Dr. Vaijayanti
-
శ్రీరామునర్చించు జిహ్వజిహ్వ..!
రాముడి పేరు తియ్యన కాబట్టి ‘పిబరే రామరసం’ అనుకుంటూ ఒకాయనా, ‘నీ నామమెంతొ రుచిరా’ అంటూ ఇంకొకాయనా దాన్నే తాగేస్తూ గడుపుతానంటారు. మాన్యుల మాటలు సరే... మనలాంటి సామాన్యుల సంగతేమిటి? అందుకే మనం... ఒడల పులకరింతతో పాటు ‘వడపప్పునూ, రామనామామృతానికి తోడు పంచామృతాన్నీ,తినగలిగినన్ని సెనగలనూ స్వీకరిద్దాం. కౌసల్యాసుప్రజారాముణ్ణి నర‘శార్దూలా’ అన్న తర్వాత ఇక పొడి ‘పులి’హోర ఆరగించకపోతే ఎలా...? ఇక పై రుచులన్నింటికీ అదనపు అనుపానంలా రాముడి నామాన్నే తేనె, చక్కెరల్లా కలిపేద్దాం! పండగ నాడు పానకంలా కలిపేసి తాగేద్దాం!! పొడి పులిహోర కావలసినవి: సన్నబియ్యం - 2 కప్పులు; పచ్చిమిర్చి - 4; కరివేపాకు - 3 రెమ్మలు; ఉప్పు - తగినంత; పసుపు - తగినంత; నూనె - కప్పు; చింతపండు రసం - పావు కప్పు (చిక్కగా ఉండాలి); పోపు కోసం: ఆవాలు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; సెనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు; ఇంగువ - పావు టీ స్పూను; ఎండుమిర్చి - 6; పొడి కోసం: మినప్పప్పు - టీ స్పూను; పల్లీలు - టేబుల్ స్పూను; సెనగపప్పు - టేబుల్‌స్పూను; ఎండుమిర్చి - 5; నువ్వుపప్పు - 2 టేబుల్ స్పూన్లు; పుట్నాల పప్పు - టేబుల్ స్పూను; జీడిపప్పు - 10 తయారీ: ముందుగా పొడికి కావలసిన పదార్థాలను నూనె లేకుండా వేయించి చల్లారాక పొడి చేసి పక్కన ఉంచుకోవాలి బియ్యానికి మూడు కప్పుల నీరు జత చేసి ఉడికించాలి బాణలిలో నూనె కాగాక ఇంగువ, పోపు సామాను వేసి వేయించాలి చింతపండు రసం, ఉప్పు, పసుపు జత చేసి ఉడికించి దింపేయాలి ఒక పెద్ద పళ్లెంలో అన్నం విడివిడిలాడేలా వేయాలి పోపు వేసి బాగా కలపాలి పొడి వేసి కలిపి వడ్డించాలి. కొబ్బరిపాల పరమాన్నం కావలసినవి: బియ్యం - కప్పు; కొబ్బరి పాలు - కప్పు; నెయ్యి - అర కప్పు; చిక్కటి పాలు - కప్పు; బెల్లం తురుము - కప్పు; కిస్మిస్ - 10; జీడిపప్పు - 10; ఏలకుల పొడి - టీ స్పూను; పచ్చ కర్పూరం - కొంచెం తయారీ: ముందుగా బియ్యంలో మామూలు పాలు, నీళ్లు కలిపి కుకర్‌లో ఉంచి ఉడికించాలి అన్నంలో కొబ్బరిపాలు కలిపి స్టౌ మీద ఉంచి కొద్దిగా ఉడికించాలి బెల్లం తురుము వేసి కలిపి చిన్న మంటపై ఉడికించాలి బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి, ఉడుకుతున్న పరమాన్నంలో వేయాలి ఏలకుల పొడి, పచ్చకర్పూరం జత చేయాలి. పంచామృతం కావలసినవి: పెరుగు - అర కప్పు; పాలు - అర కప్పు; తేనె - 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి - టీ స్పూను; పంచదార - 2 టీస్పూన్లు; అరటిపండు - ఒకటి; కొబ్బరినీళ్లు - టేబుల్ స్పూను (అరటిపండ్లు, కొబ్బరినీళ్లను రుచి కోసం వాడుకోవచ్చు. ఇవి పంచామృతాలలో ఉండే ఐదు పదార్థాలలోకి చేరవు) తయారీ: అరటిపండు ముక్కలు చేసి పక్కన ఉంచాలి ఒక పాత్రలో పెరుగు, పాలు, కొబ్బరినీళ్లు, తేనె, నెయ్యి, పంచదార వేసి బాగా కలపాలి అరటిపండు ముక్కలు జత చేయాలి దేవుడికి నైవేద్యం పెట్టి ప్రసాదం స్వీకరించాలి. పోపు సెనగలు కావలసినవి: సెనగలు - కప్పు; కొబ్బరితురుము - 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు - అర టీ స్పూను; మినప్పప్పు - అర టీ స్పూను; ఎండుమిర్చి - 2; కరివేపాకు - 2 రెమ్మలు; నూనె - 2 టీ స్పూన్లు; ఇంగువ - చిటికెడు; పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత తయారీ: సెనగలను సుమారు ఆరు గంటల సేపు నానబెట్టాలి నీరు వడపోసి కుకర్‌లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చాక దించేయాలి బాణలిలో నూనె కాగాక ఆవాలు, మినప్పప్పు వేసి వేయించాలి కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు, ఇంగువ జత చేయాలి ఉడికించుకున్న సెనగలు వేసి వేయించాలి పసుపు, కొబ్బరితురుము వేసి కలిపి దించేయాలి వేడివేడిగా వడ్డించాలి. వడపప్పు కావలసినవి: పెసరపప్పు - కప్పు; పచ్చికొబ్బరి తురుము - పావుకప్పు; మామిడికాయ తురుము - పావు కప్పు; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను; ఉప్పు - తగినంత; క్యారట్ తురుము - పావుకప్పు తయారీ: పెసరపప్పును తగినంత నీటిలో సుమారు రెండు గంటలసేపు నానబెట్టాలి నీరంతా వడక ట్టేయాలి ఒక పాత్రలో నానిన పెసరపప్పు, పచ్చికొబ్బరి తురుము, మామిడికాయ తురుము, క్యారట్ తురుము, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు వేసి కలపాలి. పానకం కావలసినవి: బెల్లం తురుము - 2 కప్పులు నీళ్లు - 5 కప్పులు ఏలకులపొడి - టీ స్పూను మిరియాలపొడి - 2 టీ స్పూన్లు తయారీ: ఒక పాత్రలో నీళ్లు, బెల్లం తురుము వేసి బాగా కలపాలి ఏలకుల పొడి, మిరియాల పొడి జత చేసి గ్లాసులలో పోసి అందించాలి. కర్టెసీ: హరిచందన, హైదరాబాద్ www.blendwithspices.com సేకరణ: డా. వైజయంతి -
