dream job
-
డ్రీమ్ జాబ్స్ అంటే ఇలా ఉంటాయా? వైరల్ వీడియో
నోట్లోకి నాలుగు వేళ్లు వెళ్లేందుకు ఏదో ఒక పని దొరికితే చాలు.. ఇది సగటు మానవుని ఆరాటం. అర్హతకు తగ్గ ఉద్యోగం రావాలి? కుటుంబాన్ని పోషించుకోవాలి. ఆ తరువాత ఉండటానికి చిన్న ఇల్లు కొనుక్కోవాలి ఇది కొంతమంది ఆశ.పే..ద్ద హోదా ఉన్న ఉద్యోగం కావాలి. నెలకు ఇదెంకల జీతం, బంగ్లా..కారు.. ఎక్స్ట్రా.. ఇది మరికొంతమంది డ్రీమ్ జాబ్. మరి ఇస్త్రీ మడత నలగకుండా, ఒళ్లుఅలవకుండా, చెమట పట్టకుండా ఉండే జాబ్ కావాలి? ఇలా ఆలోచించే జీవులు చాలామందే ఉన్నారు. సరిగ్గా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డ్రీమ్ జాబ్స్.. అంటూ సీసీటీవీ ఇడియట్స్ అనే ట్విటర్ ఖాతా ఒక ఫన్నీ వీడియోను షేర్ చేసింది. అదేంటో మీరు కూడా చూడండి. అన్నట్టు ఇలాంటి ఉద్యోగాలు నిజంగా డ్రీమ్ జాబ్సేనా? కొన్నాళ్లకు బోర్ కొట్టదూ? ఏమంటారు? Dream jobs! 😂😂 pic.twitter.com/jfsNGwI0H7— CCTV IDIOTS (@cctvidiots) November 11, 2024 -
కాలగర్భంలో కలల ఉద్యోగం..!
చిన్నపుడు ఎవరైనా ‘పెద్దయ్యాక ఏం చేయాలనుకుంటున్నావ్?’ అని అడిగితే చాలామంది పెద్ద సాఫ్ట్వేర్ ఇంజినీరో లేదా ప్రపంచంలోని టాప్ టెక్ కంపెనీలో మంచి ఉద్యోగం చేయాలని చెప్పేవారు. అదే డ్రీమ్ జాబ్‌గా ఊహించుకుని కష్టపడి చదివి ఏదో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరినవారు కూడా ఉన్నారు. అయితే మారుతున్న జీవన శైలి, టెక్ కంపెనీలో వస్తున్న మార్పులు తమ కలల సాకారానికి వ్యతిరేకంగా ఉంటున్నాయని చెబుతున్నారు. ప్రధానంగా ‘జెన్ జీ’(1997-2005 మధ్య జన్మించిన వారు) యువతకు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది.కొవిడ్ సమయంలో ఐటీ కంపెనీల రెవెన్యూ గణనీయంగా తగ్గిపోయింది. ప్రధానంగా టెక్ కంపెనీల్లో ఉద్యోగాల జీతాలకే ఎక్కువగా ఖర్చు అవుతుంది. దాంతో కరోనా కాలంలో అదే అదనుగా లేఆఫ్స్ పేరుతో చాలామంది ఉద్యోగులను తొలగించారు. ‘జెన్ జీ’ యువతకు కొత్తగా టెక్ జాబ్స్ సంపాదించడం సవాలుగా మారింది. ఇప్పటికీ ఇది కొనసాగుతోంది. కొన్ని కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి నెలలు గడుస్తున్నా ఆఫర్లేటర్ ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. కాలం గడుస్తున్న కొద్దీ ‘డ్రీమ్‌జాబ్’ ఊహ నుంచి క్రమంగా బయటకొచ్చి ఇతర ఉద్యోగాలను ఎంచుకుంటున్నారు.సాఫ్ట్వేర్ కంపెనీలే ఉద్యోగులను తొలగించడంతోపాటు ఉన్నవారిపై పని ఒత్తిడి పెంచుతున్నాయి. 2022లో ప్రపంచవ్యాప్తంగా 1064 ప్రధాన కంపెనీలు 1,65,269 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి. 