Dutch Open badminton
-
హర్షీల్‌కు డచ్ ఓపెన్ టైటిల్
న్యూఢిల్లీ: భారత యువ షట్లర్ హర్షీల్ డాని ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్ సాధించాడు. డచ్ ఓపెన్ టోర్నమెంట్లో అతను విజేతగా నిలిచాడు. ఫైనల్లో హర్షీల్ 15–21, 21–12, 21–13తో మాడ్స్ క్రిస్టోఫెర్సన్ (డెన్మార్క్)పై విజయం సాధించాడు. చీలమండ గాయం కారణంగా గతేడాది ఎనిమిది నెలలపాటు ఆటకు దూరంగా ఉన్న హర్షీల్ ఈ ఏడాది మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఫైనల్ చేరే క్రమంలో ఒక్క గేమ్ కూడా కోల్పోని హర్షీల్‌కు తుది పోరులో గట్టిపోటీనే లభించింది. తొలి గేమ్ చేజార్చుకున్నప్పటికీ నిరాశ చెందని హర్షీల్ రెండో గేమ్ నుంచి పుంజుకున్నాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. -
గురుసాయి, జయరామ్ ముందంజ
అల్మెరె: డచ్ ఓపెన్ గ్రాండ్ ప్రీలో భారత షట్లర్లు అజయ్ జయరామ్, గురుసాయి దత్ ప్రీక్వార్టర్స్‌లో ప్రవేశించారు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో జయరామ్ 21-14, 21-10 స్కోరుతో ఫాబియన్ రోత్ (జర్మనీ)పై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో గురుసాయి 21-14, 21-19తో చున్ వీ చెన్ (చైనీస్ తైపీ)ని ఓడించాడు. ఇక మహిళల సింగిల్స్‌లో పీసీ తులసి 20-22, 21-15, 21-16తో మహులెట్టె (నెదర్లాండ్స్)పై గెలుపొందింది.