enterprenuership
-
ఎంటర్ప్రెన్యూర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన లాయర్! ఏకంగా ఆరుసార్లు కేన్స్..!
ఓ మహిళ ఒక తల్లిగా, వ్యాపారవేత్తగా, మోడల్‌గా రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. లాయర్ నేపథ్యం నుంచి పూర్తి విరుద్ధ రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతోంది. అంతేగాదు ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అద్భుతమైన డిజైనర్ డ్రెస్‌లో మెరిసింది. ఇంతకీ ఎవరంటే ఆమె..దక్షిణాసియా ఇన్ఫ్లుయెన్సర్, మహిళా వ్యాపార వేత్త అయిన దీపా బుల్లెర్ ఖోస్లా శక్తిమంతమైన మహిళ. విభిన్న రంగాల్లో దూసుకుపోతూ కూడా ఓ తల్లిగా సమర్థవంతంగా బాధ్యతలను నిర్వహిస్తోంది. ఆమె కంటెంట్ క్రియేటర్‌గా, సామాజకి కార్యకర్తగా విధులు నిర్వర్తిస్తూనే వ్యాపార రంగంలో ప్రభంజనం సృష్టిస్తోంది. అంతేగాదు ముంబై ఆమ్స్టర్డామ్ ఆధారిత ఎంటర్‌ప్రెనూర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 2.1 మిలియన్ ఫాలోవర్స్‌ని కలిగి ఉంది. మరోవైపు అందం, ఫ్యాషన్‌కి సంబంధించిన వ్యాపార రంగాలను విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇక ఫ్రాన్స్‌లో అట్టహాసంగా జరుగుతున 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ప్రఖ్యాత డిజైనర్ వాల్డ్రిన షైతీ షెల్ఫ్ రూపొందించిన మెటాలిక్ స్ట్రక్చర్డ్ డ్రెస్‌లో గ్లామరస్‌గా కనిపించింది. ముఖ్యంగా ఆమె డిజైనర్ డ్రెస్ ముందుభాగంలో ఉన్న లోహ గులాబీ హైలెట్‌గా నిలిచింది. అందుకు తగ్గట్లుగా బాబ్ స్టైల్ హెయిర్ మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి ఆమెకు. ఈ ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఈవెంట్లో తన అత్యాధుని ఫ్యాషన్ డిజైనర్‌వేర్ డ్రెస్‌తో అందర్నీ మెస్మరైజ్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలకు "బ్యాక్ ఎట్ ది కార్పెట్ అట్ ఆల్ స్టార్ట్... హోమ్‌కమింగ్ @festivaldecannes" అనే క్యాప్షన్ తోపాటు హార్ట్ ఎమోజీని జోడించి మరీ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ఐతే ఆమె ఈ కేన్స్ ఈవెంట్లో గత ఆరేళ్లుగా పాల్గొంటుందట. ఆమె నేపథ్యం..దక్షిణాసియా ఇన్ఫ్లుయెన్సర్ తన పాఠశాల విద్యను ఊటీలో పూర్తి చేసింది. తల్లి డాక్టర్ కావడంతో తాను కూడా అదే వృత్తిలో ఉండాలనుకుంది. ఐతే ఇంటర్నషిప్లో తన ఆలోచనను మార్చుకున్నట్లు పేర్కొంది. ఆ తర్వాత అంతర్జాతీయ మానవ హక్కుల చట్టంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి అయిన వెంటనే నెదర్లాండ్స్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టోలో న్యాయవాదిగా పనిచేసింది. తదనంతరం లండన్‌లోని యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు, ఐఎంఏ ఇన్ఫ్లుయెన్సర్ ఏజెన్సీలో ఇంటర్న్‌షిప్ చేసింది. అయితే ఎంతోకాలం న్యాయవాద వృత్తిలో కొనసాగలేదు. మళ్లీ డిజట్ కంటెంట్ క్రియెటర్‌గా కెరీర్‌గా ఎంచుకుని మరీ దూసుకుపోయింది. ఇక 2022లో తన బ్యూటీ బ్రాండ్ ఇండెవైల్డ్ను ప్రారంభించింది. తన తల్లి నుంచి ప్రేరణ పొందిన ఆయుర్వేదం బ్రాండ్‌లో పాతుకుపోయింది. చర్మ రక్షణలో ప్రామాణిక ఉత్పత్తులే బెటర్ అని భావించి ఇటువైపు దృష్టి సారించి వ్యాపారవేత్తగా మారింది. 