DVDs
-
డీవీడి రైటర్లో రూ. 40 లక్షలు ఖరీదు చేసే బంగారం
చెన్నై: అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు వేర్వేరు ఘటనల్లో దాదాపు 40 లక్షలు ఖరీదు చేసే బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారలు తెలిపారు. ఈ మేరకు అక్టోబర్ 29న దుబాయ్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడు బ్యాగ్‌లో ఉంచిన పోర్టబుల్ డిజిటల్ వీడియో డిస్క్(డీవీడీ) రైటర్లో దాచిన బంగారు కడ్డీలను అధికారులు గుర్తించారు. ఆ బ్యాగ్‌ను మరింతగా చెక్ చేయగా సుమారు 15 మొబైల్ ఫోన్లు, దాదాపు 9 వేల విదేశీ సిగరెట్లు లభించినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. మరోక ఘటనలో దుబాయ్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడు ఏకంగా పేస్ట్ రూపంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఇద్దరు ప్రయాణకుల నుంచి దాదాపు రూ. 40 లక్షలు విలువ చేసే 900 గ్రాముల బంగారం, మొబైల్ ఫోన్లు, సుమారు రూ. 3.15 లక్షలు విలువ చేసే విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. (చదవండి: యమునా నదిపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు... ప్రూవ్ చేసిన అధికారి) -
పృథ్వీరాజ్‌కు సవాల్‌గా ఎస్వీబీసీలో డీవీడీల గోల..
శ్రీవేంకటేశ్వర భక్తి చానల్లో డీవీడీల వివాదం ముదురుతోంది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలను డీవీడీలుగా మలచి విక్రయించే క్రమంలో రూ.20 లక్షల నిధులు దుబారా కావడానికి కారణమైన అధికారులపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణమైంది. విలువైన డీవీడీలను రెండేళ్లుగా కార్యాలయ ఆవరణలో పడేశారు. ఇందులో అనేక డీవీడీలు పనికిరాకుండా పోగా, కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ అక్రమాలను నిగ్గుతేల్చడం ఎస్వీబీసీ నూతన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన పృథ్వీరాజ్‌కు సవాల్‌గా మారింది. సాక్షి, తిరుపతి సెంట్రల్: శ్రీ వేంకటేశ్వర భక్తితత్వం పై ప్రపంచవ్యాప్తంగా ప్రచారం నిర్వహించడమే లక్ష్యంగా సుమారు 12 ఏళ్ల కిందట ఏర్పాటైన శ్రీవేంకటేశ్వర భక్తి చానెల్(ఎస్వీబీసీ) వివాదాలకు వేదికగా మారడం విస్మ యం కలిగిస్తోంది. టీటీడీ కనుసన్నల్లో నడవాల్సిన ఎస్వీబీసీపై సరైన నియంత్రణ లేకపోవడమే అన్ని వివాదాలకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొంతకాలంగా ఎస్వీబీసీకి నేతృత్వం వహిస్తున్న అధికారుల తీరుతో సంస్థ ప్రతిష్ట దెబ్బతింటోంది. చాగంటి డీవీడీల విక్రయానికి శ్రీకారం చాగంటి కోటేశ్వరరావుకు ప్రజల్లో అనూహ్య స్పందన లభిస్తున్న కారణంగా