dudekula hakkulu
-
‘దూదేకులను బాబు ఓటు బ్యాంకుగానే చూశారు’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దూదేకులను ఓటు బ్యాంకుగానే చూశారని, ఐదు ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తామని చెప్పి విస్మరించారని ఏపీ ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ అధ్యక్షులు దస్తగిరి ఆవేదన వ్యక్తం చేశారు. దూదేకులకు చట్ట సభలలో ప్రాధాన్యత కల్పించాలని గురువారం విజయవాడ ధర్నాచౌక్‌లో ఏపీ ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 లక్షల దూదేకులకు దామాషా ప్రకారం చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. దూదేకుల ఫెడరేషన్‌కు రూ. 500 కోట్లు నిధులు కేటాయించి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమకు చట్ట సభలలో ప్రాతినిధ్యం కల్పించిన రాజకీయ పార్టీకి పట్టం కడతామని చెప్పారు. -
దూదేకుల హక్కుల కోసం పోరాటం
కడప రూరల్: దూదేకుల హక్కుల కోసం పోరాడుదాం అని దూదేకుల నేత బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దుర్గం దస్తగిరి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్ మెమోరియస్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన దూదేకుల సంఘీయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపు 25 లక్షలు దూదేకుల వర్గీయులు ఉన్నప్పటికీ తమకు ఏమాత్రం న్యాయం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ, ఆర్ధిక అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన తమకు నిధులను కేటాయించాని డిమాండ్ చేశారు. ఆ మేరకు దూదేకుల సోదరులు హక్కుల సాధన కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రెడ్డిబాబు, సంజీవరాయుడు, చెన్నకేశవ తదితరులు పాల్గొన్నారు.