వెయ్యింతల ఊరింతలు
చింతను చూస్తూ ఊరుకోవడం కష్టమే! కనీసం కాయ కొసల్నైనా కొరక బుద్దేస్తుంది. అందాకా ఎందుకు? చింతకాయను ఊహించుకోండి చాలు... జివ్వుమని మనసు ఊటబావి ఐపోతుంది! చింత వచ్చి చెంతన చేరితే... చప్పిడి పళ్లేలకు కూడా చురుకు పుట్టుకొస్తుంది. ఇక మనమెంత, మానవమాత్రులం? కళ్ల ముందు చింత పులుసో, పప్పో, పచ్చడో ప్రత్యక్షమవగానే... వేళ్లు కలబడి కలబడి ముద్దను కలిపేస్తాయి. చింతలో ఉన్న ‘సి’ట్రాక్షన్ వల్లనే... ఇంత ఎట్రాక్షన్. ఇవన్నీ కాదు... వెయ్యి రకాల కూర గాయలకైనా... వెయ్యి కాంబినేషన్ల రుచులను ఇవ్వగల కెపాసిటీ... చింతది, చింత పులుపుది, చింత తలపుది! చింతకాయ నువ్వుల పచ్చడి కావలసినవి: చింతకాయలు - 8, నువ్వుపప్పు - 100 గ్రా., పచ్చిమిర్చి - 10, ఎండుమిర్చి - 6, శనగపప్పు - రెండు టీ స్పూన్లు, మినప్పప్పు - రెండు టీ స్పూన్లు, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, మెంతులు - టీ స్పూను, ఇంగువ - చిటికెడు, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - 2 టేబుల్ స్పూన్లు తయారి: చింతకాయలను ఉడికించి రసం చిక్కగా తీసుకుని పక్కన ఉంచాలి బాణలిలో నువ్వులను వేయించి, చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి బాణలిలో నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, ఇంగువ వేసి వేయించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి మిక్సీలో చింతకాయరసం, నువ్వులపొడి, పోపుల పొడి, పసుపు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. దోసకాయ చింతకాయ పచ్చడి కావలసినవి: దోసకాయముక్కలు - రెండు కప్పులు, చింతకాయలు - కప్పు, పచ్చిమిర్చి - 7, కొత్తిమీర - చిన్నక ట్ట, ఉప్పు - తగినంత, మినప్పప్పు - 3 టీ స్పూన్లు, శనగపప్పు - 3 టీ స్పూన్లు, నూనె - 3 టీ స్పూన్లు, మెంతులు - 3 టీ స్పూన్లు, జీలకర్ర - టీ స్పూను, ఆవాలు - 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి - 6 (ముక్కలు చేసుకోవాలి), కరివేపాకు చిన్న కట్ట, ఇంగువ - చిటికెడు తయారి: బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి కరివేపాకు, ఇంగువ వేసి మరో మారు వేయించాలి దోసకాయ ముక్కలను కొద్దిగా ఉడికించాలి. (హాఫ్ బాయిల్ చేయాలి) చింతకాయలను ఉడికించి చిక్కగా రసం తీసుకోవాలి వేయించి ఉంచుకున్న పోపు సామాగ్రి, పచ్చిమిర్చి మిక్సీలో వేసి మెత్తగాపేస్ట్ చేసుకోవాలి ఒక గిన్నెలో ఉడికించి ఉంచుకున్న దోసకాయముక్కలు, చింతకాయరసం, మెత్తగా చేసుకున్న పేస్ట్, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. చింతకాయ పులుసు కావలసినవి: చింతకాయలు - 6, టొమాటో తరుగు - పావు కప్పు, ఉల్లితరుగు - పావు కప్పు, పచ్చిమిర్చి -2, బెల్లం తురుము - రెండు టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు, ఇంగువ - చిటికెడు, ఎండుమిర్చి - 4, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, ధనియాలపొడి - పావు టీ స్పూను, కరివేపాకు - రెండు రెమ్మలు, కొత్తిమీర - చిన్న కట్ట తయారి: చింతకాయలను ఉడికించి రసం తీసి పక్కన ఉంచాలి ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీరు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు వేసి ఉడికించాలి ఉడికించిన చింతపండు రసం, బెల్లం తురుము, పసుపు వేసి పులుసును బాగా మరిగించాలి ఒక బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి వేగాక పులుసులో వేయాలి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. చింతకాయ - శనగపిండి కూర కావలసినవి: చింతకాయలు - 10, శనగపిండి - మూడు టేబుల్ స్పూన్లు, ఉల్లితరుగు - పావు కప్పు, టొమాటో తరుగు - పావు కప్పు, పుదీనా ఆకులు - పావు కప్పు, ఎండుమిర్చి - 5, పచ్చిమిర్చి - 3, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, శనగపప్పు - రెండు టీ స్పూన్లు, మినప్పప్పు - రెండు టీ స్పూన్లు, ధనియాలపొడి - పావు టీ స్పూను, ఇంగువ - చిటికెడు, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - తగినంత, కరివేపాకు - రెండు రెమ్మలు, కొత్తిమీర - చిన్నకట్ట, నూనె - మూడు టేబుల్ స్పూన్లు. తయారి: చింతకాయలను ఉడికించి చిక్కగా రసం తీసి పక్కన ఉంచాలి బాణలిలో నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి టొమాటో ముక్కలు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా ఆకులు వేసి వేయించాలి ఇంగువ, పసుపు జత చేసి బాగా కలపాలి చింతకాయ రసంలో శనగపిండి వేసి బాగా కలిపి ఉడుకుతున్న కూరలో వేసి ఆపకుండా కలపాలి దనియాలపొడి, కరివేపాకు వేసి క లిపి దించేయాలి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. చింతకాయ ఉల్లిపాయ పచ్చడి కావలసినవి: చింతకాయలు - 6, పచ్చిమిర్చి - 5, ఉప్పు - తగినంత, పసుపు - టీ స్పూను, ఇంగువ - చిటికెడు, ఎండుమిర్చి - 5, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, శనగపప్పు - రెండు టీ స్పూన్లు, మినప్పప్పు - రెండు టీ స్పూన్లు, ఉల్లిపాయలు - 2 (చిన్నముక్కలుగా కట్ చేయాలి), కొత్తిమీర - చిన్న కట్ట తయారి: చింతకాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి మిక్సీలో చింతకాయలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేయాలి పసుపు జత చేసి గాలి చొరని గాజు సీసాలో కాని జాడీలో కాని రెండు రోజులు ఉంచాలి మూడవరోజు తిరగకలపాలి బాణలిలో నూనె వేసి కాగాక ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి కరివేపాకు జత చేసి మరోమారు వేయించి చింతకాయపచ్చడిలో వేసి కలపాలి అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఉల్లిపాయముక్కలు వేసి దోరగా వేయించి తీసేసి పచ్చడిలో వేసి కలపాలి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. చింతకాయ పప్పు కావలసినవి: చింతకాయలు - 4, కందిపప్పు - కప్పు, ఉల్లితరుగు - అర కప్పు, ఎండుమిర్చి - 6, పచ్చిమిర్చి - 4, ఆవాలు - టీ స్పూను, మెంతులు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, వెల్లుల్లి రేకలు - 4, కరివేపాకు - 2 రెమ్మలు, కొత్తిమీర - చిన్న కట్ట తయారి: పప్పులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఉడికించాలి చింతకాయలను ఉడికించి రసం తీసుకోవాలి ఒక గిన్నెలో ఉడికించిన పప్పు, చింతపండు రసం వేసి స్టౌ మీద ఉంచాలి కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి అందులో వెల్లుల్లి, పోపు సామాను వేసి వేయించాలి ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి కలపాలి ఉడికిన పప్పులో ఈ పోపు వేసి కలపాలి. సేకరణ: డా.వైజయంతి -
స్వార్థమే జీవిత పరమార్థమా?
మోసం... దగా... చీటింగ్... హవాలా... హర్షద్‌మెహతా... కోలా కృష్ణమోహన్... తెలివిగా... చాకచక్యంగా... నేర్పుగా... నమ్మినవారిని నిలువునా నట్టేట ముంచటం... వచ్చిన ధనంతో దర్జాగా జీవించటం... ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ కనిపిస్తున్న సాంఘిక రుగ్మత. ఈ రుగ్మతలపై రఘునాథ్‌రెడ్డి తీసిన లఘుచిత్రమే ‘నౌ దో గ్యారహ్’. డెరైక్టర్స్ వాయిస్: మాది గుంటూరు. చిన్నప్పటి నుంచి నాకు కథలు చెప్పడ మంటే చాలా ఇష్టం. అదే నాకు ఈ రోజు లఘుచిత్రాలు తీయడానికి సహాయపడింది. మా నాన్నగారు గతంలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ కావడం కూడా నాకు ప్లస్ అయ్యింది. నేను ప్రస్తుతం బెంగళూరులోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నౌ దో గ్యారహ్... నోరు ఉంటే రాజ్యం, నోటు ఉంటే సామ్రాజ్యం. ఇదీ స్థూలంగా కథాంశం. ఈ కాన్సెప్ట్ మీద కథ తయారుచేద్దామనుకున్నప్పుడు... రోజూ జరిగే మోసాల గురించి రాద్దామనుకున్నాను. అది కూడా వినోదాత్మకంగా తీయాలనుకున్నాను. ఈ ప్రాసెస్‌లో 1980లలో జరిగిన ల్యాండ్ స్కామ్ గురించి ఒక ఆర్టికల్ చదివాను. ఆ ఆర్టికల్ నన్ను బాగా ప్రభావితం చేసింది. అలా క్యారెక్టర్స్, సీన్లు డెవలప్ చేశాను. సినిమా తీయడంలో అందరిలాగే నన్ను కూడా త్రివిక్రమ్ గారు ప్రభావితం చేశారు. మా టీమే నాకు పెద్ద ఆస్తి. యుకే లో ఉంటున్న యామని శృంగారం గారు మా సినిమాకి ఆర్థికంగా సహాయం చేశారు. ఈ చిత్రం షూటింగ్ నాలుగు రోజుల్లో పూర్తి చేశాం. ఒక రోజులో ప్యాచ్ వర్క్ పూర్తి చేశాం. పూర్తిగా హైదరాబాద్‌లోనే