ఎప్పటికప్పుడు ఎస్వీబీసీ ద్వారా రికార్డింగ్ చేశారు. కొంత కాలానికి వీటిని డీవీడీలుగా మార్చి విక్రయించే పనికి శ్రీకారం చుట్టారు. అప్పటికే చాంగటి తన సొంత ట్రస్ట్ ద్వారా తన ప్రవచనాలను లాభాపేక్ష లేకుండా డీవీడీలు చేసి, తన ప్రవచనాలను ప్రజలకు అందించేవారు. కానీ, శ్రీవారి మీద ఉన్న భక్తి భావన కారణంగా తన ట్రస్ట్ ద్వారా కాకుండా ఎస్వీబీసీ ద్వారా ప్రవచనాలను అందించేందుకు అంగీకరించడం గమనార్హం. ఈ క్రమంలో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలను ఎస్వీబీసీ అధికారులు డీవీడీలుగా మార్చి, విక్రయానికి సిద్ధం చేశారు. శివానందల హరి, వేంకటేశ్వర మహత్యం, శ్రీవారి బ్రహ్మోత్సవాలు వంటి విభిన్న అంశాలతో కూడిన వాటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. రికార్డింగ్, మార్కెటింగ్ వంటి పనులకు ఎస్వీబీసీ అధికారులు రూ.20 లక్షల వరకు వెచ్చించారు. అధికారి మారడమే కారణం తిరుమల నాదనీరాజనంతో సహా ఎక్కడ నుంచి ప్రత్యక్ష ప్రసారాలను చేసినా..ఆ ప్రాంతానికి డీవీడీలు తరలిస్తూ విక్రయించడానికి వీలుగా ముగ్గురు సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకున్నారు. పరిమిత కాలంలో కొద్ది పాటి డీవీడీలను కూడా ఎస్వీబీసీ విక్రయించింది. ఆ డీవీడీలను రూపకలప్పన చేసిన అధికారి ఉన్నంత కాలం విక్రయాలు కొనసాగాయి. అయితే ఆయన స్థానంలో మరొక అధికారి ఎస్వీబీసీలో కీలక బాధ్యతలను చేపట్టారు. ఆయనకు చాగంటి అంటే గిట్టని కారణంగా డీవీడీలను పక్కన పడేశారు. డీవీడీలకు మార్కెట్లో డిమాండ్ తగ్గిపోయిందన్న సాకు చూపి, మిగిలిన అన్నింటిని ఎస్వీబీసీ కార్యాలయంలో ఓ మూలన పడేసినట్టు సమాచారం. డీవీడీల కంటెంట్ సరిగ్గా లేదంటూ తొలుత పరిశీలన కోసం ప్రత్యేక అధికారిని నియమించారు. ప్రణాళికా ప్రకారం డీవీడీల్లో కంటెంట్ లేదని ఆ ప్రత్యేక అధికారితో బలవంతంగా నివేదికను తయారు చేయించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. డీవీడీలను విక్రయించడం కోసం నియమించిన సిబ్బందిని కూడా ఆయన హయాంలోనే తొలగించారు. మాతృదేవోభవ డీవీడీపై మరో వివాదం శ్రీవారి ఉత్సవాల్లో కాకుండా ప్రత్యేకంగా రూపొందించిన డీవీడీల రికార్డింగ్ విషయంలోనూ వివాదాలు తలెత్తాయి. ఎస్వీబీసీ చానెల్ లేదా అనుమతి పొందిన స్టూడియోలో రికార్డింగ్ చేయాల్సి ఉంటే...ఓ ప్రవచన కర్త సొంతింట్లో నిర్వహించిన కార్యక్రమాన్ని సైతం మాతృదేవో భవ పేరిట డీవీడీగా రూపొందించడంపై అప్పట్లో తీవ్ర దుమారమే చెలరేగింది. సదరు కార్యక్రమానికి సినీ ప్రముఖుల కుటుంబ సభ్యులు హాజరు కావడాన్ని డీవీడీల్లో వీక్షించిన భక్తులు విస్తుపోవాల్సి వచ్చింది. -
రాధిక ఆప్తేకి షాక్ !
