DWARAKA TIRUMALA TEMPLE
-
వైకుంఠ ఏకాదశి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
తిరుపతి/హైదరాబాద్, సాక్షి: వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి నేడు. వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు.తిరుమలలో నేటి నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వారా దర్శనం ఉంటుంది. ఏపీలో వైష్ణవ ఆలయాలకు వేకువ ఝామునే భక్తులు క్యూ కట్టారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. గోవిందా నామస్మరణలతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక.. వీఐపీల తాకిడి వైకుంఠ ద్వార దర్శన నేపథ్యంలో.. తిరుమలకు వీఐపీల తాకిడి నెలకొంది. మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర బాబు, జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ ఎస్.ఎల్. భట్టి, జస్టిస్ శ్యామ్ సుందర్, జస్టిస్ తారాల రాజశేఖర్, కర్ణాటక గవర్నర్ ధావర్ చంద్ గెహ్లాట్‌లు విచ్చేశారు. అలాగే.. ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణ స్వామి, ఉష శ్రీచరణ్, మేరుగు నాగార్జున, చెల్లబోయిన, అంబటి రాంబాబు, కారుమూరి, గుడివాడ అమర్నాథ్, రోజా, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, రఘురామ కృష్ణంరాజు, సీఎం రమేశ్, డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు తదితరులు ఉన్నారు. ఇవాళ ముక్కోటి దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమహా విష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యపరంపరలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. తెలంగాణలో.. మరోవైపు తెలంగాణలోని వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 2.30 గంటలకు స్వామివారి మూల విరాట్లకు మహా క్షీరాభిషేకం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి రామాలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిస్తున్నారు. -
ద్వారకాతిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్న పేర్నినాని దంపతులు
-
గర్భాలయం నుంచి మహాద్వారం వరకు వివిధ రకాల పుష్పాలతో అలంకరణ
-
శ్రీవారి సేవలో రీతు చౌదరి, విష్ణుప్రియ
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ, జబర్దస్త్ ఆర్టిస్ట్ రీతు చౌదరిలు గురువారం సందర్శించారు. స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం కొండపైన గజ, గోసంరక్షణ శాలలను వారు సందర్శించారు. గజలక్ష్మి (ఏనుగు)తో ఫొటోలు దిగి సందడి చేశారు. -
శ్రీవారి ఆలయంలో విష సర్పం...
పశ్చిమ గోదావరి: ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో పొడ పాము పిల్ల భక్తులను, దేవస్థాన సిబ్బందిని హడలెత్తించింది. సోమవారం ఈ పాము పిల్ల ఆలయ పడమర రాజగోపుర ద్వారం తలుపులో చుట్టుకుని, పడుకుని ఉండడాన్ని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. అదే సమయంలో అటుగా వచ్చిన భక్తులు దాన్ని చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది దానిని బయటికి తీసి చంపేశారు. గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ పాము పిల్ల ఇక్కడికి వచ్చి ఉంటుందని ఆలయ సిబ్బంది చెబుతున్నారు. -
శ్రీవారి సేవలో సినీ దర్శకుడు మారుతి
Director Maruthi Visits Tirumala With His Family: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని సినీ దర్శకుడు దాసరి మారుతి మంగళవారం సందర్శించారు. 108 ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకున్నారు. సతీసమేతంగా స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూ జలు చేయించారు. పండితులు ఆయనకు శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని పలి కారు. శ్రీవారి జ్ఞాపిక, ప్రసాదాలను అందజేశారు. చదవండి: (రామారావు ఆన్ డ్యూటీ రిలీజ్ డేట్ వచ్చేసింది, ఎప్పుడంటే?) -
