టీడీపీలో వైస్ చైర్మన్ లొల్లి | tdp leaders have inner conflicts | Sakshi
Sakshi News home page

టీడీపీలో వైస్ చైర్మన్ లొల్లి

Published Tue, Jun 3 2014 1:22 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

tdp leaders have inner conflicts

 పార్వతీపురంటౌన్,న్యూస్‌లైన్:పార్వతీపురం మున్సి పాలిటీ చైర్మన్ పదవి ద్వారపురెడ్డి జగదీష్‌కేనని అధిష్టానం దాదాపు ఖారారు చేయడంతో, ఇక టీడీపీలో  వైస్‌చైర్మన్ లొల్లిప్రారంభమైంది. ఈపదవి కోసం ఆ పార్టీకిచెందిన నలుగురు కౌన్సిలర్లు రేసులో ఉన్నారు. మాజీమంత్రి శత్రుచర్లవిజయరామరాజు శిష్యుడు మజ్జి కృష్ణమోహన్‌భార్య మజ్జి సునీత, బెలగాం జయప్రకాష్‌తో పాటు టీడీపీని ఆది నుంచి పార్టీని నమ్ముకునిఉన్న బార్నాల సీతారాం, ఇటీవల టీడీపీ లో చేరిన రెడ్డి రవి ఈనలుగురూ ప్రయత్నాలు ము మ్మరంచేస్తున్నారు. జగదీష్‌కు ఎమ్మెల్సీగా అవకా శం వస్తుందనేప్రచారం జోరందుకుంది. ఈనేపథ్యం లో చైర్మన్ పదవి నుంచి ఆయన తప్పుకుంటే వైస్ చైర్మన్‌కు ప్రాముఖ్యత ఏర్పడనున్న నేపథ్యంలో ఈ పదవి కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నట్లు సమాచారం.
 
30వార్డుల్లో మహిళలు అధికంగా ఎన్నికవడంతో, వైస్ చైర్మన్ పదవి మహిళకు కేటాయిస్తారనికూడా ఊహాగానాలువినిపిస్తున్నాయి. అలా అయితే మజ్జి సునీతకే ఎక్కువ అవకాశాలు దక్కవ చ్చు. డాక్యుమెంట్ రైటర్ జయబాబు, సీనియర్ నాయకులు బార్నాల సీతారం ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరంచేస్తున్నారు. కొత్తగా రాజకీయాలో ్లకి వచ్చిన రెడ్డి రవి వైస్‌చైర్మన్ గిరికోసం స్వతంత్ర అ భ్యర్థులతో వత్తిడితెస్తున్నారనిసమాచారం. 14 మం ది సభ్యులున్న టీడీపీకి మరో ఇద్దరు ఇండిపెండెట్లు అవసరంఉంది. అందులో ఒకరు వైస్‌చైర్మన్ గిరీ తమకే కావాలనికోరిన నేపథ్యంలో ఎవరికి ఈ పద వి దక్కనుందో అనే అసక్తి పలువురిలో నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement