EAMCET Medical
-
శాసన మండలిలో..'ఎంసెట్ లీక్' పై దుమారం
ఎంసెట్ పేపర్ లీక్‌పై దుమారం డిప్యూటీ సీఎం, కన్వీనర్ రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ మెడికల్ ప్రశ్నపత్రం లీకేజీపై శాసన మండలిలో మరోమారు తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యవహారానికి బాధ్యత వహించి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, నాటి కన్వీనర్‌గా ఉన్న రమణారావు తమ పదవులకు రాజీనామా చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పట్టుపట్టింది. దర్యాప్తు ప్రారంభమై ఆరు నెలలు గడిచినా ప్రధాన సూత్రధారిని సీబీసీఐడీ కనిపెట్టలేక పోయినందున కేసును సీబీఐకి అప్పగించాలని, ప్రభుత్వం వెంటనే జుడీషియల్ ఎంక్వైరీకి ఆదేశించాలని ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. అయితే న్యాయ విచారణకు సర్కారు ససేమిరా అనడంతో విపక్ష సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు. ఇప్పటి వరకు 49 మంది అరెస్ట్: కడియం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అంతకు ముందు సమాధానమిస్తూ ఇప్పటి వరకు 49 మంది నిందితులను సీబీసీఐడీ అరెస్టు చేసిందని చెప్పారు. నిందితుల నుంచి రూ. 2.87 కోట్ల నగదు, రూ. 34 లక్షల విలువైన ఫ్లాట్, సఫారీ కారు, ల్యాప్‌ట్యాప్, 58 సెల్ఫోన్లను జప్తు చేసిందన్నారు. సీబీసీఐడీ సమగ్ర నివేదికను సమర్పించాక అవసరమైతే జ్యడిషియల్ ఎంక్వయిరీ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్రం పక్కనపెట్టింది: కేటీఆర్ ఐటీఐఆర్ ప్రాజెక్టును ఎన్డీయే ప్రభుత్వం పక్కన పెట్టిందని.. ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, పాతూరి సుధాకర్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు ఐటీ మంత్రి కేటీఆర్ బదులిచ్చారు. రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధికి కోసం కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే తగిన చర్యలు చేపడుతోందన్నారు. గత రెండేళ్లలో రాష్ట్రం నుంచి ఐటీ ఉత్పత్తులు 56 వేల కోట్ల నుంచి రూ. 77 వేల కోట్లకు పెరిగాయన్నారు. ఐటీ పరిశ్రమను జిల్లాలకు కూడా విస్తరిస్తున్నామని ఆయన తెలిపారు. సహకార సంఘాల ద్వారా విత్తనాలు: పోచారం అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘాల ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందించాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. రైతులకు నకిలీ విత్తనాలను సరఫరా చేసిన ఐదు కంపెనీలపై పీడీయాక్ట్ నమోదు చేశామని, 118 మంది డీలర్ల లైసెన్సులు రద్దు చేశామన్నారు. ఇతర ప్రశ్నలకు ప్రభుత్వ జవాబులు ► బీసీ కమిషన్ ఇచ్చే నివేదికను పరిశీలించాకే గ్రూపుల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం ఆలోచన చేస్తుందని బీసీ కులాల గ్రూపులను పునర్వ్యవస్థీకరణ అంశంపై ఎమ్మెల్సీ భూపతిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జోగురామన్న బదులిచ్చారు. ► హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల ఆవతల 705 కిలోమీటర్ల మేర రెండు ప్రాంతీయ రహదారులు ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధంగా ఉందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు జవాబిచ్చారు. ► నిర్వహణ వ్యయం పెరిగినందునే ఇటీవల ఆర్టీసీ చార్జీలను పెంచాల్సి వచ్చిందని, పొరుగు రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో చార్జీల పెంపు చాలా స్వల్పమని ఎమ్మెల్సీ పొంగులేటి అడిగిన ప్రశ్నకు రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి బదులిచ్చారు. -
ఏపీ మెడికల్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల
విజయవాడ (హెల్త్ యూనివ ర్సిటీ) : ఏపీలో ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం హాజరయ్యే ఎంసెట్ మెడికల్ అభ్యర్థులకు ఈనెల 12 నుంచి 17వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తున్నట్లు డా.ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ అనురాధ తెలిపారు. ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. విజయవాడ, వైజాగ్, తిరుపతి, హైదరాబాద్ జేఎన్టీయూ క్యాంపస్ లో హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. నిర్దేశిత తేదీ ల్లో ఏ హెల్ప్‌లైన్ కేంద్రంలోనైనా సర్టిఫికెట్ల పరిశీలనకు ఒరిజినల్ సర్టిఫికెట్లు, అటెస్ట్ చేసిన రెం డు సెట్ల జిరాక్స్ కాపీలతోపాటు రూ.1500 (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.800) రుసుము తో హాజరు కావాలి. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను హెచ్‌టీటీపీ://ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్ చూడొచ్చు. -