నటి రాధిక ఆప్తే షాక్‌కు గురయ్యారు. అంతగా తను ఎదుర్కొన్న సంఘటన ఏమిటనేగా మీ ఉత్సుకత. కోలీవుడ్‌కు ధోని చిత్రం ద్వారా పరిచయమైన రాధిక ఆప్తే ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా రజనీకాంత్ చిత్రం కబాలితో చాలా పాపులర్ అయ్యారు. అయితే అంతకు ముందే హిందీ, బెంగాలీ, మరాఠి తదితర భాషల్లో నటించారు. ఇక ధోని చిత్రంతో తెలుగు ప్రేక్షకులకూ పరిచయమయ్యారు. అలా దశాబ్ధంపైగానే నటిగా కొనసాగుతున్న ఈ ఉత్తరాది భామ ఇటీవల హాలీవుడ్‌లోని రంగప్రవేశం చేశారు. అయితే గ్లామర్ విషయంలో రెచ్చిపోతున్న ఈ భామకు చెందిన శృంగారభరిత సన్నివేశాల దృశ్యాలు ఇంటర్నెట్, యూట్యూబ్‌లలో హల్చల్ చేసి కలకలం పుట్టించాయి. అలాంటి వాటిని అస్సలు పట్టించుకోని రాధికఆప్తే ఇప్పుడు తొలిసారిగా షాక్‌కు గురైయ్యారట.అందుకు కారణం ఆమె నటించిన ఆంగ్ల చిత్రం పర్చెడ్నే. బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్‌దేవగన్ నిర్మించిన ఈ చిత్రంలో రాధిక ఆప్తే నటుడు అదిల్ హుస్సేన్‌తో కలిసి అర్ధనగ్న దుస్తుల్లో, ముఖ్యంగా టాప్‌లెస్ దుస్తుల్లో నటించి దుమ్మురేపారు. ఆ సన్నివేశాలు ఇప్పటకే ఇంటర్నెట్, వాట్స్‌యాప్, యుట్యూబ్లలో హల్చల్ చేస్తున్నాయి.ఈ విషయం రాధిక ఆప్తేకు తెలిసినా చలించలేదు.అయితే 20 నిమిషాల నిడివి గల ఈ శృంగార భరిత సన్నివేశాలిప్పుడు నటి రాధిక ఆప్తే శృంగార సన్నివేశాలు అంటూ డీవీడీల రూపంలో మార్కెట్లో 90 రూపాయల ధరకు విక్రయణ జరుగుతున్నాయట.ఈ సంఘటన రాధిక ఆప్తేను కలవరపరుస్తోందట. నిజానికి పర్చెడ్ చిత్రాన్ని భారతదేశంలో విడుదల చేసే ముందు అందులోని శృంగార భరిత సన్నివేశాలను తొలగిస్తామని దర్శక నిర్మాతలు ఆమెకు చెప్పారట.ఇప్పుడా సన్నివేశాలు అనధికారికంగా బయటకు రావడంతో రాధిక ఆప్తే షాక్‌కు గురైయ్యారు. దీంతో ఆమె తన పేరుతో నకిలీ శృంగార సన్నివేశాలతో కూడిన సీడీలను విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అంతే కాదు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసే విషయం గురించి సన్నిహితులతో ఆలోచనలు జరుపుతున్నారని సమాచారం.మరో విషయం ఏమిటంటే రాధిక ఆప్తే నటించిన పర్చెడ్ చిత్రం 24 అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శంపబడి 18 అవార్డులను అందుకుందని తెలిసింది. -
మహేష్ బాబు డీవీడీలు పంపిస్తారు:కరీనా
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మితభాషి. కానీ స్నేహితులతో సత్సంబంధాలు కొనసాగించే విషయంలో మాత్రం ఆయనకు ఆయనే సాటి. తాజాగా మహేష్ బాబు గురించి బాలీవుడ్ అందాల తార కరీనా కపూర్ కొన్ని ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఇదివరకే మహేష్ బాబుకు బాలీవుడ్ ఆఫర్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మహేష్ వాటిని సున్నితంగా తిరస్కరించారు. మహేష్‌కు బాలీవుడ్లో పలువురు స్నేహితులు ఉన్నారట. వారిలో సైఫ్ అలీ ఖాన్... మహేష్, నమ్రతలిద్దరికీ ఆప్త మిత్రుడట. 'నేను, సైఫ్ టాలీవుడ్ లేటెస్ట్ సినిమాల గురించి మహేష్, నమ్రతలను అడుగుతుంటాం.. మహేష్ స్వయంగా కొన్ని చిత్రాలను ఎంపిక చేసి మాకోసం డీవీడీలను పంపిస్తుంటారు' అంటూ కరీనా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మీరు తెలుగు సినిమాల్లో నటించేందుకు ఎందుకు ఆసక్తి చూపడం లేదు అని విలేకరులు అడిగిన ప్రశ్నకి స్పందిస్తూ.. నాకు తెలుగులో నటించాలనే ఉంది, కానీ భాషతో ఉన్న ఇబ్బంది వల్ల ఆగాల్సి వస్తుందంటూ చెప్పింది 'కీ అండ్ కా' స్టార్ కరీనా.