‘ఇంజినీరింగ్’ సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం
కేయూ క్యాంపస్ / పోచమ్మమైదాన్ : ప్రస్తుత విద్యాసంవత్సరం ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి సర్టిఫికెట్ల పరిశీలన గురువారం ప్రారంభమైంది. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలల్లో సెంటర్లు ఏర్పాటుచేశారు. కేయూలో అడ్మిషన్ల డెరైక్టరేట్లో 17,001 నుంచి 25వేల వరకు ర్యాంకు వచ్చిన విద్యార్థులను పిలవగా, 300 మంది వరకు సర్టిఫికెట్ల పరిశీల నకు హాజరయ్యారు.
ఈ కేంద్రాన్ని ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంఏ.సింగరాయచార్య పరిశీలన పత్రాలను విద్యార్థులకు అందజేశారు. కేయూ అడ్మిషన్ల డెరైక్టర్ డాక్టర్ నర్సింహాచారితో పాటు ఇ.సురేష్‌బాబు, డాక్టర్ ఎ.సదానందం, ఎన్.రమణ, గురురాజ్, కె.సుమలత పాల్గొన్నారు. అలాగే, హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ కేంద్రంలో 9,001 నుంచి 17వేల ర్యాంకు వచ్చిన విద్యార్థులను పిలవగా 270 మంది సర్టిఫికెట్లు పరిశీలన చేయించుకున్నారు. కార్యమ్రాన్ని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.భద్రునాయక్ పరిశీలించగా, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.రామానుజరావు, డాక్టర్ రమేష్‌కుమార్, ప్రొఫెసర్ గంగాధరరెడ్డి, డాక్టర్ నరేందర్ పాల్గొన్నారు.
పాలిటెక్నిక్‌లో..
వరంగల్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రానికి తొలిరోజు 1 నుంచి 9వే ల ర్యాంకు వరకు పిలవగా 163 మంది విద్యార్థులు హాజరయ్యారు. హెల్ప్‌లైన్ సెంటర్ ఇన్చార్జ్ శంకర్‌తో పాటు వెంకటనారాయణ, అభినవ్, యుగేందర్‌రెడ్డి, రాఘవులు, పోచయ్య, అప్పారావు పాల్గొన్నారు.
వన్‌టైం పాస్‌వర్డ్‌పై అవగాహన
సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న విద్యార్థులకు బ్యాచ్‌ల వారీగా వన్‌టైం పాస్‌వర్డ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. గత సంవత్సరం స్క్రా చ్ కార్డులు ఇవ్వగా, ఇందులో పలు లోపాలు ఉన్నాయని తేలడంతో ప్రస్తుతం వన్ టైం పాస్వర్డ్ విధానా న్ని ప్రారంభించారు. ప్రతీ విద్యార్థి రిజిస్ట్రేషన్ సందర్భంగా సెల్ నంబర్‌ను దరఖాస్తులో పేర్కొనాల్సి ఉం టుంది. ఈ మేరకు వెబ్ఆప్షన్లు నమోదు చేసుకునే ముందు రోజు కన్వీనర్ నుంచి లాగిన్ ఐడీతో పాటు వన్ టైం పాస్‌వర్డ్‌ను మెసేజ్ ద్వారా పంపిస్తారు.
దాన్ని ఉపయోగించుకుని అభ్యర్థులు తమ పుట్టిన రోజు, హాల్‌టికెట్ ఫీడ్ చేస్తే వెబ్ తెరుచుకుంటుంది. అయితే, ఎన్నిసార్లైనా వెబ్ ఆప్షన్లు మార్చుకునే వెసులుబాటు ఉండగా, ప్రతీసారి పాస్వర్డ్ మారుతుంటుంది. ఇక విద్యార్థులు కూడా పాస్‌వర్డ్‌ను మార్చుకునే వెసులుబా టు ఉంది. ఈ మేరకు 17వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే విధానం అందుబాటులోకి వస్తుంది. కాగా, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవా రం, కుటుంబ, సామాజిక, ఆర్థిక సర్వేను పురస్కరించుకుని ఈనెల 19వ తేదీన సర్టిఫికెట్ల పరిశీలన ఉండదని అధికారులు తెలిపారు.