీ ఐపీఓకు సెబీ ఓకే
న్యూఢిల్లీ: దొడ్ల డెయిరీ కంపెనీ ఐపీఓకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఈ కంపెనీ ఐపీఓతో పాటు మరో మూడు కంపెనీలు– ఆఫిల్ ఇండియా, చాలెట్ హోటల్స్, హర్ష ఇంజినీర్స్ ఐపీఓలకు కూడా పచ్చజెండా ఊపింది. దీంతో ఈ ఏడాది ఇప్పటిదాకా సెబీ అనుమతించిన ఐపీఓల సంఖ్య 64కు పెరిగింది. దొడ్ల డెయిరీ ఐపీఓ @ రూ.500 కోట్లు దక్షణ భారతదేశంలో ప్రముఖ డెయిరీ... దొడ్ల డెయిరీ ఐపీఓలో భాగంగా రూ.150 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. వీటితో పాటు ఆఫర్ ఫర్ సేల్‌లో భాగంగా 95.4 లక్షల ఈక్విటీ షేర్లను కూడా విక్రయించనున్నది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ ఈ ఐపీఓ ద్వారా రూ.500 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఈ ఐపీఓ నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి, డెయిరీ సంబంధిత సరంజామా కొనుగోలు చేయడానికి, సాధారణ వ్యాపార కార్యకలాపాలకు వినియోగించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా ఎడిల్‌వేజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ వ్యవహరిస్తాయి. ఆఫిల్ ఇండియా ఐపీఓ సైజు రూ.650 కోట్లు ఆఫిల్ ఇండియా ఐపీఓలో భాగంగా రూ.90 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయనున్నది. వీటితో పాటు ఈ కంపెనీలో వాటాలున్న సింగపూర్‌కు చెందిన ఆఫిల్ హోల్డింగ్స్ సంస్థ 55 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో జారీ చేయనున్నది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.650 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఈ నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, ఇతర సాధారణ వ్యాపార అవసరాలకు వినియోగించుకోవాలని ఈ కంపెనీ ఆలోచన. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, నొముర ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్ వ్యవహరిస్తున్నాయి. ఛాలెట్ హోటల్స్ ఐపీఓ @ రూ.2,000 కోట్లు కె.రహేజా కార్పొరేషన్‌కు చెందిన ఆతిథ్య రంగ కంపెనీ, ఛాలెట్ హోటల్స్.. రూ.950 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. వీటితో పాటు 2.46 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయిస్తారు. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.2,000 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా జేఎమ్ ఫైనాన్షియల్, యాక్సిస్ క్యాపిటల్, మోర్గాన్ స్టాన్లీలు వ్యవహిస్తున్నాయి. మారియట్, రెనైసాన్స్ తదితర బ్రాండ్ల హోటళ్లను ఈ కంపెనీ నిర్వహిస్తోంది. హర్ష ఇంజినీర్స్ ఐపీఓ సైజు రూ.500 కోట్లు హర్ష ఇంజినీర్స్ కంపెనీ ప్రెసిషన్ బేరింగ్ కేజ్‌లను తయారు చేస్తోంది. ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ రూ.370 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. వీటితో పాటు 13.25 లక్షల ఈక్విటీ షేర్లను ఈ కంపెనీ వాటాదారులు ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయిస్తారు. ఈ ఐపీఓ సైజు రూ. 500 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా యాక్సిస్ క్యాపిటల్, ఎడిల్‌వేజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లు వ్యవహరిస్తున్నాయి. -
కల్తీకి తావివ్వకుండా పాల సరఫరా
సాక్షి, బెంగళూరు : గత పదిహేనేళ్లుగా పాల సరఫరా రంగంలో సేవలందిస్తున్న తమ సంస్థ ఎటువంటి కల్తీకి తావివ్వకుండా పాలను సరఫరా చేస్తూ వస్తోందని దొడ్ల డెయిరీ సేల్స్ విభాగం రీజనల్ మేనేజర్ జే.డి.ఎజ్రా వెల్లడించారు. రాష్ట్రంలో పాలను సరఫరా చేస్తున్న కొన్ని ప్రైవేటు డెయిరీలు నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదంటూ కొన్ని పత్రికల్లో (సాక్షి కాదు) వచ్చిన కథనాలపై ఆయన పైవిధంగా స్పందించారు. శనివారమిక్కడ నిర్వహించిన విలేకరుల సవూవేశంలో పలమనేరులోని దొడ్ల డెయిరీ ప్లాంట్ మేనేజర్ విశ్వనాథ్ రెడ్డితో కలిసి జే.డి.ఎజ్రా వ ూట్లాడారు. నగరంలో పాలను సరఫరా చేస్తున్న ప్రైవేటు డెయిరీల్లో తమ సంస్థ నుంచే ఎక్కువ పాలు నగరంలో అమ్ముడవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 55 పాల చిల్లింగ్ కేంద్రాలను కలిగి ఉన్న తమ సంస్థ రోజుకు 8.5 లక్షల లీటర్ల పాలను ప్రాసెసింగ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పారు.