draksharamam
-
ద్రాక్షారామం ఆలయంలో కార్తీక మాసం సందడి
-
East Godavari Famous Temples: తూర్పుకు వెళ్తే ఇంత మంది దేవుళ్లను చూడవచ్చా? (ఫొటోలు)
-
హిందూ ధర్మ పరిరక్షణకు ఏపీ సర్కార్ ప్రాధాన్యత: మంత్రి వేణు
సాక్షి, రామచంద్రాపురం(కోనసీమ జిల్లా): దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం దాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుపుకోవడం ఆనందకరమని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. శనివారం ద్రాక్షారామ మాణిక్యాంబ భీమేశ్వర స్వామి వారి కల్యాణోత్సవంలో భాగంగా నాలుగోవ రోజు మంత్రి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హిందూ ధర్మ పరిరక్షణకు ప్రాధాన్యతను ఇస్తున్నారని ఇందులో భాగంగానే జీర్ణోద్ధరణకు వచ్చిన స్వామివారి పాత రథం స్థానే నూతన రథం నిర్మించడానికి సంకల్పించినట్లు తెలిపారు. నూతన రథం నిర్మాణం కోసం కంచి కామకోటి పీఠాధి మఠం, విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వరూప నంద స్వామి ఆశీస్సులతో 45 రోజుల క్రితం నూతన రథం పనులు ప్రారంభించి రికార్డు స్థాయిలో స్వామివారి కల్యాణ సమయానికి నూతన రథం నిర్మించుకోవడం శుభపరిణామం అన్నారు. నూతన రథంలో స్థల పురాణములో తెలిపిన విధంగా స్వామి వారి దేవాలయంలో ఉన్న వివిధ విగ్రహాల సంబంధించిన చిత్రాలను నూతన రథంలో రథ రూపశిల్పి గణపతాచార్యులు ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. నూతన రథం ప్రారంభోత్సవంలో విశాఖపట్నం శారదా పీఠం పీఠాధిపతి స్వాత్మా నంద స్వామి, జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర, జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్‌రెడ్డిలతో పాటు దేవాదాయ శాఖకు చెందిన అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
ద్రాక్షారామంలో ఎమ్మెల్యే రోజా విశేష పూజలు
-
భీమేశ్వరునికి.. నందీశ్వరునికీ నడుమ...∙
ద్రాక్షారామం (రామచంద్రపురం రూరల్): సాధారణంగా భక్తులు ఏ శివాలయానికి వెళ్లినా చండీశ్వరుడిని, నందీశ్వరుడిని దర్శించి స్వామివారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా నందీశ్వరుడి కొమ్ముల మధ్య నుంచి మూల విరాట్ దర్శించుకోవడం ఆచారంగా వస్తోంది. అయితే దక్షిణ కాశీగా పేరొందిన ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామలో మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామివారి దేవాలయంలో ఆలయ అధికారులు భీమేశ్వరునికి, నందీశ్వరుడికీ మధ్య దాతలు ఇచ్చిన దర్బారు మండపాన్ని ఏర్పాటు చేయడంపై శివ భక్తులు, గ్రామస్తులు, అర్చకులు, పురోహిత పెద్దలు కొంతమంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ దర్బారు మండపానికి అద్దాలు అమర్చి అందులో స్వామివారి మూర్తులను ఉంచి తీర్థం, పాదుకలు ఇక్కడ ఏర్పాటు చేయాలన్న ఆలోచన సమంజసం కాదంటున్నారు. దీనివల్ల స్వామికి, నందీశ్వరుడికి మధ్య ఆటంకం ఏర్పాటు చేసినట్టవుతుందని, అంతేకాకుండా భక్తుల రద్దీ వేళల్లో భక్తులకు ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం ఉందంటున్నారు. అక్కడికి బదులుగా భక్తులకు అనుకూలంగా ఉండే మరో చోటుకు ఈ మండపాన్ని మార్చాలని కోరుతున్నారు. అందరినీ ఆలోచించి చేస్తాం కొంతమంది పెద్దల సూచన మేరకు మండపాన్ని అక్కడ ఏర్పాటు చేశాం. అక్కడ పెట్టడం వల్ల భక్తులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటే, అందరితో ఆలోచించి మండపం స్థలం మార్చేందుకు నిర్ణయం తీసుకుంటాం. – పెండ్యాల వెంకట చలపతిరావు, ఈఓ, శ్రీ భీమేశ్వరస్వామివారి దేవస్థానం, ద్రాక్షారామ -
తెలుగు రాష్ట్రాలలో కార్తీక శోభ...
-
అదే పేరు.. అవే పోలికలు... అందుకే...
