drinker attacks
-
మాటామాట పెరిగి తలపై రాడ్‌తో దారుణంగా..
కరీంనగర్: మద్యం మత్తులో మాటామాట పెరిగి తలపై రాడ్‌తో బాదడంతో గంగాధర్‌రావు(36)అనే మేషన్‌కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి గోదావరిఖని పవర్‌హౌసకాలనీలో జరిగింది. గోదావరిఖని వన్‌టౌన్ సీఐ ప్రమోద్‌రావు కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వంచర్ల గంగాధర్‌రావు గోదావరిఖనిలో నివాసం ఉంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతికి చెందిన బోడి అభితేజ పవర్‌హౌస్‌కాలనీలో నివాసం ఉంటూ మేస్త్రీగా పనులు చేయిస్తున్నాడు. మేషన్‌గా పనిచేస్తున్న గంగాధర్‌రావు బోడి అభితేజ వద్ద డబ్బులు తీసుకుని పనికి రావడం లేదని ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఈవిషయంపై ఇద్దరి మద్య మరోసారి గొడవ జరిగింది. ఆవేశానికి లోనైన బోడి అభితేజ రాడ్‌తో గంగాధర్‌రావు తలపై బాదడంతో గంగాధర్‌రావు అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు అభితేజ ఉంటున్న ఇంటి వద్ద ఈఘటన జరిగింది. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ వివరించారు. ఇవి చదవండి: విదేశాల నుంచి కూతురు వచ్చాకే అంత్యక్రియలు.. -
తాగిన మైకంలో వాహనాలను తగలేశాడు..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో తాగిన మైకంలో ఓ వ్యక్తి వాహనాలకు నిప్పుపెట్టిన ఘటన వెలుగుచూసింది. ఢిల్లీలోని మదన్‌గిర్ ప్రాంతంలో నాలుగు కార్లతో సహా 18 వాహనాలను తగులబెట్టిన తాగుబోతుపై పోలీసులు కేసు నమోదు చేశారు. 14 ద్విచక్ర వాహనాలు, నాలుగు కార్లను నిందితుడు తగులబెట్టాడని పోలీసులు తెలిపారు. బైక్‌ల పెట్రోల్ ట్యాంక్‌ను తీసి అగ్గిపుల్లతో నిప్పుపెడుతున్న వ్యక్తి వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. వాహనాలు దగ్ధం కావడంతో సమీపంలో పార్క్ చేసిన కార్లు సైతం మంటల్లో చిక్కుకున్నాయని పోలీసులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున 3.05 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని తమకు సమచారం అందినట్టు పోలీసులు పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితుడుని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో ఎనిమిది ద్విచక్ర వాహనాలు, రెండు కార్లు పూర్తిగా దగ్ధమవగా, ఆరు బైక్‌లు, రెండు కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. -
అలజడి రేపుతున్న ఆకతాయిలు
♦ అక్టోబర్ 30వ తేదీ అశోక్‌నగర్ శివారులోని ముస్లింల శ్మశానవాటికలో వందలాది సంఖ్యలో సమాధుల బోర్డులను పగులగొట్టారు. ♦ అంతకు ముందుకు రోజు సైఫుల్లా బ్రిడ్జిపై పూలకుండీలు, తొట్టెలు ధ్వంసం చేశారు. దీనిపై పలువురు కార్పొరేటర్లు త్రీటౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. అయినా ఇంతవరకూ నిందితులను పోలీసులు గుర్తించకపోవడం గమనార్హం. అనంతపురం సెంట్రల్: అనంతపురం నగరంలో ఆకతాయిలు అలజడి సృష్టిస్తున్నారు. అర్ధరాత్రి వరకు తాగి తందనాలు ఆడటమే కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తూ పైశాచికానందం పొందుతున్నారు. రాత్రి వేళ పోలీసుల గస్తీ నిద్రావస్థలో ఉండటం వల్లే వీరి ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ముఖ్యంగా యువతలో చాలా మంది పెడదారి పడుతున్నారు. తమ కుమారులు ఏమి చేస్తున్నారో కూడా కొంతమంది తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అతిగారాబంతో రూ.