2023లో 1193 సంస్థల నుంచి 2,64,220 మంది టెకీలు, 2024లో ఇప్పటి వరకు 398 కంపెనీల్లో 1,30,482 మంది సాఫ్ట్వేర్లను ఇంటికి పంపించాయి. వర్క్‌ఫ్రమ్ హోం ఇస్తున్నామనే ఉద్దేశంతో దాదాపు అన్ని కంపెనీలు నియమాలకంటే ఎక్కువసేపు పని చేయిస్తున్నాయి. దాంతో ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న కొందరు ఉద్యోగార్థులు తమ చిన్నప్పటి ‘డ్రీమ్‌జాబ్’కు స్వస్తి పలుకుతున్నారు.ఇదీ చదవండి: ప్రపంచాన్ని శాసిస్తున్న రంగాలు.. వాటి ఆదాయాలుఇప్పటికే టెక్ కంపెనీల్లో పనిచేస్తున్న 51 శాతం ఉద్యోగులు తమ కుటుంబాలతో కలిసి ఉండేందుకు, పిల్లల చదువుల కోసం, వారితో సమయం గడుపుతూ మెరుగైన భవిష్యత్తు అందించేందుకు వేరే కొలువులవైపు మొగ్గు చూపుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇదిలాఉండగా, దేశవ్యాప్తంగా 19 శాతం జెన్ జీ ఉద్యోగులు తన ‘డ్రీమ్‌జాబ్’ను నెరవేర్చుకునేందుకు టాప్ కంపెనీలను ఎంచుకుంటున్నట్లు కొన్ని సర్వేల్లో వెల్లడైంది. ఏదేమైనా సరైన నైపుణ్యాలున్న వారికి ఏ కంపెనీలోనైనా కొలువు సిద్ధంగా ఉంటుంది. భవిష్యత్తులో డిమాండ్ ఉండే కోర్సులు నెర్చుకుని అందులో అడ్వాన్స్డ్ స్కిల్స్ సంపాదిస్తే ఉద్యోగం ఖాయం. వృత్తి జీవితం వేరు. వ్యక్తిగత జీవితం వేరు. రెండింటిని బ్యాలెన్స్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పాటించాలి. -
వైరల్: జాబ్‌కు ఆప్లికేషన్ ఇవ్వలేదు.. ఓ వీడియోతో జాబ్ కొట్టేశాడు..!
ముంబై: కరోనా మహామ్మారి పుణ్యానా విద్యార్థులందరు ఇంటికే పరిమితమయ్యారు. విద్యార్థులు ఇంట్లోనే ఉండి తమ అకడమిక్ ఇయర్‌ను కొనసాగిస్తున్నారు. విద్యార్థుల్లో కొంతమంది తమ డిగ్రీని పూర్తి చేసి ఉద్యోగాల కోసం నానాతంటాలు పడుతుండగా.. అందుకోసం వీలైనన్నీ కంపెనీలకు ఆప్లికేషన్లను పంపుతూ.. తమ అదృష్టాన్ని చెక్ చేసుకుంటున్నారు. విద్యార్థుల్లో కొంతమంది తమ డ్రీమ్ జాబ్‌ను సంపాదించుకోవడం ఎంతగానో కష్టపడుతున్నారు. మనలో సత్తా ఉండాలేగానీ.. ఉద్యోగమే మనల్ని వెతుకుంటూ వస్తోంది. కాగా ముంబైకు చెందిన 21 ఏళ్ల అవ్కాష్ షా (గ్రాఫిక్ డిజైనర్) విషయంలో అదే జరిగింది. అవ్కాష్ తన డ్రీమ్ జాబ్ సంపాదించుకోవడం కోసం.. భిన్నంగా ఆలోచించి తన శక్తి సామర్య్థాలను నేరుగా కంపెనీకి చూపించలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఓ 3డీ మోషన్ వీడియోను తన లింక్డిన్ ఖాతాలో ప్రముఖ క్రెడిట్‌కార్డు కంపెనీ క్రిడ్ను టాగ్ చేన్తూ పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారి, సుమారు పది లక్షల వరకు వ్యూస్ వచ్చాయి. వీడియోను చూసిన పలు కంపెనీలు అవ్కాష్ షాకు ఉద్యోగాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. కాగా ఈ వీడియోను క్రిడ్ కంపెనీ వ్యవస్థాపకుడు కునాల్ షాను ఎంతగానో ఆకర్షించింది. కంపెనీ నుంచి అవ్కాష్ షా క్రిడ్ డిజైన్ మాఫియాలోకి వెల్కమ్ అంటూ మెసేజ్‌ను పంపించింది. దీంతో అవ్కాష్ షా ఆనందానికి హద్దులేకుండా పోయింది. ఈ వీడియోతో తాను కోరుకున్న డ్రీమ్ జాబ్‌ను సంపాదించుకోవడంలో మార్గం సుగుమం చేసుకున్నాడు. ఈ వీడియోను చూసిన లింక్డిన్ అవ్కాష్ను మెచ్చుకుంది. చదవండి: యూట్యూబ్ కొత్త అప్ డేట్స్, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న క్రియేటర్స్ -
