e - pass
-
పెద్ద రైతులకు రేషన్ బంద్..!
సాక్షి, నేలకొండపల్లి: తప్పుడు వివరాలతో రేషన్ పొందుతున్న పెద్ద రైతులకు రైతుబంధు పథకం కష్టాన్ని తెచ్చింది. వివరాలను రేషన్ సర్వర్‌తో అనుసంధానం చేయటంతో పదెకరాలు, అంతకంటే ఎక్కువ వ్యవసాయ భూములున్న రైతులకు రేషన్ నిలిచిపోతున్నాయి. ఇప్పటి వరకు తక్కువ భూమి ఉన్నట్లు చూపించి పలువురు పెద్ద రైతులు ఆహార భద్రత కార్డులు పొందారు. మరికొందరు భూమి ఉన్నా సేద్యంలో లేదంటూ తప్పుడు ధృవీకరణ పత్రాలు చూపించి రేషన్ తీసుకుంటున్నారు. అలాంటి రైతులకు పథకంతో తెరపడింది. రేషన్ సర్వర్‌కు దీనిని అనుసంధానం చేయటంతో ఎక్కువ భూములు ఉన్న రైతులకు రేషన్ నిలిచిపోయింది. పెట్టుబడి సాయం పొందేందుకు సాగులో లేని భూములను సైతం సేధ్యం చేస్తున్నామంటూ రైతులు తప్పుడు పత్రాలు చూపి రెండు పర్యాయాలు లబ్ధి పొందారు. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రైతుబంధు లబ్ధిదారుల వివరాలను తెప్పించుకొని తమ శాఖ సర్వర్‌కు అనుసంధానం చేయడంతో పెద్ద రైతుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా ఫుడ్ సెక్యూరీటీ యాక్ట్ 2013 ప్రకారం వారిని రేషన్, రైతుబంధుకు అనర్హులుగా ప్రకటించింది. విచారించాలని డీఎస్‌ఓలకు ఆదేశాలు.. జిల్లాలో పది ఎకరాల పైన ఉన్న రైతులు ఎవరెవరు ఉన్నారో విచారించాలని జాయింట్ కలెక్టర్ల ద్వారా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు లిఖిత పూర్వకంగా ఆదేశాలు అందాయి. పెద్ద రైతులు, వారి భూముల వివరాలు విచారించి నివేదికలను పంపాలని అన్ని మండలాల తహసీల్దార్లను ఆదేశించారు. ఇప్పటికే డీఎస్ఓ లకు లిఖిత పూర్వక ఆదేశాలు అందాయి. రైతు బంధుతో .. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు 8 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం అందజేస్తోంది. దీంతో ఏ రైతుకు ఎంత భూమి ఉందో లెక్క తేలిపోయింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆకున్ సబర్వాల్ రైతుల ఆధార్ నంబర్‌ను పీడీఎస్ రైస్ ఈ పాస్ సర్వర్‌కు అనుసంధానం చేయటంతో అనర్హులు దొరికిపోయారు. ప్రస్తుతం రేషన్ దుకాణాలల్లో ఈ పాస్ విధానంలో బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద రైతులు రేషన్ దుకాణానికి వెళ్లి ఈ పాస్ మిషన్ పై వేలిముద్ర వేస్తు ఇన్వాలీడ్ అని వస్తోంది. దీంతో డీలర్లు రేషన్‌ను నిలిపివేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 669 దుకాణాలు ఉండగా వాటిలో 3,95,857 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. అర్హులకు ఇబ్బంది లేదు.. తక్కువ భూమి ఉన్న రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక వేళ రేషన్ ఆగిపోతే స్థానిక తహసీల్దార్‌కు దరఖాస్తు కోవాలి. విచారించి రేషన్ అందేలా చర్యలు తీసుకుంటాం. పది ఎకరాలు అంత కంటే ఎక్కువగా భూమి ఉన్న రైతులకు ఈనెల నుంచి రేషన్‌ను నిలిచిపోతుంది. ఇప్పటికే కమీషనర్ కార్యాలయంలో బ్లాక్ చేశారు. – కె.వెంకటేశ్వర్లు, ఇన్చార్జ్ డీఎస్ఓ, ఖమ్మం -
ఈ పాస్ గుట్టు విప్పుతోంది...!
