entitled
-
ఉబర్‌కు ఎదురుదెబ్బ
లండన్: బ్రిటన్ సుప్రీంకోర్టులో ఉబర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. డ్రైవర్లను కార్మికులుగా పరిగణించాల్సిందేనని స్పష్టంచేస్తూ ఒక కేసులో లండన్ లోని కోర్టు తీర్పునిచ్చింది. దీనితో ట్యాక్సీ రైడ్ దిగ్గజ సంస్థ ఉబర్ కింద పనిచేస్తున్న డ్రైవర్లకు బ్రిటన్‌లో కనీస వేతనం, సెలవు, అనారోగ్యానికి సంబంధించి సిక్ పే హక్కులు కల్పించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ ఉబర్ తన డ్రైవర్లను ‘స్వయం ఉపాధి’ పొందుతున్న స్వతంత్ర థర్డ్ పార్టీ కాంట్రాక్టర్లుగా వీరిని సంస్థ వర్గీకరించింది. అంటే చట్టం ప్రకారం వారికి కనీస రక్షణలు మాత్రమే లభిస్తాయి. దీనిపై డ్రైవర్ల పోరాటంతో దీర్ఘంకాలంగా న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వారిని స్వయం ఉపాధి కార్మికులుగానే గుర్తించాలన్న ఉబర్ విజ్ఞప్తిని న్యాయమూర్తి జార్జ్ లెగ్గట్ తోసిపుచ్చారు. బ్రిటన్ చట్టాల ప్రకారం కనీస ఉపాధి హక్కులు లభించే కార్మికులుగా తమను గుర్తించాలని దాదాపు 25 మంది డ్రైవర్లు ఒక గ్రూప్‌గా 2016కు ముందు ప్రారంభించిన న్యాయపోరాట ఫలితమిది. డ్రైవింగ్‌కు సంబంధించి యాప్ లాగ్ ఆన్ అయిన సమయం నుంచి లాగ్ ఆఫ్ అయిన సమయం వరకూ తన డ్రైవర్లను ఉబర్ ‘‘కార్మికులుగానే’’ పరిగణించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇప్పటికే ఈ మేరకు ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్, ఎంప్లాయిమెంట్ అప్పీల్ ట్రిబ్యునల్, అప్పీలేట్ కోర్ట్ ఉబర్ డ్రైవర్లకు అనుకూలంగా తీర్పునిచ్చాయి. తాజా రూలింగ్‌పై ఉబర్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తు.చ. తప్పకుండా అమలు చేస్తామని పేర్కొన్నారు. 2016కు ముందు యాప్‌ను వినియోగించిన డ్రైవర్లందరి ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడతామని తెలిపారు. కోర్టు ప్రకటన తరువాత ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో ఉబెర్ షేర్లు 3.4 శాతం పడిపోయాయి. -
అమ్మలో సగం నాన్నలో సగం
నాన్న పేరులోని మొదటి అక్షరం.. అమ్మ పేరులోని ఆఖరి అక్షరం.. ఆ రెండక్షరాలే ఈ చిన్నారి పేరు. ఇంతకీ పేరేంటి? ‘అర్హ’. అల్లు అర్జున్–స్నేహల ముద్దుల కూమార్తె పేరు ఇది. ఈ ఏడాది నవంబర్ 21న ఈ అల్లు దంపతులకు కుమార్తె పుట్టిన విషయం తెలిసిందే. పాపకు ఏ పేరు పెడితే బాగుంటుందని ఆలోచించి, చివరికి తమ ఇద్దరి పేర్లు కలసి వచ్చేటట్లుగా... అర్జున్‌లోని అఖ, స్నేహలోని ఏఅ అక్షరాలు తీసుకుని అఖఏఅ (అర్హ) అని పెట్టారు. ‘అర్హ’ అంటే హైందవంలో శివుడు... ఇస్లాంలో ప్రశాంతత, నిర్మలమైన అని అర్థం. క్రిస్మస్ కానుకగా ఆదివారం ఈ చిన్నారి పేరు ప్రకటించారు. అర్హ ఫొటోలనూ విడుదలశారు. -
భాగ్యస్వామ్యం పేరుతో ఉద్యోగి ఇంటిని తాకట్టు పెట్టి
-
అర్హులందరికీ ఉపాధి