చేశాం. మా టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడింది. పెద్ద చిత్రాలు తీయాలనే నా కోరిక నెరవేర్చుకోవడం కోసం లఘుచిత్రాలు తీసి అనుభవం సంపాదించుకుంటున్నాను. నాతో పనిచేసేవారంతా ఎంతో హార్డ్‌వర్క్ చేస్తున్నారు. మా అందరికీ సినిమాలంటే ఒక ప్యాషన్ ఉండబట్టి లఘుచిత్రాలు బాగా తీయగలుగుతున్నాం. ఇంతకుముందు రోజుల్లా కాకుండా మా టాలెంట్ నిరూపించుకోవడానికి లఘుచిత్రాల నిర్మాణం ఎంతగానో ఉపయోగపడుతోంది. షార్ట్ స్టోరీ: తెల్లవారి లేచింది మొదలు ఎవరో ఒకరు అవతలివారిని మోసం చేస్తూనే ఉన్నారు. ఇందులో కొందరు యువత ఒక జట్టుగా ఏర్పడి మోసాలు చేస్తుంటారు. అలా మోసం చేసి ధనం సంపాదిస్తుంటారు. స్థూలంగా ఇదీ కథ. కామెంట్: టిఎంసి బ్యాన ర్ మీద తీసిన ఈ లఘుచిత్రం కథాకథనం చాలా బాగుంది. ముఖ్యంగా ఈ చిత్ర డెరైక్టర్ రఘునాథరెడ్డి లఘుచిత్రాన్ని ఫీచర్‌ఫిల్మ్ స్థాయిలో తీశారు. లొకేషన్లు చాలా బాగున్నాయి. నటీనటులలో ఒకరిద్దరు తప్ప మిగతావారంతా బాగా చేశారు. ముఖ్యంగా హీరోయిన్గా వేసిన అమ్మాయి డైలాగ్ డెలివరీలో పవర్ లేదు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది డైలాగులు. ‘ఇగోకి ఆత్మాభిమానం పేరు పెట్టుకుని తిరుగుతాడు’ ‘అమ్మడానికి అది నా సెంట్ పర్సెంట్ లవ్’ ‘దొంగతనం చేయాలంటే ఒక మనిషి జేబులో చెయ్యి పెడితే చాలు... మోసం చేయాలంటే అదే మనిషి నమ్మకాన్ని కొట్టేయాలి’ ‘యాక్టివ్‌గా అలర్ట్‌గా ఉంటాడు’ ‘మొరాలిటీ కన్న ప్రాక్టికాలిటీనే ప్రధానం’ ‘ప్రకృతిని క్యాష్ చేసుకుంటే బోలెడు ధనం’ ‘ప్రేక్షకుడికి ప్రొడ్యూసర్‌కి మధ్య బ్యారియర్లాగ’ ‘వెళ్లివస్తాను... సారీ... నేను వెళ్తాను మీరు రండి’ ‘నా పూర్వీకులు చాలా పూర్ అని విన్నాను’ ‘ఫ్రీగా ఎకరాలు ఇవ్వడానికి సలహా అనుకున్నావా’ వంటి చురుకైన పదునైన డైలాగులు... ఈ కథకు ప్రాణం పోశాయి. డెరైక్టర్‌గా రఘునాథ్ సక్సెస్ సాధించినట్లే. డైలాగులు, మ్యూజిక్, కెమెరా, ఎడిటింగ్... అన్నీ పక్కాగా ఉన్నాయి. యూట్యూబ్ ప్రేక్షకులకు ఇది నిజంగా ఒక కనువిందే. కేవలం వారం రోజులలోనే రెండు లక్షల మంది ఈ చిత్రాన్ని వీక్షించారు. - డా.వైజయంతి ‘ఇగోకి ఆత్మాభిమానం పేరు పెట్టుకుని తిరుగుతాడు’ ‘అమ్మడానికి అది నా సెంట్ పర్సెంట్ లవ్’ వంటి చురుకైన పదునైన డైలాగులు... ఈ కథకు ప్రాణం పోశాయి. -
బెంగాలీ స్వీట్ బాక్స్
దసరా పండుగ... దేశమంత పండుగ! రుచులు, ఆచారాలు... సంస్కృతులు, సంప్రదాయాలు... ఆటలు, పాటలు... వేషాలు, విశేషాలు... ఎంత భిన్నంగానైనా ఉండనివ్వండి, నవరాత్రి వేడుకల్లోని అర్థం, పరమార్థం మాత్రం ఒకటే. విజయం అందించిన తియ్యదనాన్ని ఆత్మీయంగా పంచుకోవడం! శక్తిమాతకు వేర్వేరు రూపాలున్నట్లే... మిఠాయిలకూ వేర్వేరు రాష్ట్రాలు. ఆ స్వీట్ బాక్సుల్లోంచి ఈసారి మనం మధురాతిమధురమైన... బెంగాలీ బాక్స్‌ను ఓపెన్ చేద్దాం. రాజ్‌భోగ్ కావలసినవి: పాలవిరుగు - 250 గ్రా. (ఆవు పాల నుంచి చేసినది); పచ్చికోవా - 3 టేబుల్ స్పూన్లు; పిస్తాపప్పులు - 15; మైదా - టీ స్పూను; పంచదార - 5 కప్పులు; కుంకుమపువ్వు - అర టీ స్పూను; రోజ్ సిరప్ - 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి - అర టీ స్పూను. తయారి: పాలవిరుగును మెత్తగా మెదిపి, దానికి మైదా జత చేయాలి. దానిని బాగా కలిపి, చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి వేడినీటిలో పిస్తా పప్పులను వేసి ఐదు నిముషాలు ఉంచి, నీటిని వడగట్టి, పైన తొక్కలు తీసి, సన్నగా కట్ చేసుకోవాలి పచ్చికోవా పొడి, పిస్తా తరుగు, బాదం పప్పులను ఒక గిన్నెలో వేసి కలిపి, చిన్నచిన్న ఉండలుగా చేయాలి. పాలవిరుగుతో చేసిన ఒక్కో ఉండలో ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసి పక్కన ఉంచాలి ఒక పాత్రలో పంచదార, నీరు పోసి స్టౌ మీద ఉంచి మరిగించి, వెడల్పాటి పాత్రలో పోసి, కుంకుమపువ్వు రేకలు వేయాలి తయారుచేసి ఉంచుకున్న స్టఫ్డ్ బాల్స్‌ని ఇందులో వేసి స్టౌ మీద ఉంచి, ఐదు నిముషాలు ఉడికించాలి అరకప్పు వేడినీరు పోసి, మరో ఐదునిముషాలు ఉంచితే, బాల్స్ రెట్టింపు సైజుకి పొంగుతాయి. రబ్దీ ఆతార్ పాయస్ కావలసినవి: చిక్కటిపాలు - రెండున్నర కప్పులు; పంచదార - పావు కప్పు; సీతాఫలం గుజ్జు - 100 గ్రా. (గింజలు వేరు చేసి గుజ్జు తీసుకోవాలి) తయారి: ఒక పాత్రలో పాలు మరిగించి, మంట తగ్గించి 20 నిముషాలు అలాగే ఉంచి, పాలు సుమారు సగం అయ్యేవరకు కలుపుతుండాలి పంచదార జత చేసి మరో 25 నిముషాలు ఉంచి దించి, చల్లారనియ్యాలి సీతాఫలం గుజ్జును జతచేసి, పిస్తాలతో గార్నిష్ చేయాలి. రసమలై కావలసినవి: ఆవుపాలు - రెండున్నర కప్పులు (సుమారు అరలీటరు); గేదెపాలు - రెండున్నర కప్పులు (సుమారు అర లీటరు); నిమ్మరసం - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; పంచదార - కప్పు తయారి: మందంగా ఉన్న పెద్ద పాత్రలో ఆవుపాలు, గేదెపాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగించి, దింపేయాలి రెండు నిముషాల తరువాత నిమ్మరసం వేస్తూ పాలను నెమ్మదిగా కలపాలి పాలు విరిగి, అందులోని నీరు విడిపోయేంత వరకు ఉంచాలి పల్చటి వస్త్రంలో నీటిని వడపోసి, ముద్దలాంటి పదార్థంతో ఉన్న వస్త్రాన్ని చల్లటి నీటిలో రెండు మూడు సార్లు ముంచి తీయాలి వస్త్రాన్ని గట్టిగా మూటగట్టి, నీరంతా పోయేవరకు వేలాడదీయాలి పాలవిరుగులో ఇంకా నీరు ఉందనిపిస్తే పూర్తిగా పిండేసి, మెత్తగా అయ్యేవరకు (ఉండలు లేకుండా) చేతితో బాగా కలపాలి కొద్దికొద్దిగా విరుగు ముద్దను చేతిలోకి తీసుకుని, ఉండల్లా తయారుచేసి పక్కన ఉంచాలి. (పైన ఎటువంటి పగుళ్లు లేకుండా చూసుకోవాలి) ఐదు కప్పుల నీటిని మరిగించి, పంచదార వేసి కరిగేవరకు కలపాలి పంచదార పాకంలో వీటిని వేసి సుమారు ఏడెనిమిది నిముషాలు ఉడికించి, కిందకు దింపి, పావుగంటసేపు అలాగే ఉంచేయాలి వీటిని ఒక పాత్రలో పోసి, ఫ్రిజ్‌లో ఉంచి, చల్లగా సర్వ్ చేయాలి. మిస్టీ ధోయ్ కావలసినవి: పాలు - లీటరు; పెరుగు - అర టీ స్పూను; పంచదార - కప్పు; నీరు - 2 టేబుల్ స్పూన్లు తయారి: పాలను మరిగించి, సగం ఇగిరేవరకు ఉంచాలి ఒక పాత్రలో పంచదార, నీరు వేసి స్టౌ మీద ఉంచి లేత గోధుమరంగు వచ్చేవరకు ఉంచాలి ఈ మిశ్రమాన్ని పాలలో వేసి గబగబ కలిపి దించేయాలి పాలు బాగా చల్లారిన తర్వాత పెరుగు వేసి బాగా కలపాలి చల్లటి ప్రదేశంలో రాత్రి అంతా అలానే ఉంచేయాలి ఉదయాన్నే చల్లగా సర్వ్ చేయాలి. పాంటువా కావలసినవి: పచ్చికోవా - రెండు కప్పులు; మైదా - 5 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి - పావు టీ స్పూను; నెయ్యి లేదా వనస్పతి - వేయించడానికి తగినంత. పాకం కోసం: పంచదార - 3 కప్పులు; కుంకుమపువ్వు-కొద్దిగా (తప్పనిసరి కాదు) తయారి: ఒక పెద్దపాత్రలో ఒకటిన్నర కప్పుల నీరు, పంచదార వేసి మరిగించాలి మంట తగ్గించి తీగపాకం వచ్చేవరకు కలపాలి చన్నీటిలో కలిపిన కుంకుమపువ్వు జత చేసి రెండు నిముషాలు ఉంచి దించేయాలి ఒకపాత్రలో పచ్చికోవా, మైదా, ఏలకుల పొడి వేసి బాగా కలిపి, (అవసరమనుకుంటే కొద్దిగా నీరు జత చేయాలి) చిన్నచిన్న ఉండలు చేయాలి. (పగుళ్లు లేకుండా జాగ్రత్తపడాలి. పదినిముషాల సేపు ఫ్రిజ్‌లో ఉంచి తీశాక వేయించితే విరిగిపోకుండా వస్తాయి) నేతిలో వీటిని వేయించి, బంగారువర్ణంలోకి వచ్చాక తీసి చల్లటి పంచదార పాకంలో వేసి పావుగంట తర్వాత సర్వ్ చేయాలి. రసగుల్ల కావలసినవి: పాలవిరుగు - కప్పు; మైదా - టేబుల్ స్పూను; కార్న్‌ఫ్లోర్ - అర టీ స్పూను; పంచదార - ఒకటిన్నర కిలోలు; పాలు - రెండు టేబుల్ స్పూన్లు; రబ్దీ కోసం; పాలు - పది కప్పులు; పంచదార - 6 టేబుల్ స్పూన్లు; కుంకుమపువ్వు - కొద్దిగా (చల్లటి పాలలో వేసి కరిగించాలి); ఏలకులపొడి - పావు టీ స్పూను; గార్నిషింగ్ కోసం; పిస్తా పప్పులు - రెండు టేబుల్ స్పూన్లు తయారి: పాల విరుగును చేతితో బాగా కలిపి మెత్తగా చేయాలి ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ, ఉండలుగా చేసి ఆ తర్వాత ఫ్లాట్‌గా ఒత్తాలి. (ఎక్కడా పగుళ్లు లేకుండా చూసుకోవాలి) రెండువైపులా మైదా అద్ది ఒక ప్లేట్లో పక్కన ఉంచాలి మిగిలిన మైదాపిండి, కార్న్‌ఫ్లోర్‌లను అరకప్పు నీటిలో కలపాలి పెద్ద పాత్రలో ఐదు కప్పుల పంచదార వేసి కరిగేవరకు ఉడికించాలి అరకప్పు పాలు జత చేసి పాకం ఉడికే వరకు ఉంచాలి పాలు పైకి పొంగినప్పుడు గరిటెతో కలుపుతుండాలి పాకం బాగా ఉడికిన తర్వాత ఒక పాత్రలోకి వడబోయాలి ఒక కప్పు పాకాన్ని పక్కన ఉంచి, మిగిలిన పాకాన్ని వెడల్పుగా, లోతుగా ఉండే పాత్రలో పోసి, ఐదుకప్పులు నీరు జతచేసి స్టౌ మీద ఉంచి మరిగించాలి బాగా ఉడుకుతుండగా తయారుచేసి ఉంచుకున్న పాలవిరుగు టిక్కీలను ఇందులో వేయాలి పిండి జతచేసిన నీటిని కొంత ఇందులో పోయాలి టిక్కీలు పాత్రకు అతుక్కోకుండా జాగ్రత్తగా కలుపుతుండాలి పాత్ర అంచులకు మాత్రమే