dasthagiri
-
వివేకా హత్య కేసు: కుట్రదారులతో కుమ్మక్కు
తండ్రిని హత్య చేసినవానిపై పగ తీర్చుకునే కథతో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. హత్యకు కుట్ర చేసినవారిని జైలుకు పంపించేవరకు చేసిన న్యాయ పోరాటాలూ చూశాం. కానీ తండ్రిని హత్య చేసిన హంతకుడిని ఆప్తుడిగా భావిస్తూ సఖ్యతగా ఉండటం ఏ సినిమా కథలోనూ లేదు. తండ్రి రాజకీయ ప్రత్యర్థులతో జట్టు కట్టడం ఎక్కడా వినలేదు. అందుకే వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, అల్లుడు, పెద్ద బావమరిది తీరు విస్మయం కలిగిస్తోంది. వివేకా రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబు, ఆది నారాయణ రెడ్డి, బీటెక్ రవిలతో ఆయన కుటుంబ సభ్యులు జట్టు కట్టారు. హతుడైన వివేకా కుటుంబ సభ్యులు హంతకుడైన దస్తగిరితో చేతులు కలిపారు. ఈ కుట్ర కథలో సూత్రధారులు, పాత్రధారులూ ఒక్కటయ్యారు. ఆస్తి, రాజకీయ వారసత్వం కోసం కక్షగట్టిన కుటుంబ సభ్యులు కూడబలుక్కుని వాస్తవాలు దాచిపెడుతున్నారు. రాజకీయ ఆధిపత్యం కోసం కాచుకుని కూచున్న ప్రత్యర్థి పార్టీ నేతలు ఆడించినట్టు ఆడుతున్నారు. వెరసి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిజాలకు పాతరేసేందుకు ఆయన సొంత కుటుంబ సభ్యులే యత్నిస్తున్నారు. ఆర్థిక, రాజకీయ వారసత్వ విభేదాలతో వివేకా హత్య దర్యాప్తును తప్పుదారి పట్టిస్తున్న ఈ ముఠా పన్నాగం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. వివేకా శత్రువులతో జట్టుకట్టిన ఆయన కుటుంబ సభ్యులు వైఎస్ వివేకానందరెడ్డికి బయట శత్రువులు, ప్రత్యర్థులతో ఆయన కుటుంబ సభ్యులే జట్టు కట్టడం విభ్రాంతి కలిగిస్తోంది. ఆయనకు రాజకీయంగా శత్రువులు, ప్రత్యర్థులు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి కాగా... ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలతో అల్లుడు–చిన బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి ఆయనకు ఇంట్లోనే శత్రువులుగా మారారన్నది బహిరంగ రహస్యం. అలాంటి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్ రెడ్డితో పాటు వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా ప్రస్తుతం ఆ టీడీపీ నేతలతో అత్యంత సన్నిహితంగా ఉంటుండటం విస్మయపరిచేదే. వాస్తవానికి ఒకప్పుడు వివేకా వద్ద డ్రైవర్‌గా ఉన్న దస్తగిరిని సునీతే పన్లోంచి తొలగించారు. అదే దస్తగిరి వివేకాను నరికి హత్య చేస్తే... అతనితో సునీత, అమె భర్త సఖ్యతగా ఉంటున్నారు. ఈ పరిణామాలను పరిశీలిస్తే ఓ కీలకమైన అంశం చర్చించాల్సిన అవసరం ఏర్పడుతోంది. వివేకానందరెడ్డి మరణిస్తే ఎవరికి ప్రయోజనం అన్నది ఈ కేసులో కీలకంగా మారుతోంది. కడప జిల్లాలో కనీసం ఉనికి చాటుకోవాలంటే వివేకానందరెడ్డి ఉండకూడదన్నది టీడీపీకి రాజకీయ అవసరం. తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నందున వివేకానందరెడ్డి అడ్డుతొలగించుకోవడం అప్పటి టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి ప్రయోజనకరం. పులివెందులలో పట్టు సాధించడానికి వివేకానే అడ్డున్నారన్నది బీటెక్ రవి ఉద్దేశం. అందుకే 2017లో ఎమ్మెల్సీ ఎన్నికల్లోఆయన్ని దొంగదెబ్బతీసిన ఈ ముఠానే 2019లో ఏకంగా భౌతికంగా అడ్డుతొలగించుకునేందుకు కుట్ర పన్నారనటానికే ఎక్కువ అవకాశాలున్నాయని చెప్పాలి. మరి వారితో వివేకా కుమార్తె, అల్లుడు, పెద్ద బావమరిది సఖ్యతగా ఉండటం వెనుక అసలు కోణం ఏమిటన్నదే ఈ కేసులో కీలకం. అసలు టీడీపీ మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి... వివేకా పెద్ద బావమరిది శివ ప్రకాశ్ రెడ్డికి ఎలా సన్నిహితుడయ్యారు? అదీ ఆదినారాయణ రెడ్డిని ఎంపీ ఎన్నికల్లో ఓడించి సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిని గెలిపించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న నేపథ్యంలో...! దీని వెనుకే అసలు గూడు పుఠాణీ ఉంది. వివేకానందరెడ్డి మరణించిన విషయాన్ని ఆయన పీఏ కృష్ణారెడ్డి చెబితే శివ ప్రకాశ్ రెడ్డి వెంటనే ఎవరికి సమాచారం ఇవ్వాలి... సాధారణంగా సమీప బంధువులకు ముందు చెప్పాలి. కానీ వివేకానందరెడ్డి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న అప్పటి టీడీపీ మంత్రి ఆది నారాయణ రెడ్డికి మొదట ఫోన్ చేసి సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయనేమీ వివేకాకు బంధువు కాదు... మిత్రుడు అంతకన్నా కాదు. పైపెచ్చు రాజకీయ ప్రత్యర్థి. ఏదో విషయాన్ని గోప్యంగా ఉంచాలన్న ఉద్దేశంతోనో... విషయాన్ని పక్కదారి పట్టించే ఎత్తుగడతోనో వారిద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిగి ఉంటుందన్నది తేలిగ్గానే అర్థమవుతుంది. వివేకా ఇంట్లో ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలు వివేకానందరెడ్డి రెండో వివాహం అనంతరం ఆయన కుటుంబంలో తలెత్తిన పరిణామాలు ఈ కేసులో అత్యంత కీలకం. తన రెండో భార్య షమీమ్‌కు ఆస్తిలో వాటా ఇస్తానని... ఆమెతో తనకు పుట్టిన కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని వివేకా చెప్పడమే ఆ కుటుంబంలో విభేదాలకు ఆజ్యం పోసింది. ఎందుకంటే ఆయన ఆస్తికి ఏకైక వారసుడిని కావాలని అల్లుడు–చిన బావమరిది నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పట్టుదలతో ఉన్నారు. అందుకే ఆస్తిలో షమీమ్‌కు వాటా ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఇక రాజకీయంగా వివేకా వారసత్వాన్ని అందుకోవాలని పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డి భావిస్తున్నారు. అందుకు వివేకా సమ్మతించకపోవడంతో పాటు తన రెండో భార్య కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటిస్తాననేసరికి కక్ష గట్టారు. అందుకే వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె, అల్లుడు ఆయన్ని విడిచిపెట్టి హైదరాబాద్‌లో ఉంటుండగా... షమీమ్‌తో సునీత ఘర్షణ పడ్డారు. జుగుప్సాకరమైన భాషలో వాట్సప్ మెసేజుల ద్వారా దూషించుకున్నారు. షమీమ్‌ను వివేకా బావమరుదులిద్దరూ తీవ్రంగా బెదిరించారు. 2012లో రోడ్డు ప్రమాదానికి గురైన వివేకాను చూసేందుకు వెళ్లిన షమీమ్‌ను శివప్రకాశ్ రెడ్డి ఇంట్లోకి రానివ్వలేదు. ఆయన హెచ్చరించడంతో... ప్రాణభయంతో షమీమ్ అన్నయ్య, వదిన కుటుంబం పులివెందుల విడిచిపెట్టి వెళ్లిపోయింది. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివ ప్రకాశ్ రెడ్డిలతో ముప్పు ఉన్నందునే షమీమ్ హైదరాబాద్‌లో తన చిరునామా కూడా గోప్యంగా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. షమీమ్‌కు ఓ ఇల్లు ఇవ్వాలని... ఆమె కుమారుడిని హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివించాలని అనుకుంటున్నా గానీ తన కుటుంబ సభ్యులు అడ్డుపడుతుండటంతో సాధ్యం కావడం లేదని వివేకా సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు కూడా. ఎందుకంటే అప్పటికే కుటుంబ వ్యాపార సంస్థలకు సంబంధించి ఆయనకు ఉన్న చెక్ పవర్‌ను ఆయన కుటుంబ సభ్యులు తొలగించారు. వివేకా ఇద్దరు బావమరుదులు తనను తీవ్రంగా బెదిరించారని వారితో తనకు తన కుమారుడికి ముప్పు ఉందని షమీమ్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలోనూ స్పష్టం చేశారు. వివేకాకు కూడా ఆయన ఇద్దరు బావమరుదుల నుంచే ముప్పు ఉండేదని చెప్పారామె. ఈ నేపథ్యంలో కుటుంబంలో ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలు ఆయన హత్య వెనక ఎంత బలంగా ఉండవచ్చో తెలియకమానదు. రక్తపు మరకల లేఖపై గప్‌చుప్..!! వివేకానందరెడ్డికి ఇంటా, బయటా ఉన్న శత్రువులందరూ అన్ని విషయాలపైనా మాట్లాడుతున్నారు కానీ... రక్తపు మరకలతో ఉన్న లేఖపై మాత్రం మౌనం వహిస్తున్నారు. అదే వివేకా రాసిన లేఖ. వివేకా రక్తపు మరకలతో తడిసిన లేఖపై... అంతా కూడబలుక్కుని నిర్ణయించుకున్నట్టు ఒక్క మాటా మాట్లాడటం లేదు. ఎందుకంటే ఈ హత్య కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు, ఆయన బృందం పన్నిన వ్యూహంలో భాగమే ఆ లేఖపై మౌనం!!. విచిత్రమేంటంటే తరచూ టీడీపీ వేదికల మీద ఈ కేసు గురించి మాట్లాడే చంద్రబాబు ఒక్క రోజు కూడా వివేకా రాసిన లేఖ గురించి ప్రస్తావించ లేదు. సునీత, ఆమె భర్త కూడా అసలు అలాంటి లేఖ ఒకటి ఉన్నట్టుగా కూడా మాట్లాడటం లేదు. ఎందుకంటే వివేకా గుండె పోటుతో మరణించారనే కట్టు కథను ప్రచారంలోకి తెచ్చేందుకే ఆ లేఖను ఆ ముఠా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసింది. వివేకాపై తీవ్రంగా దాడిచేసిన తరువాత హంతకులు ఆయన చేత బలవంతంగా లేఖ రాయించారు. వాళ్లు బెదిరించడంతో... డ్రైవర్ ప్రసాద్ తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరచినట్టు ఆ లేఖలో వివేకా రాశారు. ఆ లేఖను మొదట.. అంటే 2019, మార్చి 15న ఉదయం 6.10 గంటలలోపే చూసిన ఆయన పీఏ కృష్ణారెడ్డి... ఆ విషయాన్ని సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పారు. తాము వచ్చే వరకు ఆ లేఖను, సెల్‌ఫోన్‌ను ఎవరికి ఇవ్వకుండా దాచి ఉంచాలని నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పీఏ కృష్ణారెడ్డితో చెప్పారు. వారు అలా చెప్పకపోయి ఉంటే కృష్ణారెడ్డి ఆ లేఖ విషయాన్ని వెంటనే బయటపెట్టేవారు. దాంతో వివేకాది హత్యేనని అందరికీ వెంటనే స్పష్టత వచ్చేది. గుండెపోటో మరొకటో కాదని వెంటనే తెలిసిపోయేది. అలా తెలిసి ఉంటే... ఎవ్వరూ మృతదేహాన్ని తాకే ప్రయత్నం చేసి ఉండేవారు కాదు. అప్పుడసలు ‘‘రక్తపు మరకలు కడిగిందెవరు? గాయాలకు కట్లు కట్టిందెవరు?’’ అని పదేపదే ప్రశ్నించే అవకాశం చంద్రబాబు నాయుడికి వచ్చి ఉండేదే కాదు. కానీ వారు అలా చేయలేదు. వివేకా గుండెపోటుతో మరణించారని ప్రచారం చేయాలన్న ఉద్దేశంతోనే ఆ లేఖను బయటపెట్టకూడదని సునీత, ఆమెభర్త రాజశేఖరరెడ్డి, బావ శివప్రకాశ్ రెడ్డి నిర్ణయించినట్టు స్పష్టమవుతోంది. అనంతరం టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ద్వారా గుండె పోటు కథను ప్రచారంలోకి తెచ్చారు. గుండె పోటు కథ ప్రచారంలోకి రావడంతో తమ లక్ష్యం నెరవేరిందని వారు భావించారు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పులివెందుల చేరుకోవటంతో ఆ లేఖతోపాటు వివేకా సెల్‌ఫోన్‌ను కృష్ణారెడ్డి వారికి ఇచ్చారు. ఆ లేఖను చదివాక కూడా వెంటనే దాన్ని పోలీసులకు అప్పగించనే లేదు. ఆ సెల్‌ఫోన్‌లోని మెస్సేజులు, డేటాను డిలీట్ చేశారు. అనంతరం సునీత ఆదేశాలతో సాయంత్రం 5గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖను, సెల్‌ఫోన్‌ను పోలీసులకు ఇచ్చారు. ఆ లేఖను సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఎందుకు గోప్యంగా ఉంచారన్నది ఈ హత్య కేసులో కీలకాంశం. ముందస్తు పన్నాగం ప్రకారమే ఆ లేఖపై మాత్రం ఇటు సునీత, ఆమె భర్త గానీ అటు చంద్రబాబు, టీడీపీ నేతలుగానీ మాట్లాడటం లేదు. అవినాశ్‌ను వివేకా ఇంటికి వెళ్లమని చెప్పింది శివప్రకాశ్‌రెడ్డే వివేకా హత్య కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు టీమ్ పక్కా పన్నాగంతో వ్యవహరించింది. వాస్తవాలు వెలుగులోకి రాకుండా...కేవలం ఊహాగానాలు, అభూతకల్పనల చుట్టూనే దర్యాప్తు కేంద్రీకృతం అయ్యేలా చేసేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే టీడీపీ అనుకూల పచ్చ మీడియాలో రోజుకో కట్టుకథను ప్రచారంలోకి తీసుకువస్తూ అటు సీబీఐ దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తూ... ఇటు ప్రజలనూ తప్పుదారి పట్టిస్తోంది. ఎంపీ అవినాశ్ రెడ్డినే లక్ష్యంగా చేసుకుని విషం చిమ్ముతోంది. ఎంపీ అవినాశ్ రెడ్డి వివేకా నివాసానికి ఏ సమయానికి వెళ్లారు... అక్కడ ఏం చూశారు అన్నదే ప్రధానాంశంగా చేసుకుని... వివేకా మృతదేహానికి కుట్లు వేశారని, కట్లు కట్టారనే అవాస్తవాలను ప్రచారంలోకి తీసుకువస్తోంది. వివేకానందరెడ్డి పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డి 2019 మార్చి 15న ఉదయం 6.20 గంటల సమయంలో ఫోన్ చేసి చెబితేనే ఎంపీ అవినాశ్ రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లారు. అప్పటికే ఎన్నికల ప్రచారం కోసం తన అనుచరులతో జమ్మలమడుగు వెళుతున్న ఆయనకు శివ ప్రకాశ్‌రెడ్డి నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ రాకపోయి ఉంటే ఆయన జమ్మలమడుగు వెళ్లి ఉండేవారు. వివేకా మరణించారని చెప్పి... వెంటనే వెళ్లమంటేనే అవినాశ్ అక్కడికి వెళ్లారు. ఆయన అక్కడకు వెళ్లినా పీఏ కృష్ణా రెడ్డి మాత్రం వివేకా రాసిన లేఖ గురించి చెప్పలేదు. ఎందుకంటే ఆ లేఖ విషయం గోప్యంగా ఉంచమని సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆయన్ని ఆదేశించారు. ఆ లేఖ విషయాన్ని శివ ప్రకాశ్ రెడ్డి ఎంపీ అవినాశ్‌కు ఫోన్ చేసినప్పుడు చెప్పినా... లేక ఆయన వివేకా ఇంటికి రాగానే పీఏ కృష్ణా రెడ్డి చెప్పినా ఎవ్వరూ భౌతిక కాయాన్ని తాకే ఉండేవారే కాదు. ఆ లేఖ విషయాన్ని అవినాశ్ వెంటనే పోలీసులకు చెప్పి ఉండేవారు. వివేకా హత్యకు గురయ్యారని అందరికీ వెంటనే తెలిసిపోయేది. అప్పటికే భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు, సాధారణ ప్రజల్ని ఆ మృతదేహం దగ్గరకు ఎవరూ వెళ్లకుండా అవినాశే కట్టడి చేసేవారు. దాంతో ఈ కేసులో కీలక ఆధారాలు పోలీసులకు దొరికేవి. కానీ అలా జరగడం నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదని వాళ్లు పన్నిన వ్యూహమే చెబుతోంది. అందుకే ఆయన లేఖ విషయాన్ని ఎంపీ అవినాశ్‌కు చెప్పలేదు. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరించి వివేకా హత్య కేసును తప్పుదారి పట్టించారని చెప్పటానికి ఇంతకన్నా ఆధారాలేం కావాలి? ‘కట్టు’కథలో ఇరికించడానికేనా? వివేకానందరెడ్డిని హత్య చేసి.. గుండెపోటుతో మరణించారన్న కట్టు కథను తెరపైకి తేవడానికే శివప్రకాశ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి ఫోన్లో మాట్లాడుకుని ఉంటారన్నది కాస్త లోతుగా పరిశీలిస్తే అర్థమయ్యే విషయం. వారిద్దరి ఫోన్ సంభాషణ అనంతరమే గుండె పోటు కథ తెరపైకి వచ్చింది. వివేకా గుండె పోటుతో మరణించారని శివప్రకాశ్ రెడ్డి తనతో చెప్పారని ఆది నారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఎక్కువగా సిగరెట్లు తాగడంతోనే అలా అయ్యి ఉంటుందని తాను ఆయనతో చెప్పినట్లు కూడా వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి ఎంత కుట్రపూరితంగా గుండె పోటు కథను తెరపైకి తెచ్చారో తెలియటం లేదా? మరోవైపు వివేకాను కుట్రపూరితంగా ఓడించిన బీటెక్ రవి, వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి సన్నిహితుడయ్యారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలకు డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు గురిచేసి తాను ఎమ్మెల్సీగా గెలిచానని బీటెక్ రవి తాజాగా పచ్చ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం అంగీకరించారు. అదే ఇంటర్వ్యూలో వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, తాను ఇప్పటికీ అత్యంత సన్నిహితులమని కూడా చెప్పడం గమనార్హం. అంటే వివేకా మరణంతో రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధి పొందుతామని భావిస్తున్న వారంతా అప్పుడు ఇప్పుడూ ఒకే జట్టుగా ఉంటున్నారన్నది అర్థం కావటం లేదా? అమరావతి నుంచి కథ నడిపిన బాబు.. వైఎస్ వివేకా హత్యకు గురైన రోజు అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు అమరావతి నుంచి పెద్ద కథే నడిపారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు కడప ఎస్పీతోనూ టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డితోను, అప్పట్లో ఎమ్మెల్సీగా ఉన్న బీటెక్ రవితోను ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ కేసు దర్యాప్తును ప్రభావితం చేశారు. వివరాలు ఎప్పటికప్పుడు చంద్రబాబుకు అప్డేట్ చేశారు. కడప ఎస్పీకి సైతం ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించేందుకు ఏబీవీ ఎందుకు అంతగా తాపత్రయ పడ్డారన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ... తాను జరిపిన దర్యాప్తులో అసలు లేఖ విషయమే పట్టించుకోలేదు. -
విస్తుగొలుపుతున్న షేక్ దస్తగిరి తీరు
-
ఏది నిజం?: వివేకా హంతకుల్ని నడిపిస్తున్నదెవరు?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డికి వైఎస్సార్ సీపీ తరఫున టిక్కెట్టిచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గెలిచేంత మెజారిటీ ఉన్నా సరే... కుట్రపూరితంగా ఆయన్ని ఓడించి.. టీడీపీ తరఫున బీటెక్ రవిని గెలిపించింది చంద్రబాబు నాయుడు. ఆయన ఉంటే జిల్లాలో తాము రాజకీయంగా ఏమాత్రం ఎదగలేమని భావించింది టీడీపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి. ఆయన్ని ఏకంగా గొడ్డలితో నరికి నేను హత్య చేశాను అని దర్యాప్తు సంస్థల ఎదుటే సాక్ష్యం ఇచ్చిన దస్తగిరి. వీళ్లంతా ఎవరు? వివేకానందరెడ్డిని వ్యక్తిగతంగా, రాజకీయంగా అంతం చేసిన ముఠా సభ్యులు. మరి వీళ్లంటే వివేకానందరెడ్డి కుటుంబానికి సహజంగానే తీవ్ర ఆగ్రహం ఉండాలి కదా? కానీ ఏం జరుగుతోంది? చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, దస్తగిరి... బాబు కోసం పనిచేసే ‘ఈనాడు’.. దాని తోకలు.. వీళ్లంతా ఇపుడు వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు–చిన బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డికి అత్యంత సన్నిహితులైపోయారు. అంతా కలిసే కోర్టులకెళుతున్నారు. ‘నేనే నరికి చంపా’ అన్న దస్తగిరి బెయిలుకోసం దరఖాస్తు చేస్తే వ్యతిరేకించ లేదు. దర్జాగా బయటే తిరుగుతున్నాడతను. ఎల్లో మీడియాకు పతాక స్థాయి ఇంటర్వ్యూలిస్తున్నాడు. వంకర మాటల ఓపెన్హార్టులో బీటెక్ రవి ప్రవచనాలు చెప్తున్నాడు. వీళ్లంతా కలిసి హంతకుడిని కూడా వదిలేసి తమ రాజకీయ ప్రత్యర్థుల్ని దీంట్లో ఇరికించడానికి వెంటాడుతున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. ఎవరికి అర్థం కానిది ఈ నాటకం? వివేకానందరెడ్డి హత్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములైన ఈ ఎల్లో మాఫియాను ఛేదిస్తే తప్ప హత్య వెనక ఉన్న వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం లేదు. 2017లో వివేకాపై చంద్రబాబు రాజకీయ కుట్ర.. మెజార్టీ సభ్యులు ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి వైఎస్ వివేకానందరెడ్డిని రాజకీయంగా అంతం చేయడమే కాదు భౌతికంగానూ లేకుండా చేయాల్సిన అవసరం కచ్చితంగా టీడీపీకే ఉందన్నది బహిరంగ రహస్యం. వైఎస్సార్ జిల్లాలో టీడీపీ బలోపేతానికి ఆయనే అడ్డంకిగా నిలబడ్డారు. అందుకే 2017లో వైఎస్సార్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వివేకాను కుట్రపూరితంగా ఓడించారు చంద్రబాబు. స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వైఎస్ వివేకానందరెడ్డిని అభ్యర్థిగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంపిక చేశారు. జిల్లాలో మెజార్టీ ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు వైఎస్సార్సీపీకి చెందినవారే ఉండటంతో ఆయన గెలుపు నల్లేరుపై నడకేనని అంతా భావించారు. వివేకాను ఓడిస్తే.. నాటి విపక్ష నేత జగన్‌ను ఓడించినట్లేనని చంద్రబాబు భావించారు. అందుకే వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలు పెట్టి తమ వైపు లాక్కున్నారు. దీనికి నాటి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి పూర్తిగా సహకరించారు. ఎందుకంటే వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి నీతిబాహ్యంగా టీడీపీకి అమ్ముడుపోయి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి అయిన వ్యక్తి ఆదినారాయణ రెడ్డి. ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేశ్ భారీగా డబ్బులు వెదజల్లి వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభపెట్టి దొడ్డిదారిలో వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించారు. 2019... వివేకా భౌతికంగా అంతం 2019 సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబులో మళ్లీ గుబులు మొదలైంది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ జిల్లాలో ఒకే ఒక ఎమ్మెల్యే సీటును గెలిచిన టీడీపీకి ఈ సారి అది కూడా కష్టమేనని అర్థమైంది. కడప సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ లోక్‌సభ స్థానానికి పార్టీ ఎన్నికల ఇన్చార్జ్గా అప్పటికే వైఎస్ వివేకానందరెడ్డిని నియమించారు. పార్టీ గెలుపు కోసం ఎన్నికల వ్యూహాలు పన్నుతూ...