32 ఏళ్ల దీపా తన భర్త డచ్ దౌత్యవేత్త ఒలేగ్ బుల్లెర్తో కలిసి లాభప్రేక్షలేని పోస్ట్ ఫర్ చేంజ్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసింది. ఇది లింగ సమానత్వంపై యూఎస్ UN సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలను పరిష్కరించేందుకు సోషల్ మీడియా శక్తిని వినియోగించుకుంటుంది. ఇన్ని రంగాల్లో రాణిస్తూ బిజీగా ఉన్న కుటుంబం కోసం కూడా కొంత సమయాన్ని కేటాయిస్తుంది. ముఖ్యంగా దీపాకి నాలుగేళ్ల కూతురు దువాతో స్పెండ్ చేయడం మహా ఇష్టం. "సహనానికి ప్రాధాన్యత ఇస్తూ.. ప్రతీది వెంటనే చేయనవసరం లేదని, అలా అని ప్రతి అడుగు వెనక్కి వేసి బ్రేక్ తీసుకోవడం కూడా సరైనది కాదు" అంటుంది దీపా. తన కలలన్నింటిని సాకారం చేసుకుంటూ విజయవంతంగా దూసుకుపోవతూ.. ఎందరో మహిళా పారిశ్రామికవేత్తలందరికీ ఆదర్శంగా నిలిచింది దీపా బుల్లెర్ ఖోస్లా . View this post on Instagram A post shared by Diipa Büller-Khosla (@diipakhosla) (చదవండి: 800 ఏళ్ల నాటి వ్యాయామం..దెబ్బకు ఒత్తిడి, అలసట మాయం!) -
మీ దగ్గర ఐడియా ఉందా..! ఐతే చలో అంటున్న స్టార్ట్ అప్
‘వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటున్నాను. డబ్బు లేదు’ అనే వాళ్లలో చాలామందికి ఐడియా ఉండదు. అంటే... ఏ వ్యాపారాన్ని ప్రారంభించాలి, ఎక్కడ ప్రారంభించాలి, ఎప్పుడు ప్రారంభించాలి... మొదలైన విషయాలపై అవగాహన ఉండదు. ‘అద్భుతమైన ఐడియా’ మన దగ్గర ఉంటే వ్యాపారం ప్రారంభించడానికి పెట్టుబడి అనేది పెద్ద సమస్య కాదని యువతరంలో ఎంతోమంది నిరూపించారు. ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ నుంచి ‘ఇండియన్ స్టార్టప్ స్టోరీస్’ లాంటి ఎన్నో టీవీ షోల ద్వారా స్ఫూర్తి పాంది ఎంటర్ప్రెన్యూర్ కావాలని కలలు కంటున్న యువతరం ఆ కల దగ్గరే ఆగిపోవడం లేదు. దానిని సాకారం చేసుకోవడానికి ఎంతో ఇష్టంగా కష్టపడుతున్నారు... ‘షార్క్ ట్యాంక్ అమెరికా కార్యక్రమాన్ని ఇష్టంగా చూసేదాన్ని. డల్లాస్ మావరిక్స్ ఓనర్ మార్క్ క్యూబన్, బ్రాక్ సిస్టమ్స్ ఫౌండర్ రాబర్ట్ హర్జెవెక్, ఫర్ యువర్ ఈజీ వోన్లీ ఫౌండర్, ప్రెసిడెంట్ లారీ గ్రైనర్లు ఎంతోమంది ఎంటర్ప్రెన్యూర్లు కావడానికి సహాయం అందించారు. షార్క్‌ట్యాంక్ ఇండియన్ వెర్షన్ విషయంలో మొదట్లో ఆసక్తి ఉండేది కాదు. ఆ తరువాత మాత్రం ఆసక్తి పెరిగింది’ అంటుంది ముంబైకి చెందిన సైకాలజీ స్టూడెంట్ అహానా గుప్తా. ‘ఒక స్టార్టప్ విజయవంతం కావడానికి ఏ అంశాలు తోడ్పడతాయి, మార్కెట్‌కు సంబంధించిన సాధ్యాసాధ్యాలు ఏమిటి, వెంచర్ క్యాపిటలిస్ట్ను ఒప్పించడానికి ఎలాంటి ప్రణాళికను అనుసరించాలి... మొదలైనవి షార్క్ ట్యాంక్లాంటి టీవీ కార్యక్రమాల ద్వారా నేర్చుకున్నాను’ అంటుంది కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ స్టూడెంట్ సుతీర్థ సుహా. ‘డిస్కవరీ ప్లస్‌లో ఇండియన్ స్టార్టప్ స్టోరీస్ చూశాను. చూస్తున్న క్రమంలో నాకు తెలియకుండానే బిజినెస్, ఎంటర్ ప్రెన్యూర్షిప్ విషయాలపై ఆసక్తి పెరిగింది’ అంటుంది చెన్నైకి చెందిన ఎంబీఏ స్టూడెంట్’ శ్రేయా ఘోష్. ‘స్టార్టప్‌లకు సంబంధించిన పరిజ్ఞానానికి పెద్ద నగరాలలో చదవాల్సిన పనిలేదని, ఐఐటీలు, ఐఐఎంలు మాత్రమే స్టార్టప్‌లను విజయవంతంగా సృష్టించగలవనే మూస ధోరణిని స్టారప్లను దృష్టిలో పెట్టుకొని రూపాందించిన టీవీ కార్యక్రమాలు బ్రేక్ చేస్తున్నాయి’ అంటుంది దిల్లీకి చెందిన స్టాటిస్టిక్స్ స్టూడెంట్ సప్తర్షి. ‘ఒక కంపెనీ ఈక్విటీ, వాల్యుయేషన్‌ను అర్థం చేసుకోవడానికి ఏ అంశాలు దోహదపడతాయి, మార్కెట్ నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటీ... వంటివి షార్క్ ట్యాంక్ ద్వారా తెలుసుకున్నాను’ అంటుంది వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ స్టూడెంట్ సహేలి సాహు. అహానా, సుతీర్థ, శ్రేయ, సప్తర్షి, సహేలి మాత్రమే