dressing table falldown
-
డ్రెస్సింగ్ టేబుల్ మీదపడి చిన్నారి మృతి
-
డ్రెస్సింగ్ టేబుల్ మీదపడి చిన్నారి మృతి
హైదరాబాద్: డ్రెస్సింగ్ టేబుల్ మీదపడి తొమ్మిది నెలల చిన్నారి మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్లో గురువారం చోటుచేసుకుంది. స్థానిక అభయాంజనేయస్వామి దేవాలయం వీధిలో నివాసముంటున్న ప్రవీణ్, అనూష దంపతుల రెండో కుమారుడు అయాన్ ఇంట్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు డ్రెస్సింగ్ టేబుల్ మీదపడింది. దీంతో అయాన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.