అడిగిన వారందరికీ ఉపాధి హామీ పథకం కింద పని కల్పిస్తామని డ్వామా పీడీ చేరెడ్డి పుల్లారెడ్డి హామీనిచ్చారు. ఆదివారం ఆయన ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మారిఓర్వకల్లు మండలం కేతవరం గ్రామంలో ఉపాధి పనులు నిర్వహిస్తున్న కూలీల వద్దకు వెళ్లిమాట్లాడారు. వారు ఎదుర్కొనే ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు. ఉపాధి పనులు పెడుతున్నారా, వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారా... ఎంత కూలి పడుతోంది.. ఇంకా ఏమి కోరుకుంటున్నారు.. తదితర విషయాలను ఆరా తీశారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. వెలుగులోకి వచ్చిన సమస్యలు... ఒక్కో కుటుంబంలో ఐదుగురు ఉన్నా ఒకే జాబ్ కార్డు ఉంది. దీంతో ఒక్కొక్కరు 20 నుంచి 35 రోజు పని చేసినా 100 రోజులు పూర్తి అవుతున్నాయి. తర్వాత ఉపాధి కరువు అవుతోంది. భూముల్లో వేసిన రాతికత్వలు వ్యవసాయానికి ఇబ్బందిగా మారాయి. సత్వరం వీటిని తొలగించాల్సి ఉంది. పొలాలకు వెళ్లేందుకు రోడ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మట్టి రోడ్లు వేయాలి. ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, కాల్వలు లేవు. దీంతో మురుగునీరు ఇళ్ల ముందే నిలుస్తోంది. ఉపాధి పనిదినాలను 150 రోజులకు పెంచాలి. పీడీ : గ్రామస్తులందరూ బాగున్నారా... గ్రామంలో ఉపాధి పనులు జరుగుతున్నాయా... మీ రు ఉపాధి పనులకు వెళ్తున్నారా? పాపన్న : సార్.. నేను గ్రామ సర్పంచ్‌గా పనిచేస్తున్నాను. అందరికీ అవసరమైన పనులు ఇంకా కల్పించలేదు. ఉపాధి పనులు కల్పిస్తే గ్రామంలో దాదాపు 120 కుటుంబాలకు మేలు జరుగుతుంది. పీడీ : అందరికీ పనులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. అన్ని కుటుంబాలు ఈ పనులను వినియోగించుకోవాలి. సిద్ధయ్య : సార్.. గ్రామానికి దాదాపు 100 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటివరకు 30 పూర్తి అయ్యాయి. మిగిలినవి కూడా వివిధ దశలో ఉన్నాయి. ఉపాధి పథకం కింద మొక్కలు నాటడం, పండ్ల తోటల అభివృద్ధి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. వ్యవసాయ కూలీలకు కూడా పనులు కల్పిస్తున్నారు. పీడీ : ఇంతవరకు ఎన్ని రోజులు పని లభించింది, ఇంకా ఎలాంటి పనులు కోరుకుంటున్నారు? మద్దిలేటి : సార్.. మా కుటుంబానికి ఇప్పటికే 100 రోజుల పని లభించింది. పనిదినాలను 150 రోజులకు పెంచితే బాగుంటుంది. పీడీ: అందరికీ ఉపయోగకరమైన పనులు కల్పిస్తాం. అందరూ సద్వినియోగం చేసుకోవాలి. పీడీ : ఏమ్మా.. నీ పేరు ఏమిటి? ఉపాధి పనులకు వెళ్తున్నావా... ఏ గ్రూపులో ఉన్నావు, ఎంత కూలీ పడుతోంది? మహిళ : నమస్కారం సార్.. నా పేరు సుబ్బమ్మ. వెన్నెల గ్రూపులో పనిచేస్తున్నాను. ఇప్పటికే 100 రోజుల పనిదినాలు పూర్తి అయ్యాయి. కూలీ రోజుకు సగటున రూ.120 నుంచి రూ.140 పడింది. పీడీ: అమ్మా.. వచ్చిన డబ్బులు ఏమి చేసుకుంటున్నావు? నాగమ్మ : మొన్నటివరకు పిల్లలు చిన్నగా ఉన్నారు. ఇప్పుడు వారిని చదివించుకోవడానికి ఉపాధి