సీ-డాక్ తో ఈసీఐఎల్ ఒప్పందం..
హైదరాబాద్: నిత్యజీవితంలో వాడే అనేక పరికరాలకు ఇంటర్నెట్ అనుసంధానం చేయడానికి సీ-డాక్ సంస్థ రూపొందించిన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటి) సాంకేతిక పరిజ్ఞాణాన్ని వృద్ది చేసే బాద్యతలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేటషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) సంస్థకు అప్పగించారు. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వశాఖ సంచాలకులు అరుణాశర్మ సమక్షంలో సీ-డాక్ డెరైక్టర్ రజత్మూనా చేతుల మీదుగా ఈసీఐఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ పి. సుదాకర్ ఒప్పంద పత్రాలు అందుకున్నారు. సీ-డాక్ రూపొందించిన సాంకేతిక పరిజ్ఞాణంతో ఐఓటీ అవసరాలతో పాటుగా పరిశ్రమలను అభివృద్ది చేసేందుకు ఎంతగానో ఉపకరిస్తుందన్నారు.