Durga Prasad rao
-
అనంతపురంలో ‘బ్రౌన్’ శాఖ ఏర్పాటు చేయాలి
కడప కల్చరల్: డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి కడపలో నిర్మించిన సీపీ బ్రౌన్ గ్రంథాలయం శాఖను అనంతపురంలోనూ ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉపమాక దుర్గాప్రసాద్‌రావు సూచించారు. జానమద్ది అనంతపురం జిల్లాకు చెందినవారని, అందువల్ల అక్కడ కూడా బ్రౌన్ గ్రంథాలయ శాఖను ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి (బ్రౌన్ శాస్త్రి) జయంతిని పురస్కరించుకుని జానమద్ది 11వ వార్షిక సాహిత్య సేవా పురస్కార ప్రదానోత్సవం ఆదివారం కడపలోని సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో నిర్వహించారు. జానమద్ది సాహితీపీఠం ఆధ్వర్యాన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జస్టిస్ ఉపమాక దుర్గాప్రసాద్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రచయిత, ఆకాశవాణి విశ్రాంత అధికారి నాగసూరి వేణుగోపాల్‌కు జానమద్ది పురస్కారాన్ని జస్టిస్ దుర్గాప్రసాద్‌రావు ప్రదానం చేశారు. స్వయంకృషి, సాహిత్యాభిలాష, సామాజిక దృష్టి జానమద్ది ప్రత్యేకతలని, భావితరాలకు వాటిని తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జస్టిస్ దుర్గాప్రసాద్‌రావు అన్నారు. ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జానమద్ది సాహితీసేవ భావితరాలకు స్ఫూర్తినిస్తుందని అభిప్రాయపడ్డారు. యోగి వేమన విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య చింతా సుధాకర్ మాట్లాడుతూ బ్రౌన్ గ్రంథాలయాన్ని సాహిత్యంతోపాటు కళానిలయంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కవి యలమర్తి మధుసూదన ‘తెలుగు భాషా ప్రాశస్త్యం–పద్య వైభవం’పై స్మారకోపన్యాసం చేశారు. పురస్కార గ్రహీత డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ మాట్లాడుతూ తాను కడపలో పనిచేసిన సమయంలో బ్రౌన్ గ్రంథాలయం, జానమద్దితో అనుబంధం ఏర్పడిందని తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వ్యక్తులు, సంస్థల ప్రతినిధులను జానమద్ది సాహితీపీఠం తరఫున సన్మానించారు. విజయవాడ దుర్గగుడి ఈవో కేఎస్ రామారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జానమద్ది సాహితీపీఠం ట్రస్టీ విజయభాస్కర్, కార్యదర్శి యామిని, డాక్టర్ వైపీ వెంకటసుబ్బయ్య, జానమద్ది కుటుంబ సభ్యులు, కవులు, రచయితలు పాల్గొన్నారు. -
ముక్కోటి ఏకాదశి: తిరుమలలో ప్రముఖులు
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ఉదయం అభిషేకం అనంతరం ఆలయ ఆర్చకులు వైకుంఠ ద్వారాలు తెరిచారు. ఉదయం నాలుగు గంటలకు దర్శనం ప్రారంభం అవ్వగా.. సామాన్య భక్తులు, వీఐపీలు దర్శనాల కోసం క్యూకట్టారు. శుక్రవారం కావడంతో అభిషేకం అనంతరం దర్శనాలు మొదలయ్యాయి. దీంతో తిరుమల క్షేత్రం వైకుంఠాన్ని తలపిస్తోంది. కాగా వైకుంఠ ఏకాదశి పర్వ దినాన పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇందు మల్హోత్రా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గా ప్రసాద్ రావు దర్శించుకున్నారు. అలాగే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, అవంతి శ్రీనివాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎంపీలు వేమారెడ్డి ప్రభాకర్ రెడ్డి, మిధున్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాదవ్, మోపిదేవి వెంకటరమణ, ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్ ఆదిత్యనాధ్, జస్టిన్ సీవీ నాగార్జున్ రెడ్డి, ఏపీ హైకోర్టు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, తెంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, హైకోర్టు న్యాయమూర్తి వెంకటరమణ, జస్టిస్ ఈశ్వరయ్య, తెలంగాణ హైకోర్టు జస్టిస్ అమర్ నాథ్ గౌడ్, తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, తెలంగాణ కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్, సర్కార్ వారి పాట చిత్రం డైరెక్టర్ పరుశురామ్, తదితరులు శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. సునీల్ దియోధర్ మాట్లాడుతూ... వైకుంఠ ఏకాదశికి టీటీడీ అద్భుతమైన దర్శన ఏర్పాట్లు చేసిందన్నారు. దేవాలయాల నిర్వహణలో టీటీడీ దేశంలోని అన్నీ ఆలయాలకు ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. కోవిడ్ నిబంధనలు అమలు చేస్తూ అద్భుతమైన దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీకి ధన్యవాదాలు తెలిపారు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వీఐపీలు క్రమ శిక్షణతో శ్రీవారిని దర్శించుకున్నారన్నారు. అనుకున్న సమయం కంటే ముందుగానే సర్వ దర్శనం ప్రారంభిస్తున్నామన్నారు. భక్తులందరూ తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు ఈ సందర్భంగా ఆలయ అదనపు ఈవో మాట్లాడుతూ.. సాధారణ భక్తులకు గంటన్నర ముందే వైకుంఠద్వార దర్శనం కల్పించినట్లు తెలిపారు. ఉ. 9 గంటలకు అనుకున్నామని కానీ 7.30 గంటలకే ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. పరిస్థితిని అంచనా వేసి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఏర్పట్లు చేసినట్లు, సర్వదర్శనం టిక్కెట్ల పెంచినట్లు పేర్కొన్నారు. సాధారణ భక్తులకు ఎక్కువ సమయం కేటాయించగలుగుతున్నామన్నారు. ప్రముఖులు సహకరించడంతో సాధారణ భక్తులకు ఎక్కువ సమయం లభించిందన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా రెండు వేలు, దాతలకు రెండు వేలు, వీఐపీలకు మూడు వేల మందికి టికెట్లు కేటాయించామన్నారు. -
వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది
సాలూరు రూరల్/బొబ్బిలి/బెలగాం, న్యూస్‌లైన్ : వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పదని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి యు.దుర్గాప్రసాదరావు అన్నారు. సోమవారం సాలూరు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సరైన అధ్యయనం లేకుండా న్యాయవాదులు కోర్టుకు హాజరుకావద్దని సూచించారు. లేకపోతే కేసులు అనవసరంగా వారుుదాపడతాయని చెప్పారు. అనంతరం దుర్గా ప్రసాదరావు దంపతులను బార్ అసోసియేషన్ చైర్మన్ ఎన్ఎస్ చలం, ఇతర సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి గౌరీశంకరరావు, సీనియర్ న్యాయవాదులు గొర్లె రామకృష్ణ, కిలపర్తి రామమూర్తి, కర్రి సన్యాసిరావు, సీఐ దేముళ్లు, ఎస్ఐ టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బొబ్బిలిలో ఘన సత్కారం... పన్నెండేళ్ల కిందట న్యాయవాది వృత్తి చేసిన కోర్టుకే హైకోర్టు న్యాయమూర్తి హోదాలో వచ్చిన దుర్గాప్రసాదరావును బొబ్బిలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అనంతరం పోలీసు వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్ష, కార్యదర్శులు తాన్న రామకృష్ణ, గంటి గోపాలకృష్ణ శర్మలు జ్ఞాపికను అందించారు. అనంతరం సీనియర్ న్యాయవాదులు జవహార్, వరహ గిరి ప్రసాదరావు, ప్రకాశరావు, వడ్డే శ్రీరాంమూర్తి, ఎంఎం జగ్గారావు, మత్స బెనర్జీ, చోడిగంజి రామారావు, తాన్న రామకృష్ణలను న్యాయమూర్తి సన్మానం చేశారు. చివరిగా న్యాయవాది పాణిగ్రాహికి సన్మానం చేస్తూ ఇది తనకు తానే చేసుకుంటున్న సన్మానమని వ్యాఖ్యానించారు. జూనియర్ న్యాయవాదులకు కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్-1908 పుస్తకాన్ని బహుకరించారు. న్యాయవాద వృత్తిలో గురువైన ఓలేటి సీతారామమూర్తి చిత్రపటాన్ని దుర్గాప్రసాదరావు ఆవిష్కరించారు. సన్మానం అనంతరం జరిగిన సభలో గత స్మృతులను తలుచుకున్నారు. కార్యక్రమంలో సబ్ జడ్జి తిరుమలరావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి విజయకల్యాణి తదితరులు పాల్గొన్నారు. పార్వతీపరం కోర్టు సందర్శన పార్వతీపురం కోర్టును హైకోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాదరావు సందర్శించారు. నూతనంగా నిర్మిస్తున్న కోర్టు భవనం నిర్మాణం నిధులు కొరత కారణంగా నిలిచిపోయిందని స్థానిక జడ్జి పి.వి.రాంబాబు నాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటానని ఆయన హామీఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక జడ్జీలు శ్రీనివాసశర్మ, కృష్ణసాయితేజ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.