లక్షలు విలువజేసే రాయల్ ఎన్ఫీల్డ్ తదితర అధునాతన ద్విచక్రవాహనాలను కొనిస్తున్నారు. పాకెట్ మనీ కోసం రూ. వందలు, వేలు ఇస్తున్నారు. ఇంకేముంది అర్ధరాత్రి వరకు ఇళ్లకు వెళ్లకుండా స్నేహితులతో కలిసి షికార్లు కొడుతున్నారు. పూటుగా మద్యం తాగి చిందులేస్తున్నారు. వారిలో వారే కొట్టుకొని పోలీసుస్టేషన్ల వరకు వెళ్తున్నారు. కొంతమంది చిల్లర ఘటనలపై పోలీస్స్టేషన్ల వరకు ఎందుకని నేరుగా ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. ఆ బైక్‌ల శబ్దం వింటే గుండె గుబేల్.. పెడదారిన పెట్టిన యువకుల్లో ఎక్కువశాతం రూ. లక్షలు విలువజేసే ద్విచక్రవాహనాలను నడుపుతున్నారు. వీటికి పెద్ద పెద్ద సౌండ్లు వచ్చేలా హారన్లు, సైలెన్సర్లు ఏర్పాటు చేసుకొని నగరంలో చక్కర్లు కొడుతున్నారు. ద్విచక్రవాహనం దగ్గరకు సమీపించిన తర్వాత భారీ శబ్దాలు వస్తుండడంతో సామాన్యులు అదురుకుంటున్నారు. ఓ మోస్తారు బాంబులు పేలినంతగా శబ్దాలు వస్తున్నాయి. అయితే ఇలాంటి వారిపై పోలీసుల నిఘా పూర్తిగా కొరవడిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అర్దరాత్రి వరకూ బార్లు ఉండడం, ఆపై హోటల్స్ కూడా నడస్తుండడం వలన వీరి ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది. ఎంత సేపూ రోడ్డుపై తాగిన వ్యక్తులు ఎవరొస్తారా అని ఎదురు చూడడం తప్ప ఆకతాయిల అడ్డాలపై పోలీసులు నిఘా సారించడం లేదు. అతివేగంతో నగరంలో దూసుకుపోతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఆకతాయిలను పట్టుకోవాలనే ఆలోచన కూడా వారికి పెద్దగా లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఆకతాయిలకు ముకుతాడు వేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
చెప్పుల పంచాయతీ.. వ్యక్తి హత్య
సాక్షి, ఆత్మకూరు రూరల్: తన చెప్పులు కనబడకపోవడానికి చిన్నాన్నే కారణమని భావించిన ఓ వ్యక్తి మద్యం మత్తులో అతడిపై దాడికి దిగాడు. తనను తాను రక్షించుకునే క్రమంలో చిన్నాన్న ఆ వ్యక్తిని నరికి చంపాడు. పోలీసుల వివరాల మేరకు..ఆత్మకూరు మండలం అమలాపురం చెంచుగూడేనికి చెందిన దాసరి మూగెన్న (26) ఇటీవల కొత్త చెప్పులు కొన్నాడు. తన చిన్నాన్న అయిన మూగెన్న ఇంటివద్దకు శుక్రవారం రాత్రి ఏదోపనిపై వెళ్లి తిరిగి వచ్చిన తరువాత తన చెప్పులు లేక పోవడాన్ని గుర్తించాడు. వాటిని చిన్నాన్నే కాజేశాడన్న నిర్ణయానికి వచ్చి ఆయనతో గొడవకు దిగాడు. మద్యం మత్తులో ఉన్న అతడు ఏకంగా విల్లంబులుతో దాడి చేశాడు. ఈక్రమంలో ఓ బాణం చిన్నాన్న చేతిగుండా దూసుకుపోయింది. దీంతో అతడు ప్రాణభయంతో తన ఇంట్లోకి దూరి తలుపులు వేసుకుని గడియ పెట్టుకున్నాడు. అయినా మూగెన్న ఆగకుండా తలుపుపై గొడ్డలితో దాడి చేయడంతో తలుపు గడియ ఊడిపోయింది. దీంతో మూగెన్న గదిలో ఉన్న చిన్నాన్నపై గొడ్డలితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. అది గమనించిన చిన్నాన్న కుమారుడైన మూగెన్న అడ్డువెళ్లాడు. అతడిపై దాడి చేయడంతో కడుపులో నుంచి పేగులు బయటకు రావడంతో అక్కడే పడిపోయాడు. ఇంతలో మూగెన్న