Dutt
-
కేసీపీ గ్రూపు అధినేత వీఎల్ దత్ కన్నుమూత
కొరుక్కుపేట (చెన్నై, సాక్షి): తెలుగు వ్యక్తి, ప్రముఖ పారిశ్రామికవేత్త, కేసీపీ గ్రూపు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ వీఎల్ దత్ (82) గుండె పోటు కారణంగా మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. ఆయనకు సతీమణి డాక్టర్ వీఎల్ ఇందిరాదత్, కుమార్తె కవితా దత్ ఉన్నారు. 1937 డిసెంబర్ 27న జన్మించిన వెలగపూడి లక్ష్మణదత్ (వీఎల్దత్) లండన్లోని బిజినెస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఉన్నత విద్యనభ్యసించారు. కేసీపీ గ్రూపు సిమెంట్, చక్కెర తదితర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ‘‘డాక్టర్ వీఎల్ దత్ అకాల మరణానికి సంతాపం తెలియజేస్తున్నాము. పరిశ్రమలకు, దేశానికి ఆయన అందించిన సేవలను ఫిక్కీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది’’ అని ఫిక్కీ ప్రెసిడెంట్ సంగీతా రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వీఎల్ దత్ 1991–92 వరకు ఫిక్కీ ప్రెసిడెంట్గా పనిచేశారు. సీఎం జగన్ సంతాపం వీఎల్ దత్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పారిశ్రామిక రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా దత్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. -
'గీతా' గానం చిరస్మరణీయం!
ఓ ప్రత్యేకమైన హస్కీ వాయిస్ తో పాటలు పాడి లక్షలాది అభిమానులను సంపాదించుకున్న గాయని గీతాదత్. ఆమె మరణించడం ఎంతో విషాదకరం. ఆమె మృతిచెంది 44 సంవత్సరాలయినా ఆమె జ్ఞాపకాలు మాత్రం చిరస్మరణీయం అంటూ గాన కోకిల లతామంగేష్కర్ గుర్తు చేసుకున్నారు. జూలై 19న గీతా మరణించిన రోజు కావడంతో ఆమెను ఎంతో మిస్ అయ్యాం అంటూ లతా తన జ్ఞాపకాలను ట్వీట్ లో పంచుకున్నారు. గీతా దత్ ఎంతో మంచి గాయకురాలని, అభిమానుల మనసులో నిలిచిపోయిన 'హమ్ పంఛీ మస్తానే', 'అంకియాన్ భూల్ గయీహై సోనా', 'క్యా బతావూం మొహబ్బత్ హై క్యా' వంటి ఎన్నో యుగళ గీతాలను ఆమెతో కలసి పాడానని గీతా పుణ్యతిథిరోజున లతా మంగేష్కర్ గుర్తుకు తెచ్చుకున్నారు. గీతా లేకుండా 44 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా ఆమెను ఎంతో మిస్ అవుతున్న ఫీలింగ్ అంటూ లతా ట్వీట్ చేశారు. 1947 నుంచి దత్ తనకు ఎంతో మంచి స్నేహితురాలని లతా మంగేష్కర్ ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం 86 ఏళ్ళున్న మెలోడీ క్వీన్ లతా మంగేష్కర్.. 1959 లో విడుదలైన చిత్రం 'కాగజ్ కే ఫూల్' లో దత్ పాడిన పాట.. 'వక్త్ నే కియా క్యా హసీన్ సితాం' లింకు ను తన ట్వీట్ లో పోస్ట్ చేశారు. గీతా దత్ జీవించినది 41 సంవత్సరాలు మాత్రమే. ఆ సమయంలో ఎక్కువ సంఖ్యలో పాటలు పాడకపోయినా, పాడినవి మాత్రం అభిమానులు ఎన్నటికీ మరువలేనివే. ఒక్కసారి ఆమె గొంతు విన్నవారెవరూ మర్చిపోలేరు. 1930 నవంబర్ లో పుట్టిన గీతా దత్.. 1972 జూలైలో లివర్ సిరోసిస్ తో మరణించారు.