Dronamraju Ravikumar
-
బ్రాహ్మణులకు సీఎం జగన్ అండ
-
43 గుళ్లను కూల్చేసిన ఘనుడు చంద్రబాబు
విజయవాడ: శారదాపీఠంపై చంద్రబాబు వ్యాఖ్యలు బాధాకరమని ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్ వైస్ చైర్మన్ ద్రోణంరాజు రవి తెలిపారు. స్వామిజీలను విమర్శించడం చంద్రబాబుకు తగదని చెప్పారు. 43 దేవాలయాలను కూల్చేసిన చంద్రబాబుకు స్వామిజీల గురించి మాట్లాడే హక్కు లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి 29 మంది భక్తులు పుష్కరాల్లో బలైపోయారని గుర్తుచేశారు. విజయవాడలో మంగళవారం ఏర్పాటుచేసిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. అహంకారం పూర్తిగా దిగే రోజులు ఇంకా ముందున్నాయని ద్రోణంరాజు రవి పేర్కొన్నారు. ప్రతిఒక్కదానికి చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అమ్మవారి రూపాన్నే మార్చేసి క్షుద్రపూజలు చేసిన ఘనుడు చంద్రబాబు అని తెలిపారు. ఎక్కడో పుట్టిన బాబాకు 400 ఎకరాలు ఇచ్చిన ఘనత చంద్రబాబుది అని ఆరోపించారు. మానస ట్రస్ట్, సింహాచలం భూ కుంభకోణాలను వెలికితీస్తామని తెలిపారు. చంద్రబాబు తన తీరు మార్చుకోకుంటే గుణపాఠం తప్పదని ద్రోణంరాజు రవి స్పష్టం చేశారు. -
చంద్రబాబు ఒకరిని బలిపశువును చేశారు..
సాక్షి, అమరావతి: బ్రాహ్మణులపై కక్ష కట్టిన సీఎం చంద్రబాబు తన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అనిల్ చంద్ర పునేఠను తాను చెప్పినట్టే వినాలని ఒత్తిడి తెచ్చి ఆయనను బలిపశువును చేశారని, ఆయన స్థానంలో ఎన్నికల సంఘం మరో బ్రాహ్మణ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యంను సీఎస్‌గా నియమిస్తే ఆయననూ అవమానించేలా మాట్లాడారంటూ అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కేసుల్లో ఎల్వీ సుబ్రమణ్యం నిందితుడు కాదంటూ 2018 జనవరిలోనే ఉమ్మడి ఏపీ హైకోర్టు కొట్టివేసిందన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కింద వస్తాయన్నారు. సీఎస్ డీజీపీ కార్యాలయానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెళ్లడమనేది ఎన్నికల ప్రక్రియలో ఒక భాగమని తెలిపారు. ఎల్వీ సుబ్రమణ్యంను సీఎస్‌గా ఎంపిక చేయడంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్ అధికారుల సంఘంతో పాటు వివిధ ఉద్యోగుల సంఘాలు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు అడ్వకేట్ జనరల్ వేణుగోపాల్ విషయంలోనూ, రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యం విషయంలోనూ వ్యవహరించిన తీరే బ్రాహ్మణులు ఇప్పటికీ మరిచిపోలేకుండా ఉన్నారన్నారు. (చదవండి: సీఎస్‌పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు) -
బాబు వ్యాఖ్యల్ని ఖండించిన బ్రాహ్మణ సంఘాలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను బ్రాహ్మణ సంఘాలు ఖండించాయి. సీఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంపై సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి విమర్శలు చేయడం సరైంది కాదని ఆల్ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ద్రోణం రాజు రవి కుమార్ అభిప్రాయపడ్డారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ఉన్న కేసులను హైకోర్టు 2018 జనవరిలోనే కొట్టేసిందని గుర్తు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకి వస్తాయని చెప్పారు. ప్రతిపక్ష నేత కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చేస్తోన్న తప్పులను ఎత్తిచూపినపుడు ఇదే ఎల్వీ సుబ్రహ్మణ్యంతో మీరు మాట్లాడించలేదా అని సూటిగా ప్రశ్నించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తెలుగుజాతి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమే అవుతోందని వ్యాక్యానించారు. గతంలో కూడా అనేక సందర్భాలలో సీఎస్‌లు డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఎన్నికల విధులను పర్యవేక్షించారని గుర్తు చేశారు. సీఎస్ డీజీపీ కార్యాలయానికి వెళ్లడమనేది ఎన్నికల ప్రక్రియలో ఒక భాగమన్నారు. -
'సినీ పరిశ్రమను రెండు కులాలు శాసిస్తున్నాయి'
హైదరాబాద్: సినీ పరిశ్రమలో వర్థమాన నటులు కనుమరుగవడానికి కులాధిపత్యమే కారణమని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం ఆరోపించింది. తెలుగు సినీ పరిశ్రమను రెండు కులాలు శాసిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవాసంఘం అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ ఆరోపించారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉదయ్ కిరణ్ కొంత మంది పెద్దలు తొక్కేసారని ఆరోపించారు. ఉదయ్‌కిరణ్ ఈ దుస్థితికి రావడానికి కారణమైనవారేవరో రాష్ట్రప్రజలందరికి తెలుసునని అన్నారు. కాగా, ఉదయ్ కిరణ్ భౌతికకాయాన్ని అగ్ర హీరోలెవరూ సందర్శించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఉదయ్ కిరణ్ భౌతికకాయాన్ని పట్టించుకునేవానే కరువయ్యారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.