satrucharla Vijayarama Raju
-
కేసును పక్కదారి పట్టిస్తున్నారు..
విజయనగరం టౌన్: తనను హత్య చేసేందుకే మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజు కుట్ర పన్ని దాడులు చేయించారని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11న కురుపాం నియోజకవర్గం చినకుదమ గ్రామంలో తనపై జరిగిన దాడికి సంబంధించి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, కేసును పక్కదారి పట్టించకుండా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ విశాఖ రేంజ్ డీఐజీ జి.పాలరాజును, ఎస్పీ ఎఆర్.దామోదర్‌ను మంగళవారం వారి చాంబర్లో కలిసి ఆమె వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు పెనుమత్స సాంబశివరాజు, ఎమ్మెల్సీ, పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, అరకు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, గజపతినగరం నియోజకవర్గ సమన్వయకర్త బొత్స అప్పలనరసయ్య, నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త బడ్డుకొండ అప్పలనాయుడు, పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు ఉన్నారు. ఈ మేరకు డీఐజీ, ఎస్పీలు మాట్లాడుతూ పూర్తి స్థాయిలో విచారణ చేయించి, నిందితులను అదుపులోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 11న తనపై జరిగిన దాడికి సంబంధించిన విషయంలో ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ పాపారావు అనుసరిస్తున్న వైఖరిపై తమకు అనుమానం ఉందనీ, ఆయన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయనీ, అందువల్ల తనకు ఆ ఇన్విస్టిగేషన్ వల్ల, అధికారి వల్ల న్యాయం జరగదని భావించి డీఐజీ, ఎస్పీలను కలిశామన్నారు. ఏప్రిల్ 11న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, చిన్నకుదమ బూత్ నంబరు152లో రిగ్గింగ్ జరుగుతుందనే సమాచారంతో అక్కడున్నటువంటి పీఓతో, ఇక్కడ రిగ్గింగ్ జరుగుతుందని ఫిర్యాదు చేసేందుకు తాను వెళ్లిన సందర్భంలో అక్కడున్నటు జెడ్పీటీసీ భర్త డొంకాడ రామకృష్ణ , ఆయన మనుషులు విజయరామరాజు ప్రోత్బలంతో తనపై తీవ్రమైన దాడి చేశారన్నారు. ఒక గిరిజన మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తీవ్రంగా గాయపరిచి తనను, తన భర్తను చంపించే ప్రయత్నం జరిగిందన్నారు. ఆ విజువల్స్ పోలీసు శాఖకు అందజేశామన్నారు. మూడు గంటల పాటు నిర్బంధించి, కరెంటు తీసి, చిత్రహింసలు పెట్టి, రాళ్లతో, సుత్తులతో కొట్టి, భయాందోళనకు గురి చేశారన్నారు. ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి భర్త, అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు మాట్లాడుతూ రిగ్గింగ్ జరుగుతుందని వెళితే జెడ్పీటీసీ భర్త డొంకాడ రామకృష్ణ రిగ్గింగ్‌కి పాల్పడుతున్నారన్నారు. దారుణంగా రిగ్గింగ్ చేస్తున్నారని నిలదీస్తే అటాక్ చేశారని, ఊర్లోని అందరినీ రెచ్చగొట్టి, తమపై దాడులు చేశారన్నారు. ఎమ్మెల్యే మహిళా అని చూడకుండా గాయపరిచారని, శత్రుచర్ల ఆయన వాహనంతో వచ్చి బూత్‌ని ఆక్రమించేశారన్నారు. తమ కుటుంబానికి తగు రక్షణ కల్పిండంతో పాటు కేసును త్వరితగతిన విచారణ చేయించి నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. వారి వెంట పార్టీ రాష్ట్ర కార్యదర్శి జమ్మాన ప్రసన్నకుమార్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్ కుమార్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాముల నాయుడు, జి.సూరపురాజు, ఎమ్ఎల్ఎన్.రాజు (హర్షరాజు) తదితరులున్నారు. ఫిర్యాదు చేస్తే... తాము ఫిర్యాదు ఇస్తే ఈ రోజు వరకూ ఎటువంటి చర్య లేదని, నిన్న విజయరామరాజు డీఎస్పీని కలిసిన తర్వాత, నేను ఈ రోజు కలిసిన తర్వాత ఆయన మాటల్లో వ్యత్యాసం కనిపించిందన్నారు. తనపై జరిగిన దాడిపై తమకు న్యాయం జరగదని భావించి, మహిళా ఎమ్మెల్యేకే భద్రత లేదంటే సామాన్యులకు ఇంకెక్కడ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకూ ఎంతవరకైనా వెళతామన్నారు. జెడ్పీటీసీ భర్త డొంకాడ రామకృష్ణ ఆ గ్రామంలో ప్రజలకు అబద్దాలు చెప్పి, తాను దాడి చేశానని చెప్పి రెచ్చగొట్టారని తెలిపారు. -
బరితెగించిన తెలుగు తమ్ముళ్లు
-
టీడీపీలో వైస్ చైర్మన్ లొల్లి
పార్వతీపురంటౌన్,న్యూస్‌లైన్:పార్వతీపురం మున్సి పాలిటీ చైర్మన్ పదవి ద్వారపురెడ్డి జగదీష్‌కేనని అధిష్టానం దాదాపు ఖారారు చేయడంతో, ఇక టీడీపీలో వైస్‌చైర్మన్ లొల్లిప్రారంభమైంది. ఈపదవి కోసం ఆ పార్టీకిచెందిన నలుగురు కౌన్సిలర్లు రేసులో ఉన్నారు. మాజీమంత్రి శత్రుచర్లవిజయరామరాజు శిష్యుడు మజ్జి కృష్ణమోహన్భార్య మజ్జి సునీత, బెలగాం జయప్రకాష్తో పాటు టీడీపీని ఆది నుంచి పార్టీని నమ్ముకునిఉన్న బార్నాల సీతారాం, ఇటీవల టీడీపీ లో చేరిన రెడ్డి రవి ఈనలుగురూ ప్రయత్నాలు ము మ్మరంచేస్తున్నారు. జగదీష్‌కు ఎమ్మెల్సీగా అవకా శం వస్తుందనేప్రచారం జోరందుకుంది. ఈనేపథ్యం లో చైర్మన్ పదవి నుంచి ఆయన తప్పుకుంటే వైస్ చైర్మన్‌కు ప్రాముఖ్యత ఏర్పడనున్న నేపథ్యంలో ఈ పదవి కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నట్లు సమాచారం. 30వార్డుల్లో మహిళలు అధికంగా ఎన్నికవడంతో, వైస్ చైర్మన్ పదవి మహిళకు కేటాయిస్తారనికూడా ఊహాగానాలువినిపిస్తున్నాయి. అలా అయితే మజ్జి సునీతకే ఎక్కువ అవకాశాలు దక్కవ చ్చు. డాక్యుమెంట్ రైటర్ జయబాబు, సీనియర్ నాయకులు బార్నాల సీతారం ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరంచేస్తున్నారు. కొత్తగా రాజకీయాలో ్లకి వచ్చిన రెడ్డి రవి వైస్‌చైర్మన్ గిరికోసం స్వతంత్ర అ భ్యర్థులతో వత్తిడితెస్తున్నారనిసమాచారం. 14 మం ది సభ్యులున్న టీడీపీకి మరో ఇద్దరు ఇండిపెండెట్లు అవసరంఉంది. అందులో ఒకరు వైస్‌చైర్మన్ గిరీ తమకే కావాలనికోరిన నేపథ్యంలో ఎవరికి ఈ పద వి దక్కనుందో అనే అసక్తి పలువురిలో నెలకొంది. -
పవన్ కళ్యాణ్, శత్రుచర్లలపై ఫిర్యాదు
-
పవన్ కళ్యాణ్, శత్రుచర్లలపై చర్యలు తప్పవా?
