విజ్ఞాన్ వర్సిటీ వీసీగా తంగరాజ్
గుంటూరు: గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్‌గా డాక్టర్ సి.తంగరాజ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా గుంటూరులోని ఓ హోటల్లో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య నూతన వీసీని పరిచయం చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ రత్తయ్య మాట్లాడుతూ ఉన్నత విద్యారంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ తంగరాజ్ సేవలు విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమన్నారు. తమిళనాడులోని అన్నామలై విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్‌గా ఆరేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించిన తంగరాజ్ భారతదేశ శాస్త్ర, సాంకేతిక విభాగం(డీఎస్టీ)లోని టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్ కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ కోర్ ప్రాజెక్టుకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారని వివరించారు.
విద్యారంగంలో మూడు దశాబ్దాల విశేష అనుభవం గడించిన తంగరాజ్ నాలుగు అంతర్జాతీయ ఫెలోషిప్స్ సాధించారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలతో పాటు రెండు ప్రైవేటు, మూడు విదేశీ వర్సిటీలలో బోధనానుభవం కలిగి ఉన్నారని చెప్పారు.