కాదు... ఇంజినీరింగ్, కామర్స్, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్... తాము చదువుతున్నది ఏదైనా సరే దేశవ్యాప్తంగా ఎంతోమంది స్టూడెంట్స్ స్టార్టప్‌లకు సంబంధించి టీవీలో వచ్చే రకరకాల కార్యక్రమాల ద్వారా ్రపాక్టికల్–లైఫ్ బిజినెస్ నాలెడ్జ్‌ను సొంతం చేసుకుంటున్నారు. ఎంటర్‌ప్రెన్యూర్స్, బిజినెస్ స్ట్రాటజీల గురించి వివరంగా తెలుసుకోవడమే కాదు వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెడుతున్నారు. షార్క్ ట్యాంక్ మాత్రమే కాదు బిలియన్ డాలర్ బయర్(వూట్ టీవీ నెట్వర్క్), సిలికాన్ వ్యాలీ (డిస్నీ ప్లస్ హాట్ స్టార్), ఇండియన్ స్టార్టప్ స్టోరీస్ (డిస్కవరీ ప్లస్), స్టార్టప్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), అప్‌స్టార్స్ (నెట్‌ఫ్లిక్స్), ప్లానెట్ ఆఫ్ ది యాప్స్(యాపిల్ టీవీ). గర్ల్‌బాస్–టీవీ సిరీస్ (నెట్‌ఫ్లిక్స్)... మొదలైన షోలు యువతరాన్ని ఆకట్టుకున్నాయి. ది క్వర్కీ నారీ మదురైకి చెందిన మాళవిక సక్సేనాకు మనసుకు నచ్చిన ఫుట్‌వేర్ కనిపించేది కాదు. ఏది చూసినా ‘ఇది నాకు కరెక్ట్ కాదు’ అనిపించేది. కొత్తదనం లోపించిన ఫుట్వేర్లను చూసీ చూసీ చివరికి హ్యాండ్–పెయింటెడ్ షూ బ్రాండ్ ‘ది క్వర్కీ నారీ’ని లాంచ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజీని క్రియేట్ చేసింది. ఇన్ఫ్లూయెన్సర్ల సహాయం తీసుకుంది. ‘షార్క్ ఇండియా’లో ‘ది క్వర్కీ నారీ’ 35 లక్షల ఫండింగ్‌ను గెలుచుకుంది. ‘ఎపిసోడ్ ప్రసారం కాగానే ఇన్స్టాగ్రామ్ ఖాతాకు పదివేల మంది కొత్త ఫాలోవర్లు యాడ్ అయ్యారు. కేవలం నలభై ఎనిమిది గంటల్లో అమ్మకాలు బాగా పెరిగాయి’ అంటుంది మాళవిక సక్సేనా. హార్ట్ అప్ మై స్లీవ్స్ సైకాలజీలో గ్రాడ్యుయేట్ అయిన రియాకు ‘ఫ్యాషన్’ అంటే ఇష్టం. ఫ్యాషన్ రంగంలో ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకోవాలనేది తన కల. 18–33 ఏళ్ల వయసు ఉన్న మహిళలను దృష్టిలో పెట్టుకొని పదివేల రూపాయల పెట్టుబడితో ‘హార్ట్ అప్ మై స్లీవ్స్’ కంపెనీ మొదలుపెట్టింది. ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ కార్యక్రమంలో తన ఐడియాను వినిపించిన తరువాత ఇన్వెస్టర్లు వినీతా సింగ్, అనుపమ్ మిట్టల్ నుంచి రూ. 25 లక్షల ఫండ్ అందుకుంది. ‘ఎన్నో డ్రెస్‌లు ఉన్నా ఏది వేసుకోవాలో అనే దాని గురించి ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను... అనే మాట చాలా మంది మహిళల నోటి నుంచి విన్నాను. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్లీవ్స్ ద్వారా ప్రతి డ్రెస్‌కు గ్లామరస్ లుక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. వ్యాపారంలో వినీతా సింగ్, అనుపమ్ మిట్టల్‌లకు ఉన్న అనుభవం, సలహాలు మా వ్యాపారాన్ని విస్తరించడానికి సహాయపడతాయి అని నమ్ముతున్నాను’ అంటుంది రియా. కవచ్ ‘షార్క్ ట్యాంక్ ఇండియా’లో ఫండ్స్ అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా రికార్డ్ సృష్టించింది 13 సంవత్సరాల అనౌష్కా జాలీ. ఆరవ తరగతిలో యాంటీ–బుల్లీయింగ్ స్క్వాడ్(ఎబీఎస్) అనే వెబ్‌సైట్‌కు రూపకల్పన చేసింది. మూడు సంవత్సరాల పాటు యాంటీ–బుల్లీయింగ్ సెషన్స్ నిర్వహించిన అనౌష్క ఆ తరువాత బుల్లీయింగ్‌పై ఫైట్ చేయడానికి ‘కవచ్’ అనే యాప్‌ను రూపొందించింది. ‘షార్క్ ట్యాంక్’లో ‘కవచ్’ 50 లక్షల ఫండింగ్‌ను గెలుచుకుంది. ఇది చదవండి: దివ్యమైన ఫుడ్చైన్: వారసత్వంగా అందుకున్నదా?...! లేదా పూర్తిగా ఆమె ఆలోచనేనా..? -
ఇంటీరియర్ డిజైనర్‌గా గౌరీ ఖాన్ ఎంత చార్జ్ చేస్తుందో తెలుసా!
