dwarapureddy jagadish
-
టీడీపీ ఎమ్మెల్సీ కావరం.. బూతులు తిడుతూ!
సాక్షి, పార్వతీపురం : ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర మంత్రులు, అధికార టీడీపీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సమస్యలపై నిలదీస్తే మహిళా ఉద్యోగులనే కాదు, పార్టీకి చెందిన మహిళా నేతలను సైతం వదిలిపెట్టని ఘటనలు ఏపీలో నిత్యం కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో విజయనగరం జిల్లాలో తమ సమస్య తీర్చాలని కోరినందుకు ఓ టీడీపీ నేత బూతు పురాణం మొదలెట్టడంతో స్థానికులు కంగుతిన్నారు. జిల్లాలోని పార్వతీపురం మున్సిపాలిటీలో సమస్యలపై ప్రశ్నించగా ఉద్రిక్త వాతావారణం నెలకొంది. మమ్మల్నే నిలదీస్తారా అంటూ టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్ దాడికి దిగి దాష్టీకానికి పాల్పడ్డారు. వాస్తవానికి విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీలో రెండు రోజులుగా మంచినీటి కుళాయిల్లో బురదనీరు సరఫరా అవుతోంది. ఇన్ని ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటుంటే, తాగునీరు ఇవ్వకుండా గ్రామదర్శిని కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని స్థానికుల తరఫున వైఎస్సార్సీపీ నేతలు ఎమ్మెల్సీ జగదీశ్‌ను ప్రశ్నించారు. అధికార పార్టీ నేతనైన నన్నే ప్రశ్నిస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన టీడీపీ నేత జగదీష్ ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. అదేంటని ప్రశ్నించిన కారణంగా వైఎస్సార్సీపీ శ్రేణులపై సైతం బూతులు మాట్లాడుతూ దూసుకొచ్చిన టీడీపీ ఎమ్మెల్సీ దాడికి దిగడంతో ఆశ్చర్యపోవడం స్థానికుల వంతైంది. కాగా, ఈ తతంగం అంతా స్ధానిక ఎమ్మెల్యే చిరంజీవి సమక్షంలోనే చోటు చేసుకోవడం గమనార్హం. -
బీజేపీ గూటికి ద్వారపురెడ్డి
పార్వతీపురం: ప్రముఖ వైద్యుడు ద్వారపురెడ్డి రామ్మోహనరావు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు బయటకు పొక్కడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌కు సోదరుడైన రామ్మోహనరావు బీజీపీలో చేరుతారని ప్రచారం జరుగుతుండడం టీడీపీ నేతల్లో కలవరం మొదలైంది. టీడీపీలో ఉండగా తనకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడం, ఓసారి ఎమ్మెల్యే టికెట్ ఆశ చూపి చివరి నిమిషంలో ప్లేటు మార్చిన విషయాన్ని రామ్మోహనరావు చాలా రోజుల నుంచి జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి సీఎం చంద్రబాబును, జిల్లాకు చెందిన మంత్రిని బాహాటంగానే విమర్శిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 22న జిల్లా కేంద్రానికి రానున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలసి ఆయన సమక్షంలో చేరనున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే శనివారం స్థానిక బీజేపీ నేతలు డొంకాడ సాయిపార్ధసారధి, పట్లాసింగ్ రవికుమార్, పాలూరి భారతి తదితరులు రామ్మోహనరావును మర్యాదపూర్వకంగా కలసి ఆహ్వానించారు. దీనిపై రామ్మోహనరావును వివరణ కోరగా తాను ఎప్పటి నుంచో బీజేపీలోనే ఉన్నానని చెప్పారు. దీంతో ద్వారపురెడ్డి కుటుంబంలో వేరుకుంపటి తప్పదన్న చర్చ సాగుతోంది. -
అది ఏక...అభిప్రాయం!
టీడీపీ జిల్లా అధ్యక్షుని ఎంపికపై అసంతృప్తి అశోక్ తీరును తప్పు పడుతున్న పార్టీ శ్రేణులు అవినీతిని అందల మెక్కించారని ఆరోపణలు క్యాడర్‌కు తప్పుడు సంకేతాలిచ్చారని పెదవి విరుపు సాక్షి ప్రతినిధి, విజయనగరం : మునుపెన్నడూలేని విధంగా టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఎంపికపై విమర్శలు, అసంతృప్తి వ్యక్తమవుతున్నాయి. ద్వారపురెడ్డి జగదీశ్‌ను మరోసారి నియమించడాన్ని మెజా ర్టీ శ్రేణులు ఆక్షేపిస్తున్నాయి. పార్టీ పదవిని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతకు మళ్లీ పగ్గాలు అప్పగించి కేడర్‌కు తప్పుడు సంకేతాలిచ్చారని వాపోతున్నాయి. పార్టీ పెద్ద దిక్కుగా భావిస్తున్న అశోక్ గజపతిరాజు తీరును సైతం తప్పు పడుతున్నాయి. అవినీతిని ప్రోత్సహించరు. ఆయనేం చేస్తే అదే కరెక్టు. ఇదీ అశోక్‌గజపతిరాజుపై పార్టీ శ్రేణులకు ఇప్పటి వరకూ ఉన్న అభిప్రాయం. కానీ తొలిసారిగా ఆయన తీరును ఆక్షేపించే పరిస్థితి టీడీపీలో నెలకుంది. దానికంతటికీ జగదీశ్‌ను మరోసారి ఎంపిక చేయడమే కారణం. ఎన్నికలకు ముందు, తర్వాత టిక్కెట్లు, పదవులు ఇప్పిస్తానంటూ పెద్ద ఎత్తున సొమ్ము గుంజారని జగదీశ్‌పై ఆరోపణలు గుప్పుమన్నాయి. అటు పార్వతీపురం, కురుపాం, చీపురుపల్లి నియోజకవర్గ నేతలైతే అధిష్టానానికి నేరుగా ఫిర్యాదు చేశారు. అశోక్ గజపతిరాజు దృష్టికి కూడా తీసుకెళ్లారు. మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు కూడా ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి. అధ్యక్ష పదవి రేసులో ఉన్న తూముల భాస్కరరావు సైతం జగదీశ్ వ్యవహారాన్ని అధినేతల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన జోరుకు బ్రేకులు పడతాయని నేతలు భావించారు. జగదీశ్ ఆశిస్తున్న ఎమ్మెల్సీ పదవి ఆయనకు చివరికి అధ్యక్ష పదవి సైతం ఊడిపోతుందని పార్టీలో ప్రచారం ఊపందుకుంది. అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిని అశోక్ గజపతిరాజు ప్రోత్సహించరని పార్టీ శ్రేణులు భావించాయి. కానీ, తన చేతిలో ఏదోక పదవి ఉండకపోతే రాజకీయంగా ఇబ్బందులొస్తాయన్న భయంతో జగదీశ్ తనదైన శైలిలో రాజకీయాలు నడిపారు. కొందరు వ్యతిరేకుల్ని, ఫిర్యాదు చేసిన నేతల్ని తన దారికి తెచ్చుకున్నారు. ఎన్నిక తేదీ సమీపించే కొద్దీ పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకున్నారు. అయితే, అశోక్ గజపతిరాజు ఇవన్నీ చూడరని, ప్రవర్తనా తీరును పరిశీలిస్తారని, ఆరోపణల్ని, ఇంటలిజెన్స్ నివేదికల్ని పరిగణలోకి తీసుకుని తప్పకుండా మార్చుతారని జగదీశ్ వ్యతిరేక వర్గీయులు భావించారు. కానీ వారి అంచనాల్ని తలకిందలు చేసి, ఎవరి అభిప్రాయాన్ని తీసుకోకుండా అందరి ఆమోదం మేరకు జగదీశ్‌ను మరోసారి ఎంపిక చేసినట్టు అశోక్ గజపతిరాజు అంతర్గత సమావేశంలో ప్రకటించి, దాన్నే