ఇప్పుడు కొనుకోండి.. 60రోజుల తర్వాత చెల్లించండి!
ఇప్పుడు కొనుకోండి.. 60రోజుల తర్వాత చెల్లించండి!
Published Wed, Nov 23 2016 7:15 PM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM
న్యూఢిల్లీ : పెద్ద నోట్లు రూ.500, రూ.1000 రద్దుచేస్తు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్, కన్సూమర్ డ్యూరెబుల్స్పై ఓ స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చింది. ఇప్పుడు కొనుకోండి.. 60 రోజుల తర్వాత బిల్లు చెల్లింపులు చేయడంటూ ప్రకటించింది. 60 రోజుల తర్వాత ఈఎంఐలో చెల్లింపుల చేసే విధంగా అవకాశం కల్పించింది. కన్సూమర్ డ్యూరెబుల్స్, మొబైల్ ఫోన్లలో మార్కెట్ లీడర్గా ఉన్న శాంసంగ్ ఈ ఆఫర్తో, జీరో డౌన్ పేమెంట్ను ఆఫర్ చేస్తోంది. తన అన్ని కన్సూమర్ డ్యూరబుల్ ఉత్పత్తులపై కూడా ఈ ఏడాది చివరి వరకు చెల్లింపులను జాప్యం చేస్తున్నట్టు ప్రకటించింది. తమ నూతనావిష్కరణ ఉత్పత్తులతో వినియోగదారులు దైనందిన జీవితాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యమని శాంసంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ భూటాని తెలిపారు.వినియోగదారుల కొనుగోలును మరింత సులభతరం చేయడానికి ఈ ఆకర్షణీయమైన ఆఫర్లను తీసుకొస్తున్నట్టు చెప్పారు.
శాంసంగ్ టెలివిజన్స్, ఎయిర్కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్, మైక్రోవేవ్ ఓవెన్ ఉత్పత్తులపై మూడు రకాలైన ఆఫర్లు ఈ ఏడాది చివరి వరకు అంటే డిసెంబర్ 31వరకు అందుబాటులో ఉంచుతున్నట్టు పేర్కొన్నారు. మొదటిది... కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు ఎలాంటి చెల్లింపులు చేయకుండా, 10 నుంచి 12 నెలవారీ వాయిదాల్లో చెల్లించుకోవచ్చు. ఈ స్కీమ్ను క్రోమా లాంటి పెద్ద ఫార్మాట్ రిటైలర్లు ఆఫర్ చేస్తున్నారు. రెండోది.. ఇప్పుడు కొనుకోండి, 60 రోజుల తర్వాత చెల్లించండి. కానీ ఎనిమిది ఈఎంఐల్లో పూర్తిచెల్లింపులు చెల్లించాల్సి ఉంటుంది. మూడోది క్రెడిట్ కార్డు ఆధారిత ఈఎంఐ. వస్తువు కొనుగోలు చేసేటప్పుడు ఏం చెల్లించనప్పటికీ, మూడు నుంచి 12 నెలల్లో ఈ చెల్లింపు చేయాల్సి ఉంటుందని శాంసంగ్ పేర్కొంది.
Advertisement