అందర్నీ కలుపుకుంటూ వెళ్లారు వివేకా. దాంతో చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి బెంబేలెత్తారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డిని చంద్రబాబు ఖరారు చేశారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్‌ను కూడా ఆదినారాయణ రెడ్డి కొడుక్కి ఇచ్చారు. వివేకా ఉంటే ఎప్పటికీ తాము రాజకీయంగా పైచేయి సాధించలేమన్నది బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే వివేకా హత్యకు గురయ్యారు. మరి ఇది టీడీపీ కుట్ర కాదా? వివేకా హత్యకు ముందు టీడీపీ నేతలతో కొందరి రహస్య సమావేశాలు... ఆయన హత్య తరువాత టీడీపీ నేతలు వ్యవహరించిన తీరే దీనికి ఊతమిస్తోంది. హత్య అనంతరం... అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పదేపదే కడప ఎస్పీకి ఫోన్ చెయ్యడం... బీటెక్ రవితో కూడా నేరుగా సంభాషించటం... ఎప్పటికప్పుడు జరుగుతున్న వ్యవహారాలను నాటి సీఎం చంద్రబాబుకు అప్డేట్ చెయ్యటం.. ఇవన్నీ కాదనలేని వాస్తవాలు. అంటే... అంతా తాము అనుకున్నట్లే జరుగుతోందా? లేదా.. అన్నది బాబుకు ఏబీ అప్డేట్ చేశారన్నది నిపుణుల మాట. హత్యకు ముందు... వివేకా అనుచరుడితో బీటెక్ రవి భేటీ ఎందుకో...! తనకు దీర్ఘకాలంగా అనుచరుడిగా ఉన్న కొమ్మారెడ్డి పరమేశ్వరరెడ్డితో వివేకాకు ఆర్థిక వ్యవహారాల్లో విభేదాలు వచ్చాయి. దాంతో పరమేశ్వరరెడ్డి కక్ష పెంచుకుని పులివెందుల నియోజకవర్గంలో వివేకా రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న టీడీపీ నేత బీటెక్ రవితో చేతులు కలిపాడు. వివేకా హత్యకు అప్పటికే పన్నాగం సిద్ధం కావడంతో... ముందుగా పరమేశ్వరరెడ్డి ఎలిబీ సృష్టించుకోవడానికి వివేకా హత్యకు కేవలం రెండు రోజుల ముందే అంటే 2019 మార్చి 13న అనారోగ్యం సాకుతో కడపలోని సన్‌రైజ్ ఆస్పత్రి ఐసీయూలో చేరాడు. కానీ ఎవరికీ తెలియకుండా 2019 మార్చి 14 సాయంత్రం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో హరిత హోటల్లో రెండుసార్లు సమావేశమయ్యాడు. ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి... ఆ తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో మృతి చెందడం గమనార్హం. సిట్ దర్యాప్తులో నార్కో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినా పరమేశ్వరరెడ్డి తిరస్కరించడం సందేహాలకు తావిస్తోంది. ‘గుండె పోటు’ కథకుడు శివప్రకాశ్ రెడ్డి... వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయటమే కాదు. ఆ హత్యలో ఇతరుల్ని ఇరికించడానికి కూడా ఎల్లో గ్యాంగ్ పకడ్బందీ కుట్ర పన్నిందని చెప్పొచ్చు. ఎందుకంటే వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారనే తప్పుడు ప్రచారం వెనుక ఆయన పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డి, టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. శివప్రకాశ్‌రెడ్డి మొదట ఆదినారాయణ రెడ్డికి ఫోన్ చేసి వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని చెప్పారు. ‘‘సిగరెట్లు ఎక్కువుగా తాగుతారు కదా! అందుకే ఇలా జరిగి ఉండొచ్చు’’ అని ఆదినారాయణరెడ్డి ఆయనతో చెప్పారు. ఈ విషయాన్ని ఆదినారాయణ రెడ్డి స్వయంగా టీవీ ఛానెళ్ల ఎదుట వెల్లడించారు. అంతేకాదు. ఆదినారాయణరెడ్డికి చెప్పిన శివప్రకాశ్ రెడ్డే... ఎన్నికల ప్రచారం నిమిత్తం ఉదయాన్నే జమ్మలమడుగు వెళుతున్న ఎంపీ అవినాశ్‌రెడ్డికి కూడా వివేకా గుండెపోటు విషయం చెప్పారు. దాంతో అక్కడి నుంచే వెనుదిరిగి... అవినాశ్ రెడ్డి వివేకా ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ వివేకా పీఏ కృష్ణారెడ్డితో పాటు పలువురు ఉన్నారు. ఇలా శివప్రకాశ్ రెడ్డి చెప్పిన గుండెపోటు విషయమే... టీవీల్లో బ్రేకింగ్ న్యూస్‌గా వచ్చింది. ఆయన హత్యకు గురయ్యారనే నిజం బయటపడేలోపే ఈ తప్పుడు ప్రచారాన్ని తీసుకొచ్చారు. మరి శివప్రకాశ్‌రెడ్డి, ఆది నారాయణరెడ్డి ఈ తప్పుడు ప్రచారాన్ని ఎందుకు చేశారు? దీన్ని ఛేదిస్తే హత్య కేసులో అసలు కుట్ర బయటపడుతుంది. రక్తపు మరకల లేఖ.. గోప్యంగా ఉంచమన్న కుమార్తె, అల్లుడు.. వివేకా గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేసేందుకుగాను ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డి పక్కా ప్లాన్‌తోనే వ్యవహరించారు. అదెలాగంటే... వైఎస్ వివేకాపై తీవ్రంగా దాడిచేసిన తరువాత హంతకులు ఆయన చేత బలవంతంగా లేఖ రాయించారు. వాళ్లు బెదిరించడంతో... డ్రైవర్ ప్రసాద్ తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని ఆ లేఖలో వివేకా రాశారు. ఆ లేఖను మొదటగా అంటే ఆ రోజు ఉదయం 6.10లోపే చూసిన ఆయన పీఏ కృష్ణారెడ్డి... ఆ విషయాన్ని సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పారు. రక్తపు మరకలున్న ఆ లేఖ చూసినవారెవరికైనా... వివేకాది హత్యేనని తెలిసిపోతుంది. కానీ లేఖ విషయాన్ని కృష్ణారెడ్డి చెప్పగానే... తాము వచ్చే వరకు ఆ లేఖను, వివేకా సెల్‌ఫోన్‌ను ఎవ్వరికీ ఇవ్వవద్దని, దాచి ఉంచాలని కృష్ణారెడ్డితో నర్రెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పారు. ఆ తరవాతే అసలు పన్నాగానికి తెరలేచింది. శివ ప్రకాశ్ రెడ్డి ద్వారా అవినాశ్‌రెడ్డికి చెప్పించారు. అవినాశ్ రెడ్డి కాల్ డేటా చూస్తే ఈ విషయం నిర్ధారణ అవుతుంది కూడా. అవినాశ్ అక్కడకు చేరాక కూడా ఆయనకు లేఖ చూపించలేదు. లేఖ ఉందన్న విషయం కూడా చెప్పలేదు. అంటే... అన్నీ పథకం ప్రకారమే చేశారు. వాస్తవానికి వారు గనక ఆ లేఖను వెంటనే పోలీసులకు ఇవ్వాలని చెప్పి ఉంటే వివేకా హత్యకు గురయ్యారన్నది వెంటనే అందరికీ తెలిసిపోయేది. కనీసం అక్కడకు చేరుకున్న అవినాశ్‌కు చూపించినా హత్య సంగతి అర్థమయ్యేది. హత్య జరిగిందని తెలిస్తే ఎవ్వరూ మృతదేహాన్ని తాకేవారే కాదు. కానీ లేఖను ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచారు. బహుశా! అంతా తామనుకున్నట్టే జరిగిందనో ఏమో!! ఆ రోజు నుంచీ ఇప్పటివరకూ చంద్రబాబు నాయుడు ఈ హత్య గురించి ఎక్కడ మాట్లాడినా... మృతదేహానికి బ్యాండేజీ ఎవరు కట్టారు? రక్తపు మరకలు ఎవరు తుడిచారు? అనే ప్రశ్నలే వేస్తున్నారు. మొత్తం టీడీపీ, ఎల్లో మీడియా.. అందరూ ఇదే విషయమై దుష్ప్రచారం చేస్తున్నారు. అంతే తప్ప అసలు గుండెపోటు అని చెప్పిందెవరు? వారికెలా తెలిసింది? అసలు లేఖను ఎందుకు గోప్యంగా ఉంచారు? అలా ఎందుకు ఉంచమన్నారు? అనే విషయాలను మాత్రం ప్రచారంలోకి రానివ్వటం లేదు. ఇదీ.. కుట్ర వెనక అసలు కథ. ఆ రోజు మధ్యాహ్నం 1గంట సమయంలో పులివెందుల చేరుకున్న సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఆ లేఖతోపాటు వివేకా సెల్‌ఫోన్‌ను కృష్ణారెడ్డి ఇచ్చారు. ఆ లేఖను చదివారు కానీ... వెంటనే పోలీసులకు ఇవ్వలేదు. సునీత ఆదేశాలతో సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖను, సెల్‌ఫోన్‌ను పోలీసులకు అప్పగించారు. ఆ లేఖను సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఎందుకు గోప్యంగా ఉంచారన్నదే ఈ హత్య కేసులో కీలకం. చంద్రబాబు మంత్రాంగం... వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన రోజు అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు అమరావతి నుంచి పెద్ద కథే నడిపారు. అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు కడప ఎస్పీతోనూ టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణరెడ్డితోను, బీటెక్ రవితోను ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ కేసు దర్యాప్తును ప్రభావితం చేశారు. కేసు దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించేందుకు ఏబీవీ ఎందుకు అంతగా తాపత్రయ పడ్డారన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ... తాను జరిపిన దర్యాప్తులో అసలు లేఖ విషయమే పట్టించుకోకపోవటం గమనార్హం. వివేకా మరణిస్తే ఎవరికి ప్రయోజనం... ! ఆయన రెండో వివాహంతో ఆ కుటుంబంలో తీవ్ర విభేదాలు వివేకానందరెడ్డి మరణిస్తే ఎవరికి లాభం అన్నది ఈ కేసులో కీలకం. దాంతో అన్ని వేళ్లూ వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో తలెత్తిన విభేదాలపైకే వెళ్తున్నాయి. తాను రెండో వివాహం చేసుకున్న షమీమ్ అనే మహిళకు పుట్టిన కుమారుడికి ఆస్తిలో భాగం ఇవ్వాలని ఆయన భావించారు. తన రాజకీయ వారసుడిగా చేస్తానన్నది ఆ జిల్లాలో అందరికీ తెలుసు. అందుకే ఆ కుటుంబంలో ఆస్తి వివాదాలు, రాజకీయ వారసత్వ వివాదాలు తీవ్రస్థాయికి చేరాయి. వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి తీవ్రంగా గొడవపడి ఆయన్ని విడిచిపెట్టి హైదరాబాద్‌లో ఉంటున్నారు. సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, బావగారు శివ ప్రకాశ్‌రెడ్డి షమీమ్ ఇంటికి వెళ్లి ఘర్షణ పడ్డారు. వివేకానందరెడ్డి అప్పటికే ఆమెకు ఇచ్చిన ఓ ఇంటి పత్రాలను బలవంతంగా తీసుకున్నారు. షమీమ్, వైఎస్ సునీత పరస్పరం దూషించుకుంటూ చేసుకున్న వాట్సాప్ చాటింగ్‌ను కూడా అప్పట్లోనే సిట్ బృందం వెలికితీసింది. షమీమ్‌కు ఓ ఇల్లు ఇవ్వాలని... ఆమె కుమారుడిని హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివించాలని అనుకుంటున్నా...అవ్వడం లేదని వివేకా సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు కూడా. ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డి జీవించి లేకపోతే ఆయన కుమార్తె, అల్లుడు, పెద్ద బావమరిదికే ఎక్కువ లాభమన్నది గమనించాల్సిన అంశం. ఆస్తితో పాటు రాజకీయ వారసత్వం కూడా తమకే వస్తుందన్నది వారి ఉద్దేశంగా తెలుస్తుంది. హంతకుడు దస్తగిరిని అప్రూవర్‌గా మార్చింది ఎవరు...!? వైఎస్ వివేకాను గొడ్డలితో స్వయంగా నరికాను అని చెప్పిన దస్తగిరి అప్రూవర్‌గా మారడంతోనే ఈ కేసు దర్యాప్తు దారితప్పింది. అతన్ని అప్రూవర్‌గా మార్చింది ఎవరనే అంశమూ ఇక్కడ కీలకం. దస్తగిరి తరచు వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డితో భేటీ అవుతున్నారు. మరోవైపు టీడీపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవితో సన్నిహితంగా ఉంటున్నారు. ఎల్లో మీడియాకు ఇంటర్వ్యూలిస్తున్నాడు. అంటే వివేకా కుటుంబం, టీడీపీ నేతల పన్నాగంలో భాగంగానే దస్తగిరి అప్రూవర్‌గా మార్చినట్టు స్పష్టమవుతోంది. అప్పటివరకు పేదరికంలో కొట్టుమిట్టాడిన దస్తగిరి.. అప్రూవర్‌గా మారిపోగానే ఒక్కసారిగా ధనవంతుడైపోయాడు. కారు, బంగ్లా, డ్రైవర్... అన్నీ వచ్చేశాయి. మరి వీటిని ఇస్తున్నదెవరు? ఎందుకు ఇస్తున్నారు? సీబీఐ అధికారులు దస్తగిరిని ఢిల్లీకి తీసుకువెళ్లి మరీ అప్రూవర్‌గా మార్చి వాంగ్మూలం నమోదు చేశారు. అందులో వాస్తవం ఎంతన్నది పట్టించుకోకుండా ఆ వాంగ్మూలం ఆధారంగానే ఏకపక్షంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. హంతకుడు ఎల్లో గ్యాంగ్ హీరోనా...! వివేకాను హత్య చేసిన దస్తగిరిని అటు టీడీపీ ఇటు టీడీపీ అనుకూల పచ్చ మీడియా హీరోగా చూపించేందుకు బరితెగించి వ్యవహరిస్తున్నాయి. ఈనాడు,ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ 5 చానళ్లు దస్తగిరిని ఇంటర్వ్యూలు చేస్తూ అతన్ని ఓ సెలబ్రిటీగా చూపిస్తున్నాయి. వైఎస్సార్ కుటుంబంపై అక్కసుతో పాత్రికేయ విలువలను దిగజారుస్తూ ఓ హంతకుడిని హీరోగా చూపించేందుకు పడరానిపాట్లు పడుతున్నాయి. తన తండ్రి హంతకుడిని ఓ సంఘ సంస్కర్తగా టీడీపీ, ఎల్లో మీడియా చూపిస్తూ ఉంటే సునీత కనీసం అభ్యంతరం వ్యక్తం చేయకపోవటమే ఇక్కడ దారుణం. ఇదే బాబు మార్కు పన్నాగం... చంద్రబాబు ఎవరినైనా అడ్డుతొలగించుకోవాలంటే తనదైన శైలిలో పన్నాగం పన్నుతారు. లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి సొంతం కుటుంబంలోనే చిచ్చుపెట్టి సొంతవారితోనే కథ నడిపిస్తారని ఎన్టీఆర్ విషయంలో రుజువైంది. ఎన్టీ రామారావును ఆయన సొంత పిల్లలతోనే ఛీకొట్టించి మరీ పదవి నుంచి దించేసి తాను అడ్డదారిలో సీఎం అయ్యారు. అదే రీతిలో వివేకానందరెడ్డికి ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాశ్ రెడ్డిలతోనే పొగ పెట్టించారు. టీడీపీ నేతలు ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిల సహకారంతో కుటుంబ సభ్యులే పాత్రధారులుగా గుట్టుచప్పుడు కాకుండా కథ ముగించారు. కీలక అంశాలను విస్మరిస్తున్న సీబీఐ సున్నితమైన వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ ఆది నుంచీ దారి తప్పింది. వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో తలెత్తిన ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలు...ఆయన లైంగిక అక్రమ సంబంధాలతో ఆయనపై కక్ష పెంచుకున్నవారు... వివేకాను సెటిల్మెంట్లకు వాడుకున్న స్నేహితులు, అనుచరులు...వివేకాను అడ్డుతొలగించుకుంటేనే రాజకీయంగా మనుగడ అని భావించిన చంద్రబాబు, ఆది నారాయణ రెడ్డి, బీటెక్ రవి... ఇలా ఈ కేసులో పచ్చ కుట్రను స్పష్టం చేస్తున్న అనేక కోణాలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. కానీ సీబీఐ మాత్రం హంతకుడిని ఎవరో వ్యూహాత్మకంగా అప్రూవర్‌గా మారిస్తే... ఆ వాంగ్మూలం పట్టుకునే ఈ కేసు దర్యాప్తు గోదారిని ఈదేందుకు యత్నిస్తుండటం సీబీఐ తీరునే ప్రశ్నార్థకంగా మారుస్తోంది. -
దస్తగిరితో డ్రామా! అప్రూవర్ వాంగ్మూలం ఉత్త కథే
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఎంత బోగస్ అనేది బట్టబయలైంది. ఆ చార్జ్‌షీట్ ఎంత కల్పితాల కట్టుకథో స్పష్టమైంది. వివేకాను హత్య చేసిన దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి ఇప్పించిన అవాస్తవ వాంగ్మూలం బండారం బహిర్గతమైంది. వాంగ్మూలంలో దస్తగిరి పేర్కొన్న బెంగళూరు భూ సెటిల్మెంట్ వ్యవహారం పూర్తిగా ఫేక్ అని సీబీఐ దర్యాప్తులోనే నిర్ధారణ కావడం గమనార్హం. వివేకాతో ఆయన స్నేహితుడు ఎర్ర గంగిరెడ్డికి వివాదాలున్నాయని ఓ కట్టుకథను కేంద్ర బిందువుగా చేసుకుని దాన్ని వైఎస్ భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డితో అంటగడుతూ దస్తగిరి ద్వారా సీబీఐ నడిపించిన డ్రామా గుట్టు వీడింది. కొత్త బృందం.. పాత పాటే! ‘బెంగళూరు భూసెటిల్మెంట్ వ్యవహారంలో ఎర్ర గంగిరెడ్డికి వాటా ఇవ్వకుండా వైఎస్ వివేకా ఎగ్గొట్టారు. దీంతో ఎర్ర గంగిరెడ్డి కక్ష పెంచుకుని వివేకాను హత్య చేయాలని నాతో చెప్పారు..!’ ఇదీ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన నిందితుడు దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో కీలక అంశం. ‘వివేకాను హత్య చేసిన తరువాత ఆ ఇంట్లో భూమి పత్రాల కోసం ఎర్రగంగిరెడ్డి గాలించారు..’ అని కూడా అందులో పేర్కొన్నారు. 2019 మార్చి 14న అర్ధరాత్రి దాటిన తరువాత వైఎస్ వివేకాను హత్య చేశామని దస్తగిరి చెప్పినట్టు వాంగ్మూలంలో ఉంది. దస్తగిరిని ఢిల్లీకి తరలించి కొద్ది వారాలపాటు చిత్రహింసలు పెట్టి మరీ ఇప్పించిన ఈ వాంగ్మూలం మినహా సీబీఐ వద్ద ఎలాంటి ఆధారం లేదు. పాత బృందంతోపాటు తాజాగా నియమించిన సీబీఐ కొత్త బృందం కూడా ఈ ఒక్క వాంగ్మూలం ఆధారంగానే దర్యాప్తు కొనసాగిస్తోంది. అయితే ఆ వాంగ్మూలం కట్టుకథేనని స్పష్టమైంది. డాక్యుమెంట్లు ఫేక్... సెటిల్మెంట్ ఫేక్ బెంగళూరు యలహంక ప్రాంతంలోని 8.6 ఎకరాల భూమి విషయంపై వై.రాధాకృష్ణ మూర్తి, హిమాచలపతి అనే వ్యక్తుల మధ్య విభేదాలున్నాయి. ఈ విషయం తెలిసి వైఎస్ వివేకానందరెడ్డి తన స్నేహితుడు ఎర్ర గంగిరెడ్డితోపాటు లక్ష్మీకర్, మరికొందరితోపాటు వై.రాధాకృష్ణమూర్తిని కలసి తాము ఆ వివాదాన్ని పరిష్కరిస్తామన్నారు. భూమి వివాదం పరిష్కరిస్తే రూ.8 కోట్లు ఇస్తానని రాధాకృష్ణమూర్తి చెప్పారు. యలహంక ఎమ్మెల్యేగా ఉన్న అప్పటి కర్ణాటక హోంమంత్రి ద్వారా ఆ భూ వివాదాన్ని పరిష్కరించేందుకు వైఎస్ వివేకా ప్రయత్నించారు. ఈ క్రమంలో హోంమంత్రి పోలీసు అధికారులను పిలిచి ఆ భూ వివాదంపై చర్చించడంతో రాధాకృష్ణమూర్తి ఇచ్చిన భూమి పత్రాలు ఫోర్జరీవని తేలింది. బెడిసికొట్టిన బ్యాంకు రుణం భూమి పత్రాలు ఫోర్జరీవని తెలిసినప్పటికీ వైఎస్ వివేకా వాటి ఆధారంగా సొమ్ము చేసుకునేందుకు రియల్ ఎస్టేట్ బ్రోకర్ పీటర్ క్యాండీని సంప్రదించారు. ఫోర్జరీ పత్రాలను బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం ఇప్పించాలని కోరారు. బ్యాంకు రుణం వస్తే అందులో 60 శాతం వివేకా, రాధాకృష్ణమూర్తి పంచుకోగా మిగిలిన 40 శాతాన్ని బ్రోకర్ పీటర్ క్యాండీ తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. లీగల్ ఖర్చుల కోసం పీటర్ క్యాండీకి మల్లిశెట్టి వెంకటరమణ అనే వ్యక్తి ద్వారా వైఎస్ వివేకా రూ.24 లక్షలు ఇప్పించారు. అయితే ఏడాది దాటినా రుణం ఇచ్చేందుకు ఏ బ్యాంకు కూడా సమ్మతించలేదు. దీంతో తాను ఇచ్చిన రూ.24 లక్షలు తిరిగి ఇవ్వాలని వివేకా, పీటర్ క్యాండీని మల్లిశెట్టి వెంకటరమణ ఒత్తిడి చేశారు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో 2019 ఫిబ్రవరి, మార్చిలో నాలుగు డిమాండ్ డ్రాఫ్ట్‌ల రూపంలో రూ.24 లక్షలు తిరిగి చెల్లించారు. చివరి డిమాండ్ డ్రాఫ్ట్‌ను 2019 మార్చి 12న అంటే వివేకా హత్యకు రెండు రోజుల ముందే చెల్లించారు. పీటర్ క్యాండీ తన వద్ద ఉన్న ఫోర్జరీ పత్రాలను సైతం రాధాకృష్ణమూర్తి కుమారుడు వెంకట ప్రసాద్‌కు తిరిగి ఇచ్చేశారు. ఇక ఆ భూమి సెటిల్మెంట్ చేయడం, బ్యాంకు రుణం తీసుకోవడం సాధ్యం కాదని తేలడంతో ఆ వ్యవహారాన్ని వదిలేశారు. ఈ సెటిల్మెంట్ చేసేందుకు యత్నించిన వైఎస్ వివేకా స్నేహితుడు ఎర్ర గంగిరెడ్డికి మొత్తం వ్యవహారం తెలుసు. అంటే బెంగళూరు భూ సెటిల్మెంట్ అన్నదే లేదని, భూమి పత్రాలు సైతం వివేకా వద్ద లేవని ఎర్ర గంగిరెడ్డికి స్పష్టంగా తెలుసు. ఇదంతా సీబీఐ దర్యాప్తులోనే వెల్లడైంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న రాధాకృష్ణమూర్తి, హిమాచలపతి, వెంకట ప్రసాద్, పీటర్ క్యాండీలను సీబీఐ అధికారులు విచారించి మరీ దీన్ని నిర్ధారించుకున్నారు. జరగని సెటిల్మెంట్.. లేని పత్రాల కోసం హత్య ఏమిటి? అసలు బెంగళూరు భూసెటిల్మెంట్ అనేది జరగలేదని ఎర్ర గంగిరెడ్డికి తెలుసు. అటువంటప్పుడు వైఎస్ వివేకా తనకు వాటా ఇవ్వలేదని కక్ష ఎందుకు పెంచుకుంటారు? అంటే ఈ కారణంతో వివేకాను హత్య చేయాలని ఎర్ర గంగిరెడ్డి తనకు చెప్పినట్లు దస్తగిరి పేర్కొనడం పూర్తిగా అవాస్తవం అని తేటతెల్లమవుతోంది. వైఎస్ వివేకాను హత్య చేసిన తరువాత ఆయన ఇంట్లో బెంగళూరు భూమి పత్రాల కోసం ఎర్ర గంగిరెడ్డి, తాము గాలించినట్లు దస్తగిరి చెప్పాడు. కానీ ఆ భూమి పత్రాలను అప్పటికే రాధాకృష్ణమూర్తి కుమారుడికి తిరిగి ఇచ్చిన విషయం ఎర్ర గంగిరెడ్డికి తెలుసు. దీన్నిబట్టి దస్తగిరి చెప్పింది అవాస్తవమే అని స్పష్టమవుతోంది. ఇక బెంగళూరు భూ సెటిల్మెంట్ అన్నదే లేదని ఎర్ర గంగిరెడ్డికి తెలిసినప్పుడు ఆ కారణంతో వైఎస్ వివేకాను హత్య చేయమని చెప్పడంగానీ, తనకు అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి సహకారం ఉందనడం కూడా అవాస్తవం అని నిర్ధారణ అవుతోంది. అంటే అప్రూవర్ దస్తగిరి వాంగ్మూలం పేరిట సీబీఐ పూర్తిగా కల్పిత కథనాలను అల్లినట్లు తేలిపోతోంది. అసలు ఆ వాంగ్మూలమే అవాస్తవం అయినప్పుడు దాని ఆధారంగా భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డిని విచారణ పేరిట సీబీఐ వేధించడం దురుద్దేశపూరితమేని స్పష్టమవుతోంది. -
వివేకా హత్యపై వింత వాదనలు
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి వ్యవహరిస్తున్న తీరు సందేహాస్పదంగా మారుతోంది. వారిని అడ్డుపెట్టుకుని సాగుతున్న సీబీఐ దర్యాప్తుపై అనుమానాలు బలపడుతున్నాయి. వివేకా హత్యకు పరస్పర భిన్నమైన కారణాలు చెబుతూ సునీత, ఆమె భర్త ఎన్.రాజశేఖరరెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై పరిశీలకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఆ దంపతులు వ్యవహార శైలిని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాలు ఆశించే.. వైఎస్ వివేకానందరెడ్డిని స్వయంగా హత్య చేసిన దస్తగిరిని సీబీఐ అప్రూవర్‌గా మార్చడాన్ని సునీత వ్యతిరేకించనే లేదు. పైగా అతడితో తరచూ మాట్లాడుతుండటం గమనార్హం. తండ్రిని హత్య చేసిన నిందితుడితో సత్సంబంధాలు నెరుపుతూ ఇతరులపై నిరాధార ఆరోపణలు చేయడం ఏమిటన్నది అంతు చిక్కకుండా ఉంది. కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించే సునీత, ఎన్.రాజశేఖరరెడ్డి దంపతులు ఆ విధంగా వ్యవహరిస్తున్నాని స్పష్టమవుతోంది. ఉద్దేశపూర్వకంగానే.. బెంగళూరులో భూ వివాదం నేపథ్యంలోనే వైఎస్ వివేకాను ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి హత్య చేశారని సీబీఐ పేర్కొంది. ఆ మేరకు దస్తగిరి వాంగ్మూలాన్ని ఆధారంగా ప్రస్తావించింది. భూ వివాదం నేపథ్యంలోనే తన తండ్రిని హత్య చేశారనే సునీత చెప్పుకొచ్చారు. కానీ తర్వాత కడప ఎంపీ టికెట్‌కు అడ్డు తొలగించుకోవడం కోసమే వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి ఈ హత్య చేయించారనే ప్రచారాన్ని సీబీఐ ఉద్దేశపూర్వకంగా ప్రచారంలోకి తెచ్చింది. అందుకు సునీత, భర్త ఎన్.రాజశేఖరరెడ్డి, అతడి సోదరుడు ఎన్.