ఎన్నికల పరిశీలకులు రావెల కిషోర్‌బాబు చేత ప్రకటింపచేయడం జగదీష్ వ్యతిరేక వర్గం జీర్ణించుకోలేకపోతోంది. నేతల అభిప్రాయాల్ని తీసుకుంటే ఒక్కొక్కరూ చెప్పేవారని, జగదీశ్‌ను వ్యతిరేకంగా గళం విప్పేందుకే అశోక్ బంగ్లాకు సుమారు 200మంది నాయకులొచ్చారని పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఎవరికీ చెప్పుకునేందుకు అవకాశమివ్వకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు కూడా తప్పుపట్టినట్టు తెలిసింది. పార్టీ విధానానికి భిన్నంగా వ్యవహరించి, అశోక్ తొలిసారి దారి తప్పారని ఆక్షేపిస్తున్నట్టు సమాచారం. అవినీతిని ప్రోత్సహించే విధంగా అశోక్ గజపతిరాజు నిర్ణయం తీసుకున్నారని పలువురు నాయకులు తప్పు పడుతున్నారు. అంటే పార్టీలో ఏంచేసినా చెల్లుపోతుందని, అవినీతి అక్రమాలకు పాల్పడినా పట్టించుకోరని, అశోక్ సైతం తేలికగా తీసుకుంటారనే సంకేతాల్ని బయటకు పంపించినట్టు అవుతుందని పార్టీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. నిత్యం అవినీతి వ్యతిరేకంగా మాట్లాడే అశోక్....ఆరోపణలు వచ్చిన వ్యక్తివైపు మొగ్గుచూపడంపై పార్టీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
జగదీష్‌కే మరో చాన్స్
సాక్షి ప్రతినిధి, విజయనగరం: కష్టకాలంలో పార్టీ బాధ్యతలను అప్పగించి, అధికారంలోకి వచ్చినప్పుడు పక్కన పెట్టడం సరికాదనుకుందో ఏమో తెలుగుదేశం పార్టీ అధిష్టానం. ముచ్చటగా మూడో సారి కూడా జిల్లా పార్టీ పగ్గాలను ద్వారపురెడ్డి జగదీష్‌కు కట్టబె ట్టింది. పాత కమిటీలో కొనసాగిన ఐవీపీ రాజును మళ్లీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించింది. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కోసం తీవ్ర స్థాయిలో పోటీ పడిన తూముల భాస్కరరావు ప్రయత్నాలను అధిష్టానం పక్కన బెట్టింది. ఆయనను సమర్థించిన నేతలను ఉసూరు మనిపించింది. ‘ఏదో జరిగిపోతోంది...అందరి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుని జిల్లా అధ్యక్షుడ్ని పార్టీ ఎంపిక చేస్తోంది. నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయి. భిన్న వాదనలు వ్యక్తమవుతాయి. అధిష్టానానికి కాసింత తలనొప్పి తప్పదు’ అంటూ వచ్చిన ఊహాగానాలు తుస్సుమన్నాయి. ఏదీ జరక్కుండానే అశోక్ గజపతిరాజు అనుకున్నది అయిపోయింది. పరిశీలకులుగా మంత్రి రావెల కిషోర్‌బాబు, ఎమ్మెల్యే ఆంజనేయులు వచ్చినా అంతా అశోక్ అభీష్టం మేరకే జరిగింది. అడ్హాక్ కమిటీ కన్వీనరుగా జగదీష్ ఉన్నందున మరోసారి జగదీష్‌కే పార్టీ బాధ్యతల్ని అప్పగిద్దామని అశోక్ ప్రతిపాదించగా దానికి అందరూ సరే అన్నారు. ఏదైనా మార్పు చేయాలనుకుంటే అడ్ హాక్ కమిటీ నియామకం సందర్భంలోనే జరగాలని, అప్పుడులేనిది ఇప్పుడెందుకని జగదీష్‌ను వ్యతిరేకిస్తున్న నేతలకు స్పష్టత ఇచ్చి ఊ కొట్టించారు. ఆ నిర్ణయాన్నే ఎన్నికల పరిశీలకుడు మంత్రి రావెల కిషోర్‌బాబు వేదికపై ప్రకటించారు. దీంతో జగదీష్ అనుకూల వర్గీయుల్లో ఆనందం వెల్లివిరియగా, వ్యతిరేక వర్గీయుల్లో అసంతృప్తి నెలకొంది. ఫలించిన జగదీష్ ప్రయత్నాలు గత వారం రోజులుగా ద్వారపురెడ్డి జగదీష్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తనను వ్యతిరేకిస్తున్న నేతల్లో పలువురిని దారికి తెచ్చుకోవడంతో ఆయన విజయం సాధించారు. ఫిర్యాదులతో అధిష్టానం వరకు వెళ్లిన నేతలు సైతం జగదీష్‌కు మద్దతుగా నిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. చివరి క్షణంలో అన్ని వైపులా మద్దతు కూడగట్టి, అశోక్ ఆశీస్సులతో అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. కాగా, జగదీష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించేందుకు ఎన్నికల ప్రాంగణమైన అశోక్ బంగ్లాకు సుమారు 200మంది వచ్చారు. అభిప్రాయం చెప్పుకోవడానికి అవకాశమిస్తే వారంతా నిరసన గళం విప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, పార్టీ పెద్దలు ఈ విషయాన్ని పసిగట్టారో ఏమో? నాలుగు గోడల మధ్య నిర్ణయం తీసుకుని, బయటికొచ్చి ప్రకటించేశారు. అశోక్ గజపతిరాజే నిర్ణయం తీసుకున్నప్పుడు తామేం చేయగలమని వాపోతూ వచ్చిన వారు వచ్చినట్లే వెనక్కి వెళ్లిపోయారు. జగదీష్‌కు ఎమ్మెల్సీ చాన్స్ మిస్సేనా? వాస్తవానికి, ద్వారపురెడ్డి జగదీష్ ఎమ్మెల్సీ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఆమేరకు మద్దతును కూడగట్టారు. అధిష్టానాన్ని కూడా ప్రాధేయ పడ్డారు. అయితే, ఆయనపై వెల్లువెత్తిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడడంతో భవిష్యత్‌లో ఎమ్మెల్సీ పదవి వస్తుందో పోతుందో గానీ ఇప్పుడున్న అధ్యక్ష పదవి పోయేటట్టు ఉందనే ఆలోచనతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇప్పుడీ చాన్స్ మిస్సయితే రెంటికీ చెడ్డ రేవడి అవుతానేమోనన్న భయంతో అధ్యక్ష పదవి కోసం మళ్లీ తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు. అందుకు తగ్గట్టుగానే పార్టీ పగ్గాలు దక్కాయి. దీంతో ఎమ్మెల్సీ పదవి రేసులో జగదీష్ ఉండకపోవచ్చన్న వాదనలు విన్పిస్తున్నాయి. అదే జరిగితే ఎమ్మెల్సీ పదవికైనా తూముల భాస్కరరావును గాని, తెంటు లక్ష్ముంనాయుడ్ని గాని పరిశీలించొచ్చనే చర్చ జరుగుతోంది. -
టీడీపీ నాయకుల ధర్నా
పార్వతీపురం :టీవల నిర్వహించిన అంగన్వాడీ నియామకాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ తదితర నాయకులు ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా చేశారు. పార్వతీపురం, కురుపాం, సాలూరు తదితర నియోజకవర్గాలకు చెందిన అంగన్వాడీ మెయిన్, లింక్, క్రెషీ, హెల్పర్ పోస్టుల నియామకాలు చేపట్టారు. పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రజిత్ కుమార్ సైనీ, ఎమ్మెల్యే, ఆయా శాఖలకు చెందిన అధికారుల కమిటీ ఆధ్వర్యంలో ఈ నియామకాలు చేపట్టారు. ఆ నియామకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేతో పాటు ఆ పార్టీకి చెందిన నాయకులు ఆందోళనకు దిగారు. ఐసీడీఎస్ పీవో కేతిరెడ్డి విజయ గౌరి ధర్నా వద్దకు వచ్చి నియామకాలు పారదర్శకంగా జరిగాయని ఎమ్మెల్యే, టీడీపీ నాయకులకు వివరించేందుకు ప్రయత్నించారు. నియామకాలు రద్దు చేస్తున్నట్లు హామీ ఇస్తే గానీ ధర్నా విరమిస్తామని వారు భీష్మించుకు కూర్చున్నారు. ఈ విషయంలో తాను చేయగలిగిందేమీ లేదని ఆమె చెప్పగా, తెలుగు తమ్ముళ్లు ఒక్కసారిగా గౌరిపై కేకలు వేశారు. ఐటీడీఏ పీవోకు సమాచారం అందించగా, ఆయన ఫోన్లో ధర్నా చేపట్టిన వారితో మాట్లాడి డీడీ టి.సీతారామమూర్తిని పంపించారు. ఈ సం దర్భంగా వారు ఆయనకు వినతిపత్రాన్ని అందజేసి ధర్నాను విరమించారు. నియామకాలు పారదర్శకంగా జరిగాయి.. ఐసీడీఎస్ పీవో కేతిరెడ్డి విజయగౌరి విలేకర్లతో మాట్లాడుతూ అంగన్వాడీ నియామకాలు పారదర్శకంగా చేపట్టామన్నారు. కొన్ని నియామకాలకు ఏడో తరగతి క్వాలిఫికేషన్ కాగా దానికే ప్రాధాన్యతనిచ్చామన్నారు. పదో తరగతి ఆపై చదివినవారు తమకు వద్దకు రాలేదని, ఏడో తరగతి మార్కుల జాబితా దరఖాస్తులతో జతచేయనివారు తదితరులు కూడా రాలేదంటున్నారన్నారు. 19వ వార్డుకు చెందిన దరఖాస్తు ఏ వార్డు, ఏ కేటగిరీకో రాయకపోవడంతో అక్కడ గుర్తించలేకపోయామని వెల్లడించారు. -
ద్వారపురెడ్డి జగదీష్‌ను టార్గెట్ చేసిన శత్రుచర్ల వర్గం
సాక్షి ప్రతినిధి, విజయనగరం : టీడీపీలో ఓ వర్గం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌ను టార్గెట్ చేసింది. ఎన్నికల సమయంలో జరిగిన అక్రమాలను బయటపెట్టడమే కాకుండా అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తోంది. దీంతో జగదీష్ అంటకాగుతున్న శత్రుచర్ల వర్గం కూడా ఇరుకున పడింది. లోపాయికారీగా నడిపిన కుమ్మక్కు రాజకీయాలకు బలైన టీడీపీ నాయకులంతా జగదీష్‌పై తిరుగుబావుటా ఎగురవేశారు. అటు జగదీష్‌ను, ఇటు థాట్రాజ్‌ను లక్ష్యంగా చేసుకుని ఫిర్యాదుల పరంపర కొనసాగిస్తున్నారు. దీనికి జిల్లా కేంద్రంలో ఉన్న ఓ నేత పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని సమాచారం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్ల టిక్కెట్ల కేటాయింపులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ చేతివాటం ప్రదర్శించారని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పార్టీలో పెద్ద చర్చే సాగింది. కానీ, ఎన్నికలప్పుడు రచ్చకెక్కితే పార్టీకి నష్టమనే భావనతో అధిష్టానం చూసీ చూడనట్టు వదిలేసింది. మొత్తానికి ఎన్నికల్లో ఆ పార్టీ గెలవడంతో జగదీష్‌పై వచ్చిన ఆరోపణలన్నీ మరుగున పడిపోయా యి. అయితే, కొమరాడ, జియ్యమ్మవలస ఎంపీపీలతో పాటు, పార్వతీపురం వైస్ చైర్మన ఎన్నిక వ్యవహారంతో జగదీష్ వ్యవహారం మళ్లీ రచ్చకెక్కింది. ఎంపీపీ ఎన్నికలప్పుడు కూడా జగదీష్ లోపాయికారీగా వ్యవహారం నడిపించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొమరాడ ఎంపీపీ ఎన్నికలో టీడీపీ తరఫున గెలుపొందిన ఎంపీటీసీల అభిప్రాయం తెలుసుకోకుండా ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వి.