గుమాస్తా కుమార్తె టాపర్
ఎంసెట్ మెడికల్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన హేమలత విజయవాడ(గుణదల)/కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ప్రతిభకు ఆర్థిక స్థితిగతులు అడ్డంకి కాదని మధ్యతరగతి కుటుంబానికి చెందిన విద్యార్థిని రుజువు చేసింది. బట్టల దుకాణంలో గుమాస్తాగా పనిచేసే ఓ సాధారణ వ్యక్తి కుమార్తె ఎంసెట్-2016 మెడికల్ విభాగంలో తొలి ర్యాంకు సాధించి స్ఫూర్తిదాయకం గా నిలిచింది. శనివారం విడుదలైన ఎంసెట్ మెడికల్ ఫలితాల్లో కర్నూలు జోహరాపురానికి చెందిన మాచాని హేమలత మొదటి ర్యాంకు సాధించింది. కర్నూలులోని శ్రీనివాస క్లాత్ స్టోర్‌లో గుమాస్తాగా పనిచేస్తున్న మాచాని వీరన్న, చంద్రకళ దంపతుల రెండో కుమార్తె హేమలత. తన ముగ్గురు బిడ్డ లు చదువులో ఆణిముత్యాలని చెప్పారు. తన సంతానాన్ని ఉన్నత స్థానంలో నిలపడానికి నిరంతరం శ్రమిస్తున్నానని వీరన్న తెలిపారు. నాన్న కల నెరవేర్చిన హేమలత మాచాని వీరన్న, చంద్రకళ దంపతులకు ముగ్గురు ఆడ పిల్లలు సంతానం. పెద్ద కుమార్తె సౌజన్య ప్రస్తుతం మహానందిలో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతోంది. రెండో కుమార్తె హేమలత ఎంసెట్ మెడిసిన్‌లో స్టేట్ ఫస్టు ర్యాంకు సాధించింది. వీరిద్దరూ కర్నూలులోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియెట్ పూర్తి చేశారు. ఇక మూడో కుమార్తె విజయశ్రీ ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. తన ముగ్గురు కుమార్తెల్లో ఒక్కరినైనా డాక్టర్‌గా చూడాలనుకున్నారు మాచాని వీరన్న. ఎన్నో వ్యయప్రయాలసకోర్చి పిల్లలను చదివించారు. రెండో తనయ మాచాని హేమలత ఎంసెట్‌లో రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు సాధించి తండ్రి కలను సాకారం చేసింది. 2015లో 248వ ర్యాంకు 2015 ఎంసెట్ మెడికల్‌లో మాచాని హేమలత మొదటి ప్రయత్నంలోనే 248వ ర్యాంకు సాధించింది. అయితే, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. నిర్దేశిత వయసుకు 28 రోజులు తక్కువగా ఉండడంతో ఆమె అప్పట్లో వైద్య విద్యలో ప్రవేశం పొందలేకపోయింది. న్యూరో సర్జన్ అవుతా ‘చాలా ఆనందంగా ఉంది. రోజుకు పన్నెండు గంటలు కష్టపడేదాన్ని. నిరంతరం పుస్తకాలతోనే దోస్తీ చేసేదాన్ని. తల్లిదండ్రుల కల నెరవేర్చడానికి నిరంతరం కష్టడుతూనే ఉంటా. న్యూరోసర్జన్ కావాలన్నది చిరకాల కోరిక. నా విజయం వెనుక మా తల్లిదండ్రులు, అధ్యాపకుల కృషి చాలా ఉంది. ఇంటర్మీడియెట్‌లో 985 మార్కులు వచ్చాయి’ అని హేమలత చెప్పింది. ర్యాంకర్ల మనోగతం న్యూరాలజిస్ట్‌నవుతా... మాది రంగారెడ్డి జిల్లా కొత్తగూడ, నాన్న నరేంద్రరెడ్డి న్యాయవాది. అమ్మ గృహిణి. చిన్నప్పటి నుంచి డాక్టర్‌ను కావాలనే ఆకాంక్షతో ఇంటర్లో బైపీసీలో చేరాను. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల శిక్షణతో రెండో ర్యాంకు సాధించాను. న్యూరాలజిస్ట్ కావాలనేది నా ఆశయం. - ఎర్ల సాత్విక్‌రెడ్డి, రెండో ర్యాంకర్ తల్లిదండ్రుల ప్రోత్సాహం... సైదాబాద్‌కు చెందిన మా నాన్న సత్యనారాయణరెడ్డి సివిల్ ఇంజనీర్. నా అభీష్టం మేరకు ఇంటర్ బైపీసీలో చేర్పించారు. ఎంసెట్‌లో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఇంతటి విజయం సాధించా. న్యూరాలజిస్ట్ లేదా కార్డియాలజిస్ట్‌గా ప్రజలకు సేవ చేయాలనేది నా ఆకాంక్ష. - ఎ.యజ్ఞప్రియ, మూడో ర్యాంకర్ నగర కుర్రాడి సత్తా ఏపీ ఎంసెట్ మెడికల్‌లో నగరానికి చెందిన ఇక్రంఖాన్ సత్తా చాటాడు. 160 మార్కులు152 మార్కులు సాధించి ఐదో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. నారాయణగూడ నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ చదివిన ఇక్రం ఎంపీసీలో 987 మార్కులు సాధించాడు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చేయడమే తన లక్ష్యమని ఇక్రంఖాన్ తెలిపాడు. కార్డియాలజిస్ట్‌నవుతా బోయినపల్లికి చెందిన ఎస్.సాహితి సావిత్రి ఎస్ఆర్నగర్ చైతన్య కళాశాలలో ఇంటర్ చదివింది. మెడిసిన్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు సాధించింది. 160కు 152 మార్కులు తెచ్చుకుంది. ఇంటర్లో 982 మార్కులు సాధించింది. ఆమె తండ్రి రమణ ఐఎస్బీ లో, తల్లి దీప్తి సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నారు. భవిష్యత్తులో కార్డియాలజిస్టునయ్యి సేవలందించాల న్నది తన ఆకాంక్షని సాహితి తెలిపింది.