ఆదాయంకన్నా ఉద్యోగ స్థిరత్వానికే యువత ప్రాధాన్యత
కొన్నేళ్ల క్రితం వరకు... యువత చూపంతా ఐటీ కంపెనీలవైపే... వారి కలల కొలువులంటే ఎంఎన్‌సీలే... ఐదంకెల జీతాలు, వారానికి ఐదు రోజుల పనిదినాలు, వారాంతాల్లో విలాసాలు, ఏటా ఇంక్రిమెంట్లు, ఠంఛనుగా ప్రమోషన్ల వంటి ఆఫర్లకు ఆకర్షితులై ప్రైవేటు కొలువుల వైపు పరుగులు పెట్టేవారు. జాతరలను తలపించే ఉద్యోగ మేళాల్లో నాలుగైదు దశల వడపోతలను దాటుకొని మరీ డ్రీమ్ జాబ్స్‌లో చేరేవారు. పరిస్థితి తలకిందులు.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం దెబ్బకు కుదేలైన కార్పొరేట్ కంపెనీలు ఎడాపెడా ఉద్యోగులను తొలగించడం, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లను అటకెక్కించడం, క్యాంపస్ ప్లేస్మెంట్ల జోలికి వెళ్లకపోవడం వంటి పరిణామాలు ప్రైవేటు ఉద్యోగాల విషయంలో యువత ఆలోచనలపై ప్రభావం చూపాయి. ప్రస్తుతం ఇలా.. ♦ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 1.20 లక్షల ఉద్యోగాల భర్తీకి తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌కు ఉద్యోగార్ధుల నుంచి అందిన దరఖాస్తులు ఏకంగా 2.40 కోట్ల పైమాటే! ♦ ఇండియన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఎస్బీఐ వంటి ప్రభుత్వరంగ సంస్థలు కర్ణాటక ఇంజనీరింగ్ కాలేజీల్లో చేపడుతున్న క్యాంపస్ ప్లేస్మెంట్లకు భారీ ఆదరణ లభిస్తోంది. ఉద్యోగాల్లో స్థిరత్వానికే నేటి యువత ప్రాధాన్యత ఇస్తున్నదనడానికి ఈ పరిణామాలే పెద్ద ఉదాహరణలు. సాక్షి, హైదరాబాద్: దేశంలో యువత ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాల వైపే పరుగులు పెడుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. లోక్‌నీతి–సీఎస్డీఎస్ (సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్) రెండు దఫాలుగా జరిపిన దేశవ్యాప్త సర్వేలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, జైపూర్, సూరత్, పుణేలతోపాటు 11 రాష్ట్రాల్లో ఎక్కువ జనాభా ఉన్న మరికొన్ని నగరాలు, చిన్న పట్టణాలు, గ్రామాల్లోని 11,635 మంది యువతీయువకులపై రెండు దఫాలుగా అధ్యయనం జరిపి వారి అభిప్రాయాలను క్రోడీకరించారు. 