ద్వారకాతిరుమల ఆలయ ఈవోపై విచారణ
ద్వారకాతిరుమల: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి జీవీ సుబ్బారెడ్డిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి బి.సూర్యనారాయణ, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, కమిషనర్లకు గతనెల 29న ఉత్తర్వులు జారీ చేశారు. ఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సుబ్బారెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని భీమడోలుకు చెందిన శ్రీవేంకటేశ్వరస్వామి సేవాసమితి అధ్యక్షుడు పరిమి వేంకటేశ్వరరెడ్డి గతేడాది నవంబర్ 16న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. గత ఆగస్టు 8న శ్రీవారి కొండపై వైష్ణవ సంప్రదాయాలకు విరుద్ధంగా జంతుబలి ఇచ్చారని, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆ వివాదంపై విచారణాధికారిగా నియమితులైన ఏఈవో బీవీఎస్ రామాచార్యులపై ఒత్తిడి తెచ్చి, ఆయన గుండెపోటుతో మృతిచెందడానికి ఈవో సుబ్బారెడ్డి కారకుడయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆలయ పరిసరాల్లోనే నివాసం ఉంటున్న ఈవో.. భక్తులు కాళ్లు కడుక్కునే బహిరంగ ప్రదేశంలో టవల్ కట్టుకుని స్నానం చేయడం వల్ల మహిళా భక్తులు ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు. గత అక్టోబర్ 20న స్వామి కల్యాణంలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులను అవమానించారని పేర్కొన్నారు. ఆలయ ఆస్తిని కాజేస్తున్నా పట్టించుకోవడంలేదని తెలిపారు. ప్రసాదాల తయారీ, సెంట్రల్ స్టోర్, లీజియస్ విభాగాల నుంచి ఈవో ప్రతినెలా రూ.10 లక్షలు వసూలు చేస్తున్నారని, తలనీలాల కాంట్రాక్టరుకు లాభం చేకూరుస్తూ ఆలయానికి నష్టం కలుగజేస్తున్నారని ఆరోపించారు. -
సంక్షేమ ప్రభుత్వానికే ప్రజలు ఓటు వేశారు
-
‘రాట్నాలమ్మవారి’తో సింధుకు ఎంతో అనుబంధం
పెదవేగి (పశ్చిమ గోదావరి): రాట్నాలకుంటలోని రాట్నాలమ్మవారి ఆశీస్సులతోనే ఒలింపిక్ కాంస్య పతకం సాధించానని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలంలోని రాట్నాలకుంటలో వెలసిన రాట్నాలమ్మవారిని శుక్రవారం సింధు కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఒలింపిక్స్‌కు వెళ్లేముందు అమ్మ ఆశీస్సులు తీసుకున్నానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష మేరకు పతకంతో తిరిగి రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సింధుకు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ చళ్లగొళ్ల వెంకటేశ్వరరావు ఆహ్వానం పలికారు. ఆలయంలో తరతరాల అనుబంధం సింధు కుటుంబానికి కులదైవంగా రాట్నాలమ్మ వారు పూజలందుకుంటున్నారు. సింధు తండ్రి పూసర్ల వెంకటరమణ, ఆయన సోదరులు రామస్వామి, తాండవ కృష్ణమూర్తి కుటుంబసభ్యులతో కలిసి ఏలూరు పడమరవీధిలో ఉండేవారు. ఆ సమయంలో ఎండ్ల బండ్లపై బలివే రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని అమ్మవారి సన్నిధికి వచ్చేవారు. ఈ క్రమంలో సింధుకు కూడా చిన్ననాటి నుంచి అమ్మవారిపై నమ్మకం కలిగింది. ద్వారక తిరుమలలో.. ద్వారకాతిరుమల: రాబోయే రోజుల్లో మరెన్నో మెడల్స్ సాధించి దేశానికి మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తానని పీవీ సింధు అన్నారు. ద్వారకా తిరుమల చినవెంకన్న క్షేత్రాన్ని కుటుంబసమేతంగా ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు స్వామివారి జ్ఞాపిక, ప్రసాదాలను అందజేశారు. -
శ్రీవారి గుడిలో మూడు గుర్రాలకు అనారోగ్యం
