Duplesis
-
కోహ్లి కన్నీళ్లు పెట్టిన వేళ డ్యుప్లెసిస్ వ్యాఖ్యలు
-
జొహన్నెస్‌బర్గ్ కెప్టెన్‌గా డుప్లెసిస్
కేప్‌టౌన్: చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) పాత మిత్రులు స్టీఫెన్ ఫ్లెమింగ్, డుప్లెసిస్ మళ్లీ జట్టు కట్ట నున్నారు. సీఎస్కే యాజమాన్యం దక్షిణాఫ్రికా టి20 లీగ్‌లో కొనుగోలు చేసిన జొహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ కోసం ఇద్దరు కలిసి పని చేయనున్నారు. ఈ జట్టుకు ఫ్లెమింగ్ కోచ్ కాగా, డుప్లెసిస్ సారథ్యం వహించనున్నాడు. ఐపీఎల్ మెగా వేలానికి ముందు చెన్నై డుప్లెసిస్‌ను విడుదల చేశాక ఈ ఏడాది బెంగళూరుకు సారథ్యం వహించి జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చాడు. క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) టి20 లీగ్‌లో ఓ మినీ సీఎస్కే జట్టే బరిలోకి దిగబోతోంది. ఎందుకంటే మొయిన్ అలీ (ఇంగ్లండ్), మహీశ్ తీక్షణ (శ్రీలంక), రొమారియో షెఫర్డ్ (విండీస్)లు కూడా జొహన్నెస్‌బర్గ్ జట్టులో ఉన్నారు. ఆటగాళ్లే కాదు కోచింగ్ సిబ్బంది కూడా సీఎస్కేతోనే నిండిపోతోంది. ఫ్లెమింగ్ హెడ్‌కోచ్‌గా, ఎరిక్ సిమన్స్ సహాయ కోచ్‌గా వ్యవహరిస్తారు. ఒకప్పుడు సీఎస్కేకు ఆడిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఆల్బీ మోర్కెల్‌ను కూడా జొహన్నెస్‌బర్గ్ జట్టు కోచింగ్ సిబ్బందిలో నియమించనున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది ఆరంభంలో సీఎస్ఏ టి20 లీగ్ జరిగే అవకాశముంది. -
చెన్నై అలవోకగా...
చెన్నైతో మ్యాచ్‌లో పంజాబ్ విజయ లక్ష్యం 161 పరుగులు. ఒక దశలో జట్టు విజయానికి 49 బంతుల్లో 71 పరుగులు అవసరం. ఈ స్థితిలో పంజాబ్ గెలిచేస్తుందనే అనుకున్నారంతా... కానీ చెన్నై స్పిన్నర్లు జడేజా, హర్భజన్, తాహిర్ చెలరేగారు. దాదాపు 6 ఓవర్ల పాటు పంజాబ్‌ను ఒక్క బౌండరీ కూడా బాదకుండా అడ్డుకున్నారు. దీంతో విజయ సమీకరణం 16 బంతుల్లో 44గా మారగా, ఛేదన పంజాబ్ వల్ల కాలేదు. రాహుల్, సర్ఫరాజ్ నెమ్మదైన అర్ధసెంచరీలతో జట్టు మూల్యం చెల్లించుకోగా, ధోని వ్యూహాలతో చెన్నైకి మరో విజయం దక్కింది. చెన్నై: సొంతగడ్డపై సమష్టిగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. శనివారం చేపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌కింగ్స్ 22 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌పై ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 160 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (38 బంతుల్లో 54; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో అదరగొట్టాడు. కెప్టెన్ ధోని (23 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులే చేయగలిగింది. రాహుల్ (47 బంతుల్లో 55; 3 ఫోర్లు, 1 సిక్స్), సర్ఫరాజ్ ఖాన్ (59 బంతుల్లో 67; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాటం వృథా అయింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హర్భజన్, కుగ్లీన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. సాదాసీదాగా... డు ప్లెసిస్, వాట్సన్ తొలి వికెట్‌కు 56 పరుగులు జోడించి చెన్నైకి శుభారం భం అందించారు. టై బౌలింగ్‌లో వరుసగా 4, 6 బాదిన వాట్సన్ పవర్ ప్లే చివరి బంతికి మరో బౌండరీతో జోరు కనబరిచాడు. తర్వాత మరో భారీ షాట్ ఆడే క్రమంలో అశ్విన్‌కు దొరికిపోయాడు. రైనా (17) సింగిల్స్‌కే ప్రా ధాన్యతనిచ్చాడు. మరోవైపు మురుగన్, అశ్విన్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో స్కోరు వేగం తగ్గింది. సగం ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై 71/1తో నిలిచింది. వరుస బంతుల్లో డు ప్లెసిస్, రైనాలను ఔట్ చేసి అశ్విన్ స్కోరును కట్టడి చేశాడు. అనంతరం రాయుడు (15 బంతుల్లో 21 నాటౌ ట్; 1 ఫోర్, 1 సిక్స్), చివర్లో ధోని బ్యాట్ ఝళిపించారు. కరన్ వేసిన 19వ ఓవర్లో 6, 4, 4తో ధోని 19 పరుగులు రాబట్టాడు. చివరి ఓవర్లో రాయు డు సిక్స్, ధోని బౌండరీ బాదడంతో స్కోరు 150 పరుగులు దాటింది. డుప్లెసిస్ జోరు ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతోన్న ఫాఫ్ డు ప్లెసిస్.... షమీ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో చెలరేగాడు. అదే ఓవర్ చివరి బంతిని ఫైన్ లెగ్ మీదుగా భారీ సిక్సర్‌గా మలిచాడు. టై ఓవర్లోనూ లాంగాన్ మీదుగా మరో సిక్సర్‌తో అలరించాడు. ఆరంభంలో స్పిన్ ఎదుర్కొనేందుకు కాస్త తడబడిన అతను... అశ్విన్, మురుగన్ వేసిన వరుస ఓవర్లలో రెండు సిక్సర్లతో జోరు కనబరిచాడు. ఇదే క్రమంలో 33 బంతుల్లో అర్ధసెంచరీని అందుకున్నాడు. తర్వాత అశ్విన్ బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతి జాగ్రత్తకు పోయి.. ఒకే ఓవర్లో విధ్వంసక ఆటగాడు గేల్ (5), మయాంక్ అగర్వాల్ (0)లను ఔట్ చేసి హర్భజన్ పంజాబ్‌కు షాకిచ్చాడు. అయితే రాహుల్, సర్ఫరాజ్ జోడీ జట్టును ఆదుకుంది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 110 పరుగులు జోడించారు. చహర్ వేసిన నాలుగో ఓవర్లో రాహుల్ 4, 6, 4తో అలరించాడు. తొలిసారి ఐపీఎల్ ఆడుతోన్న కుగ్లీన్ తన మొదటి బంతినే సర్ఫరాజ్‌కు సిక్స్‌గా సమర్పించుకున్నాడు. దీంతో పవర్‌ప్లేలో పంజాబ్ 2 వికెట్లకు 48 పరుగులు చేసింది. మరోసారి కుగ్లీన్ బౌలింగ్ (12వ ఓవర్)లోనే సర్ఫరాజ్ 4, 6తో అలరించాడు. అప్పటివరకు సాఫీగా సాగిన పంజాబ్ ఇన్నింగ్స్ బ్యాట్స్‌మెన్ అతి జాగ్రత్తతో డీలా పడింది. -
దక్షిణాఫ్రికాదే సిరీస్
కేప్‌టౌన్: పాకిస్తాన్‌తో జరుగుతోన్న మూడు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే దక్షిణాఫ్రికా 2–0తో కైవసం చేసుకుంది. ఆ జట్టు రెండో టెస్టులో 9 వికెట్ల తేడాతో నెగ్గింది. 41 పరుగుల లక్ష్యంతో ఆదివారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలు 9.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 43 పరుగులు చేసి విజయం సాధించారు. డీన్ ఎల్గర్ (24 నాటౌట్; 4 ఫోర్లు), డు ప్లెసిస్ (3 నాటౌట్) లాంఛనం పూర్తి చేశారు. ఓపెనర్ డి బ్రుయెన్ (4)ను అబ్బాస్ ఔట్ చేయగా... ఆమ్లా రెండు పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాకిది వరుసగా ఏడో సిరీస్ విజయం కావడం విశేషం. మూడో టెస్టు శుక్రవారం నుంచి జొహన్నెస్‌బర్గ్‌లో ప్రారంభం కానుంది. డు ప్లెసిస్ సస్పెన్షన్... ఈ మ్యాచ్‌లో ‘స్లో ఓవర్ రేట్’ కారణంగా దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్‌పై ఐసీసీ ఓ టెస్టు మ్యాచ్ నిషేధం విధించింది. దీంతో పాటు సారథి మ్యాచ్ ఫీజులో 20 శాతం, జట్టు సభ్యుల ఫీజులో 10 శాతం కోత పెట్టింది. -
శతకాలతో మెరిసిన డు ప్లెసిస్, మిల్లర్
హొబార్ట్: డేవిడ్ మిల్లర్ (108 బంతుల్లో 139; 13 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ డు ప్లెసిస్ (114 బంతుల్లో 125; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత శతకాలతో చెలరేగారు. దీంతో ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 40 పరుగుల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. ఆసీస్ గడ్డపై 2009 అనంతరం దక్షిణాఫ్రికాకు ఇదే తొలి వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మిల్లర్, డుప్లెసిస్ దూకుడుతో 50 ఓవర్లలో 320 పరుగులు చేసింది. 