dooms day
-
ITGC Thwaites Glacier: ‘ప్రళయ’ గ్లేసియర్తో... విలయమే!
మనిషి అత్యాశ భూమి మనుగడకే ఎసరు పెట్టే రోజు ఎంతో దూరం లేదని మరోసారి రుజువైంది. గ్లోబల్ వారి్మంగ్ దెబ్బకు అంటార్కిటికాలోని ‘డూమ్స్‌డే’ గ్లేసియర్ ఊహించిన దానికంటే శరవేగంగా కరిగిపోతోందట. అది మరో 200 ఏళ్లలోపే పూర్తిగా కరగడం ఖాయమని తాజా అంతర్జాతీయ అధ్యయనం ఒకటి కుండబద్దలు కొట్టింది. ‘‘అప్పుడు సముద్రమట్టాలు కనీసం పదడుగుల దాకా పెరిగిపోతాయి. అమెరికా నుంచి ఇంగ్లాండ్ దాకా, బంగ్లాదేశ్ నుంచి పసిఫిక్ దీవుల దాకా ప్రపంచమంతటా తీర ప్రాంతాలన్నీ నీటమునుగుతాయి. తీరప్రాంత మహానగరాలన్నీ కనుమరుగైపోతాయి. పైగా మనం అంచనా కూడా వేయలేనన్ని మరిన్ని దారుణ ఉత్పాతాలకు కూడా ఈ పరిణామం దారితీస్తుంది’’ అని స్పష్టం చేసింది. 2018 నుంచి ఆ గ్లేసియర్ కరుగుదల తీరుతెన్నులను ఆరేళ్లపాటు లోతుగా పరిశీలించిన మీదట ఈ నిర్ధారణకు వచి్చంది. ‘‘శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా ఆపేయడం వంటి చర్యలతో గ్లోబల్ వారి్మంగ్‌కు ఇప్పటికిప్పుడు ఏదోలా అడ్డుకట్ట వేసినా లాభమేమీ ఉండకపోవచ్చు. ఈ గ్లేసియర్ కరుగుదల రేటును తగ్గించడం ఇక దాదాపుగా అసాధ్యమే’’ అని గురువారం విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది! అంటార్కిటికాలో థ్వైట్స్ గ్లేసియర్ విస్తృతిలో ప్రపంచంలోనే అతి పెద్దది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం సైజులో ఉంటుంది. ఇది కరిగితే సముద్ర మట్టాలు ప్రమాదకర స్థాయిలో పెరిగి ప్రపంచ మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తాయి. దాంతో సైంటిస్టులు దీన్ని డూమ్స్‌డే (ప్రళయకాల) గ్లేసియర్‌గా పిలుస్తుంటారు. అందుకే ‘ఇంటర్నేషనల్ థ్వైట్స్ గ్లేసియర్ కొలాబరేషన్’ పేరిట దిగ్గజ సైంటిస్టులంతా బృందంగా ఏర్పడి 2018 నుంచీ దీని కరుగుదల తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తూ వస్తున్నారు. ఇందుకు ఐస్ బ్రేకింగ్ షిప్పులు, అండర్‌వాటర్ రోబోలను రంగంలోకి దించారు. ఐస్ఫిన్ అనే టార్పెడో ఆకారంలోని రోబోను ఐస్‌బర్గ్ అడుగుకు పంపి పరిశోధించారు. అది అత్యంత ప్రమాదకరమైన వేగంతో కరిగిపోతూ వస్తోందని తేల్చారు. నివేదికలోని ముఖ్యాంశాలు... → డూమ్స్‌డే గ్లేసియర్ కరగడం 1940 నుంచీ క్రమంగా ఊపందుకుంది. గత 30 ఏళ్లుగా శరవేగంగా కరిగిపోతోంది. అది ఈ శతాబ్దంలో ఊహాతీతంగా పెరిగిపోనుంది. → మరో 200 ఏళ్లలోపే గ్లేసియర్ తాలూకు మంచుపొరలన్నీ కుప్పకూలి కరగడం ఖాయం. ఫలితంగా వచ్చి కలిసే నీటి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా సముద్రమ ట్టం కనీసం రెండడుగులు పెరుగుతుంది. → అంటార్కిటికాలోని విస్తారమైన మంచు పలకల సమూహాన్ని కరగకుండా పట్టి ఉంచేది డూమ్స్‌డే గ్లేసియరే. కనుక దానితో పాటే ఆ భారీ మంచు పలకలన్నీ కరిగి సముద్రంలో కలుస్తాయి. దాంతో సముద్రమట్టం ఏకంగా పదడుగులకు పైగా పెరిగిపోతుంది. → డూమ్స్‌డే గ్లేసియర్ వాలుగా ఉంటుంది. దాంతో అది కరుగుతున్న కొద్దీ అందులోని మంచు వెచ్చని సముద్ర జలాల ప్రభావానికి మరింతగా లోనవుతూ వస్తుంది. వెచ్చని జలాలు గ్లేసియర్ అడుగుకు చొచ్చుకుపోతున్నాయి. దాంతో అది కరిగే వేగం మరింతగా పెరుగుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
India Environment Report – 2024: హిమగిరులకు పెనుముప్పు!