బాలీవుడు సూపర్ స్టార్ షారుఖాన్ భార్య గౌరీ ఖాన్ సక్సెస్ ఫుల్ ఇంటీరియర్ డిజైనర్ తన కెరీర్‌తో దూసుకుపోతున్నారు. ఓ ఇంటీరియర్ డిజైనర్‌గా తన ఇంటినే ఎంత విలావంతంగా తీర్చిదిద్దిందో చూస్తే సృజనాత్మకతకు నిర్వచనం గౌరీ ఖాన్ ఏమో అనిపిస్తుంది. అంతేగాదు ఓ పక్క తన భర్త కెరియర్‌కు తన వంతుగా సహాయ సహకారాలను అందిస్తూనే మహిళా వ్యాపారవేత్తగా దూసుకుపోతున్నారు. ఆధునాతన సృజనాత్మక నైపుణ్యానికి ఓ కొత్త అద్దాన్ని ఇచ్చారామె. ఈ సందర్భంగా ఇంటీరియర్ డిజైనర్‌గా తన జర్నీ ఎలా సాగింంది? అందులో తాను ఎదర్కొన్న సవాళ్ల గురించి ఓ ఇంటర్యూలో చాలా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అవేంటంటే.. నిజానికి గౌరీ ఖాన్ బీఏ పట్టభద్రురాలే గాక ఫ్యాషన్ డిజైన్ కోర్సు కూడా చేశారు. ఇక ఆమె తండ్రిది గార్మెంట్ వ్యాపారం కావడంతో టైలరింగ్‌లో కూడా కొంత ప్రావిణ్యం ఉంది. అయితే ఈ అర్హతల కారణంగా ఇంటీరియర్ డిజైనర్ రంగంలోకి ప్రవేశించలేదు. ముంబైలో ఐకానిక్‌గా. మంచి పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన షారుఖ్-గౌరీ ఖాన్ల ఇల్లు 'మన్నాత్' బంగ్లా అత్యద్భుతంగా ఉంటుంది. అయితే దీన్ని నిర్మించి ఏళ్లు కావొస్తుండటంతో అత్యంత సుందరంగా పునర్నిర్మించాలనుకున్నారు ఫారుఖ్. ఆ తరుణంలోనే గౌరీఖాన్‌కి ఇంటీరియర్ డిజైనర్ రంగంపై మక్కువ ఏర్పడింది. అంతేగాదు ఈ ఇంటిని అత్యంత సుందరంగా మలచడం కోసం ప్రముఖ ఆర్కిటెక్చర్లతో కలిసి పనిచేసింది కూడా. అలా ఆమె తనకు తెలియకుండానే ఇంటీరియర్ డిజైనర్‌గా మారారు. పైగా తమ విలాసవంతమైన బంగ్లా మన్నాత్ని ఎంతం అందంగా తీర్చిదిద్దిందంటో అదోక అద్భుతమైన ప్యాలెస్ అన్నంత రేంజ్లో ఉంటుంది. ప్రస్తుతం ఆ ఇంటి విలువ ఏకంగా రూ. 200 కోట్లు. అలా గౌరీ ఖాన్ తన ఇంటిని సర్వాంగాసుందరంగా మార్చే క్రమంలో ఇంటీరియర్ డిజైనర్‌గా మారారు గౌరీ. ఆ తర్వాత ఆ రంగాన్నే వృత్తిగా ఎంచుకోవాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యింది. ఈ రంగంలో మరింత మెళ్లుకవలను నేర్చుకుని తన నైపుణ్యానికి మరింత పదునుపెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో 2013లో ముంబైలో గౌరీ ఖాన్ డిజైన్స్ పేరుతో డిజైన్ స్టూడియోని ఏర్పాటు చేసింది. ఇక అక్కడ నుంచి పలు విభిన్న ప్రాజెక్టులను టేకప్ చేసింది. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వచ్చిందని చెబుతోంది గౌరీ ఖాన్. ఈ నేపథ్యంలో ఎందరో ప్రముఖ అంతర్జాతీయ డిజైనర్లతో కలిసి పనిచేసినట్లు తెలిపారు. అయితే తాను ఓ ఇంటీరియర్ డిజైనర్‌గా తన సంస్థను ప్రమోట్ చేసుకుంటూ ఈ వ్యాపారంలో తనకంటూ ఓ సముచిత స్థానాన్ని ఏర్పరచుకునేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందని అంటోంది. అంతేగాదు ముఖేష్ అంబానీ , రాబర్టో కావల్లి రాల్ఫ్ లారెన్ వంటి ప్రముఖుల ఇళ్లకు ఇంటిరీయర్ డిజైనర్‌గా పని చేశారు. తాను ఓ స్టార్ భార్యను కాబట్టి ఈ రంగంలో సులభంగా విజయం వచ్చేస్తుంది అనుకుంటారు కానీ అది ముమ్మాటికి తప్పంటారు గౌరీ ఖాన్. ఎవ్వరైన ఓ వ్యాపారం చేసేటప్పడు జస్ట్ సపోర్ట్ ఇస్తారు ఇక అక్కడ నుంచి ఎవరికీ వారే స్వయంగా వ్యాపారాన్ని నడిపుంచుకుని, విజయం దక్కించుకోవాల్సిందే అంటున్నారు గౌరీ. దేనికైనా అత్యంత ఓపికతో కూడిన నేర్పు ఉంటేనే సాధ్యమని చెబుతోంది. ఈ రంగంలో తాను ఎదుర్కొన్నఇబ్బందిని, సవాళ్లని ఓ పాఠంగా తీసుకుని ముందుకు వెళ్లేదానిని, అందువల్లే ఇంటీరియర్ డిజైనర్ ఎంట్రప్రెన్యూర్‌గా సక్సెస్ అయ్యానని అన్నారామె. ఇక ఆమె ఇంటరీయర్ డిజైనర్‌గా టేకప్ చేసిన ప్రాజెక్టులకు ఎంత ఛార్జ్ చేస్తుందంటే సుమారు రూ. 6 లక్షలు నుంచి మొదలవ్వుతుందట. ఆమె ఇంటీరియర్ డిజైన్స్ నెట్ వర్తే దాదాపు రూ. 200 కోట్లు పైనే ఉంటుందట. దీంతోపాటు ఆమె 2014లో డిజైన్ సెల్ అనే పేరుతో కాన్సెప్ట్ స్టోర్‌ని కూడా ప్రారంభించింది. ఇందులో గౌరీనే స్వయంగా తీర్చిదిద్దినా ఫర్నీచర్ డిజైన్లు ఉంటాయి. అంతేగాదు పారిస్‌లోని ప్రతిష్టాత్మకమైన మైసన్ ఎట్ ఆబ్జెట్ షోలో తన ఫర్నిచర్ డిజైన్లను ప్రదర్శించడానికి ఆహ్వానం సైతం దక్కించుకుంది. అలాగే ఫార్చ్యూన్ మ్యాగజైన్ 50 అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఆమె కూడా ఒకరిగా నిలవడం విశేషం సెలబ్రెటీ హోదా కంటే ప్రత్యేక గుర్తింపు మిన్న.. ఇక్కడ షారుఖ్ స్టారడమ్ అతడి భార్యగా ఆమెకు ఉంటుంది. అలాగా ఆమె షారుఖ్ సినిమాలను నిర్మిస్తూ చిత్ర నిర్మాతగా కూడా మారింది. అయినా మహిళ సాధికారత అనే పదానికి అర్థమిచ్చేలా తనకంటూ ఓ గుర్తింపు కావాలనుకుంది. అందుకోసం నచ్చిన రంగాన్ని ఎంచుకుంది. అది మొదటగా తన ఇంటి డిజైన్ నుంచి ప్రారంభంచి.. ప్రముఖులు ఇళ్లు డిజైన్ చేసే స్థాయికి చేరుకుంది. తన సంస్థకు గౌరీ ఖాన్ అనే బ్రాండ్ నేమ్ దక్కించుకుని సక్సెఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా దూసుకుపోయింది. ఏ మహిళైనా సరే పెళ్లి, పిల్లలు కారణంతో కెరీర్‌ను ఆపేయాల్సిన పనిలేదని నిరూపించింది. అంతేగాదు పిల్లలు ఎదిగిపోయి మనం అవసరం లేదనుకున్న తరుణంలో మళ్లీ మన కెరీర్లో లేదా మనకు ఇష్టమైన రంగంలో రాణించేందుకు యత్నించి, మనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకోగలమని ప్రూవ్ చేశారు గౌరీ ఖాన్. (చదవండి: 'నారీ శక్తి'.. 'నారీ శక్తీ' అంటారుగా! చేతల్లో చూపండి!) -
30 ఏళ్ల వయసున్న టాప్ వ్యాపారస్థులు వీరే..
ముప్పై ఏళ్లలోపు యువతకు ఎక్కువగా స్నేహితులతో గడపాలని, మంచి బైక్‌పై చక్కర్లు కొట్టాలని, మంచి దుస్తులు కొనాలని.. ఉంటుంది. చాలా కొద్దిమంది మాత్రం సమయం వృథా చేయకుండా జీవితంలో స్థిరపడాలనుకుంటారు. అయితే అది అంత సులభమైన విషయమేమీ కాదు. కానీ, ఆ వయసులోనే సొంతంగా ఒక కంపెనీ పెట్టి విజయవంతంగా నడుపుతూ వందల కోట్లకు అధిపతి కావడం అనేది అనూహ్యమైన విజయం. తాజాగా హురున్ ఇండియా అలాంటి 100 మంది యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల జాబితా విడుదల చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 5 మంది ఉన్నారు. ‘హురున్ ఇండియా టాప్ 100 అండర్ 30 ఎంటర్‌ప్రెన్యూర్స్ వాచ్ లిస్ట్ 2023’ పేరుతో విడుదల చేసిన ఈ జాబితాలో ముంబయికి చెందిన జెప్టో క్విక్ కామర్స్ సంస్థ వ్యవస్థాపకులైన కైవల్య వోహ్రా (21 ఏళ్లు), ఆదిత్ పలిఛ (22 ఏళ్లు)లకు అగ్రస్థానం దక్కింది. హైదరాబాద్‌కు చెందిన ఎడ్టెక్ సంస్థ, భాంజు వ్యవస్థాపకుడు నీలకంఠ భాను ప్రకాష్ (24 ఏళ్లు) ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఈ జాబితాలో మొత్తం అయిదుగురు మహిళలు ఉండగా.. ‘స్కిల్‌మ్యాటిక్స్’కు చెందిన దేవాన్షి కేజ్రీవాల్ (27 ఏళ్లు) అందరి కంటే చిన్నవారు. 8 మంది యువ వ్యాపారవేత్తలు స్పేస్‌టెక్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ జాబితాలో అధికంగా సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్) కంపెనీల వ్యవస్థాపకులు 19 మంది ఉన్నారు. ఫిన్‌టెక్, ఎడ్టెక్ రంగాలకు చెందిన 11 కంపెనీల ప్రతినిధులకు ఇందులో చోటు దొరికింది. బెంగళూరుకు చెందిన కంపెనీలు/ వ్యవస్థాపకుల సంఖ్య ఈ జాబితాలో అధికంగా ఉంది. తదుపరి స్థానాల్లో ముంబయి, దిల్లీకి చెందిన వారు ఉన్నారు. బెంగళూరు నుంచి 10 మంది, ముంబయి నుంచి 9 మంది, దిల్లీ నుంచి 8 మంది ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఉన్నారు. ఈ జాబితాలో స్థానం సంపాదించిన యువ వ్యాపారవేత్తల్లో ఐఐటీ-రూర్కీ పట్టభద్రులైన 8 మంది ఉండటం గమనార్హం. ఐఐటీ- కాన్పూర్ నుంచి ఏడుగురు, ఐఐటీ- దిల్లీ నుంచి ఆరుగురు, ఐఐటీ- బాంబే, మద్రాస్ నుంచి అయిదుగురు చొప్పున ఉన్నారు. మనదేశంలోని యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శక్తి, సామర్థ్యాలను ‘హురున్ ఇండియా టాప్ 100 అండర్ 30 ఎంటర్‌ప్రెన్యూర్స్ వాచ్ లిస్ట్ 2023’ ప్రతిబింబిస్తోందని హురున్ ఇండియా వ్యవస్థాపకుడు అనస్ రహమాన్ జునాయిద్ వివరించారు. ప్రస్తుత వ్యాపార ప్రపంచంలో వినూత్న వ్యాపార వ్యూహాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించగల సామర్థ్యం ఉన్న యువ వ్యాపారవేత్తల అవసరాలు ఎంతో అధికంగా ఉన్నట్లు తెలిపారు. పెట్టుబడిదారులు, ప్రభుత్వాలు, బహుళజాతి వ్యాపార సంస్థలు ఇటువంటి సత్తా ఉన్న యువ వ్యాపారవేత్తలు, సంస్థల కోసం అన్వేషిస్తున్నట్లు విశ్లేషించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అయిదుగురు ఔత్సాహిక వ్యాపారవేత్తలు పిన్న వయసు లోనే మంచి విజయాలు నమోదు చేసి హురున్ జాబితాలో స్థానం సంపాదించారు. హైదరాబాద్ నుంచి నీలకంఠ భాను ప్రకాష్ (24 ఏళ్లు, భాంజు, ఎడ్యుటెక్ కంపెనీ)తో పాటు, శశాంక్ రెడ్డి గుజ్జుల (27 సంవత్సరాలు, నెక్ట్స్‌వేవ్, ఎడ్యుటెక్ కంపెనీ), రాకేష్ మున్ననూరు (29 ఏళ్లు, విజిల్‌డ్రైవ్, సాస్ కంపెనీ), అనురాగ్ మాలెంపాటి (30 ఏళ్లు, లీప్ ఇండియా ఫుడ్, లాజిస్టిక్స్ సేవల కంపెనీ) ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలానికి చెందిన అనుపమ్ పెడర్ల (29 ఏళ్లు, నెక్ట్స్‌వేవ్, ఎడ్టెక్ కంపెనీ)కు సైతం ఈ జాబితాలో స్థానం దక్కింది. ఇదీ చదవండి: డిసెంబర్ 20న మొబైల్ ఫోన్లు స్విచ్ఆఫ్.. ఎందుకంటే.. -
జగనన్న ప్రభుత్వం చొరవతో మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు..!
-
సీఎం ఎస్టీ ఎంటర్ ఎంట్రెప్రినేటర్ షిప్ ఇన్నోవేషన్ స్కీం ప్రారంభం
-
స్టార్టప్ కలలు కంటున్నారా.. ఈ స్కూల్ మీకోసమే..!
ఉద్యోగం వెదుక్కోవాలి...అనేది నిన్నటి మాట. స్టార్టప్‌కు బాట వేసుకోవాలి... అనేది నేటి మాట. తమ స్టార్టప్ కలలను సాకారం చేసుకోవడానికి యూత్ ‘స్టార్టప్ స్కూల్ ఇండియా’ వైపు చూస్తుంది... ఎంబీఏ చేస్తున్న అభినయ(గోరఖ్‌పూర్)కు విజేతల కథలు చదవడం అంటే ఇష్టం. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, కేవలం తమ ప్రతిభనే పెట్టుబడిగా పెట్టి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటున్న స్టార్టప్ స్టార్లు ఆమెకు స్ఫూర్తి. తనకూ స్టార్టప్ కలలు ఉన్నాయి. కాని అవి పేపర్ మీద మాత్రమే ఉన్నాయి. ఎలా మొదలు కావాలి...అనే విషయం మీద అభినయకు అవగాహన లేదు. ఇది అభినయ పరిస్థితి మాత్రమే కాదు... దేశంలో ఉన్న ఎన్నో చిన్నపట్టణాల యువత పరిస్థితి...ఇలాంటి వారికి ఇప్పుడు ‘స్టార్టప్ స్కూలు’ రూపంలో ఒక దారి దొరకబోతోంది. గూగుల్ తాజాగా స్టార్టప్ స్కూల్ ఇండియా (ఎస్ఎస్ఐ) గురించి ప్రకటించింది. ‘స్టార్టప్’ అనగానే దేశంలో కొన్ని నగరాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. ‘ఇక్కడ మాత్రమే స్టార్టప్‌లకు అనువైన వాతావరణం ఉంది’ అనే భావన ఉంది. మరి చిన్న పట్టణాల పరిస్థితి ఏమిటి? అక్కడ స్టార్టప్‌లకు అవకాశం లేదా? అనే ప్రశ్నకు ‘కచ్చితంగా ఉంది’ అనే సమాధానం తన స్కూల్ ద్వారా ఇవ్వబోతోంది గూగుల్. దేశంలోని పది చిన్నపట్టణాల్లో, మూడు సంవత్సరాల కాలపరిధిలో, పదివేల మంది స్టూడెంట్స్‌ను స్టార్టప్ రూట్లోకి తీసుకురావాలనేది గూగుల్ స్టార్టప్ స్కూల్ లక్ష్యం. ఇన్వెస్టర్లు, సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్, ప్రోగ్రామర్స్‌ను ఒకే దగ్గరకు తీసుకువచ్చే