♦ వేలిముద్ర వేస్తేనే సరుకులు ♦ వినియోగం లేని కార్డులు40 శాతం పెనే ♦ బయటపడుత్ను డీలర్ల చేతివాటం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ప్రజాపంపిణీ వ్యవస్ధ లో ఈ-పాస్ అమలు డీలర్ల గుట్టు విప్పుతోంది. ఆహార భద్రత కార్డుల్లో వినియోగంలో లేనివి 40 శాతం పైనే ఉన్నట్లు తేటతెల్లమైంది. ఇప్పటి వరకు ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రతి నెలా వందల కోట్ల రూపాయల సబ్సిడీ బియ్యం పక్కదారి పడ్డాయా..? అంటే అవుననేపిస్తోంది. సాక్షాత్తు స్పెషల్ ఆపరేషన్ టాస్క్ ఫోర్స్ (ఎస్ఓటీ) సైతం దాడుల సందర్భంగా పేర్కొంటూ వచ్చింది. తాజాగా ప్రభుత్వ చౌకధరల దుకాణాలలో ఈ-పాస్ అమలుతో డీలర్ల చేతివాటానికి చెక్ పెట్టినట్లయింది. ఈ-పాస్ అమలుకు ముందు ఫిబ్రవరి మాసం వరకు సుమారు 90 నుంచి 95 శాతం వరకు కార్డుదారులు సరుకులు తీసుకున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తుండగా.... ఈ-పాస్ పూర్తి స్థాయి అమలుతో వినియోగకార్డుల సంఖ్య ఒకేసారి 60 శాతానికి పడిపోయింది. దీనిని బట్టి డీలర్ల మాయజాలంతో వినియోగం లేని కార్డుల సరుకు పక్కదారి పట్టినట్లు స్పష్టమవుతోంది. ఇదీ పరిస్థితి... గ్రేటర్ హైదరాబాద్‌లోని జంట పౌర సరఫరాల శాఖకు చెందిన 12 అ ర్బన్ సర్కిళ్లలో 13.57 లక్షల మ ంది కార్డుదారు లు ఉండగా ప్రతి నెలా సగటున 12 లక్షల కార్డుదారుల వరకు సరుకులు తీసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. తాజాగా ఈ-పాస్ అమలుతో సరుకులు తీసుకుంటున్న కార్డుదారుల సం ఖ్య ఒకే సారి తగ్గిపోయింది. ప్రస్తుత నెలలో సరుకుల పంపి ణీ గడువు ముగిసే బుధవారం నాటికి 8.67,208 కార్డు దారులు మాత్రమే సరుకులు తీసుకున్నట్లు ఈ-పాస్‌లో రికార్డు అయింది. ఏప్రిల్ లో మొత్తం కార్డుదారుల్లో 8,51,205 కార్డుదాలు మాత్రమే సరుకులు తీసుకున్నట్లు నమోదైంది. మొత్తం మీద హైదరాబాద్‌లోని 859 చౌకధరల దుకాణాల పరిధిలో మొత్తం 7,95,418 కార్డులు ఉండగా ఈ నెల 4,94,996 కార్దుదారులు, గత నెలలో 4,87,623 కార్డుదారులు సరుకులు తీసుకున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా అర్బన్ లోని 684 దుకాణాల పరిధిలో మొత్తం 5,61,880 కార్డు దారులు ఉండగా ఈ నెలలో 3,72,212 కార్డుదారులు, గత నెలలో 3,63,582 కార్డు దారులు మాత్రమే సరుకులు తీసుకున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. దీనిని బట్టి సబ్సిడీ సరుకులు ఇప్పటి వరకు పెద్ద ఎత్తున పక్కదారి పడినట్లు స్పష్టం అవుతోంది. -
ఈ-పాస్ ఉంటేనే స్కాలర్షిప్లు
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో 1.15 లక్షల పేద విద్యార్థుల కోసం ప్రభుత్వమిచ్చే స్కాలర్షిప్లను సకాలంలో అందించాలని, ఇందుకు ఈ-పాస్ ద్వారా విద్యార్థుల పేర్లను నెలాఖరులోగా ఆన్లైన్లో పొందుపరచాలని కలెక్టర్ సిద్ధార్థ జైన్ కళాశాల యాజమాన్యాలను కోరారు. స్థానిక సీఆర్‌రెడ్డి కళాశాల ఆడిటోరియంలో మంగళవారం కళాశాలల యాజమాన్యం, అధికారులతో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. కొత్తగా స్కాలర్షిప్పులు పొందే విద్యార్థులంతా ఈనెల 31లోగా, రెన్యువల్ చేసేకునేవారు ఈ నెల 25లోగా ఈ-పాస్ ద్వారా ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో 500కు పైగా కళాశాలలు ఉన్నప్పటికీ వాటిల్లో కొన్ని రిజిస్టరు కాలేదని అటువంటి కళాశాలలను గుర్తించి ఆన్లైన్లో వాటి పేర్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సోషల్ వెల్ఫేర్ జేడీ ఆర్.మల్లికార్జునరావును కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని ప్రతి కళాశాల విధిగా వెబ్సైట్ రూపొందించుకోవాలని అందులో పనిచేసే ఫ్యాకల్టీ వివరాలు, కళాశాల సమగ్ర సమాచారాన్ని అందులో పొందుపరచాలని, వారంరోజుల్లో ఈ ప్రక్రియను కళాశాలలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ-పాస్ ద్వారా ఆన్లైన్ చేయడానికి రూపొందించిన మైక్రో ప్రాసెసర్ ధరను రూ. 27 వేల నుంచి తక్కువకు అందించేలా తగు చర్యలు తీసుకుంటానని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో సీపీవో కె సత్యనారాయణ, డీఈవో ఆర్.నరసింహారావు, ఎన్ఐసీ సైంటిస్ట్ గంగాధర్ పాల్గొన్నారు. విలువలతో కూడిన విద్య అవసరం ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులకు విలువలతో కూడిన విద్యాబోధన అందించినపుడే ఆశించిన ఫలితాలు సాధ్యమని కలెక్టర్ సిద్ధార్థ జైన్ చెప్పారు. విద్యాప్రమాణాల తీరుపై ఎంఈవోలు, సహాయ సాంఘిక సంక్షేమాధికారులతో మంగళవారం ఆయన ఏలూరులో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల తాను పలు ఇంటర్వ్యూలు నిర్వహించానని అయితే ఒక్క విద్యార్థి కూడా సరైన విజ్ఞానం లేకుండా సమాధానాలు ఇచ్చారన్నారు. సమాజానికి ఉపయోగపడే విద్యావిధానం కావాలే తప్ప కాగితాలకే పరిమితమయ్యే డిగ్రీలు ఎందుకని కలెక్టర్ ప్రశ్నించారు. ఎల్కేజీ నుంచే విద్యాప్రమాణాలు మెరుగుపరచడంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించాలన్నారు. ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తే పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు పొందడం కష్టమేమి కాదన్నారు.