శివప్రకాశ్‌రెడ్డి సీబీఐ ముందు ఇచ్చిన వాంగ్మూలాలను ఆధారంగా చూపించారు. హత్యకు భూ వివాదం కారణమని చెప్పినవారే... అంతలోనే పూర్తి విరుద్ధంగా కడప ఎంపీ టికెట్ కోసం హత్య చేశారని ఆరోపించడం సందేహాస్పదంగా మారింది. చార్జ్‌షీట్‌లో స్పష్టంగా పేర్కొన్న ఎన్ఐఏ తాజాగా కడప ఎంపీ టికెట్ కోసమంటూ తాము చేసిన ఆరోపణల్లో పస లేదని నిర్ధారణ కావడంతో కొత్త పల్లవి అందుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై హత్యాయత్నం డ్రామా అని, ఆ తరహాలోనే ఎన్నికల్లో సానుభూతి పొందేందుకే వివేకాను హత్య చేయించారని నిరాధార ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది. నాడు వైఎస్ జగన్‌ను హత్య చేసేందుకే నిందితుడు విశాఖ విమానాశ్రయంలో దాడికి పాల్పడినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చార్జ్‌షీట్‌లో స్పష్టంగా పేర్కొంది. మరి అలాంటప్పుడు ఆ హత్యాయత్నం అంతా డ్రామా అని సునీత, ఆమె భర్త ఎన్.రాజశేఖరరెడ్డి ఆరోపించడం ఏమిటో అర్థం కావడం లేదు. తన తండ్రి వివేకా హత్య కేసులో అసలు దోషులెవరో తేల్చాలన్న అంశంపై సునీతకు చిత్తశుద్ధి లేదన్నది తద్వారా స్పష్టమవుతోంది. కేవలం తమ రాజకీయ, ఇతరత్రా ప్రయోజనాల కోసమే ఈ కేసును ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు వెల్లడవుతోంది. వీరి తీరు ఆది నుంచి సందేహాస్పదమే.. ► వివేకా మృతి చెందారని ఆయన పీఏ ఎంవీ కృష్ణారెడ్డి మొదట సునీత, ఆమె భర్త ఎన్.రాజశేఖరరెడ్డికే సమాచారమిచ్చారు. కానీ కాసేపటికే రాజశేఖరరెడ్డి సోదరుడు అప్పటి టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి ఫోన్ చేసి వైఎస్ వివేకా గుండెపోటుతో మరణించారని ఎలా చెప్పారు? ► వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహాన్ని ఆయన అనుచరుడు ఇనయతుల్లా ఫొటోలు, వీడియోలు తీసి వారి కుటుంబ సభ్యులకు ఉదయం 6.30 గంటలకే వాట్సాప్ చేశాడు. ఆ ఫొటోలు చూసిన తరువాత అయినా ఆయన్ని హత్య చేశారని సునీత, ఆమె భర్త ఎందుకు గుర్తించ లేదు? ఆ తరువాత కూడా వారు పీఏ ఎంవీ కృష్ణారెడ్డికి ఫోన్ చేసి సందేహాస్పద మృతిగా పోలీసులకు ఫిర్యాదు చేయమని ఎందుకు చెప్పారు? ► వైఎస్ వివేకా రాసినట్లు చెబుతున్న లేఖ, ఆయన సెల్‌ఫోన్‌ను పీఏ ఎంవీ కృష్ణారెడ్డి స్వాధీనం చేసుకున్నారు. ఆ విషయాన్ని సునీత, ఆమె భర్త ఎన్.రాజశేఖరరెడ్డికి చెప్పారు. మరి వాటిని వెంటనే పోలీసులకు అప్పగించాలని వారు ఎందుకు చెప్పలేదు? తాము వచ్చే వరకు వాటిని దాచి ఉంచాలని సూచించారు. వారు మధ్యాహ్నానికి పులివెందుల చేరుకున్నాక... సాయంత్రం ఆ లేఖ, సెల్ఫోన్లను పోలీసులకు అప్పగించారు. అలా ఎందుకు చేశారు? పోలీసులకు అప్పగించే ముందు ఆ సెల్‌ఫోన్‌లోని ఏ డేటాను డిలీట్ చేశారు? ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదు? ► బాత్రూమ్లోని వివేకా మృతదేహాన్ని హాల్లోకి తీసుకురావాలని ఆయన పెద్ద బావమరిది శివప్రకాశ్‌రెడ్డి చెప్పారని ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి వాంగ్మూలం ఇచ్చాడు. శివప్రకాశ్‌రెడ్డి అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ► షమీమ్ అనే మహిళను వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో ఆ కుటుంబంలో విభేదాలు తలెత్తిన విషయం వాస్తవం కాదా? తన రెండో భార్యకు రూ.10 కోట్లు ఇవ్వాలన్న వివేకా నిర్ణయాన్ని ఆయన భార్య సౌభాగ్యమ్మ, సునీత, అల్లుడు ఎన్.రాజశేఖరరెడ్డి వ్యతిరేకించారు. కుటుంబ బ్యాంకు ఖాతాలకు సంబంధించి వివేకానందరెడ్డికి చెక్ పవర్ లేకుండా చేశారు. షమీమ్ ఇంటికి వెళ్లి ఆమెను బెదిరించారు. ఈ విషయాలను షమీమ్ స్వయంగా సీబీఐకి వెల్లడించారు. ఈ అంశాలపై సునీత ఎందుకు స్పందించడం లేదు? ► వివేకాకు తాము రాజకీయ వారసులు కావాలని ఆయన పెద్ద బావమరిది ఎన్.శివప్రకాశ్‌రెడ్డి, చిన బావమరిది, అల్లుడైన ఎన్.రాజశేఖరరెడ్డి భావించారు. అందుకు వివేకా సానుకూలంగా లేకపోవడంతో ఆయనపై ఆగ్రహం పెంచుకోవడం వాస్తవం కాదా? -
దస్తగిరి చెప్పిందంతా అబద్ధం
పులివెందుల: తాను ప్రలోభపెట్టానంటూ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు దస్తగిరి చెప్పిందంతా అవాస్తవమని జర్నలిస్ట్ భరత్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం పులివెందులలో ఆయన మాట్లాడుతూ.. దస్తగిరి 2021, సెప్టెంబర్ 30వ తేదీన సీబీఐ అధికారులకు ఇచ్చిన లేఖలో చెప్పినవన్నీ అబద్ధాలేనన్నారు. ఆ లేఖలో తాను ఓ న్యాయవాదితో కలసి డబ్బు, పొలం ఇస్తామని ప్రలోభాలకు గురి చేసినట్లు దస్తగిరి పేర్కొన్నాడని, ఇది నిజంకాదన్నారు. గతంలో తాను కేసు విషయమై మీడియా సమావేశం నిర్వహించిన తర్వాత సీబీఐ అధికారులు తనను కడప వారి గెస్ట్‌హౌస్‌కు పిలిచి మీడియా సమావేశాలు పెడితే కేసులో ఇరికిస్తామని, ఏ విషయం ఉన్నా తమ వద్దకు వచ్చి చెప్పాలని బెదిరించారన్నారు. దీంతో తాను మౌనంగా ఉన్నానని తెలిపారు. ఇప్పుడు కూడా తాను మౌనంగా ఉంటే దస్తగిరి చెప్పినవి నిజమని నమ్మే అవకాశముందని, తనపై లేనిపోని ఆరోపణలతో కేసులు పెడతారనే ఆందోళనతో మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. దస్తగిరి ఇచ్చిన లేఖలో తమ పేర్లు రాయడం చాలా బాధాకరమన్నారు. దస్తగిరి 164 స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత తాము ప్రలోభాలకు గురి చేశామన్నాడని, అసలు స్టేట్మెంట్ రికార్డు చేసేసిన తర్వాత ప్రలోభాలకు గురి చేయాల్సిన అవసరం ఏముంటుందని భరత్ యాదవ్ ప్రశ్నించారు. కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్ మారదు కదా అని అన్నారు. నిజానికి తనకు ఇవ్వాల్సిన డబ్బు గురించి మాత్రమే దస్తగిరిని అడిగానని, ఆయన రేపు, మాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నాడన్నారు. డబ్బు విషయం మాట్లాడిన ప్రతిసారీ ‘‘నాకు సీబీఐ అండగా, తోడుగా ఉంది, నాకేం కావాలన్నా సీబీఐ చేస్తుందని.. అందుకే వారి మాట వింటాను’’ అని దస్తగిరి అంటుండేవాడన్నారు. తోడు రమ్మంటేనే దస్తగిరితో ఢిల్లీకి వెళ్లానని, ఆ ఖర్చులు కూడా తానే ఇచ్చానని.. ఈ విషయాలన్నీ ఆధారాలతో సహా సీబీఐకి గతంలోనే ఇచ్చానని భరత్ యాదవ్ తెలిపారు. దస్తగిరి చెప్పే అబద్ధాలను సీబీఐ గమనించాలని ఆయన కోరారు. దస్తగిరి అందరికి చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాడన్నారు. -
గంగిరెడ్డి, ఉమాశంకర్ వ్యాజ్యాలపై స్పందించిన హైకోర్టు
