ఆదోని మార్గంలో నాలుగు రైళ్ల దారిమళ్ళింపు
ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని మార్గంలో ప్రయాణించే నాలుగు రైళ్లను గురువారం నుంచి 4 వ తేదీ వరకు దారిమళ్ళించారు. వాడి, రాయచూరు ప్రాంతాల్లో డబుల్ లైన్ పనులు జరుగుతుండడం వల్ల పూణె నుంచి రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ట్రైన్ నం.16381 ముంబయి కన్యాకుమారి రెండు రోజులు, నం.11013 కుర్ల ఎక్స్ప్రెస్ మూడు రోజులు, నం.12164 చెన్నై ఎక్స్ప్రెస్ రెండు రోజులు, నం.16382 కన్యాకుమారి ముంబయి ట్రైన్లు పూణె నుంచి మేరేజ్, బళ్లారి, గుంతకల్ మీదుగా నడుపుతున్నట్లు తెలిపారు. ప్రయాణికులు రైళ్ల మార్పులను గమనించాలని అధికారులు కోరారు.