E ticketing
-
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: ఇక ఆ అవసరమే లేదు!
సాక్షి, ముంబై: రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తన వినియోగ దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆన్‌లైన టికెంట్ బుకింగ్ పద్ధతిని మరింత సులువు చేయనుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ వాయిస్ సెంట్రిక్ ఈ-టికెటింగ్ ఫీచర్‌ను త్వరలోనే ఐఆర్సీటీసీ ప్రవేశపెట్టనుంది. తాజా నివేదికల ప్రకారం తొలి దశ టెస్టింగ్ విజయవంతమైంది. ఏఐ ఆధారిత చాట్‌బాట్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఇకపై ఐఆర్సీటీసీ లాగిన్ కావడానికి ఐడీ, పాస్వర్డ్, ఓటీపీలతో పనిలేకుండానే, కేవలం వాయిస్ ద్వారా రైలు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. టికెట్ బుక్ చేసుకునేటప్పుడు వివరాలు ఇవ్వడానికి బదులుగా, Actually అని చెబితే సరిపోతుంది. దీని కోసం కొన్ని అవసరమైన మార్పులతో AskDisha (డిజిటల్ ఇంటరాక్షన్ టు సీక్ హెల్ప్ ఏనీటైం)పరీక్షిస్తోంది. తొలి దశ పరీక్షలు విజయవంతం కావడంతో మలి దశ టెస్టింగ్‌ను మరింత వేగవంతం చేయనుంది. ఈ ఫీచర్‌ను వచ్చే 3 నెలల్లోనే కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. దీని ద్వారా ఐఆర్సీటీసీ బ్యాకెండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్మెరుగ వుతుందని భావిస్తున్నారు. ఆస్క్ దిశ 2.0 ఫీచర్ రైలు ప్రయాణానికి సంబంధించి కస్టమర్లకు ప్రశ్నలకు సమాధానాలిస్తుంది. వీటిని హిందీ లేదా ఇంగ్లిష్‌లో ప్రశ్నలు అడగవచ్చు. ఇంగ్లిష్‌లో అయితే ‘యాక్చువల్లీ’ అనే పదంతో చాటింగ్‌ను స్టార్ట్ చేయాలి. ఈ ఫీచర్ ద్వారా కస్టమర్ తన టిక్కెట్‌ను రద్దు చేసుకోవచ్చు. రద్దు చేసిన టికెట్ల నగదు రీఫండ్ స్థితిని, పీఎన్‌ఎర్ స్టేటస్‌ను కూడా చూడవచ్చు.అంతేకాదు ప్రయాణికులు బోర్డింగ్ లేదా డెస్టినేషన్ స్టేషన్‌ని కూడా మార్చుకోవచ్చు. రైలు టికెట్లను ప్రివ్యూ, ప్రింట్, షేర్ చేయవచ్చని తెలుస్తోంది. నిజానికి ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగం గత ఏడాది మార్చిలోనే ఈ ఫీచర్ గురించి ట్విటర్లో పోస్ట్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలను కూడా వెబ్సైట్లో పొందుపర్చింది. -
ఐఆర్సీటీసీ వెబ్సైట్లో బగ్ గుర్తించిన విద్యార్థి..!
చెన్నై: రైల్వే ఈ-టికెటింగ్ ప్లాట్‌ఫాం ఐఆర్సీటీసీలో పన్నెండో తరగతి విద్యార్థి గుర్తించిన బగ్‌ను సరిచేసినట్లు సెప్టెంబర్ 21న సీనియర్ అధికారి ప్రకటించారు. వివరాలోకి వెళ్తే.. చెన్నైలోని తాంబరం ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల రంగనాథ్ రైల్వే టికెట్ బుక్ చేద్ధామని భారత రైల్వే ఈ-టికెటింగ్ ప్లాట్‌ఫాం ఐఆర్సీటీసీకి వెళ్లాడు. గత నెలలో ఆగస్టు 30న టికెట్టు బుక్ చేసే సందర్భంలో వెబ్సైట్లో నెలకొన్న బగ్‌ను గుర్తించాడు రంగనాథ్. వెంటనే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌కు, ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌కు తెలియజేశాడు. చదవండి: గౌనులో పేలిన స్మార్ట్‌ఫోన్..! చర్యలకు సిద్దమైన కంపెనీ..! బగ్ సహయంతో ప్రయాణికుల డేటా హ్యకర్ల చేతిలోకి వెళ్తే ప్రమాదం ఉండటంతో ఐఆర్‌సీటీసీను రంగనాథ్ అప్రమత్తం చేశాడు. ఈ బగ్‌తో హ్యాకర్లు ప్రయాణికులకు సంబంధించిన పేరు, వయసు, ప్రయాణ వివరాలు, పీఏన్‌ఆర్ నంబర్, గమ్యస్థానం మొదలైనవి తెలుసుకునే అవకాశం ఉందని రంగనాథన్ ఐఆర్సీటీసీకి నివేదించాడు. అంతేకాకుండా హ్యకర్లు ప్రయాణికులకు తెలియకుండానే వారి టిక్కెట్టును కూడా రద్దు చేయవచ్చునని గుర్తించాడు. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో బగ్ ఉందని ఐటీ వింగ్ గుర్తించింది. వెబ్సైట్లో నెలకొన్న సమస్యను పరిష్కారం చేసినట్లు సెప్టెంబర్ 11 తారీఖున ఐటీవింగ్ నుంచి రంగనాథ్‌కు ఈ-మెయిల్‌ను పంపింది. గతంలో లింక్డ్ఇన్, యునైటెడ్ నేషన్స్, బైజూస్, నైక్, లెనోవో, అప్‌స్టాక్స్ వెబ్ అప్లికేషన్లలో భద్రతా లోపాలను గుర్తించాడు. చదవండి: Neeraj Chopra: అప్పుడేమో రాహుల్ ద్రావిడ్..ఇప్పుడు నీరజ్ చోప్రా..! సరికొత్త రూపంలో.. -
ఆ తప్పు చేయను; రూ.2 లక్షల జీతం ఇవ్వండి
న్యూఢిల్లీ : నకిలీ సాఫ్ట్‌వేర్‌తో భారతీయ రైల్వేకు కోట్ల రూపాయల నష్టం కలిగించిన నిందితుడు హమీద్ అష్రఫ్ ఓ ‘కొత్త’ ప్రతిపాదన తీసుకొచ్చాడు. విదేశాల్లో తలదాచుకుంటున్న అష్రఫ్ తనపై కేసులు ఎత్తివేసి ఎథికల్ హ్యాకర్‌గా నియమించుకోవాలని ఆఫర్ ఇచ్చాడు. అందుకోసం నెలకు రూ.2 లక్షలు జీతంగా ఇవ్వాలని రైల్వే భద్రతా దళం (ఆర్పీఎఫ్) డీజీకి విఙ్ఞప్తి చేస్తూ సందేశాలు పంపాడు. ఇక ఈ కేసులో ఇప్పటివరకు 28 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో అష్రఫ్‌కు గ్యాంగ్‌లో ఒకరైన గులాం ముస్తాఫా కూడా ఉన్నాడు. (చదవండి : ‘ఈ–టికెట్’ స్కాం బట్టబయలు) బెయిల్‌పై వచ్చి జంప్ అయ్యాడు.. ఐఆర్టీసీ నకిలీ వెబ్‌సైట్‌ను రూపొందించిన అష్రఫ్ దానిని భారీ మొత్తానికి కొందరికి అమ్మేశాడు. ఈ ఉదంతంపై ‘ఆపరేషన్ థండర్‌స్టార్మ్’ పేరుతో ఆర్పీఎఫ్ దర్యాప్తు ప్రారంభించింది. కుంభకోణంలో కీలకమైన గులాం ముస్తాఫాను అరెస్టు చేసింది. విదేశాలకు పారిపోయిన అష్రఫ్ కోసం గాలిస్తోంది. ఈ కుంభకోణం సూత్రధారులకు మనీ ల్యాండరింగ్, ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నట్లు కేసును ఛేదించిన ఆర్పీఎఫ్ డీజీ అరుణ్ కుమార్ తెలిపారు. మీడియాకు మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. ఈనేపథ్యంలోనే అష్రఫ్ కాళ్ల బేరానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, ఐఆర్టీసీ ఈ-టికెటింగ్ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపాల కారణంగానే తాను.. నకిలీ వెబ్సైట్ రూపొందించానని అష్రఫ్ చెప్పుకొచ్చాడు. ఐఆర్టీసీ వెబ్సైట్లో లోపాల్ని గతంలో తాను లేవనెత్తితే పిచ్చోడి మాదిరిగా చూశారని వెల్లడించాడు. తనను శిక్షిస్తే ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడదని.. మరికొంతమంది నకిలీ సాఫ్ట్వేర్ రూపొందించి మోసాలకు పాల్పడతారని పేర్కొన్నాడు. ఎథికల్ హ్యాకర్‌గా పనిచేసి భారతీయ రైల్వే ఈ-టికెటింగ్‌లో లోపాల్ని సరిచేస్తానని అష్రఫ్ సెలవిచ్చాడు. కాగా, 2016లో ఈ-టికెటింగ్‌కు సంబంధించి ఓ కేసులో అరెస్టైన అష్రఫ్ బెయిల్ పొందాడు. అనంతరం దుబాయ్‌కి జంప్ అయ్యాడు. -
ఐఆర్సీటీసీలో టికెట్ బుకింగ్ ఇక ఈజీ!
న్యూఢిల్లీ: ఐఆర్సీటీసీ ద్వారా రైళ్ల టికెట్లను బుక్ చేయడంలో ఎదురవుతున్న కష్టాలకు ముగింపు పలుకుతూ.. కొత్త తరం ‘ఈ టికెటింగ్’ వ్యవస్థను రైల్వే శాఖ ప్రారంభిస్తోంది. పూర్తిగా ఆధునీకరించిన ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ను రైల్వే మంత్రి సదానంద గౌడ బుధవారం ప్రారంభించనున్నారు. ఆ వెబ్సైట్లో ఆధునీకరణ తరువాత టికెట్ బుకింగ్ సామర్థ్యం నిమిషానికి ప్రస్తుతం ఉన్న 2000 టికెట్ల నుంచి 7200 టికెట్లకు పెరుగుతుంది.