ఎర్రచందనం స్మగ్లర్ల అరాచకాలపై ప్రభుత్వం స్పందించింది.
హైదరాబాద్: ఎర్రచందనం స్మగ్లర్ల అరాచకాలపై ప్రభుత్వం స్పందించింది. క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అటవీశాఖ సిబ్బందిపై స్మగ్లర్ల అమానుష దాడి ఘటనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అటవీ శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, డీజీపీ ప్రసాదరావు, కర్నూలు, కడప, చిత్తూరు ఎస్పిలు హాజరయ్యారు.
సమావేశం అనంతరం మంత్రి శత్రుచర్ల మాట్లాడుతూ అటవీ సిబ్బందిని చంపడం ద్వారా ఎర్రచందనం స్మగ్లర్లు ప్రభుత్వానికి సవాల్ విసిరారన్నారు. ఇక ముందు స్మగ్లర్లపై పీడీ యాక్ట్, నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్న 7 డివిజన్లను గుర్తించినట్లు తెలిపారు. ఒక్కో డివిజన్‌కు 20 మంది చొప్పున ఆయుధాలతో సిబ్బందిని నియమిస్తామని చెప్పారు.