భారతదేశానికి పెట్టని కోటలాగా రక్షణ కవచంగా ఉన్న సుందర హిమాలయాలు కనుమరుగు కానున్నాయా? భూమిపై ఉష్ణోగ్రతల పెరుగుదలను అడ్డుకోకపోతే కచి్చతంగా ఇదే జరుగుతుందని ఇండియా పర్యావరణ నివేదిక–2024 తేలి్చచెప్పింది. 2100 నాటికి హిమాలయ పర్వతాల్లోని 75 శాతం మంచు కరిగిపోయే ప్రమాదం ఉందని స్పష్టంచేసింది. తద్వారా వరదలు, విపత్తులు సంభవిస్తాయని, పర్యావరణం, జీవజాలం, వృక్షజాతులకు ముప్పు సంభవిస్తుందని వెల్లడించింది. ఆసియాలో 200 కోట్ల మంది తీవ్రంగా ప్రభావితం అవుతారని పేర్కొంది. భూగోళంపై అత్యధికంగా మంచు నిల్వ ఉన్న మూడో అతిపెద్ద ప్రాంతం హిమాలయాలే. కాలుష్యం, ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల ఇక్కడి హిమానీనదాలు(గ్లేసియర్స్) వేగంగా కరిగిపోతున్నాయి. ఎగువ హిమాలయాల్లో ఇప్పటికే మంచు చాలావరకు మాయమైంది. 2013 నుంచి 2022 వరకు ఇండియాలో 44 శాతం ప్రకృతి విపత్తులకు హిమగిరుల్లో మంచు కరగడమే కారణమని ఇండియా పర్యావరణ నివేదిక–2024 వివరించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో, ప్రధానంగా హిమాలయ రాష్ట్రాల్లో వరదలు, పెను తుఫాన్లు, కొండ చరియలు విరిగిపడడం వంటి విపత్తులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నట్లు ఈ నివేదిక గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. మనమంతా పర్యావరణ సంక్షోభం అంచున ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. హిమాలయాల్లో మంచు కరిగిపోతుండడంతో విలువైన వృక్ష సంపద అంతరించిపోతున్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. ప్రతి పదేళ్లకు 54 మీటర్ల మేర వృక్షాలు కనుమరుగు అవుతున్నట్లు వెల్లడయ్యింది. నిత్యం మంచుతో గడ్డకట్టుకొని ఉండే ప్రాంతాలు సైతం మాయమవుతున్నాయి. ముఖ్యంగా పశి్చమ భాగంలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. 2004 నుంచి 2020 వరకు 8,340 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచు కరిగింది. అదంతా మైదాన ప్రాంతంగా మారిపోయింది. హిమాలయాల్లో 40 శాతం మంచు ఇప్పటికే కరిగిపోయిందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే 2100 నాటికి 75 శాతం మంచు కనిపించకుండా పోతుందని ఇండియా పర్యావరణ నివేదిక హెచ్చరించింది. ఈ మహావిపత్తును నివారించాలంటే వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెడ్ డెవలప్మెంట్(ఐసీఐఎంఓడీ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇజబెల్లా కొజీల్ సూచించారు. అత్యవసర, నిర్ణయాత్మక కార్యాచరణ అవసరమని పేర్కొన్నారు. హిమాలయ పర్యావరణ, జీవావరణ వ్యవస్థపై కోట్ల మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయని గుర్తుచేశారు. మన ప్రభుత్వాలు చురుగ్గా వ్యవహరించాలని, హిమాలయాలను కాపాడుకోకపోతే మానవాళి మనుగడకు ప్రమాదం తప్పదని స్పష్టం చేశారు. ప్రమాదంలో డూమ్స్ డే గ్లేసియర్ అంటార్కిటికా ఖండం పశి్చమ భాగంలోని డూమ్స్ డే హిమానీనదం(థ్వాయిట్స్ గ్లేసియర్) మనుగడ ముప్పును ఎదుర్కొంటోంది. గత 80 ఏళ్లలో ఏకంగా 50 బిలియన్ టన్నుల మంచును కోల్పోయింది. ప్రస్తుతం 130 