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన స్థితిలో వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 252 పరుగులు జోడించి జట్టుకు భారీ స్కోరు అందించారు. ఆస్ట్రేలియాపై వన్డేల్లో ఏ వికెట్‌కైనా నమోదైన అత్యుత్తమ భాగస్వామ్యం ఇదే కావడం విశేషం. చివరి 15 ఓవర్లలో దక్షిణాఫ్రికా ఏకంగా 174 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, స్టొయినిస్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆసీస్ 9 వికెట్లకు 280 పరుగులు చేసి ఓడింది. షాన్ మార్‡్ష (106; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీకి తోడు స్టొయినిస్ (63; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధశతకంతో రాణించాడు. చివర్లో అలెక్స్ క్యారీ (42), మ్యాక్స్‌వెల్ (35) పోరాడినా లాభం లేకపోయింది. సఫారీ బౌలర్లలో స్టెయిన్, రబడ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. -
సమ న్యాయం ఏది?: డుప్లెసిస్ ధ్వజం
పోర్ట్ ఎలిజబెత్: క్రికెటర్ల ప్రవర్తనకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విధించే డీమెరిట్ పాయింట్లపై దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అందరినీ సమాన దృష్టితో చూడాల్సిన ఐసీసీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని మండిపడ్డాడు. ఇందుకు ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్, తమ దేశ పేసర్ రబడాలపై చర్యలే ఉదాహరణగా డుప్లెసిస్ విమర్శించాడు. వీరి విషయంలో సమ న్యాయం జరగలేదని ధ్వజమెత్తాడు. వార్నర్ తొలి టెస్ట్‌లో డికాక్‌ను ఉద్దేశపూర్వకంగా దూషించినపుడు లెవల్ 2 కింద మూడు డీమెరిట్ పాయింట్లు ఇచ్చారు. రెండో టెస్ట్‌లో రబడా అనుకోకుండా స్మిత్ భుజాన్ని తాకటంతో లెవల్2 కింద నాలుగు డీమెరిట్ పాయింట్లు, 65 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించారు. రబడాకి కూడా మూడు డీమెరిట్ పాయింట్లు ఇచ్చుంటే ఆస్ట్రేలియాతో జరిగే మిగతా టెస్టులు ఆడేవాడని కానీ ఐసీసీ తమకు వ్యతిరేకంగా ప్రవర్తించిందని ఐసీసీని డుప్లెసిస్ విమర్శించాడు. ప్రస్తుతం రబడా అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు, రెండో టెస్ట్‌లో 11 వికెట్లతో విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక రబడా విషయంపై ఐసీసీ వ్యతిరేకంగా అప్పీల్‌కు వెళ్లినా లాభం ఉండదనే ఉద్దేశంతో వెళ్లటంలేదని డుప్లెసిస్ పేర్కొన్నాడు. -
దక్షిణాఫ్రికాను మళ్లీ ‘కంగారు’ పెట్టిస్తారా!
సాక్షి, స్పోర్ట్స్: నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా పటిష్ట ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడనుంది. పేస్‌కు స్వర్గదామమైన డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ స్డేడియంలో ఆసీస్ పేసర్లను ఎదుర్కోవడం సఫారీలకు పెద్ద సవాల్. సొంతగడ్డపై ఇటీవల జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లు కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టు టెస్టు సిరీస్ నెగ్గినా.. అందులో టీమిండియా పేసర్లను ఎదుర్కోలేకపోయారు. భారత బౌలర్ల కంటే ఆసీస్ పేసర్లు మరింత వేగంగా బంతులేస్తారన్నది తెలిసిందే. బౌన్సర్లు, యార్కర్లతో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరి బిక్కిరి చేయడంతో పాటు అవసరమైతే స్లెడ్జింగ్ లాంటి వాటిలో ఆసీస్ క్రికెటర్లు ముందుంటారు. అసలే సొంతగడ్డ మీద కంగారూలతో 14 సిరీస్‌ల్లో తలపడిన ప్రొటీస్ జట్టు కేవలం 2 సిరీస్‌లు మాత్రమే నెగ్గింది. 1970 తర్వాత సొంతగడ్డలో ఆసీస్‌పై టెస్ట్ సిరీస్ నెగ్గలేదన్న చెత్త రికార్డును చెరిపేయాలని సఫారీ టీమ్ భావిస్తోంది. అయితే భారత యువ బౌలర్లు కుల్దీప్, చహల్‌లను సరిగా ఎదుర్కోలేక ఆపసోపాలు పడ్డ సఫారీలకు ఆసీస్‌తో తాజా టెస్ట్ సిరీస్ సవాల్‌గా నిలువనుంది. పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజల్‌వుడ్, నాథన్ లయన్లతో పటిష్టంగా ఉన్న ఆసీస్ బౌలింగ్ అటాక్‌ను ఎదుర్కోవాలంటే మానసికంగా సన్నద్ధం కావాలి. అసలే టీమిండియా చేతిలో వన్డే, టీ20ల్లో సిరీస్‌లు కోల్పోయిన సఫారీ జట్టు ఏ మేరకు ఆసీస్‌కు పోటీ ఇస్తుందో చూడాలి. మరోవైపు 2016లో ఆసీస్‌లోనే తమను ఓడించిన సఫారీలను చిత్తు చేయాలని స్టీవ్ స్మిత్ సేన ప్రతీకారేచ్ఛతో ఉంది. మధ్యాహ్నం గం. 1.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. -
