మహేష్ బాబు డీవీడీలు పంపిస్తారు:కరీనా
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మితభాషి. కానీ స్నేహితులతో సత్సంబంధాలు కొనసాగించే విషయంలో మాత్రం ఆయనకు ఆయనే సాటి. తాజాగా మహేష్ బాబు గురించి బాలీవుడ్ అందాల తార కరీనా కపూర్ కొన్ని ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఇదివరకే మహేష్ బాబుకు బాలీవుడ్ ఆఫర్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మహేష్ వాటిని సున్నితంగా తిరస్కరించారు.
మహేష్కు బాలీవుడ్లో పలువురు స్నేహితులు ఉన్నారట. వారిలో సైఫ్ అలీ ఖాన్... మహేష్, నమ్రతలిద్దరికీ ఆప్త మిత్రుడట. 'నేను, సైఫ్ టాలీవుడ్ లేటెస్ట్ సినిమాల గురించి మహేష్, నమ్రతలను అడుగుతుంటాం.. మహేష్ స్వయంగా కొన్ని చిత్రాలను ఎంపిక చేసి మాకోసం డీవీడీలను పంపిస్తుంటారు' అంటూ కరీనా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మీరు తెలుగు సినిమాల్లో నటించేందుకు ఎందుకు ఆసక్తి చూపడం లేదు అని విలేకరులు అడిగిన ప్రశ్నకి స్పందిస్తూ.. నాకు తెలుగులో నటించాలనే ఉంది, కానీ భాషతో ఉన్న ఇబ్బంది వల్ల ఆగాల్సి వస్తుందంటూ చెప్పింది 'కీ అండ్ కా' స్టార్ కరీనా.