సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దూదేకులను ఓటు బ్యాంకుగానే చూశారని, ఐదు ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తామని చెప్పి విస్మరించారని ఏపీ ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ అధ్యక్షులు దస్తగిరి ఆవేదన వ్యక్తం చేశారు. దూదేకులకు చట్ట సభలలో ప్రాధాన్యత కల్పించాలని గురువారం విజయవాడ ధర్నాచౌక్‌లో ఏపీ ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 లక్షల దూదేకులకు దామాషా ప్రకారం చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. దూదేకుల ఫెడరేషన్‌కు రూ. 500 కోట్లు నిధులు కేటాయించి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమకు చట్ట సభలలో ప్రాతినిధ్యం కల్పించిన రాజకీయ పార్టీకి పట్టం కడతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment