DRT recovery
-
రుణ ఎగవేత కేసులో కేశినేనికి డీఆర్టీ సమన్లు
సాక్షి, అమరావతి: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో టీడీపీ ఎంపీ కేశినేని నానికి డెట్స్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్టీ) సమన్లు జారీ చేసింది. తమ బ్యాంకు నుంచి రుణం తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో కేశినేని సంస్థల నుంచి వడ్డీతో సహా డబ్బులు వసూలు చేసుకోవడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశాఖ డీఆర్టీని ఆశ్రయించింది. దీంతో జూలై 11వ తేదీ ఉదయం 10.30లోగా నేరుగా లేదా లాయర్ల ద్వారా వివరణ ఇవ్వాలని.. లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీఆర్టీ స్పష్టం చేసింది. కేశినేని నానితో పాటు కేశినేని పావని, కేశినేని కార్గో అండ్ కారియర్స్ లిమిటెడ్‌లకు కూడా పత్రికా ప్రకటన ద్వారా డీఆర్టీ సమన్లు జారీ చేసింది. -
పన్నుల పరిష్కార పథకం పరిధి పెంపు...
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన ’వివాద్ సే విశ్వాస్’ పథకం పరిధిని విస్తరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రుణ రికవరీ ట్రిబ్యునల్స్‌లో (డీఆర్టీ) ఉన్న పెండింగ్ కేసులను కూడా ఇందులోకి చేర్చే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. 2019 నవంబర్ దాకా గణాంకాల ప్రకారం.. వివాదాల్లో చిక్కుబడిన ప్రత్యక్ష పన్ను బకాయీలు సుమారు రూ. 9.32 లక్షల కోట్లుగా ఉన్నాయి. సంబంధిత వర్గాల సిఫార్సులకు అనుగుణంగా వివాద్ సే విశ్వాస్ బిల్లుకు కొత్త సవరణలను ప్రస్తుత పార్లమెంటు సెషన్లో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. ఈ బిల్లు ప్రకారం పథకాన్ని ఎంచుకున్న వారు.. మార్చి 31లోగా వివాదాస్పద పన్ను మొత్తం కడితే వడ్డీ నుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది. మరోవైపు, 12 ప్రధాన పోర్టులకు స్వయంప్రతిపత్తినిచ్చే దిశగా 1963 నాటి చట్టం స్థానంలో కొత్త మేజర్ పోర్ట్ అథారిటీ బిల్లు 2020కి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధాన పోర్టుల సామర్థ్యాన్ని, పోటీతత్వా న్ని పెంచేందుకు ఇది తోడ్పడనుంది. ప్రస్తుత పార్ల మెంటు సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. -
డీఆర్టీలో కేసు దాఖలుకు ‘పరిమితి’ రెట్టింపు
న్యూఢిల్లీ: బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ రుణ బకాయిలు రాబట్టుకునే విషయంలో డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ)లో కేసు దాఖలుకు అవసరమైన మొత్తాల పరిమితిని గురువారం కేంద్రం రూ. 20 లక్షలకు పెంచింది. ఆర్థికశాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకూ ఈ పరిమితి 10 లక్షలు. దీనివల్ల ఇకపై రూ.20 లక్షల పైబడిన బకాయిలను రాబట్టుకోడానికి మాత్రమే డీఆర్టీని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆశ్రయించగలుగుతాయి. డీఆర్టీలో అధిక సంఖ్యలో కేసులు పేరుకుపోతుండటంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. దేశంలో 39 డీఆర్టీలు ఉన్నాయి. -
మాల్యా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
బెంగళూరు: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మరిన్ని కష్టాలు ప్రారంభమైనట్టే కనిపిస్తోంది. బెంగళూరు రుణ రికవరీ ట్రిబ్యునల్ బెంచ్ తాజా తీర్పుతో మాల్యాకు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ చెల్లించాల్సిన రుణాలకు సంబంధించిన రికవరీ ప్రక్రియ ప్రారంభించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంకు అనుమతిని మంజూరు చూస్తూ గురువారం డీఆర్టీ తీర్పు చెప్పింది. రుణాల రికవరీకి మాల్యా ఆస్తుల ఎటాచ్ మెంట్, చేపట్టాలని ఆదేశించింది. రూ.6,203 కోట్ల రుణాలపై జులై 26, 2013నుంచి 11.5 శాతం వడ్డీని రాబట్టవచ్చని తెలిపింది. అంతేకాదు ఈ తీర్పుపై మాల్యా రుణ రికవరీ పునర్విచారణ న్యాయస్థానాలు (డీఆర్ ఏటీ) వెళ్లాలనుకుంటే.. మొత్తంలో 50 శాతం కోర్టు ఫీజుగా చెల్లించాలని స్పష్టం చేసింది. కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ కు వ్యతిరేకంగా తమ పిటిషన్లను విచారించిన కోర్టు ఈ మేరకు అనుమతినిచ్చిందని కన్సార్టియం న్యాయవాది విలేకరులకు తెలిపారు. ఆస్తులను అటాచ్ మెంట్ కు ఆర్డర్ జారీ చేసిందని చెప్పారు. దీంతో రుణాల రికవరీకి బ్యాంకుల గత మూడేళ్లుగా చేస్తున్న చట్టపరమైన పోరాటం ముగిసినట్టయింది. అలాగే డీఆర్ టీ ప్రిసైడింగ్ అధికారి కె శ్రీనివాసన్ వెలువరించిన ఈ తీర్పుతో మార్చి 2016 నుంచి యునైటెడ్ కింగ్డమ్ (యుకె) లో విలాస జీవితాన్ని గడుపుతున్న మాల్యా చుట్టూ ఉచ్చుమరింత బిగియనుందని భావిస్తున్నారు.కాగా మాల్యా గత సంవత్సరం మార్చి 2 న దేశం వదిలి బ్రిటన్ కు చెక్కేశాడు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసున కేసులో ముంబై పీఎంఎల్ఏ కోర్టు ఉద్దేశ పూర్వక ఎగవేతదారుడుగా తేల్చిన సంగతి తెలిసిందే.