తగిలేలా అరకప్పు నీటిని ఐదు నిముషాలకొకసారి పోయాలి. (ఇలా చేయడం వల్ల పాకం చిక్కబడదు) పావుగంట సేపు ఇలాగే ఉడికించాలి స్పూన్‌తో జాగ్రత్తగా తీసి అంతకుముందు తయారుచేసి ఉంచుకున్న పాకంలో వేయాలి రబ్దీ తయారుచేసేటప్పుడు పాలను మందంగా, లోతుగా ఉండే నాన్‌స్టిక్ పాన్‌లో ఉంచి, మంటను పెంచుతూ తగ్గిస్తూ, ఆపకుండా కలుపుతూ, మూడువంతులు వచ్చేంత వరకు కలుపుతుండాలి. అంచులకు అంటిన క్రీమ్‌ని ఎప్పటికప్పుడు కలుపుతుండాలి. బెంగాలీ సందేశ్ కావలసినవి: పాలవిరుగు - పావు కప్పు; పంచదారపొడి - పావు కప్పు కంటే తక్కువ తయారి: పాలవిరుగును చల్లారబెట్టి అందులో పంచదార పొడి వేసి నెమ్మదిగా కలపాలి ఈ మిశ్రమాన్ని నాన్‌స్టిక్ పాన్‌లో వేసి, సన్నని మంట మీద మూడు నిముషాలు ఉంచాలి (ఉడుకుతున్నంతసేపు కలుపుతూనే ఉండాలి) బాగా ఉడికిన తర్వాత కిందకు దించి చల్లారనివ్వాలి ఉండలు లేకుండా చేతితో బాగా కలిపి మెత్తగా చేయాలి ఏ ఆకారంలో కావాలంటే ఆ ఆకారంలో చేసుకుని, నచ్చిన డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేయాలి. ఇవి పాటించండి... రసగుల్ల, గులాబ్‌జామ్, రసమలై వంటి వాటిని ఉడికించడానికి తగినంత వెడల్పు ఉన్న పాత్రను ఎంచుకోవాలి. పాత్ర ఇరుకుగా ఉంటే ఒకదానితో ఒకటి అతుక్కుని ముద్దలా అయిపోతాయి. పాలవిరుగును చేతితో ఎంత ఎక్కువసేపు మెదిపితే అంత మెత్తబడి... రసగుల్ల, గులాబ్‌జామ్ వంటివి బాగా వస్తాయి. రసగుల్ల, గులాబ్‌జామూన్, రసమలై... వీటిని చేతిలో రౌండ్‌గా చేసేటప్పుడు పైన పగుళ్లు లేకుండా చూసుకోవాలి. ఏమాత్రం పగులు ఉన్నా సరిగా రావు. పంచదార పాకం పట్టినప్పుడు మలినాలు పైకి తేలతాయి. వాటిని వడగట్టి, అరకప్పు చన్నీరు కలిపి మళ్లీ పాకం పట్టుకుంటే స్వీట్లు రుచిగా ఉంటాయి. ఇంటిదగ్గరే కోవా తయారుచేసుకోవడం... వెడల్పాటి నాన్‌స్టిక్ పాన్‌లో పాలు పోసి మరిగించాలి. పాలు చిక్కబడగానే మంట తగ్గించి, పాలు బాగా దగ్గర పడేవరకు ఉంచి దించి బాగా చల్లారనిస్తే పచ్చి కోవా తయారయినట్లే. కర్టెసీ చెఫ్: ఆనందబార్ ఆదిత్య సరోవర్ కొండాపూర్, హైదరాబాద్ సేకరణ: డా.వైజయంతి -
నిన్ను ప్రేమించువారికై...
ప్రేమించడం... ప్రేమే జీవితం అనుకోవడం... చేతులు కోసుకోవడం... రైలు కింద పడిపోవడం... చదువులు మానేసి పిచ్చివారైపోవడం... ప్రేమ కోసం ఇన్ని త్యాగాలు చేయాలా? ‘నువ్వు ఇష్టపడేవారి కోసం నువ్వు చచ్చిపోవాలనుకోవడం కంటె... నిన్ను ఇష్టపడేవారి కోసం నువ్వు బతకడం నేర్చుకో...’ అంటోంది ‘లవ్ డ్రైవ్’... డెరైక్టర్స్ వాయిస్ : మాది విశాఖజిల్లా డొంకాడ గ్రామం. ఆంధ్ర యూనివర్శిటీలో బి.కాం చదివాను. ఆ తరవాత మల్టీ మీడియా, మాయా, విజువల్ ఎఫెక్ట్స్ ఎడిటింగ్ నేర్చుకున్నాను. ఫ్రీలాన్సర్‌గా హార్డ్‌వేర్ నెట్వర్కింగ్ చేస్తున్నాను. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నాను. నాకు మా తల్లిదండ్రుల నుంచి, స్నేహితుల నుంచి మంచి సపోర్ట్ ఉంది. ఇది నా మొదటి లఘుచిత్రం. ఈ చిత్రానికి పెద్దగా ఖర్చేమీ చేయలేదు. షార్ట్ స్టోరీ: అన్ని ప్రేమకథల్లాగే ఈ కథలో కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఫోన్లో చాటింగ్‌లు, మెసేజ్‌లు, సినిమాలు, షికార్లు... అన్నీ మామూలే. అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్లో ఇద్దరికీ బాగా దెబ్బలు తగులుతాయి. ఒకరోజు హీరో... తలకి తగిలిన, కాలికి తగిలిన దెబ్బలకు కట్టు కట్టుకుని, రోడ్డు మీద కుంటుతూ నడుస్తుంటాడు. ఆ సమయంలో హీరోయిన్ అటుగా వస్తుంది. ఆమెను ఎంత పలకరించినా పలకదు. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అంటూ, చేతి మీద గాయం చేసుకుంటాడు. ఆ అమ్మాయి అక్కడికి ఎలా వచ్చిందనేది చిన్న ట్విస్ట్. ఆ తరవాత స్నేహితులు వచ్చి, ‘నిన్ను ప్రేమించేవారి కోసం నువ్వు బ్రతకాలి’ అనటంతో కథ పూర్తవుతుంది. కామెంట్: ఈ కథ మొదటి నుంచి చివరి వరకు చాలా రొటీన్‌గా ఉందనే భావన కలుగు తుంది. ఇందులో కొత్తదనమేమీ లేదనిపి స్తుంది. అసలు కథంతా కొసమెరుపులోనే ఉంటుంది. ప్రేమలో కూరుకుపోయినవారికి, ఆత్మ హత్యలు చేసుకునేవారికి మంచి సందేశం ఇచ్చాడు. ఆత్మహత్య చేసుకునే ముందు... మనల్ని కన్న తల్లిదండ్రుల్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. అలాగే మనల్ని ప్రేమించేవారిని కూడా జ్ఞాపకం తెచ్చుకో వాలి. అప్పుడు ఎటువంటి సమస్య ఎదురైనా ఏ అఘాయిత్యాయినికీ పాల్పడరు... అనే విషయాన్ని చాలా చక్కగా చూపాడు. టేకింగ్, రీరికార్డింగ్, ఎడిటింగ్, ఫొటోగ్రఫీ, యాంగిల్స్... అన్నీ బావున్నాయి. అయితే... నటీనటుల చేత డైలాగులు మరింత పటిష్ఠంగా చెప్పించి ఉంటే బాగుండేది. ఇంత చిన్నవయసులోనే మంచి మంచి ఆలోచనలు కలగడం వల్ల, భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు తీయగలుగుతారు. - డా.వైజయంతి -