సాక్షి, ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల దివ్య క్షేత్రంలో శ్రీవారి సేవల్లో పాలుపంచుకునే మూడు అశ్వాలు ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. మేత తిన్న కొద్ది సమయానికే అవి కుప్పకూలిపోయాయి. దీన్ని గమనించిన ఆలయ అధికారులు పశువైద్యాధికారుల సాయంతో చికిత్సనందించారు. అయితే అందులో ’అశ్వ’ అనే గుర్రం చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున మృతిచెందింది. మరో అశ్వం ఇంకా చికిత్స పొందుతోంది. మూడో అశ్వం పూర్తిగా కోలుకుంది. స్వామికి సేవలందించే అశ్వాలకు ఇలా జరగడంపై పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ మహిళా మోర్చ జాతీయ కార్యదర్శి శరణాల మాలతీరాణి చినవెంకన్న సేవకోసం 20 నెలల క్రితం అశ్వ, శ్వేత అనే రెండు (తెల్లరంగు)మగ అశ్వాలను ఆలయానికి బహూకరించారు. అలాగే ద్వారకాతిరుమలకు చెందిన దేవస్థానం ఉద్యోగి శోభనగిరి 18 నెలల క్రితం యోగిని అనే ఆడ అశ్వాన్ని ఆలయానికి బహుమతిగా అందించారు. అప్పటి నుంచి ఆలయ అధికారులు వాటిని శ్రీవారి తిరువీధి సేవలకు, అలాగే ధనుర్మాస, కనుమ, బ్రహ్మోత్సవాలకు వినియోగిస్తున్నారు. శేషాచలకొండపైన గోసంరక్షణశాలలోనే ఈ అశ్వాలను అధికారులు సంరక్షిస్తున్నారు. అరగకపోవడం వల్లే.. ఒకేసారి ఈ మూడు అశ్వాలు అస్వస్థతకు గురి కావడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అవి తిన్న ఆహారంలో ఏమైనా విషపు గుళికలు కలిశాయా.. అన్న సందేహాలు కలిగాయి. అయితే మృతిచెందిన అశ్వానికి పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ జి.నాగేంద్ర మాట్లాడుతూ తిన్న మేత అరగకపోవడం వల్లే అశ్వాలు అస్వస్థతకు గురయ్యాయని, ఊపిరందక ఒక అశ్వం మృత్యువాత పడిందని తెలిపారు. అయితే అవి తిన్న మేతలో సాలీళ్లు ఉండటం వల్లే ఇలా జరిగుండొచ్చని చెప్పారు. వైభవాన్ని చాటే అశ్వాలు.. ఆలయానికి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఈ అశ్వాలు శ్రీవారి ఉత్సవాల వైభవాన్ని చాటాయి. స్వామి వాహనానికి ముందు గజ లక్ష్మి (ఏనుగు)తో కలసి ఈ అశ్వాలు నడుస్తూ కనువిందు చేసేవి. ఒక అశ్వం మృతిచెందడం, మరో అశ్వం ఇంకా చికిత్స పొందుతుండటం పట్ల భక్తులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీ: మూడు ఆలయాలకు పాలకమండళ్లు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రముఖ ఆలయాలకు రాష్ట్ర ప్రభుత్వం పాలక మండళ్లను నియమించింది. విజయవాడ, సింహాచలం, ద్వారకా తిరుమల ఆలయాలకు పాలక మండళ్లను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు వెలువరించింది. ప్రిన్సిపల్ కార్యదర్శి ఉషారాణి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పాలకమండళ్లలో పదహారుగురు చొప్పున సభ్యులను నియమించారు. మూడు ఆలయాల్లోని ప్రధాన అర్చకులు ఎక్స్అఫిషియో సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సింహాచలం, ద్వారకా తిరుమలలో వ్యవస్థాపక కుటుంబ సభ్యులు చైర్మన్‌గా వ్యవహరిస్తారని వెల్లడించింది. దుర్గ గుడి పాలక మండలి చైర్మన్‌గా పైలా సోమినాయుడును ఎన్నుకునే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ మేరకు ఆలయాల పాలకమండళ్లలో మహిళలకు పెద్దపీట వేశారు. (చదవండి: 29 నుంచి ‘అరకు ఉత్సవ్’) విజయవాడ: దుర్గ గుడి పాలక మండలి సభ్యులు 1. పైలా సోమినాయుడు 2. కటకం శ్రీదేవి 3. డీఆర్కే ప్రసాద్ 4. బుసిరెడ్డి సుబ్బాయమ్మ 5. పులి చంద్రకళ 6. ఓవీ రమణ 7. గంటా ప్రసాదరావు 8. రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి 9. చక్కా వెంకట నాగ వరలక్ష్మి 10. కార్తీక రాజ్యలక్ష్మి 11. నేటికొప్పుల సుజాత 12. నేలపట్ల అంబిక 13. కానుగుల వెంకట రమణ 14. నెర్సు సతీశ్ 15. బండారు జ్యోతి 16. లింగంబొట్ల దుర్గాప్రసాద్ (పధాన అర్చకుడు) ద్వారకా తిరుమల: వెంకటేశ్వరస్వామి దేవస్థానం పాలక మండలి సభ్యులు 1. వ్యవస్థాపక కుటుంబ సభ్యులు (చైర్మన్) 2. మాతూరు శ్రీవల్లీ 3. గ్రంథి శేషగిరిరావు 4. కర్పూరం గవరయ్య గుప్తా 5. గూడూరి ఉమాబాల 6. కనకతాల నాగ సత్యనారాయణ 7. కొండేటి పద్మజ 8. కొత్తా విజయలక్ష్మి 9. చిలువులూరి సత్యనారాయణరాజు 10. కుంజా శాంతి 11. నందిని బందంరావూరి 12. మనుకొండ నాగలక్ష్మి 13. జి. సత్యనారాయణ 14. మేడిబోయిన గంగరాజు 15. వీరమళ్ల వెంకటేశ్వరరావు 16. పీవీఎస్‌ఎస్‌ఆర్ జగన్నాథ ఆచార్యులు (ప్రధాన పూజారి) సింహాచలం: లక్ష్మీనరసింహ దేవస్థానం పాలక మండలి సభ్యులు 1. వ్యవస్థాపక కుటుంబ సభ్యులు (చైర్మన్) 2. దాడి దేవి 3. వారణాసి దినేశ్‌రాజ్ 4. నల్లమిల్లి కృష్ణారెడ్డి 5. జి. మాధవి 6. గడ్డం ఉమ 7. రాగాల నరసింహారావు నాయుడు 8. దాడి రత్నాకర్ 9. సూరిశెట్టి సూరిబాబు 10. రంగాలి పోతన్న 11. సంచిత గజపతిరాజు 12. దొనకొండ పద్మావతి 13. నెమ్మాడి చంద్రకళ 14. సిరిపురపు ఆశాకుమారి 15. విజయ్ కే. సోంధి 16. గొడవర్తి గోపాల కృష్ణామాచార్యులు (ప్రధాన అర్చకుడు) -
వెంకన్న ఆలయంలో తప్పిన ప్రమాదం
-
ద్వారకా తిరుమలలో తప్పిన పెను ప్రమాదం
సాక్షి, పశ్చిమ గోదావరి : ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. అన్నదాన భవనం పక్కన బాయిలర్ పేలడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాద సమయంలో పక్కన ఎవరూ లేకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. -
శ్రీవారి హుండీల లెక్కింపులో కొత్త ఆదేశాలు
ద్వారకా తిరుమల : శ్రీవారి దేవస్థానంలో బుధవారం నిర్వహించాలి్సన హుండీల లెక్కింపు కొత్త ఆదేశాల కారణంగా అర్ధంతరంగా నిలిచిపోయింది. దేవస్థానంలో పనిచేసే రెగ్యులర్ అటెండర్లు, డ్రైవర్లు, ఎన్‌ఎంఆర్‌లు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని హుండీల లెక్కింపునకు అనుమతించడం లేదని ఆలయ అధికారులు సర్క్యులర్ జారీచేశారు. ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు ఈ సర్క్యులర్‌ను నోటీసు బోర్డులో ఉంచారు. దీంతో దిగువస్థాయి సిబ్బంది కొరత కారణంగా హుండీల లెక్కింపు నిలిచిపోయింది. చినవెంకన్న ఆలయంలో ప్రతి 15–20 రోజులకోసారి జరిగే హుండీల లెక్కింపులో రెగ్యులర్ సిబ్బంది 65 మందితో పాటు, ఎన్ఎంఆర్, ఔట్‌సోరి్సంగ్ ఉద్యోగులు దాదాపు 100 మంది పాల్గొంటారు. దిగువస్థాయి సిబ్బంది అధికారుల పర్యవేక్షణలో పలు ప్రాంతాల్లో ఉన్న హుండీల్లోని సొమ్మును బయటకు తీసి, లెక్కింపు ప్రాంతానికి తరలిస్తారు. అక్కడ మిగిలిన సిబ్బంది, అధికారులు లెక్కిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరూ శ్రమిస్తేనే ఈ లెక్కింపు పూర్తవుతుంది. అయితే బుధవారం హుండీల లెక్కింపు జరిపేందుకు ఆలయ అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ఇంతలో ఎగువస్థాయి సిబ్బంది, అధికారులతో మాత్రమే లెక్కింపు జరపమన్న ఆదేశాలు జారీ అయ్యాయి. సొమ్ము బయటకు తీసేవారు లేక హుండీల లెక్కింపు జరిపేందుకు సుమారు 30 మంది అధికారులు, ఎగువస్థాయి సిబ్బంది ఉదయం లెక్కింపు ప్రాంతానికి చేరుకున్నారు. అయితే హుండీల్లోని సొమ్ము బయటకు తీసే వారు లేక, తీసినా సకాలంలో లెక్కింపు పూర్తవదన్న సందేహంతో అధికారులు లెక్కింపును నిలిపివేశారు. సీసీ కెమేరాల పర్యవేక్షణలో జరిగే హుండీల లెక్కింపునకు అనుమతించని దిగువస్థాయి సిబ్బందిని, ఏ పర్యవేక్షణా లేని, ఆదాయాలు వచ్చే ప్రాంతాల్లో విధులు ఎలా కేటాయిస్తున్నారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మరింత కట్టుదిట్టమైన భద్రతల నడుమ లెక్కింపు జరపాల్సింది పోయి, ఇలా దిగువస్థాయి సిబ్బందికి లెక్కింపులో మినహాయింపు ఇవ్వడం ఏమిటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.