2016 సర్వే లో పాల్గొన్న యువజనుల్లో (15–34 వయోశ్రేణి) కనీసం 65 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగాల వైపే మొగ్గు చూపారు. ప్రైవేటు రంగం వైపు చూస్తున్న యువత కేవలం 7 శాతం మాత్రమే. ఉద్యోగ స్థిరత్వం, ప్రభుత్వ–ప్రైవేటురంగ ఉద్యోగుల వేతనాల మధ్య అంతరం తగ్గుతుండటం ఇందుకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. సౌకర్యాలు, సెలవులు వంటి అంశాలు కూడా యువతను కొంత మేరకు ప్రభావితం చేస్తున్నాయి. 2007లో 62 శాతం యువత సర్కారీ జాబులకు ఓటేశారు. 2007లో 13 శాతం మంది ప్రైవేటు ఉద్యోగాల పట్ల మొగ్గు చూపగా 2016 నాటికి వారి సంఖ్య ఏడు శాతానికి పడిపోయింది. పెద్ద నగరాల యువత ప్రభుత్వ రంగం వైపే ♦ సీఎస్డీఎస్ సర్వేల ప్రకారం పెద్ద నగరాల్లో సర్కారీ కొలువుల వైపు మొగ్గుచూపుతున్న యువతీయువకులు దశాబ్ద కాలంలో బాగా పెరిగారు. 2007లో 48 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగాలకు ఓటేశారు. 2016 నాటికి ఇలాంటి యువజనులు మరో 14 శాతం పెరిగారు (62శాతం). ఈ నగరాల్లో ప్రైవేటు రంగాన్ని ఎంచుకుంటున్న వారు అప్పటి (24 శాతం) కంటే ఇప్పుడు బాగా తగ్గారు (10 శాతం). ♦ చిన్న నగరాల్లో సర్కారీ జాబులు కోరుకుంటున్న యువత దశాబ్ద కాలంలో 2 శాతం మేర పెరిగింది. (2007లో 58 శాతం; 2016లో 60 శాతం). ♦ 2007లో 65 శాతం గ్రామీణ యువత ప్రభుత్వ ఉద్యోగాల వైపు మొగ్గుచూపగా 2016 నాటికి ఇలాంటి వారు మరో నాలుగు శాతం మేరకు (69 శాతం) పెరిగారు. ♦ పెద్ద, చిన్న పట్టణాల్లో స్వయం ఉపాధి/వ్యాపారంపట్ల ఆసక్తి చూపుతున్న వారి సంఖ్యలో పెద్దగా మార్పు లేదు. (ఇంచుమించు 20 శాతం). ♦ దేశవ్యాప్తంగా స్వయం ఉపాధి/వ్యాపారంపట్ల ఆసక్తి చూపుతున్న వారు 2007 (16శాతం)తో పోల్చుకుంటే 2016 నాటికి కొద్దిగా పెరిగారు (19 శాతం). ప్రైవేటుకు ‘నో’.. ♦ గ్రామాల్లో డిగ్రీ, అంతకంటే ఎక్కువ చదువుకున్న యువతీయువకుల్లో అత్యధికులు (82 శాతం) ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రైవేటు రంగం వైపు చూస్తున్న వారు అతి స్వల్పం (4 శాతం). 12 శాతం మంది స్వయం ఉపాధి వైపు మొగ్గుచూపు తున్నారు. ♦విద్యాస్థాయితో నిమిత్తం లేకుండా పరిశీలించినప్పుడు 2007లో 9 శాతం గ్రామీణ యువత ప్రైవేటు రంగం వైపు మొగ్గింది. 2016లో ఇలాంటి వారి శాతం సున్నా. ♦పేదవర్గాలు (63 శాతం), ఎగువ మధ్యతరగతి వర్గాలు (65 శాతం) కూడా సర్కారీ ఉద్యోగాలవైపే ఆసక్తి కనబరుస్తున్నాయి. స్థిరత్వానికే ప్రాధాన్యత.. ♦ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తున్న యువతలో దాదాపు సగం మంది స్థిరత్వాన్ని కారణంగా చూపుతున్నారు. కొందరు ఉద్యోగపరమైన సంతృప్తి, మంచి ఆదాయం, తమలా ఆలోచించే వాళ్లతో కలసి పనిచేసే అవకాశం ఉండటం వంటి కారణాలుగా పేర్కొన్నారు. ♦ ప్రైవేటురంగం, స్వయం ఉపాధి రంగాల వైపు వెళ్లాలనుకుంటున్న యువతీయు వకులు ఉద్యోగపరమైన సంతృప్తి, మంచి ఆదాయాన్ని కారణంగా చూపుతున్నారు. -
భారతీయ విద్యార్థుల డ్రీమ్ జాబ్ ఇదేనట..!