భుజియింపవయ్య బొజ్జగణపయ్య
నైవేద్యాన్ని తృప్తిగా స్వీకరించి భక్తుల కడుపు నింపే దేవుడు... ముక్కోటి దేవతల్లో... బొజ్జగణపయ్య ఒక్కడే! పెడుతుంటే చెయ్యడ్డు పెట్టడు పెడుతున్నదేమిటని చూడనే చూడడు! అటుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్ ఎనీథింగ్... నిటలాక్షుని అగ్రసుతునికి విందే! ఇవన్నీ కలిసిన ఉండ్రాళ్లయితేనా... ఇక చెప్పేదేముందీ... ఆయనకు భుక్తాయాసం. మనకు భక్తాయాసం. జిల్లేడుకాయలు కావలసినవి: బియ్యప్పిండి - 2 కప్పులు నీరు - 5 కప్పులు కొబ్బరితురుము - కప్పు బెల్లం తురుము - కప్పు ఏలకులపొడి - టీ స్పూను తయారి: ఒక పాత్రలో నీరు మరిగించాలి. బియ్యప్పిండి వేసి బాగా కలిపి మంట తగ్గించి, పదినిముషాలుంచి దించేయాలి. బాణలిలో కొబ్బరితురుము, బెల్లం తురుము, ఏలకుల పొడి వేసి స్టౌమీద ఉంచి, ఉడికించి దించేయాలి. చల్లారాక చిన్నచిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి. కొద్దిగా బియ్యప్పిండిని చేతిలోకి తీసుకుని, పల్చగా ఒత్తి కొబ్బరి ఉండను అందులో ఉంచి జిల్లేడుకాయ ఆకారంలో అంచులను మూసేయాలి. ఇలా అన్నీ తయారుచేకుని, ఇడ్లీ రేకులలో ఉంచి, కుకర్‌లో పెట్టి, మూత ఉంచాలి. పదినిముషాలయ్యాక దించేయాలి. (విజిల్ పెట్టకూడదు) కేసర్ పనీర్ మోద క్ పేడా కావలసినవి: పనీర్ - అరకప్పు పాలపొడి - అరకప్పు పాలు - అరకప్పు పంచదార - అరకప్పు + 3 టేబుల్ స్పూన్లు ఏలకులపొడి - అర టీ స్పూను కుంకుమపువ్వు - కొద్దిగా నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు తయారి: పనీర్‌ని మెత్తగా పొడి చేయాలి. (అవసర మనిపిస్తే మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవచ్చు) మందపాటి బాణలిలో పనీర్ పొడి, పాలపొడి, పాలు, కుంకుమపువ్వు వేసి అన్నీ కలిసేవరకు బాగా కలపాలి. నెయ్యి జత చేసి కలపాలి. కిందకు దించి చల్లారనివ్వాలి. మిక్సీలో పంచదార, ఏలకులపొడి వేసి మెత్తగా చేయాలి. ఈ పొడిని పనీర్ మిశ్రమంలో వేసి కలపాలి. (తీపిఎక్కువ తినేవారు, మరి కాస్త జత చేయవచ్చు) ఈ మిశ్రమాన్ని ఉసిరికాయ పరిమాణంలో ఉండలుగా చేసుకోవాలి. (మోదక్ మౌల్డ్‌లు ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటిని ఉపయోగించవచ్చు). బిళ్ల కుడుములు కావలసినవి: బియ్యపురవ్వ - కప్పు నీరు - 3 కప్పులు నూనె - 2 టీ స్పూన్లు ఉప్పు - తగినంత తయారి: బాణలిలో రవ్వను కొద్దిగా (నూనె లేకుండా) వేయించాలి. ఒక మందపాటి పాత్రలో నీరు, ఉప్పు వేసి మరిగించాలి. మరుగుతున్న నీటిలో రవ్వ వేసి కలపాలి. మంట తగ్గించి సుమారు పది నిముషాలు ఉంచి దించి, చల్లారనివ్వాలి. చేతికి నూనె రాసుకుని, ఉడికించుకున్న రవ్వను కొద్దిగా తీసుకుని ఉండలుగా చేసి, వాటిని టిక్కీల మాదిరిగా ఒత్తాలి. స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక టీ స్పూను నూనె వేసి ఈ టిక్కీలను ఒక్కొక్కటిగా వేసి రెండువైపులా కాల్చాలి. వీటిని ఉల్లిపాయ చట్నీతో తింటే బాగా రుచిగా ఉంటాయి. (గోధుమవర్ణంలోకి మారాక రెండవవైపు తిప్పాలి. లేదంటే విరిగిపోతాయి) తామర గింజల పాయసం కావలసినవి: తామర గింజలు - కప్పు (సూపర్ మార్కెట్లో దొరుకుతాయి) పాలు - అర లీటరు; కండెన్స్డ్ మిల్క్/ పంచదార - 6 టేబుల్ స్పూన్లు జీడిపప్పు ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు; కుంకుమపువ్వు - కొద్దిగా బాదంపప్పు ముక్కలు - టీ స్పూను; పిస్తా పప్పులు - కొద్దిగా కిస్మిస్ - రెండు టేబుల్ స్పూన్లు; ఏలకులపొడి - అర టీ స్పూను తయారి: మందపాటి పాత్రలో సన్నటి మంట మీద పాలు మరిగించాలి. తామర గింజలను చిన్నచిన్న ముక్కలుగా చేయాలి. బాణలిలో నెయ్యి వేసి కరిగాక, బాదంముక్కలు, జీడిపప్పు ముక్కలు, కిస్మిస్ వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలి ఉన్న నేతిలో తామర గింజలు వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించాలి. సగం గింజలను మిక్సీలో వేసి పొడి చేయాలి. మిగిలిన గింజలను, తామరగింజల