వేతనాలు వినియోగిస్తున్నాం. అదే విధంగా పొలం అభివృద్ధి పనులు చేసుకున్నాం. ఉపాధి పథకంతో వల్ల మాకు ఎంతో మేలు జరిగింది. పీడీ : ఏమయ్యా నీ పేరు ఏమిటి? ఉపాధి పనులకు వెళ్తున్నావా.. ఇంతవరకు ఎన్ని రోజులు పనిచేశావు? కూలీ : సార్.. నా పేరు బాలన్న. ఈ సంవ త్సరంలో ఇప్పటివరకు మా కుటుంబం 70 రోజులు పనిచేసింది. ప్రస్తుతం పనులు లేవు. పనులు పెడితే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఇంట్లో ఇద్దరం ఉపాధి పనులపైనే ఆధార పడివున్నాం. పీడీ : అందరికీ పనులు కల్పిస్తాం.. సరైన విధంగా పనిచేసుకుంటే గిట్టుబాటు వేతనం కూడా లభిస్తుంది. నీ పేరు ఏమిటి, నీకు ఏమైనా సమస్య ఉందా? కూలీ : సార్.. నా పేరు మౌలాలి. ఇంతవరకు 30 రోజులు పనిచేశాను. పొలం పనులు ఉండటం వల్ల ఉపాధి పనులు చేయలేదు. మా గ్రామంలో గతంలో పొలాల్లో రాతికత్వలు కట్టారు. ఇవి అడ్డంగా మారిపోయాయి. వీటిని ఎత్తివేసే విధంగా పనులు చేపట్టాలి. అడ్డంగా ఉన్న రాతికత్వలను ఎత్తివేయడం వల్ల రైతులకు సౌకర్యంగా సాగుకు అనువుగా ఉంటుంది. పీడీ : పొలంలో ఉన్న రాతికత్వలను ఎత్తివేసేందుకు ఉపాధి పథకంలో అవకాశం ఉందో లేదో చూస్తాను. అవకాశం ఉంటే కచ్చితంగా ఆ పనులకు అవకాశం ఇస్తాం. సర్పంచ్ : సార్.. గార్గేయపురం నుంచి కేతవరం వరకు రోడ్డు అధ్వానంగా ఉంది. ఉపాధి పథకం కింద రోడ్డు అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందా..? అదే విధంగా గ్రామంలోని ఎస్సీ కాలనీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మురుగునీరు పోవడం లేదు. ఇళ్ల మధ్యనే నిలుస్తోంది. కాల్వలు నిర్మించడానికి చొరవ తీసుకోవాలి. పీడీ: రోడ్డు అభివృద్ధి చేసే పనులకు ఉపాధి పథకంలో అవకాశం ఉండదు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లకు మాత్రం అవకాశం ఉంది. ఎస్సీ కాలనీ సీసీ రోడ్లు వేయడానికి చర్యలు తీసుకుంటాం. మాణిక్యమ్మ : సార్.. రేండేళ్లుగా మేము ఉపాధి పనులపైనే ఆధారపడి బతుకుతున్నాం. మా ఇంటికి ఒక్క జాబ్ కార్డు ఉంది. ఇద్దరం పనిచేస్తాం. ఒక్కొక్కరం 50 రోజులు పనిచేయడంతో 100 రోజుల పనిదినాలు పూర్తి అయ్యాయి. ఇక మాకు ఉపాధి లేదంటున్నారు. పనిదినాలను 150 రోజులకు పెంచాలి. అప్పుడే మాకు ఉపయోగంగా ఉంటుంది. పీడీ : ఉపాధి పనిదినాలను 150 రోజులకు పెంచడం మా చేతిలో లేదు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. పనిదినాలను 150 రోజులకు పెంచే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం. అవసరమైతే మీ కుటుంబానికి మరో జాబ్ కార్డు ఇచ్చి 100 రోజుల పని కల్పిస్తాం. మహిళ : సార్... నా పేరు కళ్యాణి. జయంతి గ్రూపులో మేటిగా పనిచేస్తున్నాను. మాకు ఒక జాబ్ కార్డు ఉంది. ఇందులో నలుగురం పనిచేస్తున్నాం. ఒక్కొక్కరం 25 రోజులు పనిచేయడంతోనే 100 రోజు పనిదినాలు పూర్తి అయ్యాయి. ఇక పని లేదంటున్నారు. మా పరిస్థితి ఏమిటి? పీడీ : మీ ఇంటికి ఉన్న జాబ్ కార్డులో నలుగురు సభ్యులుగా ఉన్నారా... అయితే మీ కుటుంబానికి అదనంగా మరో జాబ్ కార్డు మంజూరు చేస్తాం. అర్హత కల్గిన అన్ని కుటుంబాలకు అదనపు జాబ్ కార్డులు ఇస్తాం. మీరు ఎంపీడీఓ ఆఫీసుకు వెళ్లి జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి... మంజూరు చేస్తాం. పీడీ : అమ్మా.. మీకు ఇప్పుడు ఎంత కూలి పడుతుంది. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా...? మహిళలు : సార్.. మాకు ఇప్పటివరకు కూలి బాగానే పడుతోంది. రూ.120 నుంచి రూ.140 వరకు పడుతోంది. మాకు ఈ కూలి రూ.160 వరకు వచ్చే విధంగా చూడాలి. అప్పుడు మాకు ఉపాధి పనులు గిట్టుబాటు అవుతాయి. పీడీ : రోజుకు ప్రభుత్వం గరిష్ట కూలి రూ.169గా నిర్ణయించింది. ఈ మేరకు కూలి రావాలంటే రోజుకు కనీసం 8 గంటలు, కొలతల ప్రకారం పని చేయాలి. గోవర్ధన్ : సార్... ఉపాధి పథకం వ్యవసాయ కూలీలకు ఎంతో తోడ్పడుతోంది. గ్రామంలోని పొలాలకు వెళ్లేందుకు రోడ్లు వేయిస్తే బాగుంటుంది. పీడీ : వ్యవసాయ భూములకు వెళ్లడానికి వీలుగా మట్టి రోడ్లు వేసేందుకు ఉపాధి హామీ పథకం కింద ప్రొవిజన్ ఉంది. -
అర్హులందరికీ పింఛన్లు అందాలి
ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : అర్హులైన వారందరికీ పింఛన్లు అందేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు చిత్తశుద్ధితో చూడాలని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. నగరంలోని 5, 6 డివి జన్లలో మున్సిపల్ కార్పొరేషన్ స్కూళ్లలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, సిటీ ఎమ్మెల్యే డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్, డిప్యూటీ మే యర్ ద్వారకానాథ్‌తో కలసి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు జీవనాధారం కోసం పింఛన్లపై ఆధారపడుతున్నారన్నారు. గతంలో నెలకు రూ.75 ఉన్న పింఛన్‌ను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.200 చేశారని, ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని రూ.1000కి పెంచడం అభినందనీయమన్నారు. అయితే అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా అధికారులు, ప్రజా ప్రతి నిధులు కృషి చేయాలన్నారు. 2019 సంవత్సరానికి ప్రతి పేద ఇంటికి మరుగుదొడ్లు ఉండేలా చూడాలని ప్రధాన మంత్రి చేపట్టిన కార్యక్రమం కూడా బాగుందన్నారు. సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తాను పర్యటించిన అర్హులైన తమ పింఛన్లు తీసివేశారని, చాలా మంది తనకు చెప్పారని అన్నారు. అలాంటి వారిని చూసిన వెంటనే ఎటువంటి పరీక్షలు చేయకుండానే వారు వృద్ధులని, పూర్తిగా వికలాంగులని తెలుస్తున్నప్పటికీ నిబంధనల పేరుతో అర్హులైన చాలా మంది పింఛన్లను తీసివేశారన్నారు. ఆధార్‌కార్డు, రేషన్‌కార్డుల్లో ఉన్న చిన్న చిన్న తప్పులను సాకుగా చూపి పింఛన్లు తీసివేశారని అన్నారు. ఆ పింఛన్‌దారులు ఆ తప్పుల సవరణ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన వారందరికీ పింఛన్లు అందేలా మంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. పింఛన్లు అందజేసే అధికారులు పింఛన్‌దారులను హేళన చేస్తూ మాట్లాడడం తగదని హెచ్చరించారు. డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ మాట్లాడుతూ డివిజన్లో చాలా మంది అర్హులైన వారికి పింఛన్లు అందలేదన్నారు. పెన్షన్‌ను రూ.200 నుంచి రూ.1000కు పెంచిన ప్రభుత్వం అర్హులైన వారందరికీ పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. -
పింఛన్ల తొలగింపుపై పునర్విచారణ చేపట్టాలి
అనంతపురం అర్బన్: సామాజిక పింఛన్ల జాబితాలో అర్హులను తొలగించడంపై వెంటనే విచారణ జరిపించి అర్హులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యంతో కలిసి ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇస్తున్న రూ.200 పింఛన్‌ను రూ.వెయ్యికి పెంపు చేస్తూనే.. మరోవైపు స్వల్ప కారణాలతో ఏక పక్షంగా జిల్లా వ్యాప్తంగా అర్హులను తొలగించడం సమంజసం కాదని, తొలగించిన వాటిపై పునర్విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ తరహాలో కొత్త వారికి పింఛన్లు మంజూరు చేయాలన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏవీఆర్ హంద్రీ-నీవా మొదటి దశ కాలువ పనులను 80 శాతం పూర్తి చేసి జీడిపల్లి రిజర్వాయర్ వరకు నీటిని తీసుకొచ్చామని, ప్రభుత్వం మొదటి దశ పనులు పూర్తి చేసి, రెండో దశ పనులనూ యుద్ధ ప్రాతిపదికన ముగించి అనంతపురంతో పాటు చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు అందించాలన్నారు. ఈ పనులు పూర్తయితేనే జిల్లాలోని చెరువులు జల కళను సంతరించుకుంటాయన్నారు. జిల్లాలో రూ.7,676 కోట్లతో రూపొందించిన ‘ప్రాజెక్టు అనంత’ను తక్షణం అమలు చేయాలన్నారు. రైతులకు అందాల్సిన రూ.618 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ, రూ.184 కోట్ల పంటల బీమా మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని, గతంలో చంద్రబాబు డిమాండ్ చేసిన మేరకు ప్రస్తుతం ఎకరాకు రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.1800 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని రైతులకు ఇవ్వాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో రాజధానిపై ప్రకటన చేసిన సందర్భంలో వివిధ జిల్లాలకు ప్రకటించిన ప్రణాళికలో భాగంగా అనంతపురం జిల్లాకు కేటాయించిన ఏవీఆర్ హంద్రీ-నీవా, కుద్రే ముఖ్ ప్రాజెక్టు, ఆధ్యాత్మిక నగరంగా పుట్టపర్తి, పుట్టపర్తిలో విమానశ్రయం, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ను అమలు చేయాలన్నారు. జిల్లాలో ఎయిమ్స్ బదులు, దాని అనుబంధ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని ప్రజల ఆశలపై నీళు చల్లారన్నారు. రాష్ట్ర విభజన చట్టం మేరకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా వెనుకబడిన జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్నారు. సమావేశంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సోమర జయచంద్రనాయుడు, నాయకులు నాగరాజు, దాదాగాంధీ, తదితరులు పాల్గొన్నారు. -