వేదిక ఇది. ఎఫెక్టివ్ ప్రాడక్ట్ స్ట్రాటజీ, ప్రాడక్ట్ యూజర్ వాల్యూ, రోడ్ మ్యాపింగ్ అండ్ పిఆర్డి డెవలప్మెంట్... మొదలైనవి గూగుల్ కరికులమ్‌లో భాగం కానున్నాయి. వర్కింగ్ ఈవెంట్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు సంబంధించినవి తొమ్మిదివారాల కార్యక్రమంలో ఉంటాయి. ‘ఎన్నో స్టార్టప్‌లతో పనిచేసిన అనుభవం గూగుల్‌కు ఉంది. ఇప్పుడు ఆ అనుభవాలు యూత్‌కు గొప్ప పాఠాలుగా మారుతాయి’ అంటున్నారు మమవర్త్ కో–ఫౌండర్ వరుణ్ అలఘ్. స్టార్టప్‌ల దిశగా యూత్‌ను తీసుకెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం గూగుల్‌కు ఇదే మొదటిసారి కాదు. 2016లో దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో ఎంటర్ప్రెన్యుర్షిప్ వర్క్‌షాప్‌లు నిర్వహించింది. పదినగరాలలో నిర్వహించిన స్టూడెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఛాలెంజ్ (ఎస్ఈసి)కు మంచి స్పందన వచ్చింది. టాప్ 3 విన్నర్స్‌ను సిలికాన్‌వ్యాలీకి తీసుకెళ్లి గూగుల్ లీడర్స్‌తో మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. ఇక తాజా‘స్టార్టప్’ స్కూల్ విషయానికి వస్తే... ‘టెక్నాలజీ, ఫైనాన్స్, డిజైన్... మొదలైన రంగాలకు చెందిన మార్గదర్శకులతో ఒక విశాల వేదిక ఏర్పాటు చేయడానికి స్కూల్ ఉపకరిస్తుంది’ అంటున్నారు గూగుల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ ఆనందన్. దేశంలో స్టార్టప్ కల్చర్ ఊపందుకోవడానికి అనువైన వాతావరణం ఉంది. అంతమాత్రాన ‘అన్నీ మంచి శకునములే’ అనుకోవడానికి లేదు. దాదాపు 90 శాతం స్టార్టప్‌లు అయిదుసంవత్సరాల లోపే తమ ప్రయాణాన్ని ఆపేస్తున్నాయి. లోపభూయిష్టమైన డిమాండ్ అసెస్మెంట్, రాంగ్ ఫీడ్‌బ్యాక్, నిర్వాహణలోపాలు... మొదలైన కారణాలు స్టార్టప్‌ల ఫెయిల్యూర్స్‌కు కారణం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గూగుల్ స్టార్టప్ స్కూల్ పాఠాలు యువతరానికి ఎంతో ఉపయోగపడనున్నాయి. ‘నా ఫ్రెండ్స్ కొందరు స్టార్టప్ మొదలు పెట్టి దెబ్బతిన్నారు. దీంతో నా స్టార్టప్ కలకు బ్రేక్ పడింది. అయితే ఒకరి పరాజయం అందరి పరాజయం కాదు. ఎవరి శక్తి సామర్థ్యాలు వారికి ఉంటాయి...అనేది తెలుసుకున్నాక నేనెందుకు నా ప్రయత్నం చేయకూడదు అనిపించింది. గూగుల్ స్టార్టప్ స్కూల్ నాలాంటి వారికి విలువైన మార్గదర్శనం చేయనుంది’ అంటుంది దిల్లీ–ఐఐటీ విద్యార్థి ఈషా. -
కుబేరుడి కుమారునికి ఆనంద్ మహీంద్ర బంపర్ ఆఫర్
ముంబై: మిలీనియర్ ఆయిల్ ట్రెడర్ కుమారుడికి తమ కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పిస్తామని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ఉత్తరాఖండ్‌కు చెందిన మిలీనియర్ రాకేశ్ థక్కర్ కొడుకు ద్వార్‌కేశ్ థక్కర్.ఇంజనీరింగ్ చదువుతున్న ద్వార్‌కేశ్‌కు చదువు పట్ల ఆసక్తి లేని కారణంగా తన స్వస్థలం పాంద్రా నుంచి సిమ్లాకు వెళ్లాడు. సొంతంగా ఎదగాలని నిర్ణయించుకొని అక్కడ ఓ హోటళ్లో అంట్లు శుభ్రం చేసే పనిలో చేరాడు. ప్రతి రోజు అంట్లను శుభ్రం చేసి.. రోడ్లపైనే నిద్రపోయేవాడు. ఈక్రమంలో సిమ్లా పోలీసులు అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా.. అతను ఓ మిలీనియర్ కొడుకు అని తేలింది. ఓ మిలీనియర్ కొడుకు అంట్లు తోముతున్న దృశ్యాలు ప్రధాన పత్రికల్లో రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న ఆనంద్.. అతనికి తన కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పించారు. ఈ విషయంపై థక్కర్ స్పందిస్తు మహీంద్ర కంపెనీ ఆఫర్‌ను కచ్చితంగా స్వీకరిస్తానని తెలిపాడు. కంపెనీ అధికారులను త్వరలోనే కలుస్తానని ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. మరోవైపు థక్కర్ తండ్రి రాకేశ్ థక్కర్.. మహీంద్ర ఆఫర్ చేసిన ఇంటర్న్‌షిప్‌పై స్పందిస్తూ తన కుమారుడికి జీవితంలో ఒక గొప్ప లక్ష్యం ఉందని, కచ్చితంగా ఏదో ఒక రోజు నెరవెరుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తుల్లో గొప్ప పారిశ్రామికవేత్తగా ద్వార్‌కేశ్ థక్కర్ ఎదుగుతాడని ఆనంద్ మహీంద్ర చెప్పడం విశేషం. -