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ గ్లేసియర్ క్రమంగా కరిగిపోతోంది. కొత్తగా వచి్చచేరే మంచు కంటే కరిగిపోతున్నదే ఎక్కువ. మరికొన్నేళ్లలో పూర్తిగా అంతమైనా అశ్చర్యం లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవలే ఈ హిమానీనదంపై అధ్యయనం చేశారు. నమూనాలు సేకరించి విశ్లేషించారు. ఎల్–నినో ప్రభావం కారణంగా భూమి వేడెక్కుతుండడంతో డూమ్స్‌డే గ్లేసియర్ కరిగిపోతున్నట్లు గుర్తించారు. ఈ పరిణామం 80 సంత్సరాల క్రితం.. 1940వ దశకంలోనే మొదలైందని, 1970వ దశకంలో వేగం పుంజుకుందని తేల్చారు. అంటార్కిటికా ఖండంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో హమానీనదం కరిగిపోయే రేటు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నట్లు సైంటిస్టులు స్పష్టం చేశారు. పశి్చమ అంటార్కిటికాలో మంచు ఫలకాల స్థిరత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం తోడ్పడుతుందని భావిస్తున్నారు. డూమ్స్ డే గ్లేసియర్ కీలకమైన ప్రదేశంలో ఉంది. ఇది పూర్తిగా కరిగిపోతే పశి్చమ అంటార్కిటికా నుంచి సముద్రంలోకి మరింత నీరు చేరుతుంది. ఫలితంగా సముద్ర మట్టం 65 సెంటీమీటర్ల వరకు పెరిగే ప్రమాదం ఉంది. అదే జరిగితే లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. జల విధ్వంసం తప్పదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భూమి అంతం : ఏప్రిల్ 23..?
సాక్షి, వెబ్ డెస్క్ : భూమి మీద ప్రాణికోటికి మరో పదిరోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నెల 23న భూమి అంతరించనున్నట్లు ‘డేవిడ్ మీడే’ ప్రకటించారు. ఈ లోపు జీవితంలో మిగిలి ఉన్న చిన్న చిన్న కోరికలను నెరవేర్చుకొండి అంటున్నారు మీడే. గత కొద్ది నెలలుగా భూమి అంతరిస్తుందని తరచూ హెచ్చరికలు చేస్తున్న కాన్స్పిరసీ థియరిస్టు మీడే. ఈయన మరోసారి భూమి అంతం కాబోతోందని ప్రకటించారు మీడే. ఈ సారి మాత్రం పాత ఉదాహారణలు అయిన నిబిరు, ప్లానెట్ ఎక్స్‌తో పాటు జోంబీ గ్రంథాన్ని కూడా ఆధారం చేసుకుని మరి ఈ ప్రకటన చేశాడు. ఈ సారి భూమి అంతం తప్పదంటున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా బైబిల్లో చెప్పిన ప్రకారం ఈ నెల 23న రాత్రి 12 గంటల ఒక నిమిషానికి ఈ విపత్తు సంభవించనున్నట్లు డేవిడ్ మీడే చెప్పారు. దీని గురించి బైబిల్లో కూడా ఉందన్నారు. బైబిల్ ప్రకారం ప్రకారం క్రీస్తు పునరాగమనం జరుగుతుందని క్రైస్తవుల నమ్మకం. పునరాగమన సమయంలో చనిపోయిన వారు, బతికున్నవారు ఆకాశంలోకి వెళ్తారు. అక్కడ దేవుడు వారు భూమి మీద చేసిన మంచి, చెడు పనుల ప్రకారం వారి ఆత్మలను స్వర్గానికి లేదా నరకానికి పంపిస్తాడని నమ్మకం. సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించినప్పుడు సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు ఒకే క్రమంలోకి వస్తారని అప్పుడు ఏవైనా ఉపద్రవాలు సంభవించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు కూడా అంటున్నారు. ఈ మూడు గ్రహాలు ఒకే క్రమంలోకి వచ్చినప్పుడు నిబిరు గ్రహం భూ కక్ష్యలోకి ప్రవేశించి భూమిని నాశనం చేస్తుందని డేవిడ్ మీడే అంటున్నారు. -
యుగాంతానికి 2 నిమిషాలే!
