'ఇరు రాష్ట్రాల వివాదాన్ని కేంద్రం పరిష్కరించాలి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏర్పడ్డ ఉద్యోగుల విభజన వివాదంపై ఏకాభిప్రాయం రాలేదు. మంగళవారం ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మలు సమావేశమై చర్చించారు.
అనంతరం కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ తొలగించిన విద్యుత్ ఉద్యోగులకు 2 నెలలుగా జీతాలు లేక బాధపడుతున్నారని అన్నారు. ఉద్యోగుల విభజన వివాదంపై ఏకాభిప్రాయం రాలేదని చెప్పారు. స్థానికత ఆధారంగా తొలగించామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోందని, తాము జనాభా ప్రతిపదికన విభజించాలని కోరామని తెలిపారు. అన్ని వివాదాల్లోనూ సమస్య ఇలానే ఉందని, ఉద్యోగుల విభజన కొలిక్కిరాలేదని కృష్ణారావు చెప్పారు. ఇరు రాష్ట్రాల వివాదాన్ని కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.