Emperor of Corruption
-
‘రఫేల్ కంటే అమరావతి స్కామ్ పెద్దది’
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అతని అనుచరగణం చేసిన అవినీతి, అక్రమాలను ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఎండగడుతోంది. ఢిల్లీ వేదికగా అటు ప్రత్యేక హోదాపై, ఇటు టీడీపీ ప్రభుత్వ అరాచక పాలనపై ఆ పార్టీ ఎంపీలు, సీనియర్ నాయకులు గళం వినిపిస్తున్నారు. ‘చంద్రబాబు ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ అనే పుస్తకాన్ని వైఎస్సార్సీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు, సీనియర్ నేతలు ఢిల్లీలో సోమవారం విడుదల చేశారు. కాదేదీ అవినీతికి అనర్హమన్నట్టుగా చంద్రబాబు దోపిడీ పాలన సాగుతోందని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు నిజ స్వరూపం చెప్పడానికే ఈ పుస్తకమని తెలిపారు. చంద్రబాబు, అతని అనుచరులు అమరావతి నుంచి పోలవరం నిర్మాణం వరకు 6 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతి కార్యకలాపాల కోసమే చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేస్తున్నాడని రాజ్యసభ సభ్యుడు విజసాయిరెడ్డి అన్నారు. ఏపీలో పుట్టిన ప్రతి బిడ్డపై అప్పుల భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రఫెల్ కంటే అమరావతి స్కామ్ పెద్దది.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరుగుతోందని కాగ్ స్పష్టం చేసిందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. రఫేల్ కంటే అమరావతి స్కామ్ పెద్దదని వాటర్ మాన్ రాజేంద్ర సింగ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. 600 హామీలిచ్చిన తెలుగుదేశం పార్టీ ఒక్కటీ కూడా అమలు చేయలేదని రాజ్యసభ్యుడు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అవినీతి పాలనపై సాక్షాత్తూ ఇద్దరు చీఫ్ సెక్రటరీలు బహిరంగంగా విమర్శలు చేశారని చురకలంటించారు. -
మంత్రి లోకేశ్ శాఖలో అవినీతి దందా
-
’అవినీతి చక్రవర్తి పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి’
చంద్రబాబు ఏరకంగా అవినీతికి పాల్పడ్డారో ప్రజలకు వివరించాలి: అంబటి రాంబాబు గుంటూరు: ప్రస్తుతం అవినీతి చక్రవర్తి ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఈ రాష్ట్రాన్ని గత మూడేళ్లుగా పాలిస్తున్న సీఎం చంద్రబాబే ఆ అవినీతి చక్రవర్తి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రంలో ప్రతిచోటా అవినీతి నెలకొని ఉందని, ఇందుగలదు.. అందు లేదు అనే సందేహం లేదనే రీతిలో అవినీతి రాష్ట్రంలో పాకిపోయిందని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆవిష్కరించిన 'చంద్రబాబు అవినీతి చక్రవర్తి' పుస్తకం గురించి అంబటి వివరించారు. 'రాజుల గొప్పతనాల గురించి కవులు, రచయితలు పుస్తకాలు రాయడం చూశాం. కానీ ఒక ముఖ్యమంత్రి అవినీతి మీద పుస్తకం రాశామంటే అది ఏ స్థాయిలో ఉందో ప్రజలే అర్థం చేసుకోవాలి. ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అనే పుస్తకం గత ప్లీనరీ సమావేశాల్లో ఒక ఎడిషన్ విడుదల చేశాం. మూడేళ్ల కాలంలో జరిగిన అవినీతిపై మరో ఎడిషన్ ప్రచురించాం' అని అన్నారు. 'మొదటి పుస్తకంలో రూ. 1,45,549 కోట్ల మేర అవినీతికి చంద్రబాబు పాల్పడ్డారంటూ ఆధారాలతో కూడిన వివరాలిచ్చాం. రెండో పుస్తకంలో రూ. 3 లక్షల 75 వేల 8 కోట్ల అవినీతికి చంద్రబాబు పాల్పడ్డారని ఆధారాలతోసహా ముద్రించాం. ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ చదవాలి. చంద్రబాబు ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారో.. ఏ రకంగా డబ్బులు వెనకేసుకున్నారో ఆధారాలతో సహా ఇందులో వివరంగా పొందుపర్చాం' అని అన్నారు. 'చంద్రబాబు అవినీతి చక్రవర్తి' పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలకు అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. 'పురాణాల్లో హిరణ్యకశకుడు ప్రహ్లాదుడిని మీ హరి ఎక్కడున్నాడని అడుగుతాడు.. అప్పుడు ప్రహ్లాదుడు ఇందుగలడందులేడనే సందేహం వలదు.. ఎందెందు వెతికినా అందందు కలడు అని మంచి మాట చెబుతాడు. దానినే మనం అన్వయించుకుంటే ఇందుగలదు.. అందు లేదనే సందేహం వలదు. రాష్ట్రంలో ఎందెందుకు వెతికినా చంద్రబాబు అవినీతికి కలదు' అని అంబటి దుయ్యబట్టారు. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రాన్ని తొమ్మిది ఏళ్లు పాలించినప్పుడు.. హైటెక్ సిటీ పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేశారని, హైటెక్ సిటీ ఎక్కడ వస్తుందో ముందుగానే ఎంపీ మురళీమోహన్‌కు చెప్పి.. అక్కడ భూములు కొన్న తర్వాత హైటెక్ సిటీ ప్రకటించారని, ఆ తరవాత మురళీమోహన్ కొన్న భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారన్నారని విమర్శించారు. అదేవిధంగా ఇప్పుడు రాజధాని ప్రాంతంలో కూడా వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. లోకేష్ బినామీలకు ముందుగానే లీకులు ఇచ్చి ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేయించి.. పెద్ద భూ కుంభకోణానికి చంద్రబాబు పాల్పడ్డారని అన్నారు. విశాఖ ప్రాంతంలో భూముల రికార్డులను తారుమారు చేసి లక్షల కోట్ల రూపాయల భూములను తెలుగుదేశం నేతలకు కట్టబెట్టారన్నారు. ఈ పుస్తకంలోని బాబు అవినీతి గురించి వివరంగా చెప్పాలంటే రెండు ప్లీనరీలు పెట్టినా సరిపోదని, జిల్లా కేంద్రాల్లో కౌంటర్లు ఓపెన్ చేశామని, అవినీతి చక్రవర్తి పుస్తకం ప్రతీ జిల్లాలో అందుబాటులో ఉంటుందని చెప్పారు. -
చంద్రబాబు అవినీతిపై ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు గడిచిన మూడేళ్లలో సాగించిన అవినీతిపై ముద్రించిన ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఈ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో సీఎం చంద్రబాబు చేసిన అవినీతిపై ఆధారాలతో సహా ఈ పుస్తకాన్ని ముద్రించడం జరిగిందన్నారు. ఆయన సాక్ష్యాత్తూ రూ.3 లక్షల 75వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. అందులో లక్షకోట్ల కుంభకోణంలో ఒక్క రాజధాని ప్రాంతం భూముల మీద అయితే, మరొకటీ విశాఖలో భూముల మీద జరిగిన కుంభకోణం అన్నారు. ఇవి కాకుండా చంద్రబాబు నాయుడు వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కాంట్రాక్టులకు సంబంధించి అన్ని ఆధారాలతో ఈ పుస్తకాన్ని రూపొందించామన్నారు. ఈ పుస్తకాన్ని ప్రతి గ్రామంలోకి తీసుకు వెళ్లాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు సూచించారు. వాస్తవానికి చంద్రబాబు ‘అవినీతి చక్రవర్తి’ పేరుతో వైఎస్ఆర్ సీపీ ఏడాది కిందటే ఒక పుస్తకాన్ని ప్రచురించింది. అయితే ఈ ఏడాది కాలంలో చోటు చేసుకున్న మిగిలిన అన్ని కుంభకోణాలను జతచేసి, గత కుంభకోణాల జమా లెక్కలను అప్డేట్ చేసి ఈ పుస్తకాన్ని పునర్ముద్రించింది. మొత్తం 56 కుంభకోణాలకు సంబంధించి అవినీతి చోటు చేసుకున్నది అది తేల్చినట్లు తెలుస్తోంది. ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ పుస్తకం కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సంచలనం.. ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’