అర్హుల పింఛన్లు తొలగిస్తే ఊరుకునేది లేదు
బ్రహ్మంగారిమఠంః అర్హులైన వారి పింఛన్లను రద్దు చేస్తే ఊరుకునేది లేదని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. సోమవారం బ్రహ్మంగారిమఠం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బి.మఠం సింగిల్ విండో అధ్యక్షుడు సి.వీరనారాయణరెడ్డి, మల్లెపల్లె సర్పంచ్ నాగిపోగు పెంచలయ్యలు మల్లెపల్లె గ్రామ పంచాయపతీ పరిధిలో రాజకీయ కక్షతో అర్హులుగా అర్హులైన 140 మందిని పింఛన్ల జాబితా నుంచి తొలగించారని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందించారు. మల్లెపల్లె వీఆర్ఓ సుబ్బన్నను పిలిచి రికార్డులను పరిశీలించారు. అర్హులుగా ఉన్న వారికి ప్రభుత్వం ఇచ్చిన ఆప్షన్లలో తొమ్మిది, పది నెంబర్లు వేయడంతో ఆయన వీఆర్ఓ, ఎంపీడీఓలపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు వీఆర్ఓ భయపడి పరిశీలన అనంతరం స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ సభ్యురాలు ఆమోదం తెలిపారని, అయితే కమిటీ సభ్యుల్లో ఒకరైన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మేకల రత్నకుమార్ యాదవ్ కుమారుడు బాలకృష్ణ యాదవ్ ఆమోదం కోసం ఫైలు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అక్కడే అవకతవకలు జరిగినట్లు ఎమ్మెల్యేకు వివరించారు. అర్హులైన వారిని తొలగించే అర్హత ఎవ్వరిచ్చారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. వీఆర్ఓపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. లింగాలదిన్నెపల్లె గ్రామంలో 40 మంది, మల్లెపల్లెలో 20 మంది, చెంచయ్యగారిపల్లెలో 60, ఎద్దులాయపల్లెలో 10 మంది, మల్లెపల్లె ఎస్సీ కాలనీలో మరికొంత మందిని తొలగించినట్లు రికార్డులు పరిశీలించగా తెలిసింది. అయితే వీరు వైఎస్సార్సీపీకి ఓట్లు వేసిన వృద్ధులేనని, అంతేగాకుండా రెడ్డి సామాజిక వర్గం కావడం వలనే తీసివేసినట్లు వైఎస్సార్సీపీ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలు ఎలా ఉన్నా అర్హులను గుర్తించి వారికి పింఛన్ వచ్చేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎంపీడీఓ హుసేన్‌కు తెలిపారు. మండల కమిటిలోనైనా ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. అర్హుల పింఛన్లను ఎవరు రద్దు చేశారనేదానిపై రాతపూర్వకం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ 140 పింఛన్ల రద్దుకు ప్రధాన కారకుడు తెలుగుదేశం నాయకుని కుమారుడు బాలకృష్ణ యాదవ్ అని వీఆర్ఓ రాతపూర్వకంగా ఎమ్మెల్యేకు తెలిపారు. దీనిపైన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని స్థానిక నాయకులకు హామీనిచ్చారు. బాధ్యుడైన బాలకృష్ణపై కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.