
కుమార్తె అర్హతో అల్లు అర్జున్, స్నేహ
నాన్న పేరులోని మొదటి అక్షరం.. అమ్మ పేరులోని ఆఖరి అక్షరం.. ఆ రెండక్షరాలే ఈ చిన్నారి పేరు. ఇంతకీ పేరేంటి? ‘అర్హ’. అల్లు అర్జున్–స్నేహల ముద్దుల కూమార్తె పేరు ఇది. ఈ ఏడాది నవంబర్ 21న ఈ అల్లు దంపతులకు కుమార్తె పుట్టిన విషయం తెలిసిందే. పాపకు ఏ పేరు పెడితే బాగుంటుందని ఆలోచించి, చివరికి తమ ఇద్దరి పేర్లు కలసి వచ్చేటట్లుగా... అర్జున్‌లోని అఖ, స్నేహలోని ఏఅ అక్షరాలు తీసుకుని అఖఏఅ (అర్హ) అని పెట్టారు.
‘అర్హ’ అంటే హైందవంలో శివుడు... ఇస్లాంలో ప్రశాంతత, నిర్మలమైన అని అర్థం. క్రిస్మస్ కానుకగా ఆదివారం ఈ చిన్నారి పేరు ప్రకటించారు. అర్హ ఫొటోలనూ విడుదలశారు.