నిందితుడని అదుపులోకి తీసుకున్న హిమాచల్ ప్రదేశ్ పోలీసులు విచారణ అనంతరం వదిలేసిన వైనం బతుకు జీవుడా అంటూ గ్రామానికి చేరుకున్న బాధితుడు గంగావతి : ఓ హత్యకేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అదే పేరు.. అవే పోలికలతో ఫేస్బుక్లో ఫొటో కన్పించింది. ఇంకేముంది.. నిందితుడనుకుని అరెస్ట్‌చేశారు. విచారణ అనంతరం కాదని తెలుసుకుని వదిలివేశారు. దీంతో బాధితుడు బతుకుజీవుడా అంటూ స్వగ్రామానికి చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో అక్లండ్ హోటల్ నిర్వహిస్తున్న సూద్ దంపతులను అదే హోటల్లో పనిచేసే శ్యామలరావు 2001లో హత్య చేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. అక్కడి జిల్లా న్యాయస్థానం 2004 మే 17న శ్యామలరావుకు ఉరిశిక్ష విధించింది. అయితే..అతను సహన సెంట్రల్ జైలు నుంచి అదే ఏడాది ఆగస్టులో తప్పించుకుని పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలిస్తుండగా.. ఫేస్బుక్లో అదే పేరు, పోలికలతో ఫొటో కన్పించింది. దాని ఆధారంగా ఈ నెల 6న కర్ణాటక రాష్ట్రం గంగావతి తాలుకా విద్యానగర్‌కు వచ్చారు. శ్యామలరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని హిమాచల్ ప్రదేశ్‌కు తీసుకెళ్లారు. అక్కడ సుదీర్ఘ విచారణ అనంతరం శ్యామలరావు వెంట్రుకలు, ఎత్తు, తండ్రి పేరు పరిశీలించి అపరాధి కాదని నిర్ధారించారు. గురువారం ఇంటికి తిరిగి పంపించారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా..విద్యానగర్‌లో స్థిరపడిన చీకట్ల శ్యామలరావుది తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామం. కొన్నేళ్ల క్రితమే ఇక్కడికొచ్చి స్థిరపడ్డాడు. -
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ.
-
ఆలయాల్లో కార్తీక కాంతులు
హైదరాబాద్: కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం వేకువజాము నుంచే శైవక్షేత్రాలు, నది, సముద్ర తీరాలు భక్తుల కళకళలాడాయి. పుణ్యస్నానాలు ఆచరించే భక్తులతో నిండిపోయాయి. గోదావరి తీరంలోని ఖమ్మం జిల్లా భద్రాచల క్షేత్రంలో వేకువజామునుంచే పెద్ద సంఖ్యలో భక్తులు గోదావరి తీరానికి చేరుకున్నారు. పుణ్యస్నానాలు చేసి, శ్రీరాముని సన్నిధిలో దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలు జిల్లా శ్రీశైలం పాతాళగంగ వద్ద రద్దీ పెరిగిపోయింది. మల్లికార్జున స్వామి దర్శనానికి జనం పోటెత్తారు. భక్తుల రద్దీ కారణంగా ఆర్జిత సేవలను రద్దు చేసి, స్వామి వారి అలంకార దర్శన సేవభాగ్యం కల్పించారు. తిరుపతిలోని కపిలతీర్థంలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కపిలతీర్థం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో భక్తులను దగ్గరగా అనుమతించటం లేదు. శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు.సింహాచల వరాహ నరసింహ స్వామి క్షేత్రం, నల్లగొండ జిల్లా యాదాద్రి, విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో మహిళలు కార్తీక దీపారాధన చేశారు. గోదావరి, కృష్ణా నదులతోపాటు బాపట్ల సూర్యలంక, ఒంగోలు, విశాఖ కాకినాడ, బందరు సముద్ర తీరాల్లో భక్తులు కార్తీక స్నానాలు చేస్తున్నారు. -
ఔను.. ఇక్కడి నుంచే ఆయన...
