ఈ పాస్ గుట్టు విప్పుతోంది...!
♦ వేలిముద్ర వేస్తేనే సరుకులు
♦ వినియోగం లేని కార్డులు40 శాతం పెనే
♦ బయటపడుత్ను డీలర్ల చేతివాటం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ప్రజాపంపిణీ వ్యవస్ధ లో ఈ-పాస్ అమలు డీలర్ల గుట్టు విప్పుతోంది. ఆహార భద్రత కార్డుల్లో వినియోగంలో లేనివి 40 శాతం పైనే ఉన్నట్లు తేటతెల్లమైంది. ఇప్పటి వరకు ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రతి నెలా వందల కోట్ల రూపాయల సబ్సిడీ బియ్యం పక్కదారి పడ్డాయా..? అంటే అవుననేపిస్తోంది. సాక్షాత్తు స్పెషల్ ఆపరేషన్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌ఓటీ) సైతం దాడుల సందర్భంగా పేర్కొంటూ వచ్చింది. తాజాగా ప్రభుత్వ చౌకధరల దుకాణాలలో ఈ-పాస్ అమలుతో డీలర్ల చేతివాటానికి చెక్ పెట్టినట్లయింది.
ఈ-పాస్ అమలుకు ముందు ఫిబ్రవరి మాసం వరకు సుమారు 90 నుంచి 95 శాతం వరకు కార్డుదారులు సరుకులు తీసుకున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తుండగా.... ఈ-పాస్ పూర్తి స్థాయి అమలుతో వినియోగకార్డుల సంఖ్య ఒకేసారి 60 శాతానికి పడిపోయింది. దీనిని బట్టి డీలర్ల మాయజాలంతో వినియోగం లేని కార్డుల సరుకు పక్కదారి పట్టినట్లు స్పష్టమవుతోంది.
ఇదీ పరిస్థితి... గ్రేటర్ హైదరాబాద్‌లోని జంట పౌర సరఫరాల శాఖకు చెందిన 12 అ ర్బన్ సర్కిళ్లలో 13.57 లక్షల మ ంది కార్డుదారు లు ఉండగా ప్రతి నెలా సగటున 12 లక్షల కార్డుదారుల వరకు సరుకులు తీసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. తాజాగా ఈ-పాస్ అమలుతో సరుకులు తీసుకుంటున్న కార్డుదారుల సం ఖ్య ఒకే సారి తగ్గిపోయింది. ప్రస్తుత నెలలో సరుకుల పంపి ణీ గడువు ముగిసే బుధవారం నాటికి 8.67,208 కార్డు దారులు మాత్రమే సరుకులు తీసుకున్నట్లు ఈ-పాస్‌లో రికార్డు అయింది. ఏప్రిల్ లో మొత్తం కార్డుదారుల్లో 8,51,205 కార్డుదాలు మాత్రమే సరుకులు తీసుకున్నట్లు నమోదైంది.
మొత్తం మీద హైదరాబాద్‌లోని 859 చౌకధరల దుకాణాల పరిధిలో మొత్తం 7,95,418 కార్డులు ఉండగా ఈ నెల 4,94,996 కార్దుదారులు, గత నెలలో 4,87,623 కార్డుదారులు సరుకులు తీసుకున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా అర్బన్ లోని 684 దుకాణాల పరిధిలో మొత్తం 5,61,880 కార్డు దారులు ఉండగా ఈ నెలలో 3,72,212 కార్డుదారులు, గత నెలలో 3,63,582 కార్డు దారులు మాత్రమే సరుకులు తీసుకున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. దీనిని బట్టి సబ్సిడీ సరుకులు ఇప్పటి వరకు పెద్ద ఎత్తున పక్కదారి పడినట్లు స్పష్టం అవుతోంది.