హైదరాబాద్: ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన సినీహీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, తిరుపతి టిడిపి, బిజెపి అభ్యర్థులపై వైఎస్ఆర్ సిపి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వారు నిబంధనలు అతిక్రమించినట్లు పూర్తి ఆధారాలను వైఎస్ఆర్ సీపీ నేతలు పీఎన్వీ ప్రసాద్, శివకుమార్‌లు ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌కు సమర్పించారు. విజయనగరం జిల్లా టెక్కలిలో ప్రజలనుద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఆయా పార్టీలు ఇచ్చే డబ్బు తీసుకొని ఓటు మాత్రం టీడీపీకి వేయాలని చెప్పడం తీవ్రమైన నేరంగా వారు పేర్కొన్నారు. ఐపీసీ 107, 171ఇ, 171ఎఫ్ నిబంధనల ప్రకారం అది నేరమని తెలిపారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు తక్షణమే పవన్ కల్యాణ్‌ను అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోసం డబ్బులు పంచినట్లు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం శాసనసభకు పోటీ చేస్తున్న టిడిపి అభ్యర్థి మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మాట్లాడినట్లు వారు తెలిపారు. శత్రుచర్లను వెంటనే ఎన్నికల బరి నుంచి తప్పించాలని వారు డిమాండ్ చేశారు. ‘‘ఒక్కో కుటుంబానికి రెండు వేలు ఇచ్చా.. మీ గ్రామానికి ఇప్పటికే రూ.15 లక్షలు పంపిణీ చేశా.. ఇంకెంత ఇవ్వాలి మీకు’’ అని శత్రుచర్ల టిడిపి కార్యకర్తలపైనే మండిపడ్డారు. ఆయన మాట్లాడేటప్పుడు సాక్షిటివి చానల్ వీడియో కూడా తీసింది. టిడిపి-బిజెపి కూటమికి చెందిన తిరుపతి అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి తమ ఎన్నికల ప్రచార కరపత్రాలలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఫొటోను ముద్రించారు. వారిపై చర్యలు తీసుకోవాలని పీఎన్వీ ప్రసాద్, శివకుమార్‌లు భన్వర్‌లాల్‌కు విజ్ఞప్తి చేశారు. వీరు ఇచ్చిన ఆధారాలను పరిశీలించి ఎన్నికల సంఘం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
స్మగ్లర్ల సవాల్‌కు స్పందించిన ప్రభుత్వం
హైదరాబాద్: ఎర్రచందనం స్మగ్లర్ల అరాచకాలపై ప్రభుత్వం స్పందించింది. క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అటవీశాఖ సిబ్బందిపై స్మగ్లర్ల అమానుష దాడి ఘటనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అటవీ శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, డీజీపీ ప్రసాదరావు, కర్నూలు, కడప, చిత్తూరు ఎస్పిలు హాజరయ్యారు. సమావేశం అనంతరం మంత్రి శత్రుచర్ల మాట్లాడుతూ అటవీ సిబ్బందిని చంపడం ద్వారా ఎర్రచందనం స్మగ్లర్లు ప్రభుత్వానికి సవాల్ విసిరారన్నారు. ఇక ముందు స్మగ్లర్లపై పీడీ యాక్ట్, నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్న 7 డివిజన్లను గుర్తించినట్లు తెలిపారు. ఒక్కో డివిజన్‌కు 20 మంది చొప్పున ఆయుధాలతో సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. -
మంత్రి శత్రుచర్ల కాన్వాయ్‌పై చెప్పులు
-
మంత్రి శత్రుచర్ల కాన్వాయ్‌పై చెప్పులు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా మంత్రి శత్రుచర్ల విజయమరాజుకు ఘోరపరాభవం జరిగింది. కొత్తూరు గ్రామంలో ఆయన కాన్వాయ్‌పై సమైక్యవాదులు రాళ్లు, చెప్పులు విసిరారు. మంత్రిపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. మంత్రి సమైక్యాంధ్రకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనను ముందుకు కదలనివ్వలేదు. పోలీసుల జోక్యంతో మంత్రి బయటపడ్డారు.