వాషింగ్టన్: ప్రపంచ వినాశనం అత్యంత దగ్గరపడుతోందనడానికి సూచికగా డూమ్స్‌డే క్లాక్‌లో నిమిషాల ముల్లును మరో 30 సెకన్లు ముందుకు జరిపారు. ప్రస్తుతం డూమ్స్ డే క్లాక్‌లో సమయం రాత్రి 11.58 గంటలు. అంటే డూమ్స్ డే గడియారం ప్రకారం వినాశనానికి (12 గంటల సమయాన్ని వినాశనానికి గుర్తుగా భావిస్తారు) మనం రెండే నిమిషాల దూరంలో ఉన్నామన్నమాట. డూమ్స్ డే గడియారం ఎవరు నిర్వహిస్తారు, వినాశనానికి ఎంత దూరంలో ఉన్నామనేవి ఆసక్తికరంగా మారాయి. 1947లో ఏర్పాటు... మానవాళి తన మతిలేని చర్యల వల్ల ప్రపంచ వినాశనానికి చేజేతులా ఎంత దగ్గరగా వెళుతోందో హెచ్చరించేందుకు ఏర్పాటు చేసిందే ఈ డూమ్స్‌డే గడియారం. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మొదటిసారిæ అణ్వాయుధాలను తయారుచేసిన మాన్‌హట్టన్ ప్రాజెక్టులో భాగస్వాములైన అమెరికా సైంటిస్టులు 1945లో ‘బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్’ అనే జర్నల్ను ప్రారంభించారు. ఈ జర్నల్ను శాస్త్రవేత్తలే నిర్వహిస్తున్నారు. వారే 1947లో తొలిసారిగా డూమ్స్ డే గడియారం విధానాన్ని ఏర్పాటు చేశారు. తొలుత అణ్వాయుధాలు, అణు యుద్ధాల వల్ల పొంచి ఉన్న ప్రమాదాన్ని మాత్రమే డూమ్స్‌డే గడియారం ద్వారా హెచ్చరించేవారు. 2007 నుంచి వాతావరణ మార్పుల వల్ల కలిగే ముప్పును కూడా దీని ద్వారా హెచ్చరిస్తున్నారు. అర్ధరాత్రి 12 అంటే వినాశనమే గడియారంలో సమయం అర్ధరాత్రి 12 గంటలు అయ్యిందంటే ప్రపంచం అంతమైపోయినట్లే లెక్క. దీనిలో సమయం అర్ధరాత్రి 12కు ఎంత దగ్గరగా ఉంటే ప్రపంచం అంత ప్రమాదంలో ఉందని అర్థం. ఎంత దూరంగా ఉంటే అంత సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారు. 1947 నుంచి ఇప్పటి వరకు ఈ గడియారంలో సమయాన్ని 20 సార్లు మార్చారు. మానవాళి వినాశనానికి ఎంత దూరంలో ఉందన్న దానిని బట్టి సమయాన్ని ముందుకు, వెనక్కు మారుస్తూ ఉంటారు. 1991లో అమెరికా, సోవియట్ రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక గడియారంలో సమయాన్ని రాత్రి 11.43కు మార్చారు. అంటే నాడు ప్రపంచం వినాశనానికి 17 నిమిషాల దూరంలో ఉందని అర్థం. రెండోసారి రెండు నిమిషాల వ్యవధి ప్రపంచం వినాశనానికి అత్యంత దగ్గరగా ఉన్నట్లు తొలిసారిగా 1953లో ఈ గడియారం చూపించింది. ఆ ఏడాది అమెరికా, సోవియట్ యూనియన్లు హైడ్రోజన్ బాంబులు పరీక్షించడంతో సమయాన్ని 11.58కి మార్చారు. అంటే వినాశనానికి రెండు నిమిషాల దూరంలో ప్రపంచం ఉందని అర్థం. మళ్లీ ఈ ఏడాది, ఈ నెలలోనే దీనిని 11.58కి మార్చారు. అణ్వాయుధాలు, వాతావరణ మార్పులకు సంబంధించి రేకెత్తుతున్న ఆందోళనలపై ప్రపంచ దేశాల అధినేతలు సరైన విధంగా స్పందించడం లేదంటూ ఈ నెలలో సమయాన్ని 11.58కి మార్చారు. ఉత్తర కొరియాపై అణు దాడికి సిద్ధంగా ఉన్నామంటూ ట్రంప్ పరోక్షంగా ప్రకటించడం, పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగాలని ట్రంప్ నిర్ణయం తీసుకోవడం తదితరాలను ఇందుకు కారణాలుగా భావించవచ్చు. గడియారంలో ముఖ్య ఘట్టాలు ► 1947లో ఏర్పాటు చేసినప్పుడు సమయం రాత్రి 11:53. అంటే వినాశనానికి ఏడు నిమిషాల దూరం. ► 1949లో సోవియట్ యూనియన్ తొలి అణుపరీక్ష. సమయం 4 నిమిషాల ముందుకు. అంటే 11:57 ► 1953లో అమెరికా తొలి హైడ్రోజన్ బాంబు పరీక్ష. మరో నిమిషం ముందుకు. అంటే 11:58. ► 1991లో ప్రచ్ఛన్న యుద్ధం ముగియడంతో 14 నిమిషాలు వెనక్కు జరిపారు. అంటే11:43గా మార్చారు. ► 1998లో భారత్, పాక్‌లు అణ్వాయుధాలను పరీక్షించడంతో ఎనిమిది నిమిషాలు ముందుకు జరిపారు. అంటే 11:51 ► 2016– తీవ్రమైన వాతావరణ మార్పులు, భారీ అణ్వాయుధ పరీక్షలు. 2 నిమిషాలు ముందుకు–11:57 ► 2017– అణ్వాయుధాల ఆధునికీకరణ, వాతావరణ మార్పులతో సమయం 30 సెకన్లు ముందుకు–11:57:30 -
రెండున్నర నిమిషాల్లో అణుయుద్ధం
ప్రపంచ అణుయుద్ధం సంభవించి ప్రపంచదేశాలు సర్వనాశనమయ్యే ‘డూమ్స్ డే’ మరెంతో దూరంలో లేదు. అణు యుద్ధం సంభవించే ఆ 12 గంటల కాలానికి ప్రపంచం కేవలం రెండున్నర నిమిషాల దూరంలో ఉందని అణు శాస్త్రవేత్తల బులెటిన్ ప్రకటించింది. ఆ మేరకు షికాగో యూనివర్సిటీలోని బులెటిన్ గోడపై వేలాడదీసిన ఊహాత్మక గడియారాన్ని సవరించామని వెల్లడించింది. అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అణ్వస్త్రాల గురించి ఇటీవల చేసిన వ్యాఖ్యలను, భూతాపోన్నతి పరిస్థితులను ఆయన తేలిగ్గా తీసుకోవడం తదితర అంశాలతోపాటు భారత్, పాకిస్థాన దేశాల సరిహద్దుల మధ్య ఉద్రిక్త పరిస్థితలు తలెత్తడం, ఇరు దేశాల ప్రభుత్వాల తాజా వైఖరి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని డూమ్స్ డే గడియారాన్ని సవరించామని బులెటిన్‌లో అణు శాస్త్రవేత్తలు వివరించారు. హిరోషిమా, నాగసాకి నగరాల్లో అణు బాంబులు సృష్టించిన అపార నష్టాన్ని చూశాక ‘మన్‌హట్టన్ అణు ప్రాజెక్ట్ (ప్రపంచంలో తొలి అణ్వస్త్రాల తయారీ ప్రాజెక్ట్)’లో పాల్గొన్న అణు శాస్త్రవేత్తలు ఓ బృందంగా ఏర్పడి ప్రపంచంలో మరెక్కడా అణుబాంబులు పేలకుండా చూడాలని నిర్ణయించారు. వారి ఆలోచనలో భాగంగానే 1947లో ఊహాత్మక డూమ్స్ డే గడియారాన్ని సృష్టించారు. ప్రపంచ దేశాల మధ్య అణు యుద్ధం ఎంత సమీపానికి వచ్చిందో ప్రపంచ పరిణామాలను, పరిస్థితులను బేరీజు వేసి చెప్పడం ఈ గడియారం ఉద్దేశం. తద్వారా అణు యుద్ధ మేఘాల నిర్మూలనకు చర్యలు తీసుకోవచ్చన్నది వారి అభిప్రాయం. వారు గడియారాన్ని సవరించినప్పుడల్లా 15 మంది నోబెల్ అవార్డు గ్రహీతల అభిప్రాయం కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అణు శాస్త్రవేత్తలు 1947లో ఏర్పాటుచేసిన ఈ డూమ్స్ డే గడియారంలో అణుయుద్ధం జరిగే సమయాన్ని అర్ధరాత్రి 12 గంటలుగా పేర్కొన్నారు. ఇప్పుడు, అంటే 2017లో ఆ గడియారంలో అర్ధరాత్రి 11గంటల 57 నిమిషాల, 30 సెకండ్లు అయినట్లు సవరించారు. అంటే ప్రపంచం అణు యుద్ధానికి సరిగ్గా రెండున్నర నిమిషాల దూరంలో ఉందన్న మాట. 12 గంటలకు ఇంత దగ్గరగా రావడం 1953 తర్వాత ఇదే మొదటిసారి. అప్పుడు 12 గంటలకు రెండు నిమిషాల దూరంలో ఉన్నట్లు పేర్కొన్నారు. తొలి హైడ్రోజన్ బాంబు పరీక్ష జరిగిన కారణంగా అప్పుడు సమయాన్ని అలా పేర్కొన్నారు. గడియారాన్ని మొదట ఏర్పాటు చేసినప్పుడు 12 గంటలకు ఏడు నిమిషాల దూరంలో ఉన్నట్టు పేర్కొనగా, 1991లో 17 నిమిషాల దూరంలో ఉన్నట్లు సవరించారు. ఇప్పటి వరకు ఈ గడియారాన్ని 22 సార్లు సవరించారు. ఆసియా దేశాల మధ్యనే, అంటే భారత్, పాకిస్థాన్ దేశాల మధ్యనే అణుయుద్ధం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అణుశాస్త్రవేత్తలు, నోబెల్ గ్రహీతలు అభిప్రాయపడ్డారు. భారత్ సైనిక స్థావరాలపై పాక్ మూకలు జరిపిన దాడులు, ప్రతీకారంగా భారత్, పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి సర్జికల్ దాడులు జరపడాన్ని, ముందస్తుగా అణ్వస్త్రాలను ప్రయోగించమనే భారత సిద్ధాంతాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని భారత రక్షణ మంత్రి వ్యాఖ్యానించడం, అంతే ఘాటుగా పాకిస్థాన్ రక్షణ మంత్రి స్పందించడం లాంటి అంశాలను వారు ఉదహరించారు. బీజేపీ అధికారంలో ఉండడాన్ని కూడా వారు పరోక్షంగా పేర్కొన్నారు. ఈ రెండు దేశాల మధ్య అణు యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో, ఆ తర్వాత సంభవించే వాతావరణ పరిణామాల వల్ల దాదాపు 200 కోట్ల మంది ప్రజలు మరణిస్తారని అమెరికా ఆటమిక్ సంస్థ గతంలో అంచనా వేసింది. తొలుత కేవలం అణు యుద్ధానికే పరిమితం చేసిన ఈ డూమ్స్ డే గడియారాన్ని 2007 నుంచి వాతావరణ పరిస్థితుల మార్పు వల్ల సంభవించే ప్రళయానికి కూడా అన్వయిస్తూ వస్తున్నారు. అందుకనే భూతాపోన్నతి అంశాన్ని డోనాల్డ్ ట్రంప్ సీరియస్‌గా తీసుకోకపోవడాన్ని కూడా వారు పరిగణనలోకి తీసుకున్నారు. -
భూ ప్రళయం వస్తుందా?