భారతీయ విద్యార్థుల కలల ఉద్యోగం ఏమిటని...? అడిగితే, టక్కున వారి నోట వచ్చే మాట టెక్ దిగ్గజాలు గూగుల్, యాపిల్ సంస్థల పేర్లు. ఆ కంపెనీల తర్వాత విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడే ఉద్యోగ సంస్థ ఏమిటో తెలుసా..? దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థకు, ద్రవ్య నియంత్రణకు అత్యున్నత సంస్థగా నిలుస్తున్న రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియానేనట. ఆర్బీఐ అత్యంత ఇష్టమైన ఉద్యోగాల్లో ఒకటిగా నిలుస్తోందని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. గూగుల్, యాపిల్ల తర్వాత అత్యంత ఆకర్షణీయమైన సంస్థగా సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియానే నిలుస్తోందట. యూనివర్సమ్ గ్లోబల్ రీసెర్చ్ సంస్థ సర్వే వెల్లడించిన ఇండియన్ స్టూడెంట్స్ డ్రీమ్ జాబ్ సర్వేలో ఆర్బీఐ మూడో స్థానాన్ని దక్కించుకుంది. అమెరికన్ టెక్ దిగ్గజాలు ఫేస్ బుక్, మైక్రోసాప్ట్, డిస్నీలను అధిగమించి ఆర్బీఐ ఈ స్థానాన్ని కైవసం చేసుకుందని యూనివర్సమ్ తెలిపింది. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ) విద్యార్థులు మాత్రం ఎక్కువగా వెస్టరన్ కంపెనీలపై మొగ్గుచూపుతున్నారని యూనివర్సమ్ వెల్లడించింది. అయితే ఇక్కడ కూడా ఆర్బీఐ ఐదో స్థానంలో నిలిచిందని సర్వే తెలిపింది. మెకిన్సే, అమెజాన్, జేపీ మోర్గాన్, స్థానిక ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ల తర్వాత ఎంబీఏ విద్యార్థులు ఆర్బీఐలో ఉద్యోగం కోసం ఎక్కువగా ప్రయత్నిస్తున్నారని యూనివర్సమ్ పేర్కొంది. ఆర్బీఐ విజయోత్సవంలో కీలకమైన అంశం.. సంతృప్తికరమైన సిబ్బందినేనని సెంట్రల్ బ్యాంకు 2015 వార్షిక రిపోర్టులో వెల్లడించింది. అమెరికన్ టెక్ దిగ్గజాలను అధిగమించి ఆర్ బీఐ లాంటి సంస్థలు యువతను ఎక్కువగా ఆకట్టుకునే కంపెనీగా నిలవడం, విద్యార్థుల్లో ఆలోచన దృకోణం మారుతుందని తెలుస్తున్నట్టు సర్వే పేర్కొంది. గవర్నర్ గా రఘురామ్ రాజన్ ఆర్బీఐను విజయవంతమైన బాటలో నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సెప్టెంబర్‌లో ఆయన పదవీ విరమణ చేయబోతున్నారు. రాజన్ వారసుడిగా ఉర్జిత్ పటేల్ తదుపరి ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆర్ బీఐలో ఉద్యోగులుగా అర్హత పొందడానికి సంస్థ నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదా ఐఐఎమ్ ల్లో నిర్వహించే ఉద్యోగ నియామకాల్లో అర్హత పొందాల్సి ఉంటుంది.