రాయవరం : ‘ఐతే ఓకే’ అనే డైలాగ్ ఆయన సినీ జీవితాన్ని మలుపునిచ్చింది. ‘ఔను..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ చిత్రంలోని ఈ డైలాగ్‌ను మరువని సినీ ప్రేక్షకులు కొండవలస లక్ష్మణరావును చిరకాలం గుర్తుంచుకుంటారు. నాటకరంగంలో స్టేజి ఆర్టిస్ట్‌గా ఉన్న కొండవలస ఆ సినిమా నుంచే హాస్యనటుడుగా సినీ ప్రస్థానం మొదలెట్టారు. ఆయన సినీ జీవితానికి బీజం పడింది ఈ జిల్లాలోనే అని చెప్పవచ్చు. ఆయనను గుర్తించింది దర్శకుడు వంశీయే.. ద్రాక్షారామలో నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో అల్లదే.. మా ఊరండీ అనే నాటకం 2001లో ప్రదర్శించారు. ఆ నాటకాన్ని సినీ దర్శకుడు వంశీ తిలకించారు. ‘నాటకం నచ్చలేదు.. కానీ నీ నటన బాగుంది’ అని కితాబిచ్చి వంశీ వెళ్లిపోయినట్లుగా కొండవలస పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. తన నటనతో వంశీ మనోఫలకంపై ముద్ర వేసుకున్న కొండవలసకు ‘ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాలో తొలి అవకాశం ఇచ్చారు. ఆ విధంగా కొండవలస సినీ జీవితానికి ద్రాక్షారామ వేదికైందని చెప్పవచ్చు. శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ, నటనలో తనకంటూ ఒక ప్రత్యేకశైలిని ఏర్పరచుకోవడంతో పాటు ‘ఐతే..ఓకే’ అనే మేనరిజం జనం నోళ్లలో నానిపోయేలా ఆయన నటించారు. గోదావరితో అనుబంధం కొండవలస లక్ష్మణరావు నటించిన పలు చిత్రాలు జిల్లాలో చిత్రీకరించారు. ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమా పాటల చిత్రీకరణ రాజమండ్రి, పోలవరంలో సాగాయి. ఆ సమయంలో కొండవలస ఇక్కడకు వచ్చారు. తర్వాత జిల్లాలో చిత్రీకరించిన కబడ్డీ కబడ్డీ, దొంగరాముడు అండ్ పార్టీ తదితర చిత్రాల్లో కొండవలస నటించారు. ఈ నేపథ్యంలో ఆయనకు గోదావరి ప్రాంతంతో అనుబంధం ఏర్పడింది. సినిమా షూటింగ్లకే కాకుండా జిల్లాలో జరిగిన అనేక నాటక ప్రదర్శనలకు న్యాయనిర్ణేతగా వచ్చారు. దాతృత్వానికీ ధనికుడే.. వాస్తవానికి మధ్య తరగతి కుటుంబానికి చెందిన కొండవలస దాతృత్వానికి ధనికుడని చెప్పవచ్చు. జిల్లాలో పలు నాటక పరిషత్‌లకు హాజరైన సందర్భంలో ఆయన పేద కళాకారులకు నగదు బహుమతులు అందజేసి, సత్కరించారు. రాయవరంలో వీఎస్ఎం నాటక కళాపరిషత్ ద్వారా నిర్వహించే నాటక పోటీల సందర్భంగా ప్రతి ఏటా ఆయన పేద వృద్ధ కళాకారులకు నగదు బహుమతులు అందజేసేవారు. ఏసురాజు పెసరట్టు ఆయనకు ఇష్టం ఆత్రేయపురం : గోదావరి తీరాన షూటింగ్ జరిగిన సమయంలో ఆత్రేయపురం కాలువ రేవులో ఉన్న ఏసురాజు హోటల్‌కు కొండవలస వెళ్లేవారు. అక్కడ పెసరట్టు ఉప్మా అంటే కొండవలసకు ఎంతో ఇష్టం ఏర్పడింది. షూటింగ్ సమయంలో సరదాగా వచ్చి, తృప్తిగా పెసరట్టు తిని వెళ్లేవారని ఏసురాజు తెలిపారు. కళావాణి సంస్థ అధ్యక్షుడు సఖినేటి రామకృష్ణంరాజుకు కొండవలసతో మంచి సంబంధాలున్నాయి. గోపి గోపికా గోదావరి, బెండు అప్పారావు ఆర్ఎంపీ, సరదాగా కాసేపు, కత్తి పద్మారావు తదితర సినిమాల్లోని కొన్ని సన్నివేశాల్లో కొండవలసతో కలిసి సఖినేటి నటించారు. రావులపాలెం కేంద్రంగా నిర్వహిస్తున్న సీఆర్సీ నాటక కళా పరిషత్‌లో ప్రతిఏటా పేద కళాకారులను సత్కరించి, రూ.2 వేల నగదును కొండవలస అందజేసేవారు. మూర్తీభవించిన మానవత్వం కొండవలస లక్ష్మణరావు నటుడే కాదు. మానవత్వం మూర్తీభవించిన వ్యక్తి. ఔను..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమాలో భార్యాభర్తలుగా కలిసి నటించాం. అంతకు ముందు పరిషత్‌ల ద్వారా పలు నాటకాల్లో నటించాం. మంచి వ్యక్తిత్వం కలిగిన లక్ష్మణరావు ఎంతో మంది కళాకారులకు తన శక్తికొద్దీ సాయపడ్డారు. - వై.సరోజ, సినీ నటి, ద్రాక్షారామ నాటకమంటే ప్రాణం నాటకరంగం నుంచి సినీ రంగంలో ప్రవేశించినా.. ఆయన నాటక రంగాన్ని వీడలేదు. కళాపరిషత్‌లు నాటక పోటీలకు ఆహ్వానిస్తే తప్పనిసరిగా వీలుచూసుకుని హాజరయ్యేవారు. రాయవరంలో కళాపరిషత్‌కు కూడా కొండవలస వచ్చి తన సూచనలు, సలహాలు ఇవ్వడం మర్చిపోలేం. - మంతెన అచ్యుతరామరాజు, వీఎస్ఎం నాటక కళాపరిషత్ ప్రధాన కార్యదర్శి, రాయవరం