ఏనాటికై నా భూగోళంపై ప్రళయం సంభవిస్తుందని, సముద్రాలు ముంచెత్తి, దావానలం దహించివేసి భూమిపై మానవుల మనుగడ పూర్తిగా తుడిచిపెట్టుకు పోతుందని దాదాపు 200 ప్రాచీన సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. ఆ సిద్ధాంతాల్లో వాస్తవం లేకపోలేదని, భూప్రళయం సంభవించే రోజులు మరెంతో దూరంలో లేవని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ గ్రాహం హాంకాక్ తెలియజేస్తున్నారు. 12,800 ఏళ్ల క్రితం భూమిపై జీవజాలం సర్వనాశనమైన తీరులోనే మరో 20 ఏళ్లలో భారీ తోక చుక్కొకటి భూమిని ఢీకొనడం వల్ల మానవ జాతి సమస్తం నశించిపోతుందని గ్రాహం హెచ్చరిస్తున్నారు. 12,800 ఏళ్ల ప్రాంతంలో ‘యంగర్ డ్రయాస్’ అనే భారీ తోకచుక్క భూమిని ఢీకొనడం వల్ల మంచు పర్వతాలు కరగిపోయి సముద్రాలు పొంగి పొర్లాయని, మరోపక్క అడవులు దావానలంతో దగ్ధమయ్యాయని శాస్త్రవేత్తలు కూడా ధ్రువీకరించారు. ఫలితంగానే జడల ఏనుగులు, రాక్షస బల్లులు నశించిపోయాయనే వాదనకు శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. నాడు కోటి మెగాటన్నుల బరువు గల తోకచుక్క గంటకు లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి భూగోళాన్ని ఢీకొట్టిందని, అణ్వాయుధ శక్తికి 20 లక్షల ఎక్కువ రెట్ల శక్తి వెలువడిందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇప్పుడు కూడా అలాంటి తోక చుక్కొకటి సూర్య కుటుంబం నుంచి భూమివైపు దూసుకొస్తోందని ఖగోళ భౌతిక శాస్త్రజ్ఞుడు విక్టర్ క్లూబ్, ఖగోళ శాస్త్రవేత్త బిల్ నాపియర్ చెబుతున్నారు. అయితే ఆ ప్రళయం ఎప్పుడూ సంభవిస్తుందో చెప్పలేమని వారు అంటున్నారు. కచ్చితంగా ఈ ప్రళయం 20 ఏళ్లలో సంభవిస్తుందని, శాస్త్రవేత్తల తాజా పరిశోధనలు రుజువు చేస్తున్నాయని ‘మెజీషియన్స్ ఆఫ్ ది గాడ్స్’ అనే తన తాజా పుస్తకంలో హాంకాక్ వెల్లడించారు. భూమి పుట్టుపూర్వోత్తరాలు, ప్రళయాలు, తరతరాల నాగరికత చరిత్రను అవగాహన చేసుకున్న కొంతమంది మానవులు మాత్రం ప్రళయం నుంచి తప్పించుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 2012లోనే భూ ప్రళయం వస్తుందనే ‘డూమ్స్ డే’ లాంటి ప్రచారాలు గతంలో జరిగిన విషయం తెల్సిందే.