♦ బాబు అవినీతిని బయటపెట్టిన పుస్తకం ♦ ఢిల్లీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన వైనం హైదరాబాద్, సాక్షి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అవినీతి ద్వారా రూ.1.34 లక్షల కోట్లు సంపాందించి, ఆ సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బహిరంగంగానే కొనుగోలు చేస్తుండడాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్ష్యాధారాలతో సహా వివరించిన వైనాన్ని చూసి ఢిల్లీ రాజకీయ వర్గాలు నివ్వెరపోయాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై ప్రతిపక్ష పార్టీ నేరుగా ఆరోపణలు చెయ్యడం, ప్రతి కుంభకోణానికి సంబంధించిన వివరాలను సంఖ్యలతో సహా పుస్తక రూపంలో ప్రచురించి కేంద్ర మంత్రులకు, వివిధ పార్టీల జాతీయ నేతలకు అందించడం ఢిల్లీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘సేవ్ డెమొక్రసీ’ ఉద్యమంలో భాగంగా వైఎస్సార్సీపీ ప్రచురించిన ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ పుస్తకం చంద్రబాబు అవినీతిపై సంధించిన ఒక బ్రహ్మాస్త్రం. గత 23 నెలల్లో చంద్రబాబు ఏయే ప్రాజెక్టుల్లో ఎంతెంత దోచుక్నునదీ, తన పార్టీ మనుషులకి, బినామీలకు ఎంతెంత దోచిపెట్టిందీ ఈ పుస్తకం పూర్తి సాక్ష్యాధారాలతో సహా వివరించింది. రాజధాని అభివృద్ధి పేరుతో జరిగిన రియల్ ఎస్టేట్ లావాదేవీలు, విద్యుత్ టెండర్లు, ప్రాజెక్టు కాంట్రాక్టుల్లో భారీగా జరిగిన అవకతవకలు, ఆ అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న తీరును ఈ పుస్తకం బహిర్గతం చేసింది. రాజధాని ఎక్కడ రాబోతుందో ముందే తెలిసినా ఆ విషయాన్ని చంద్రబాబు తన బినామీలకే చెప్పడం, రాజధాని రాబోయే ప్రాంతం గురించి ‘మీడియా లీకుల’ద్వారా ప్రజలను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించడం, తద్వారా అమరావతి ప్రాంతంలో భూముల ధరలు పడిపోయేటట్లు చేయడాన్ని ఈ పుస్తకం సవివరంగా బయటపెట్టింది. తప్పుడు ప్రచారంతో దళితులను భయభ్రాంతులకు గురిచేసి, వారికి చెందిన అసైన్డ్ భూములు, లంక భూములను తెలుగుదేశం పార్టీ నేతలు ఏ విధంగా తక్కువ ధరలకు కొనుగోలు చేశారో ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకం కళ్లకు కట్టినట్లుగా చూపింది. అంతేకాకుండా రాజధానిలో బినామీలు కొనుగోలు చేసిన భూముల ధరలను రెట్టింపు చేసేందుకు జోనింగ్ విధానాన్ని తీసుకురావడం గురించి తెలియజేసింది. జోనింగ్ విధానం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు వేలాది మంది రైతుల భూముల ధరలు పడిపోయేలా చేసి, వారి బతుకుల మీద ఏ విధంగా దెబ్బకొట్టారో ఈ పుస్తకం వెల్లడించింది. చంద్రబాబు అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలు, విద్యుత్ టెండర్లు, ప్రాజెక్టుల ఖర్చును నింబంధనలకు విరుద్దంగా ఎన్నో రెట్లు పెంచి, రాష్ట్ర ఖజానాను ఆయన తనయుడు ఏ విధంగా కొల్లగొట్టారో ఈ పుస్తకం ప్రాజెక్టుల వారీగా వివరించింది. తమ పార్టీకి తగినంత మెజారిటీ ఉన్నా, రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమే ఉండకూడదన్నట్లుగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు రూ.30 కోట్ల నుంచి 40 కోట్ల అవినీతి సొమ్మును ఆఫర్ చేసి చంద్రబాబు కొనుగోలు చెయ్యడాన్ని ఎంపరర్ ఆఫ్ కరప్షన్ చర్చించింది. అభివృద్ధికి, నీతి నిజాయతీలకు మారు పేరునని చెప్పుకునే చంద్రబాబు చర్యలను విన్నప్పుడు అధికార బీజేపీ నుంచి, ప్రతిపక్ష సీపీఎం వరకూ అన్ని పార్టీల నేతలూ దిగ్భ్రాంతికి గురయ్యారు.