బిడ్డకేమి తెలుసు నాన్న ఇకలేడని.. | how would baby knows father was no more | Sakshi
Sakshi News home page

బిడ్డకేమి తెలుసు నాన్న ఇకలేడని..

Published Wed, Feb 15 2017 12:25 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

బిడ్డకేమి తెలుసు నాన్న ఇకలేడని.. - Sakshi

బిడ్డకేమి తెలుసు నాన్న ఇకలేడని..

కొలిమిగుండ్ల : ‘పాపం నాన్న ఎదపై కూర్చుని అమాయకంగా బోసి నవ్వులు చిందించడం మాత్రమే తెలిసిన ఆ పసిబిడ్డ.. ఆయన ఇక రాడని తెలియక అంతే అమాయకంగా ఎప్పటిలాగే తండ్రి మృతదేహంపై కూర్చుని ఆయన పలకరింపు కోసం తదేకంగా చూస్తూ ఉండిపోయాడు’. ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్న వారి కళ్లు చెమర్చాయి. తాడిపత్రి మండలం గదరగుట్టపల్లెకు చెందిన దూదేకుల దస్తగిరి(34), ఆశాబీ దంపతులది పేద కుటుంబం. భర్త నాపరాతి గనుల్లో లోడింగ్‌ పనులు, భార్య ఉపాధి పనులకు వెళ్లి జీవనం సాగించేవారు. వీరికి ముగ్గురు ఆడపిల్లల తర్వాత ఆరు నెలల క్రితం కుమారుడు జన్మించాడు. ఉదయం నుంచి ఎన్ని పనులు చేసినా, ఎంతగా కష్టపడినా సాయంత్రం కుమారుడి బోసి నవ్వులు, చిలిపిచేష్టలు చూస్తూ అన్ని మరిచిపోయేవారు.

ఈ క్రమంలో మంగâýæవారం కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె గనుల్లో ట్రాక్టర్‌కు లోడింగ్‌ చేసిన దస్తగిరి అదే వాహనంలోనే ఇంటికి బయలుదేరాడు. విండ్‌వరల్డ్‌ సబ్‌స్టేçÙ¯ŒS సమీపానికి రాగానే ట్రాక్టర్‌ అదుపు తప్పి రాళ్ల గుట్ట ఎక్కడం, కుదుపుల కారణంగా దస్తగిరి కిందపడటంతో అతనిపై ట్రాక్టర్‌ టైర్‌ ఎక్కి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న భార్య ఆరునెలల పసిబిడ్డతో ఘటనా స్థలానికి చేరుకుని భర్త మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించింది. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ వెంకట సుబ్బయ్య తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement