E Retail
-
190 బిలియన్ డాలర్లకు ఈ–రిటైల్ మార్కెట్
న్యూఢిల్లీ: దేశీ ఈ–రిటైల్ మార్కెట్ ఏటా 18 శాతం వృద్ధి చెందనుంది. 2030 నాటికి 170–190 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఓ నివేదిక ప్రకారం స్థూల ఆర్థికాంశాలు, వినియోగంపరమైన సవాళ్ల కారణంగా 2024లో ఈ–రిటైల్ రంగ వృద్ధి చారిత్రక గరిష్టమైన 20 శాతం నుంచి నెమ్మదించి సుమారు 10–12 శాతానికి మందగించింది. అయితే, ఇటీవల ద్రవ్య పరపతి విధానాన్ని సరళతరం చేయడంతో వృద్ధి క్రమంగా పుంజుకోనుంది. ముఖ్యంగా 2025 పండుగ సీజన్ నుంచి మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ‘దీర్ఘకాలికంగా మార్కెట్ ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నాయి. ఈ–రిటైల్ రంగం వచ్చే ఆరేళ్లు 18 శాతం వృద్ధి చెంది 170–190 బిలియన్ డాలర్లకు చేరవచ్చు‘ అని నివేదిక పేర్కొంది. ముఖ్యావసరయేతర ఉత్పత్తులు, సేవలపై ప్రజలు మరింతగా ఖర్చు చేయనుండటం ఇందుకు దోహదపడనుంది. రిపోర్టులోని మరిన్ని ముఖ్యాంశాలు.. → గత దశాబ్దకాలంలో రిటైల్‌కి సంబంధించి భారత్ శక్తివంతమైన కేంద్రంగా మారింది. 2024లో అంతర్జాతీయంగా మూడో అతి పెద్ద రిటైల్ మార్కెట్‌గా ఎదిగింది. → ఇటీవలి కాలంలో వినియోగం, ముఖ్యావసరాలు కాకుండా ఇతరత్రాల ఉత్పత్తులు, సేవలపై ఖర్చు చేయడం కాస్త నెమ్మదించింది. ప్రైవేట్ వినియోగం కోవిడ్ పూర్వం (2017–19లో) 11 శాతంగా ఉండగా దానితో పోలిస్తే కోవిడ్ తర్వాత (2022–24) 8 శాతానికి తగ్గింది. వేతనాలు పెద్దగా పెరగకపోవడం, ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండటం మొదలైన అంశాలు ఇందుకు కారణం. → ఇటీవల ద్రవ్యపరపతి విధానాన్ని సరళతరం చేయడంతో ఈ–రిటైల్ వృద్ధి మళ్లీ పుంజుకోనుంది. నిత్యావసరాలు, దుస్తులు.. ఎల్రక్టానిక్స్ వంటి ఉత్పత్తుల అమ్మకాలు ఇందుకు దోహదపడనున్నాయి. 2030 నాటికి ప్రతి మూడు డాల ర్లలో వీటి వాటా రెండు డాలర్లుగా ఉంటుంది. → ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా ఈ–రిటైల్ వినియోగం పెరుగుతోంది. 2020 నుంచి చూస్తే కొత్తగా షాపింగ్ చేస్తున్న ప్రతి అయిదుగురిలో ముగ్గురు ఈ ప్రాంతాల నుంచే ఉంటున్నారు. అలాగే, 2021 నుంచి చూస్తే కొత్త విక్రేతల్లో 60 శాతం మంది ద్వితీయ శ్రేణి లేదా అంతకన్నా చిన్న పట్టణాలకు చెందినవారే ఉంటున్నారు. → క్విక్ కామర్స్, హైపర్ వేల్యూ కామర్స్ మొదలైన విభాగాలు తదుపరి ఈ–రిటైల్ వృద్ధికి దోహదపడనున్నాయి. -
అజియో బిగ్ బోల్డ్ సేల్ షురూ
ముంబై : ప్రముఖ ఆన్లైన్ ఫ్యాషన్ ఈ-రిటైలర్ అజియో.కాం ఈనెల 11 నుంచి 15 వరకూ ‘బిగ్ బోల్డ్ సేల్’ ను ప్రకటించింది. స్టైల్, కమ్ఫర్ట్ను కోరుకునే కస్టమర్లందరికీ బోల్డ్ స్టైల్స్‌ను భారీ డిస్కౌంట్లతో బిగ్ బోల్డ్ సేల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. 2000కు పైగా బ్రాండ్స్ నుంచి 2,00,000 స్టైల్స్ ఇంతకుముందెన్నడూ లేని డిస్కౌంట్ ఆఫర్లతో సేల్‌లో సిద్ధంగా ఉన్నాయని అజియో.కాం వెల్లడించింది. నైక్, ప్యూమా, అదిదాస్, లెవీస్ వంటి దిగ్గజ బ్రాండ్లు అజియో బిగ్ బోల్డ్ సేల్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఇక 50 నుంచి 90 శాతం వరకూ డిస్కౌంట్లతో పాటు టీ షర్ట్స్, జీన్స్, కుర్తాలపై ఆకర్షణీయ ఫ్లాష్ డీల్స్ ఉంటాయని వెల్లడించింది. సేల్‌లో భాగంగా పలు అంతర్జాతీయ బ్రాండ్లను లాంఛ్ చేస్తామని పేర్కొంది. 2016లో డౌట్ ఈజ్ ఔట్ అంటూ ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అజియో ప్రపంచ ఫ్యాషన్ పోకడలకు పర్యాయపదంగా నిలిచింది. చదవండి : లాక్మే ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన ‘రకుల్’ -
ఫ్లిప్‌కార్ట్‌లో చక్రం తిప్పనున్న వాల్‌మార్ట్!
ముంబై: దేశీయ ఈ-రిటైల్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో గ్లోబల్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ భారీగా వాటాను చేజిక్కించుకోబోతుంది. దీనికి సంబంధించి చర్చలు తుది దశకు వచ్చినట్టు ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో సగానికి పైగా వాటాలను కొనుగోలు చేసేందుకు వాల్‌మార్ట్ ఎన్నోరోజులుగా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ చర్చలు కనుక సఫలమైతే, దేశీయ ఈ-రిటైల్ రంగంలో వాల్‌మార్ట్, అమెజాన్‌తో ప్రత్యక్షంగా పోటీకి దిగనుంది. తొలుత 20-26 శాతం వాటాను మాత్రమే కొనుగోలు చేయాలని భావించిన వాల్‌మార్ట్.. తదుపరి జరిగిన పరిణామాలతో ఫ్లిప్‌కార్ట్‌లో చక్రం తిప్పేందుకు అవసరమైన 51 శాతం వాటాను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో జపాన్‌కు చెందిన పెట్టుబడి సంస్థ సాఫ్ట్‌బ్యాంక్‌కు అత్యధిక వాటా ఉంది. అయితే సాఫ్ట్‌బ్యాంకు నుంచి ఈ వాటాలను వాల్‌మార్ట్ కొనుగోలు చేసి, ఫ్లిప్‌కార్ట్‌లో అతిపెద్ద షేర్‌హోల్డర్‌గా నిలవనుంది. మిగతా వాటాలను ఇతర ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలు చేయనుంది.వాల్‌మార్ట్ కొనుగోలు చేయబోతున్న వాటాల విలువ రూ.77 వేల కోట్లుగా ఉంటుందని అంచనా. దీనికి సంబంధించి సాఫ్ట్‌బ్యాంకు, టైగర్ గ్లోబల్లతో వాల్‌మార్ట్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు సంస్థలకు కలిపి ఫ్లిప్‌కార్ట్‌లో 20 శాతం వాటాలున్నాయి. అయితే ఏ కంపెనీ అధికారులు కూడా ఈ చర్చలను అధికారికంగా ధృవీకరించలేదు. ఎంతో కాలంగా దేశీయ మార్కెట్లో వాల్‌మార్ట్ తన సత్తా చాటాలని చూస్తోంది. కానీ ఇన్ని రోజులు రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐల అనుమతిపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించడంతో అది సాధ్యం కాలేదు. ప్రస్తుతం రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐ నిబంధనలను ప్రభుత్వం సరళీకరించింది. ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ విలువ 14.2 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుతం వాల్‌మార్ట్ పెట్టుబడులతో ఫ్లిప్‌కార్ట్ విలువ రెండింతలు కానుంది. గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో ఫ్లిప్‌కార్ట్‌కు తీవ్ర పోటీ ఎదురవుతోంది. ప్రస్తుతం వాల్‌మార్ట్ పెట్టనున్న పెట్టుబడులతో, అమెజాన్‌కు ఫ్లిప్‌కార్ట్ గట్టి పోటీ ఇవ్వనుంది. వాల్‌మార్ట్ భారత్‌లో ప్రస్తుతం 21 స్టోర్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
ఈ-రిటైల్‌లో 14.5 లక్షల జాబ్స్
లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ రంగాల్లో అత్యధికం 2021 నాటికి సాకారం: కేపీఎంజీ అప్పటికల్లా 103 బిలియన్ డాలర్లకు ఈ-కామర్స్ న్యూఢిల్లీ: మున్ముందు ఈ-రిటైల్ రంగం ఉపాధి అవకాశాల హబ్‌గా మారనుంది. 2021 నాటికి దేశీయ ఈ-రిటైల్ రంగం, దానికి అనుబంధంగా పనిచేసే లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ (గోదాములు), ఐటీ/ఐటీఈఎస్ వంటి రంగాల్లో ఏకంగా 14.5 లక్షల కొత్త ఉద్యోగాలొస్తాయని స్నాప్‌డీల్, కేపీఎంజీ నివేదిక తెలియజేసింది. ఈ రెండు సంస్థలూ ‘దేశంలో ఉపాధి అవకాశాలపై ఈ-కామర్స్ ప్రభావం’ పేరుతో సంయుక్త అధ్యయన నివేదికను విడుదల చేశారుు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు చేరుకోవడం ద్వారా ఈ-కామర్స్ రంగం సామాజిక, ఆర్థిక రంగంపై చెప్పుకోతగ్గ ప్రభావం చూపిస్తుందని ఈ నివేదిక పేర్కొంది. ప్రధాన రంగంతోపాటు దాని అనుబంధ రంగాల్లో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాల కల్పన, నూతన వ్యాపార అవకాశాలు, సామాజిక - ఆర్థిక వ్యవస్థలను ఏ విధంగా ప్రభావితం చేయనున్నదీ ఈ నివేదిక ద్వారా తెలియజేయాలనుకున్నట్టు స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో కునాల్ బెహల్ తెలిపారు. నివేదికలోని అంశాలు లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ రంగం అత్యధికంగా 10 లక్షల మేర ప్రత్యక్ష ఉద్యోగాలను తీసుకురానుంది. ఈటైల్ రంగంలో అధిక నైపుణ్యాలతో కూడుకున్న 4 లక్షల ఉద్యోగాలు ఏర్పడతారుు. ఈ-కామర్స్ రంగంలో కొత్తగా రానున్న ప్రతీ ఉద్యోగంతో దాని అనుబంధ రంగాల్లో మూడు నుంచి నాలుగు కొత్త ఉద్యోగాలు ఏర్పడతారుు. 2020 నాటికి ఈ కామర్స్ రంగం 103 బిలియన్ డాలర్ల (రూ.6.9లక్షల కోట్లు) స్థారుుకి చేరుకుంటుంది. ఇందులో ఈటైల్ రంగం వాటా 67 శాతం (68 బిలియన్ డాలర్లు). ఆన్లైన్ విక్రేతల సంఖ్య సైతం 2020 నాటికి 13 లక్షల సంఖ్యకు వృద్ధి చెందుతుంది. 70 శాతం ఆన్లైన్ విక్రేతలు చిన్న పట్టణాల నుంచి రానున్నారు. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు వీలుగా పరిశోధన అభివృద్ధిపై పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, కార్మిక సంస్కరణలను మెరుగుపరచడం, వృత్తిపరమైన శిక్షణ ద్వారా ప్రభుత్వం వైపు నుంచి సహకారం అవసరం.