ఏపీ ప్రజలు మంచి పారిశ్రామికవేత్తలు: జైట్లీ
ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి పారిశ్రామిక వేత్తలని, ఆ విషయం ఇప్పటికే నిరూపితమైందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. వాళ్ల ముందడుగుతో రాష్ట్రం త్వరలోనే మరిన్ని వెలుగులు చూస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కోర్ క్యాపిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు లింగాయపాలెం వచ్చిన ఆయన.. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే... ''ఇద్దరికి ప్రధానంగా అభినందనలు. ముందుగా ఈ ప్రాంత రైతులు.. చరిత్రలో తొలిసారిగా వాళ్లు ఎప్పుడూ లేనట్లుగా తమ భూములను రాష్ట్ర రాజధాని కోసం ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రికార్డు సమయంలో రాజధాని నిర్మాణానికి మొత్తం ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేశారు. అందుకని రైతులను, ముఖ్యమంత్రిని అభినందిస్తున్నాను. విభజనకు వ్యతిరేకంగా అప్పట్లో కొందరు పోరాడారు. చంద్రబాబు, వెంకయ్య ఆ సమయంలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు మంచి ప్యాకేజి కావాలని అడిగారు. సుజనాచౌదరి, సీఎం రమేష్ రాష్ట్ర ప్రజల గొంతును పార్లమెంటులో గట్టిగా వినిపిస్తూ వెంకయ్య మాటలకు అడ్డుతగిలారు. కొత్త రాజధాని అత్యాధునికంగా తయారవుతుందన్న విశ్వాసం నాకుంది. సీఎం చైనా, జపాన్, దావోస్, అమెరికా.. అన్నిదేశాలూ తిరుగుతూ వనరుల సేకరణకు ప్రయత్నిస్తున్నారు హైదరాబాద్‌ను ఎలా అధునాతనంగా రూపొందించారో, గుంటూరు ప్రాంతంలోనూ మంచి రాజధాని రూపొందించే అవకాశం మీకు దొరికింది. ఇందులో మీకు కేంద్రప్రభుత్వం కూడా తగినంత సాయం చేస్తుంది. మొదటి ఐదేళ్లలో 2.03 లక్షల కోట్లు ఇస్తామని నేను ఇంతకుముందే చెప్పాను. 2004 నుంచి 2009 వరకు ఏపీకి 34వేల కోట్లు కేంద్రం నుంచి వచ్చాయి. 2009 నుంచి 2014 వరకు ఐదళ్లలో 64వేల కోట్ల సాయం వచ్చింది. కానీ మోదీ పాలనలోని ఐదేళ్లలో ఏపీకి కేవలం ఆర్థికసంఘం, ఇతర నిధుల కింద రూ. 2.03 లక్షల కోట్లు ఇస్తున్నాం. జాతీయస్థాయి విద్యాసంస్థలు మరికొన్నింటిని కూడా ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేస్తాం. రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, పలు పరిశ్రమల మంజూరుకు కేంద్రం ప్రయత్నిస్తుంది. భూసేకరణ పూర్తయితే విజయవాడ విమానాశ్రయం కూడా అత్యాధునికంగా రూపొందుతుంది. రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికీ సాగునీరు అందించేందుకు పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా నిధులిస్తున్నాం. కేంద్రం నుంచి 90:10 నిష్పత్తిలో రావాల్సిన నిధులన్నింటినీ ప్రత్యేక ప్యాకేజితో ఇప్పటికే అందిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి పారిశ్రామికవేత్తలు. రైతులు అందించిన సాయం, పారిశ్రామికవేత్తల ముందడుగుతో రాష్ట్రం అద్భుతంగా వెలుగుతుందని ఆశిస్తున్నాను. రైతులు తమ భూములను అమ్ముకుంటే వారికి పడే కేపిటల్ గెయిన్ టాక్స్ విషయాన్ని పలువురు ప్రశ్నించారు. దానికి వీలైనంత త్వరలో పరిష్కారం చూసే ప్రయత్నం చేస్తాను. ఏపీ ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చిందేందుకు అందరం కలిసి ప్రయత్నం చేద్దాం''