టి.జనార్దన్ థాట్రాజ్ చెప్పినట్టు నడుచుకున్నారని, దీనివెనుక పెద్ద ఎత్తున సొమ్ము చేతులు మారాయని ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో పార్టీ తరఫున బిఫారం ఇచ్చిన వ్యక్తిని కాకుండా టీడీపీ ఎంపీటీసీలంతా మరో వ్యక్తిని ఎంపీపీగా ఎన్నుకున్నారు. తన మాట కాదని వేరొక వ్యక్తిని ఎన్నుకుంటారా అని విప్ ధిక్కారం కింద ఎనిమిది మంది ఎంపీటీసీలపై ఫిర్యాదు చేయించారు. దీంతో వారంతా సభ్యత్వాన్ని కోల్పోయారు. జగదీష్, థాట్రాజ్ అనుసరించిన దుర్నీతికి తామంతా బలి పశువు అయ్యామని, అవతలి వ్యక్తితో ఒప్పందాలు చేసుకుని తమకు అన్యాయం చేశారని వారందరూ తిరుగుబాటు చేస్తున్నారు. చంద్రబాబునాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లారు. జగదీష్‌ను టార్గెట్ చేసి ఫిర్యాదు చేశారు. జియ్యమ్మవలస ఎంపీపీ ఎన్నికల్లో కూడా జగదీష్ అదే తరహాలో వ్యవహరించారని ప్రస్తుతం పెద్ద దుమారమే రేగుతోంది. ఈ మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీ నుంచి ఎనిమిది మంది, ఇండిపెండెంట్లు ఆరుగురు, వైఎస్సార్సీపీ తరఫున ఒకరు గెలిచారు. టీడీపీ తరఫున గెలిచిన వాళ్లంతా మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్ వర్గీయులుగా, ఇండిపెండెంట్‌గా గెలిచిన వారంతా థాట్రాజ్ వర్గీయులుగా కొనసాగారు. ఎంపీపీ ఎన్నికల్లో థాట్రాజ్ వర్గం వ్యూహాత్మకంగా వ్యవహరించి జయరాజ్ వర్గం నుంచి ఒకర్ని లాగి ఆ వ్యక్తికే పార్టీ తరఫున బీ ఫారం తీసుకొచ్చి ఎంపీపీగా పోటీ చేయించారు. జగదీష్ తెరవెనుక పావులు కదపడం వల్లే ఇదంతా జరిగిందని టీడీపీ తరఫున గెలిచిన వాళ్లంతా భావించారు. దీంతో వారంతా పార్టీ తరపున బీ ఫారం ఇచ్చిన వారికి కాకుండా తమలో ఒకర్ని ఎంపీపీగా ఎన్నుకున్నారు. దీంతో థాట్రాజ్, జగదీష్ వ్యూహం బెడిసికొట్టింది. పార్టీ సూచించిన వారికి కాకుండా వేరొకరికి ఓటు వేస్తారా అని వారిపై విప్ ధిక్కారం కింద ఫిర్యాదు చేశారు. దీంతో వారి సభ్యత్వం రద్దయింది. దీనికంతటికీ జగదీషే కారణమని ధ్వజమెత్తుతున్నారు. లోపాయికారీగా చేసుకున్న ఒప్పందాలకు తామంతా బలి పశువులమయ్యామని వాపోతున్నారు. అంతటితో ఆగకుండా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీనిపై పార్టీ దూతలు ఆరా తీస్తున్నాయి. పార్వతీపురం వైస్ చైర్మన్ ఎన్నికలో కూడా జగదీష్ అడ్డగోలుగా వ్యవహరించారని ఆ పార్టీ వర్గాలు భగ్గుమంటున్నాయి. పార్టీ జెండాను మోసిన నాయకులకు కాకుండా ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన నాయకుడికి వైస్ చైర్మన్ పోస్టు ఇచ్చారని మండి పడుతున్నాయి. దీని వెనుక పెద్ద కథే నడిచిందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో పార్టీని నమ్ముకుని ఎన్నాళ్లగానో పనిచేసిన నాయకులంతా ఆవేదన చెందుతున్నారు. వారంతా ఓ మాజీ ఎమ్మెల్యే ద్వారా అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, జగదీష్‌పై ఒకేసారి అసంతృప్తి వర్గాలన్నీ రచ్చకెక్కడానికి జిల్లా కేంద్రంలో ఉన్న ఓ నేత కారణమని తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవి విషయంలో తనకు పోటీగా నిలిచారన్న ఆవేదనతో ఉన్న ఆ నేత, అదను చూసుకుని వారిని రెచ్చగొట్టారని సమాచారం. జగదీష్ వ్యవహారమంతా ఎప్పటికప్పుడు అధిష్టానానికి ఫిర్యాదు చేయించేలా తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈయన వ్యూహం ఫలిస్తే జగదీష్‌కు ఉన్నత పదవులు దక్కడం కష్టమే. ఇక జగదీష్‌తో కలిసి కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో లోపాయికారీ రాజకీయాలు నెరిపారన్న విమర్శలతో శత్రుచర్ల వర్గం కూడా ఇబ్బందుల్లో పడేలా ఉంది. -
టీడీపీలో వైస్ చైర్మన్ లొల్లి
పార్వతీపురంటౌన్,న్యూస్‌లైన్:పార్వతీపురం మున్సి పాలిటీ చైర్మన్ పదవి ద్వారపురెడ్డి జగదీష్‌కేనని అధిష్టానం దాదాపు ఖారారు చేయడంతో, ఇక టీడీపీలో వైస్‌చైర్మన్ లొల్లిప్రారంభమైంది. ఈపదవి కోసం ఆ పార్టీకిచెందిన నలుగురు కౌన్సిలర్లు రేసులో ఉన్నారు. మాజీమంత్రి శత్రుచర్లవిజయరామరాజు శిష్యుడు మజ్జి కృష్ణమోహన్భార్య మజ్జి సునీత, బెలగాం జయప్రకాష్తో పాటు టీడీపీని ఆది నుంచి పార్టీని నమ్ముకునిఉన్న బార్నాల సీతారాం, ఇటీవల టీడీపీ లో చేరిన రెడ్డి రవి ఈనలుగురూ ప్రయత్నాలు ము మ్మరంచేస్తున్నారు. జగదీష్‌కు ఎమ్మెల్సీగా అవకా శం వస్తుందనేప్రచారం జోరందుకుంది. ఈనేపథ్యం లో చైర్మన్ పదవి నుంచి ఆయన తప్పుకుంటే వైస్ చైర్మన్‌కు ప్రాముఖ్యత ఏర్పడనున్న నేపథ్యంలో ఈ పదవి కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నట్లు సమాచారం. 30వార్డుల్లో మహిళలు అధికంగా ఎన్నికవడంతో, వైస్ చైర్మన్ పదవి మహిళకు కేటాయిస్తారనికూడా ఊహాగానాలువినిపిస్తున్నాయి. అలా అయితే మజ్జి సునీతకే ఎక్కువ అవకాశాలు దక్కవ చ్చు. డాక్యుమెంట్ రైటర్ జయబాబు, సీనియర్ నాయకులు బార్నాల సీతారం ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరంచేస్తున్నారు. కొత్తగా రాజకీయాలో ్లకి వచ్చిన రెడ్డి రవి వైస్‌చైర్మన్ గిరికోసం స్వతంత్ర అ భ్యర్థులతో వత్తిడితెస్తున్నారనిసమాచారం. 14 మం ది సభ్యులున్న టీడీపీకి మరో ఇద్దరు ఇండిపెండెట్లు అవసరంఉంది. అందులో ఒకరు వైస్‌చైర్మన్ గిరీ తమకే కావాలనికోరిన నేపథ్యంలో ఎవరికి ఈ పద వి దక్కనుందో అనే అసక్తి పలువురిలో నెలకొంది.