ముందస్తు బడ్జెట్‌కు ఈసీ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌ను ముందస్తుగా ఫిబ్రవరి 1నే ప్రవేశపెట్టడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. 2017 తొలినాళ్లలో ఐదు రాష్ట్రాల (పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా) శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ముందస్తు బడ్జెట్‌కు ఈసీ అడ్డు చెబుతుందేమోనన్న ఉద్దేశంతో కేంద్ర ఆర్థిక శాఖ ఈసీని వివరణ కోరింది. ముందస్తు బడ్జెట్‌కు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
బ్రిటిష్ కాలం నుంచి బడ్జెట్‌ను ఫిబ్రవరి నెల చివ రి పని దినాన ప్రవేశపెట్టడం ఆనవాయితీ. దీనివల్ల బడ్జెట్ ఆమోదం పొంది అమలవ్వడానికి జూన్ దాకా సమయం పట్టేది. ఈ ఏడాది నుంచి బడ్జెట్‌ను నెల ముందే ప్రవేశపెట్టి, చట్టపరమైన ప్రక్రియను త్వరగా పూర్తిచేసి, ఆర్థిక సంవత్సరం మొదలయ్యే ఏప్రిల్ 1 నుంచే బడ్జెట్‌ను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం బుధ లేదా గురువారాల్లో సమావేశమై, బడ్జెట్ తేదీని నిర్ణయించే అవకాశం ఉంది.