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు షేక్ దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు అనుమతినివ్వడంతో పాటు అతనికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ కడప చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కమ్ ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ఈ నెల 26న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కడప కోర్టు ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న తుమ్మల గంగిరెడ్డి, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై జస్టిస్ రాయ్ మంగళవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు టి.నిరంజన్‌రెడ్డి, బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ, అతను అప్రూవర్‌గా మారేందుకు అనుమతిస్తూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధమన్నారు. ఇప్పటికే దస్తగిరి వాంగ్మూలాన్ని సీఆర్పీసీ సెక్షన్ 164 కింద నమోదు చేశారని, కోర్టులో చార్జిషీట్ కూడా దాఖలు చేశారని తెలిపారు. సెక్షన్ 164 కింద వాంగ్మూలం నమోదు చేసిన తరువాత అప్రూవర్‌గా మరోసారి వాంగ్మూలం నమోదు చేయడానికి వీల్లేదన్నారు. నిందితుడైన దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి ఓ సాక్షిగా అతని వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు పులివెందుల కోర్టు రంగం సిద్ధం చేస్తోందన్నారు. కడప కోర్టు ఉత్తర్వుల వల్ల పిటిషనర్లకు తీరని నష్టం కలుగుతుందన్నారు. అందువల్ల ఈ వ్యాజ్యాల్లో జోక్యం చేసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. దీనిపై కౌంటర్‌కు సమయం కావాలని సీబీఐ తరఫు న్యాయవాది చెన్నకేశవులు కోరారు. ఇందుకు న్యాయస్థానం అంగీకరిస్తూ విచారణను వారానికి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదిగా ఉన్న దస్తగిరికి నోటీసులు జారీ చేసింది. -
దస్తగిరికి అప్రూవర్‌గా అనుమతి.. చట్టవిరుద్ధం
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు షేక్ దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు అనుమతి ఇవ్వడంతోపాటు అతడికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ కడప చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కమ్ ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి గత నెల 26న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ వివేకా హత్యకేసులో నిందితులు తుమ్మల గంగిరెడ్డి, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి హైకోర్టులో గురువారం వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కడప కోర్టు ఉత్తర్వులకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వారు హైకోర్టును ఈ సందర్భంగా అభ్యర్థించారు. దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ, అతడిని అప్రూవర్‌గా మారేందుకు అనుమతి ఇస్తూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. కడప కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో నిందితుడు దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి, సాక్షిగా అతడి వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు పులివెందుల కోర్టు రంగం సిద్ధం చేస్తోందని తెలిపారు. కడప కోర్టు ఉత్తర్వుల వల్ల తమకు తీరని నష్టం కలుగుతుందన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా వివేకా హత్యకేసులో అసలు నిందితులకు రక్షణగా దస్తగిరిని ముందు పెట్టారని ఆరోపించారు. దస్తగిరి చెప్పిన వివరాలన్నీ కట్టు కథలేనని, వాటిని కడప కోర్టు పరిగణనలోకి తీసుకుని ఉండాల్సింది కాదని పేర్కొన్నారు. దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదించాలంటూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాఖలు చేసిన పిటిషన్ వెనుక కంటికి కనిపించని రాజకీయ కుట్ర ఉందన్నారు. నేరాన్ని నిరూపించేందుకు సాక్ష్యాలు లేనప్పుడు మాత్రమే క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుందని, సీబీఐ ఒకపక్క సాక్ష్యాలున్నాయని చెబుతూ, మరోపక్క దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదించాలని పిటిషన్ వేయడం వెనుక ఉన్న కుట్రను కోర్టు పరిగణనలోకి తీసుకుని ఉండాల్సిందన్నారు. వివేకా హత్యతో తమకు సంబంధం లేకపోయినా తమను ఈ కేసులో ఇరికించేందుకే సీబీఐ ఈ పిటిషన్ దాఖలు చేసిందని పేర్కొన్నారు. కడప కోర్టు ఉత్తర్వుల వల్ల తమకు తీరని అన్యాయం జరుగుతుందని, అందువల్ల ఆ ఉత్తర్వులను కొట్టేయాలని వారు హైకోర్టును అభ్యర్థించారు. -
‘దూదేకులను బాబు ఓటు బ్యాంకుగానే చూశారు’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దూదేకులను ఓటు బ్యాంకుగానే చూశారని, ఐదు ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తామని చెప్పి విస్మరించారని ఏపీ ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ అధ్యక్షులు దస్తగిరి ఆవేదన వ్యక్తం చేశారు. దూదేకులకు చట్ట సభలలో ప్రాధాన్యత కల్పించాలని గురువారం విజయవాడ ధర్నాచౌక్‌లో ఏపీ ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 లక్షల దూదేకులకు దామాషా ప్రకారం చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. దూదేకుల ఫెడరేషన్‌కు రూ. 500 కోట్లు నిధులు కేటాయించి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమకు చట్ట సభలలో ప్రాతినిధ్యం కల్పించిన రాజకీయ పార్టీకి పట్టం కడతామని చెప్పారు. -
బిడ్డకేమి తెలుసు నాన్న ఇకలేడని..
కొలిమిగుండ్ల : ‘పాపం నాన్న ఎదపై కూర్చుని అమాయకంగా బోసి నవ్వులు చిందించడం మాత్రమే తెలిసిన ఆ పసిబిడ్డ.. ఆయన ఇక రాడని తెలియక అంతే అమాయకంగా ఎప్పటిలాగే తండ్రి మృతదేహంపై కూర్చుని ఆయన పలకరింపు కోసం తదేకంగా చూస్తూ ఉండిపోయాడు’. ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్న వారి కళ్లు చెమర్చాయి. తాడిపత్రి మండలం గదరగుట్టపల్లెకు చెందిన దూదేకుల దస్తగిరి(34), ఆశాబీ దంపతులది పేద కుటుంబం. భర్త నాపరాతి గనుల్లో లోడింగ్ పనులు, భార్య ఉపాధి పనులకు వెళ్లి జీవనం సాగించేవారు. వీరికి ముగ్గురు ఆడపిల్లల తర్వాత ఆరు నెలల క్రితం కుమారుడు జన్మించాడు. ఉదయం నుంచి ఎన్ని పనులు చేసినా, ఎంతగా కష్టపడినా సాయంత్రం కుమారుడి బోసి నవ్వులు, చిలిపిచేష్టలు చూస్తూ అన్ని మరిచిపోయేవారు. ఈ క్రమంలో మంగâýæవారం కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె గనుల్లో ట్రాక్టర్‌కు లోడింగ్ చేసిన దస్తగిరి అదే వాహనంలోనే ఇంటికి బయలుదేరాడు. విండ్వరల్డ్ సబ్‌స్టేçÙ¯ŒS సమీపానికి రాగానే ట్రాక్టర్ అదుపు తప్పి రాళ్ల గుట్ట ఎక్కడం, కుదుపుల కారణంగా దస్తగిరి కిందపడటంతో అతనిపై ట్రాక్టర్ టైర్ ఎక్కి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న భార్య ఆరునెలల పసిబిడ్డతో ఘటనా స్థలానికి చేరుకుని భర్త మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించింది. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ వెంకట సుబ్బయ్య తెలిపారు. -
అల్ట్రాటెక్ ఉద్యోగి ఆత్మహత్య
తాడిపత్రి రూరల్ : తాడిపత్రి మండలంలోని గదరగుట్టపల్లి గ్రామానికి చెందిన దస్తగిరి(37) శనివారం ఒంటిపై కిరోసి¯ŒS పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో పనిచేస్తున్న అతడు కొన్ని నెలలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతుండేవాడు. ఆ బాధ భరించలేక ఇంట్లో కిరోసి¯ŒS పోసుకుని నిప్పంటించుకున్నాడు. కుటుంబసభ్యులు వెంటనే గాయపడిన అతడిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి అనంతపురానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడికి భార్య వహీదా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.