ఏపీ మెడికల్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల | Released Notification to AP Medical counseling | Sakshi
Sakshi News home page

ఏపీ మెడికల్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల

Published Thu, Jul 7 2016 1:47 AM | Last Updated on Mon, Sep 4 2017 4:16 AM

Released Notification to AP Medical counseling

విజయవాడ (హెల్త్ యూనివ ర్సిటీ) : ఏపీలో ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం హాజరయ్యే ఎంసెట్ మెడికల్ అభ్యర్థులకు ఈనెల 12 నుంచి 17వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తున్నట్లు డా.ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ అనురాధ తెలిపారు. ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు.

విజయవాడ, వైజాగ్, తిరుపతి, హైదరాబాద్ జేఎన్‌టీయూ క్యాంపస్ లో హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. నిర్దేశిత తేదీ ల్లో ఏ హెల్ప్‌లైన్ కేంద్రంలోనైనా సర్టిఫికెట్ల పరిశీలనకు ఒరిజినల్ సర్టిఫికెట్లు, అటెస్ట్ చేసిన రెం డు సెట్ల జిరాక్స్ కాపీలతోపాటు రూ.1500 (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.800) రుసుము తో హాజరు కావాలి. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను హెచ్‌టీటీపీ://ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్ చూడొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement