durables
-
NielsenIQ: ‘మాల్స్’ విక్రయాల్లో భారత్ టాప్
న్యూఢిల్లీ: ఆధునిక వాణిజ్య ఛానళ్ల ద్వారా విక్రయాల్లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే భారత్ అగ్రస్థానంలో ఉన్నట్టు నీల్సన్ఐక్యూ నివేదిక తెలిపింది. ఆధునిక అంగళ్లలో ఎఫ్ఎంసీజీ, టెక్నాలజీ డ్యూరబుల్స్ విక్రయాల పరంగా రెండంకెల వృద్ధి చూపిస్తున్న ఏకైక దేశం భారత్ అని.. ప్రీమియం ఉత్పత్తులకు ఆదరణ, పండుగల విక్రయాలు ఇందుకు సాయపడుతున్నట్టు పేర్కొంది. 40 శాతం ఎఫ్ఎంసీజీ అమ్మకాలు, 30 శాతం టెక్నాలజీ డ్యూరబుల్స్ విక్రయాలు ఆధునిక వాణిజ్య ఛానళ్ల ద్వారానే నమోదవుతున్నట్టు వెల్లడించింది. ఇది భారత వినియోగదారుల ప్రాధాన్యతలను తెలియజేస్తున్నట్టు నీల్సన్ ఐక్యూ నివేదిక పేర్కొంది. ఆన్లైన్ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్నా కానీ, భారత వినియోగదారులకు ఆధునిక అంగళ్లు (సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లు, డిపార్ట్మెంట్ స్టోర్లు) ప్రాధాన్య మార్గాలుగా ఉన్నట్టు తెలిపింది. ‘‘ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆధునిక వాణిజ్యం బలంగానే నమోదైంది. ధరల అస్థిరతలు ఉన్నప్పటికీ రండంకెల వృద్ధి నమోదైంది. ప్రీమియం ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది’’అని ఈ నివేదిక వివరించింది. ఎఫ్ఎంసీజీ, టెక్ డ్యూరబుల్స్ విక్రయాలకు పండగల సీజన్ కీలకమని పేర్కొంది. ఈ కాలంలోనే ఎఫ్ఎంసీజీ మొత్తం అమ్మకాల్లో 20 శాతం, టెక్నాలజీ డ్యూరబుల్స్ అమ్మక్లాలో 60 శాతం నమోదవుతున్నట్టు తెలిపింది. ఆహారోత్పత్తుల కంటే వీటి అమ్మకాలే ఆయా సీజన్లలో 1.8 రెట్లు అధికంగా ఉంటున్నట్టు పేర్కొంది. చిన్న తయారీ సంస్థల ఉత్పత్తులతోపాటు, రిటైలర్లు సొంతంగా నిర్వహించే ప్రైవేటు లేబుల్స్ రూపంలో పెద్ద కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. ప్రైవేటు లేబుళ్ల అమ్మకాలు పెద్ద తయారీ సంస్థల ఉత్పత్తులతో పోలి్చతే ప్రవేటు లేబుళ్ల అమ్మకాలు (రిటైల్ సంస్థల సొంత ఉత్పత్తులు) 1.5 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక చిన్న తయారీ సంస్థలు కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలో 70 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి’’అని నీల్సన్ ఐక్యూ నివేదిక తెలిపింది. ఆధునిక చానళ్లలో సంప్రదాయంగా ఎఫ్ఎంసీజీలకు సంబంధించి పెద్ద ప్యాక్‌లకు ఆదరణ ఉంటుండగా, ఇది క్రమంగా చిన్న ప్యాక్‌ల వైపు మళ్లుతున్నట్టు వివరించింది. -
ఇప్పుడు కొనుకోండి.. 60రోజుల తర్వాత చెల్లించండి!
న్యూఢిల్లీ : పెద్ద నోట్లు రూ.500, రూ.1000 రద్దుచేస్తు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్, కన్సూమర్ డ్యూరెబుల్స్‌పై ఓ స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చింది. ఇప్పుడు కొనుకోండి.. 60 రోజుల తర్వాత బిల్లు చెల్లింపులు చేయడంటూ ప్రకటించింది. 60 రోజుల తర్వాత ఈఎంఐలో చెల్లింపుల చేసే విధంగా అవకాశం కల్పించింది. కన్సూమర్ డ్యూరెబుల్స్, మొబైల్ ఫోన్లలో మార్కెట్ లీడర్‌గా ఉన్న శాంసంగ్ ఈ ఆఫర్‌తో, జీరో డౌన్ పేమెంట్‌ను ఆఫర్ చేస్తోంది. తన అన్ని కన్సూమర్ డ్యూరబుల్ ఉత్పత్తులపై కూడా ఈ ఏడాది చివరి వరకు చెల్లింపులను జాప్యం చేస్తున్నట్టు ప్రకటించింది. తమ నూతనావిష్కరణ ఉత్పత్తులతో వినియోగదారులు దైనందిన జీవితాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యమని శాంసంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ భూటాని తెలిపారు.వినియోగదారుల కొనుగోలును మరింత సులభతరం చేయడానికి ఈ ఆకర్షణీయమైన ఆఫర్లను తీసుకొస్తున్నట్టు చెప్పారు. శాంసంగ్ టెలివిజన్స్, ఎయిర్‌కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్, మైక్రోవేవ్ ఓవెన్ ఉత్పత్తులపై మూడు రకాలైన ఆఫర్లు ఈ ఏడాది చివరి వరకు అంటే డిసెంబర్ 31వరకు అందుబాటులో ఉంచుతున్నట్టు పేర్కొన్నారు. మొదటిది... కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు ఎలాంటి చెల్లింపులు చేయకుండా, 10 నుంచి 12 నెలవారీ వాయిదాల్లో చెల్లించుకోవచ్చు. ఈ స్కీమ్‌ను క్రోమా లాంటి పెద్ద ఫార్మాట్ రిటైలర్లు ఆఫర్ చేస్తున్నారు. రెండోది.. ఇప్పుడు కొనుకోండి, 60 రోజుల తర్వాత చెల్లించండి. కానీ ఎనిమిది ఈఎంఐల్లో పూర్తిచెల్లింపులు చెల్లించాల్సి ఉంటుంది. మూడోది క్రెడిట్ కార్డు ఆధారిత ఈఎంఐ. వస్తువు కొనుగోలు చేసేటప్పుడు ఏం చెల్లించనప్పటికీ, మూడు నుంచి 12 నెలల్లో ఈ చెల్లింపు చేయాల్సి ఉంటుందని శాంసంగ్ పేర్కొంది.