పొడిని పాలలో వేసి ఉడికించాలి. కండెన్స్డ్ మిల్క్ లేదా పంచదార జతచేయాలి. టేబుల్ స్పూన్ పాలలో కుంకుమపువ్వు వేసి బాగా కలిపి మరుగుతున్న పాలలో వేసి ఐదు నిముషాలు ఉంచాలి. ఏలకులపొడి, డ్రైఫ్రూట్స్ ముక్కలు వేసి బాగా కలిపి దించేయాలి. బౌల్స్‌లో పోసి పిస్తా ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. చిక్కుడుగింజలు-ఉండ్రాళ్లు కావలసినవి: బియ్యప్పిండి - కప్పు నీరు - 2 క ప్పులు; నూనె - 2 టేబుల్ స్పూన్లు ఉప్పు - అర టీ స్పూను చిక్కుడు గింజలు - అర కప్పు కొబ్బరి తురుము - అర కప్పు కొత్తిమీర తరుగు - పావు కప్పు పచ్చిమిర్చి పేస్ట్ - టీ స్పూను నిమ్మరసం - టీ స్పూను ఆవాలు - పావు టీ స్పూను జీలకర్ర - పావు టీ స్పూను శనగపప్పు - అర టీ స్పూను మినప్పప్పు - అర టీ స్పూను నూనె - మూడు టీ స్పూన్లు ఇంగువ - చిటికెడు ఉప్పు - తగినంత బాల్స్ తయారి: ఒక పాత్రలో నీరు, ఉప్పు, కొద్దిగా నూనె పోసి మరిగించాలి. మంట తగ్గించి బియ్యప్పిండి పోసి కలిపి మూత పెట్టి 15 నిముషాలు ఉంచాలి. ఒక వెడల్పాటి పాత్రకు నూనె రాయాలి. కొద్దికొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటూ ఉండలుగా చేసి, వీటిని ప్లేట్ మీద ఉంచి, పైన కొద్దిగా నూనె జల్లి కుకర్‌లో ఉంచి మూతపెట్టి పదినిముషాలు ఉంచి దించేయాలి. చిక్కుడు గింజలను ఉడికించి నీరు తీసేయాలి. పాన్‌లో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఇంగువ, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి. ఉడికించిన చిక్కుడు గింజలు, చిన్న ఉండ్రాళ్లు, వేసి బాగా కలిపి ఐదు నిముషాలు ఉడికించి దింపేయాలి. నిమ్మరసం, కొబ్బరితరుగులతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. బెల్లం కుడుములు కావలసినవి: బియ్యప్పిండి - అర కప్పు నీరు - ముప్పావు కప్పు; బెల్లం తురుము - అర కప్పు కంటె కొద్దిగా తక్కువ; ఎండుకొబ్బరి తురుము - మూడు టేబుల్ స్పూన్లు ఏలకులపొడి - కొద్దిగా; నెయ్యి/నూనె - రెండు టేబుల్ స్పూన్లు తయారి: ఒక పెద్ద పాత్రలో నీరు పోసి మరిగించాలి. బెల్లం తురుము వేసి రెండు మూడు నిముషాలు కలపాలి. ఏలకులపొడి, ఎండుకొబ్బరి తురుము, బియ్యప్పిండి వేసి ఆపకుండా కలపాలి. కిందకు దించి ఐదు నిముషాలు వదిలేయాలి. చేతికి నెయ్యి లేదా నూనె రాసుకుని ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతులలోకి తీసుకుంటూ, ఉండలు చేయాలి. వీటిని కుకర్‌లో ఇడ్లీ రేకుల మీద ఉంచి, వాటి మీద కొద్దిగా నెయ్యి వేసి, మూత పెట్టాలి (విజిల్ పెట్టకూడదు). పది నిముషాలయ్యాక దించేయాలి. ఉండ్రాళ్లు కావలసినవి: బియ్యపురవ్వ - రెండుకప్పులు నీరు - మూడున్నర కప్పులు శనగపప్పు - పావు స్పూను; ఉప్పు - తగినంత నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు తయారి: ఒక పెద్ద పాత్రలో నీరు, ఉప్పు వేసి మరిగించాలి. శనగపప్పు వేసి బాగా కలపాలి. రవ్వ వేస్తూ ఆపకుండా కలిపి, మంట తగ్గించాలి. కొద్దిగా చల్లారాక చేతికి నూనె చేసుకుని, బియ్యపురవ్వను కొద్దిగా తీసుకుంటూ ఉండ్రాళ్లు చేయాలి. ఉల్లి చట్నీ తయారి కావలసినవి: ఉల్లితరుగు - కప్పు; ఎండుమిర్చి - 6 పచ్చికొబ్బరి తురుము- పావు కప్పు; చింతపండుగుజ్జు - టీ స్పూను బెల్లం తురుము - టీ స్పూను; ఉప్పు - తగినంత నూనె - 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను కరివేపాకు - రెండు రెమ్మలు; నెయ్యి - టీ స్పూను తయారి: మిక్సీలో ఎండుమిర్చి, పచ్చికొబ్బరి తురుము, బెల్లం తురుము, ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి ఉల్లితరుగు, చింతపండు గుజ్జు వేసి మరో మారు మిక్సీ పట్టి పేస్ట్ తయారుచేసుకోవాలి (మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి) బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లిపాయ పేస్ట్ వేసి సుమారు పది నిముషాలు వేయించాలి మరో బాణలిలో నెయ్యి వేసి కరిగాక ఆవాలు, కరివేపాకు వేసి కొద్దిగా వేయించి ఈ మిశ్రమాన్ని పచ్చడిలో వేసి కలిపి బిళ్ల కుడుములతో వడ్డించాలి. నోట్ రవ్వ తయారి: బియ్యాన్ని శుభ్రంగా కడిగి పది నిముషాలు నానబెట్టి నీరు వడపోసి, వస్త్రం మీద ఆరపోయాలి. నీరంతా పోయాక (బియ్యం తడిగానే ఉండాలి) మిక్సీలో వేసి విప్పర్ మోడ్‌లో మిక్సీ తిప్పి రవ్వ తయారుచేసి, జల్లించాలి. సేకరణ: డా.వైజయంతి కర్టెసీ: చెఫ్ అండ్ హర్ కిచెన్