నుంచి చిన్నాన్న గొడ్డలి గుంజుకుని అతడిపై విచక్షణరహితంగా దాడి చేశాడు. తీవ్రరక్తస్రావం కావడంతో దాసరి మూగెన్న అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత తీవ్రంగా గాయపడిన కుమారుడిని ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఆత్మకూరు సీఐ బత్తల క్రిష్ణయ్య, ఎస్ఐ వెంకటసుబ్బయ్య తమ సిబ్బందితో ఘటనస్థలికి వెళ్లి వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్‌ను రప్పించి తనిఖీ నిర్వహించారు. నిందితుడు మూగెన్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. శనివారం డీఎస్పీ మాధవరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
తాగుబోతు వీరంగం
హాస్టల్ విద్యార్థిపై దాడి కొరవడిన అధికారుల పర్యవేక్షణ అభద్రతాభావంతో విద్యార్థులు బత్తలపల్లి : సంక్షేమ వసతిగహం విద్యార్థులపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. సాయంత్రం నుంచి ఉదయం వరకు వార్డెన్, సిబ్బంది, నైట్‌వాచ్‌మన్ లేకపోవడంతో అభద్రతాభావంతో బిక్కుబిక్కుమంటున్నారు. తాజాగా ఓ తాగుబోతు హాస్టల్లో వీరంగం వేశాడు. పసివాడని కూడా చూడకుండా విద్యార్థిపై విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచాడు. మండలంలోని రాఘవంపల్లికి చెందిన నాగరాజు, ఆదెమ్మల ఏకైక కుమారుడు ఎల్.వాసు బత్తలపల్లిలోని బీసీ సంక్షేమ వసతిగహంలో ఉంటూ బాలుర ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. విద్యార్థికి కొంచెం మానసిక స్థితి కూడా సరిగా లేదు. సోమవారం రాత్రి హాస్టల్లో వాసు, అతని స్నేహితుడు గొడవపడ్డారు. స్నేహితుడు సమీపంలోని తాగుబోతు బేల్దారి రాజుకు గొడవ గురించి చెప్పాడు. మద్యం మత్తులో ఉన్న ఆ బేల్దారి హాస్టల్లోకి వెళ్లి వాసుపై దాడి చేశాడు. ఛాతీపై బలంగా తన్నడంతో బాలుడు గోడకు తగిలి గాయపడ్డాడు. అంతటితో ఆగకుండా బెత్తం తీసుకుని ఇష్టమొచ్చినట్టు బాదడంతో వీపుపై వాతలు పడ్డాయి. ఈ సమయంలో వార్డెన్ గానీ, అటెండర్లు గానీ ఎవ్వరూ లేరు. రక్తపుగాయలతో ఏడుస్తున్న వాసును తోటి స్నేహితులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్థానికులు గమనించి విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన బత్తలపల్లికి చేరుకున్నారు. వార్డెన్‌కు ఫోన్ చేస్తే సరైన స్పందన రాలేదు. దీంతో వారు అర్ధరాత్రి 12 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విషయం తెలిపారు. మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హాస్టల్‌కు చేరుకునే సరికి ముగ్గురు అటెండర్లు విధులకు హాజరయ్యారు. తమ డ్యూటీ ప్రకారం వచ్చి పోతుంటామని అటెండర్లు తెలిపారు. రాత్రిపూట ఎవ్వరూ ఉండం అని చెప్పారు. వార్డన్ అనంతపురంలో కాపురం ఉండడంతో ఆయన కూడా సాయంత్రమే వెళ్లిపోతారన్నారు. తమకు భద్రత కరువైందని ఈ సందర్భంగా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో పర్యవేక్షిస్తాం తాగుబోతు వీరంగం చేసిన సమయంలో నేను విజయవాడలో ఉన్నాను. హాస్టల్‌కు నైట్ వాచ్మెన్లను ప్రభుత్వం తీసుకోలేదు. విద్యార్థిపై జరిగిన దాడి గురించి నాకు సమాచారం ఇచ్చారు. ఇకపై అటెండర్లతో రాత్రి సమయంలో పర్యవేక్షించేలా చూస్తాం. –శ్రీనివాసులుశెట్టి, వార్డెన్, బీసీ సంక్షేమ వసతిగహం