న్యూజిలాండ్‌తో మూడో టెస్టు ‘డ్రా’
దక్షిణాఫ్రికాదే సిరీస్ ఆఖరి రోజు ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో... దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు ‘డ్రా’గా ముగిసింది. డుప్లెసిస్ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా జట్టు 1–0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ రెండు జట్ల మధ్య డ్యూనెడిన్‌లో జరిగిన తొలి టెస్టు ‘డ్రా’కాగా... వెల్లింగ్టన్లో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. ఈ టెస్టు సిరీస్‌కు ముందు జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 3–2తో సొంతం చేసుకుంది. -
డుప్లెసిస్ అజేయ సెంచరీ
దక్షిణాఫ్రికా 481/8 డిక్లేర్డ్ న్యూజిలాండ్‌తో రెండో టెస్టు సెంచూరియన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో డు ప్లెసిస్ (234 బంతుల్లో 112 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీ సాధించాడు. దీంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను 481/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. 283/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం రెండో రోజు ఆట కొనసాగించిన సఫారీ జట్టు భారీ స్కోరుకు డుమినీ (88), డు ప్లెసిస్ బాటలు వేశారు. లోయర్ ఆర్డర్లో వాన్ జిల్ 35 పరుగులు చేశాడు. వాగ్నెర్‌కు 5 వికెట్లు దక్కాయి. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 16 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 38 పరుగులు చేసింది. గప్టిల్ (8), లాథమ్ (4), టేలర్ (1) నిరాశపరిచారు. విలియమ్సన్ (15 బ్యాటింగ్), నికోల్స్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
తాహిర్ తిప్పేశాడు
► 7 వికె ట్లతో వెస్టిండీస్‌ను కూల్చేసిన ఇమ్రాన్ ► 139 పరుగులతో దక్షిణాఫ్రికా ఘన విజయం బెసెటెరి (సెయింట్ కీట్స్, నేవిస్): బ్యాట్స్‌మన్ హషీమ్ ఆమ్లా (99 బంతుల్లో 110: 13 ఫోర్లు) సెంచరీకి, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ తాహిర్ (7/45) బౌలింగ్ మెరుపులు తోడవడంతో ముక్కోణపు సిరీస్ ఆరో వన్డేలో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. వార్నర్ పార్క్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 139 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 343 పరుగుల భారీ స్కోరును సాధించింది. క్వింటన్ డికాక్(103 బంతుల్లో 71: 6 ఫోర్లు), డుప్లెసిస్ (50 బంతుల్లో 73 నాటౌట్: 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలతో చెలరేగగా... క్రిస్ మోరిస్ (26 బంతుల్లో 40: 2 ఫోర్లు, 2 సిక్సర్లు), డివిలియర్స్ (19 బంతుల్లో 27: 1 ఫోర్, 2 సిక్సర్లు) వేగంగా ఆడారు. వెస్టిండీస్ బౌలర్లలో కీరన్ పొలార్డ్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం 344 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 38 ఓవర్లలోనే 204 పరుగులు చేసి ఆలౌటైంది. చార్లెస్ (41 బంతుల్లో 49: 7 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్ కాగా శామ్యూల్స్ (24) ఫరవాలేదనిపించాడు. ఈ మ్యాచ్ 33వ ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టిన తాహిర్... వేగంగా 100 వికెట్లు (58వ మ్యాచ్‌లో) తీసిన దక్షిణాఫ్రికా బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా తరఫున ఒక బౌలర్ వన్డేల్లో 7 వికెట్లు పడగొట్టడం కూడా ఇదే తొలిసారి. మరో బౌలర్ షమ్సీ 2 వికెట్లతో రాణించాడు.