గొంతెండుతున్న పల్లెలు
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : మాక్లూర్ మండలం వెంకటాపూర్ గ్రామం... 20రోజుల క్రితం ఈ గ్రామానికి నీరు అందించే ట్రాన్స్ఫార్మర్, సబ్మెర్సిబుల్ పంపులు చెడిపోయాయి. అధికారులు ఇప్పటివరకు వాటికి మరమ్మతులు చేయించలేదు. ఫలితంగా గ్రామస్తులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. రాత్రి పూట వ్యవసాయ బావుల వద్ద కెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. ఉదయం నుం చి రాత్రి వరకు కరెంటు ఉండకపోవడంతో నీటి కటకట ఏర్పడింది. జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో ఈ దుస్థితి నెలకొంది. ఇక జిల్లా సరిహద్దు గ్రామాలలో గ్రామీణుల తాగునీటి అవస్థలు చెప్పనలవి కాకుం డా ఉన్నాయి.
చుక్క నీరు లేదు
ఎండలు మండుతున్నాయి. తాగేందుకు నీరు దొరకడం లేదు. ఏకధాటిగా 12 గంటల నుంచి 14 గంటల వరకు కరెంటు సరఫరా లేకపోవడం ఇం దుకు ప్రధాన కారణమవుతోంది. మరోవైపు ప్ర త్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో ప్రజలు నీటికోసం గోస పడుతున్నారు. గ్రామాలలో
ఉన్న నీటి ట్యాంకుల వినియోగం సక్రమంగా లేదు. కొన్నిచోట్ల అవసరమైన మేరకు ట్యాంకుల నిర్మాణం లేనందున సరిపోయేంత నీరు అందుబాటులో ఉం డడం లేదు. ముఖ్యంగా జిల్లా సరిహద్దు ప్రాంతాలు, తం డాలలో నీటి కటకట ఏర్పడింది. గాంధారి, ఎల్లారెడ్డి, లింగంపేట, మద్నూరు, జుక్కల్, భీంగల్, సిరి కొండ, డిచ్పల్లి, కామారెడ్డి ప్రాంతాల్లో నీటి తీవ్రత ఎక్కువగా ఉంది. తండాలలోని వాగుల్లోని చెలిమలు, ఊట బావులనుంచి నీటిని తోడుకుంటున్నారు. మరికొన్ని చోట్ల వ్యవసాయ బావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఇందు కోసం కిలోమీటర్ల చొప్పు న కాలినడకన వెళుతున్నారు.
ఇదీ పరిస్థితి
జిల్లాలో 1,640 ఆవాస ప్రాంతాలు ఉండగా, 1,054 ఆవాస ప్రాంతాలకు నీటి సరఫరా ఉంది. 590 ఆవా స ప్రాంతాలకు పాక్షికంగా నీటి సరఫరా అవుతోంది. 159 ఆవాస ప్రాంతాలు సురక్షితం కానివి. ఈ ప్రాంతాలకు సీపీడబ్ల్యూ పథకం ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం. అధికారులు చెబుతున్న వివరాలు ఇవి. కాగా క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరే విధంగా ఉంది. అధికారులు చెప్పినట్లు 1,054 ఆవాస ప్రాంతాలకు కాకుండా, 600 ఆవాస ప్రాంతాలకు కూడా నీటి సరఫరా అందుబాటులో లేదు.
590 ప్రాంతాలకు పాక్షికంగా నీటి సరఫరా ఉందని పేర్కొనడంలోనూ నిజం లేదు. వంద ప్రాంతాలకు కూడా సక్రమంగా నీరు అందడం లేదు. 39 బోర్లను అద్దెకు తీసుకుని, 31 ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలపడం మరీ పచ్చి అబద్ధంగా కనిపిస్తోంది. బోర్ల నుంచి నీటిని అందించేందుకు కరెంటు సదుపాయమే లేదు. అయి నా అధికారులు వీటిని లెక్కలోకి తీసుకుంటున్నారు. అద్దె ట్యాంకర్ల ద్వారా గ్రామాలకు నీటి సరఫరా నామమాత్రంగానే ఉంటోంది. ఈ ఏడాది వేసవి ప్రణాళికలో భాగంగా రూ. 1.50 కోట్లతో ప్రణాళిక లు సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అయి తే ఆ ప్రణాళికలు ఎక్కడా అమలవుతున్నట్లు కని పించడం లేదు.
జిల్లాలో 347 బోర్లు, చేతిపంపులకు ఫ్లషింగ్, డిఫెనింగ్ చేసినట్లు అధికారులు రికార్డులలో చూపుతున్నారు. చేతిపంపుల వినియోగం అక్కడక్కడ మాత్రమే ఉంది. వేసవి కాలంలో చేతిపంపులే ప్రధాన నీటి వనరులుగా ఉపయోగపడతాయి. వీటి ని పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా అంతటా అధికారులు ఎన్నికల నిర్వహణలో నిమగ్నమయ్యారు. దీంతో నీటి ఎద్దడిపై చర్యలు తీసుకునేందుకు తీవ్ర ఆటం కాలు ఎదురవుతున్నాయి. అధికారులు ప్రధానమైన నీటి అవసరాలను పట్టించుకోకపోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.