ఇరిగేషన్ ఈఈపై రైతులు దాడి
బోధన్: నిజామాబాద్ జిల్లా రైతులు బోధన్ బై పాస్ రోడ్డు వద్ద ఆందోళనకు దిగారు. తమ పంట పొలాలకు సాగునీరు అందించాలంటూ రైతులు ధర్నా చేయడంతో రాకపోకలు స్తంభించాయి. పోలీసులు రంగప్రవేశంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరిగేషన్ ఈఈ సత్యశీల రెడ్డి పై రైతులు దాడికి యత్నించారు. ధర్నా చేస్తున్న రైతుల్లో శంకర్ అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో బోధన్ ఆస్పత్రికి తరలించారు.