E-verification
-
ఈ వెరిఫికేషన్ కోసం 68వేల ఐటీఆర్‌లు
న్యూఢిల్లీ: రిటర్నుల్లో ఆదాయం తక్కువ చూపించడం లేదా అసలు చూపించకపోవడానికి సంబంధించి ఆదాయపన్ను శాఖ 2019–20 సంవత్సరానికి 68,000 ఐటీఆర్‌లను ఈ–వెరిఫికేషన్ కోసం ఎంపిక చేసుకుంది. ఈ విషయాన్ని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చీఫ్ నితిన్ గుప్తా తెలిపారు. పన్ను చెల్లింపుదారుల వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లోని వివరాలు, రిటర్నుల్లో పేర్కొన్న వివరాలకు మధ్య పోలిక లేకపోతే ఆదాయపన్ను శాఖ ఈ–వెరిఫికేషన్ నోటీసు జారీ చేస్తుంది. దాంతో పన్ను చెల్లింపుదారులు సమాచారం మధ్య పోలిక లేకపోవడంపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ–వెరిఫికేషన్ నోటీసులో పేర్కొన్న సమాచారం నిజమేనని పన్ను చెల్లింపుదారులు గుర్తించినట్టయితే సవరించిన రిటర్నులు వేసి, అవసరమైతే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తాము 68,000 పన్ను చెల్లింపుదారులకు నోటీసులు ఇవ్వగా.. 35,000 కేసుల్లో సంతృప్తికరమైన వివరణ ఇవ్వడం లేదంటే సవరించిన రిటర్నులు వేసినట్టు గుప్తా తెలిపారు. ఇప్పటి వరకు 15 లక్షల సవరించిన రిటర్నులు దాఖలయ్యాయని, వీటి రూపంలో రూ.1,250 కోట్లు వసూలైనట్టు చెప్పారు. మరో 33,000 కేసులకు సంబంధించి ఇంకా సమాధారం రాలేదని.. వారు సవరించిన రిటర్నులు (2019–20 సంవత్సరానికి) వేసేందుకు మార్చి 31 వరకు సమయం ఉందన్నారు. -
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. రేపే చివరి తేదీ!
2020-21 మదింపు సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్)ని దాఖలు చేసి ఇంకా ఈ-వెరిఫై చేసుకోని వారు వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదాయపు పన్ను విభాగం సూచించింది. సాధారణంగా రిటర్నులు దాఖలు చేసిన 120 రోజుల్లో ఈ-వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ-వెరిఫై చేసుకోలేకపోతే వాటిని 'డీఫెక్టివ్ రిటర్న్' అని అంటారు. గత రెండేళ్లుగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎంతోమంది రిటర్నుల ఈ-వెరిఫైని పట్టించుకోలేదు. దీంతో ఐటీ విభాగం ఈ ఏడాది ఐటీఆర్-వీ లేదా ఈ-వెరిఫికేషన్ సమర్పించకపోవడం వల్ల వెరిఫికేషన్ కోసం పెండింగ్'లో ఉన్న అన్ని ఆదాయపు పన్ను రిటర్నులను ఫిబ్రవరి 28, 2022 వరకు ధృవీకరించవచ్చని పన్ను శాఖ డిసెంబర్ 28, 2021న జారీ చేసిన సర్క్యులర్'లో తెలిపింది. ఫిబ్రవరి 28 వరకు ఈ-వెరీఫై చేసుకొనే అవకాశాన్ని ఇచ్చింది. ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్, బ్యాంకు ఖాతా/డీమ్యాట్ ద్వారా ఈవీసీ ద్వారా ఇ-వెరిపై చేసుకునేందుకు వీలుంది. లేకపోతే.. సీపీసీ బెంగళూరుకు అక్నాలడ్డ్మెంట్ను పంపించాలి. లేకపోతే రిటర్ను సమర్పించినప్పటిక్సీ, అది చెల్లదు. Don’t miss the final chance to verify your ITR for AY 2020-21. Pl note that the ITR can be verified by several modes. The last date for verification is 28th February, 2022. Pl visit: https://t.co/GYvO3mStKf #ITR #VerifyNow pic.twitter.com/llkfxoppf3 — Income Tax India (@IncomeTaxIndia) February 26, 2022 (చదవండి: రష్యా - ఉక్రెయిన్ యుద్ధం..భారీగా పెరగనున్న స్మార్ట్ ఫోన్ ,ఎలక్ట్రిక్ కార్ల ధరలు?!) -
పాస్‌పోర్టుకు ‘ఈ–వెరిఫికేషన్’
నెల్లూరు: పాస్‌పోర్టు వెరిఫికేషన్ కోసం రోజుల తరబడి దరఖాస్తు దారుడు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. వెరిఫికేషన్ ప్రక్రియను సులభతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం (మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్) ఇటీవల ఉత్తర్వులు విడుదల చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై వెరిఫికేషన్ ప్రక్రియ దరఖాస్తు దారుడితో నిమిత్తం లేకుండానే ఆయా ప్రాంత పోలీసుస్టేషన్, డీసీఆర్బీలో అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీ ద్వారా (క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్)ను నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పాస్‌పోర్టు దరఖాస్తు స్పెషల్ బ్రాంచ్ కార్యాలయానికి వచ్చిన మూడు రోజులలోపే పూర్తి చేస్తారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మార్పు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి దరఖాస్తుదారుడితో నిమిత్తం లేకుండా వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో పాస్‌పోర్టు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న మరుసటి రోజు వెరిఫికేషన్ నిమిత్తం జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దరఖాస్తును డౌన్లోడ్ చేసుకొంటారు. దరఖాస్తు సమయంలో సమర్పించిన పుట్టిన తేదీ ధ్రువీకరణపత్రం, ఆధార్‌కార్డు, విద్యార్హత, పెళ్లికి సంబంధించిన డాక్యుమెంట్లను క్షేత్రస్థాయిలో పరిశీలన నిమిత్తం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లి పరిశీలించే వారు. చుట్టు పక్కల వారిని విచారించి దరఖాస్తుదారుడు ప్రవర్తనపై ఆరా తీయడంతో పాటు దరఖాస్తుదారుడి వద్ద సంతకాలు సేకరించేవారు. అతనిపై ఏవైనా కేసులు ఉన్నాయో లేవో ఆయా ప్రాంత పోలీస్స్టేషన్లలో తెలుసుకుని దాని ఆధారంగా నివేదిక తయారు చేసేవారు. ఈ ప్రక్రియ పూర్తిచేయడంలో అనేక సమస్యలు ఉండేవి. కొన్నిసార్లు దరఖాస్తుదారుడు అందుబాటులో లేకపోవడం, మరికొన్ని సార్లు వెరిఫికేషన్‌లో ఆలస్యం అవుతుండటం, కొన్నిచోట్ల వెరిఫికేషన్ పేరిట దరఖాస్తుదారుడి ఇబ్బందులకు గురిచేయడం తదితరాల కారణంగా పాస్‌పోర్టు రావడం ఆలస్యం అయ్యేది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్టు వెరిఫికేషన్ ప్రక్రియను సులభతరం చేసింది. వెరిఫికేషన్ పేరిట పోలీసులు వస్తే ఫిర్యాదు చేయండి పాస్‌పోర్టు వెరిఫికేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం సులభతరం చేసింది. దరఖాస్తుదారుడితో నిమిత్తం లేకుండా వెరిఫికేషన్ ప్రక్రియ రెండు, మూడు రోజుల్లో ఎస్బీ పోలీసులు పూర్తి చేస్తారు. వెరిఫికేషన్ పేరిట ఎవరైనా ఎస్బీ పోలీసులు దరఖాస్తుదారుడి ఇంటికి వస్తే వెంటనే స్పెషల్ బ్రాంచ్ కార్యాలయం, లేదా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ, సీఐలకు సమాచారం అందించాలి. – సత్యయేసుబాబు, ఇన్చార్జి ఎస్పీ -
ట్యాక్స్ రిటర్న్స్ ఇక సులభం..
న్యూఢిల్లీ: పన్ను రిటర్నుల ఈ-వెరిఫికేషన్ ప్రక్రియను సరళతరం చేసే దిశగా ఆదాయ పన్ను విభాగం చర్యలు తీసుకుంది. బ్యాంకు ఖాతాలు, డీమ్యాట్ ఖాతాల వివరాలను సమర్పించడం ద్వారా కూడా ఐటీఆర్‌ల ఈ-వెరిఫికేషన్ కోడ్లను పొందే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. పన్ను చెల్లిం పుదారు తన బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబరు వివరాలను ముందస్తుగా సమర్పిస్తే వాటిని ధ్రువీకరించుకున్న తర్వాత కోడ్లను ఈ-ఫైలింగ్ పోర్టల్ ఆయా చెల్లింపుదారుల ఫోన్ నంబరు, ఈమెయిల్‌కు పంపుతుంది. డీమ్యాట్ విషయంలో పాన్ నంబరు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ బ్యాం కింగ్, ఈమెయిల్ లేదా ఆధార్ నంబరు ద్వారా వన్ టైమ్ పాస్‌వర్డ్‌ను పొంది ఐటీఆర్‌లను ఎలక్ట్రానిక్ పద్ధతిలో పరిశీలించుకునే వీలు ఉంది. ఐటీ విభాగం. బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్‌కి పేపరు రూపంలో అక్నాలెడ్జ్మెంటు పంపే విధానానికి పూర్తిగా స్వస్తి చెప్పే దిశగా ఐటీ విభాగం ఈ చర్యలు చేపడుతోంది.