entry pass
-
ఇంగ్లండ్ కోచ్ మెక్‌కల్లమ్‌కు చేదు అనుభవం..
యాసెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఆసక్తికరంగా మారింది. మూడోరోజు ఆటలో రెండు సెషన్లు దాదాపు వర్షంతో తుడిచిపెట్టుకుపోయినప్పటికి.. ఇంగ్లండ్ పైచేయి సాధించింది. కేవలం ఆఖరి సెషన్లోనే మిగతా ఆరు వికెట్లు కూల్చిన ఇంగ్లండ్.. ఆసీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. దీంతో ఆస్ట్రేలియా ఇంగ్లండ్ ముందు 251 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. ఆటకు ఇంకా రెండు రోజులు సమయం ఉండడంతో ఇంగ్లండ్ గెలుస్తుందా.. లేక ఆసీస్ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంటుందా అనేది చూడాలి. కాగా లార్డ్స్ టెస్టు అనంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్లు సహా సిబ్బందికి ఏదో ఒక రకంగా అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్ అభిమానుల దృష్టిలో అలెక్స్ కేరీ విలన్‌గా మారిపోయాడు. ఇక ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌కు కూడా లీడ్స్‌లోని హెడ్డింగ్లే స్టేడియంలో చేదు అనుభవం ఎదురైంది. మూడో టెస్టు ప్రారంభానికి ముందు స్టేడియం ప్రవేశ ద్వారం వద్ద ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఎంట్రీ పాస్ లేదని ఇంగ్లండ్ ప్రధాన కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను స్టేడియం లోపలికి అనుమతించలేదని సమాచారం. ఇంగ్లండ్ మీడియాలో దీని గురించి కథనాలు వెలువడ్డాయి. ఆ కథనాల ప్రకారం.. సరైన ఎంట్రీ పాస్ లేకపోవడంతో మెక్‌కల్లమ్‌ను భద్రతా సిబ్బంది గేటు వద్ద ఆపేశారు. డ్యూటీలో ఉన్న సెక్యురిటీ గార్డ్ మెక్‌కల్లమ్‌ను గుర్తుపట్టలేదు. అంతేకాకుండా అతడితో వాగ్వాదానికి దిగాడు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో సెక్యురిటీ గార్డ్ తన ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మెక్కల్లమ్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని భద్రతా సిబ్బందిని హెచ్చరించి అక్కడి నుంచి ముందుకుసాగాడు. ఇక మెక్కల్లమ్ న్యూజిలాండ్ తరపున 101 టెస్టులు, 260 వన్డేలు, 71 టి20 మ్యాచ్‌లు ఆడి.. ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లు కలిపి 14,676 పరుగులు సాధించాడు. విధ్వంసకర బ్యాటర్‌గా పేరు పొందిన మెక్కల్లమ్ ఖాతాలో 19 సెంచరీలు, 76 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: #Ashes2023: హద్దు మీరిన ఇంగ్లండ్ ఫ్యాన్స్.. అలెక్స్ కేరీకి చేదు అనుభవం -
KBR Park: కేబీఆర్ పార్కు టికెట్టు ధర పెంపు
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): బంజారాహిల్స్‌లోని ప్రతిష్టాత్మక కేబీఆర్ పార్కు ప్రవేశ రుసుముతో పాటు వార్షిక పాస్ ధరలను అటవీశాఖాధికారులు భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 1 నుంచి అమలు కానున్న ఈ ప్రవేశ రుసుముతో పాటు వార్షిక పాస్‌లను ఆన్లైన్లో రెన్యూవల్ చేసుకోవాలని నోటీసును అతికించారు. వార్షిక ఎంట్రీపాస్(జనరల్) 2021లో రూ. 2250 ఉండగా 2022 నుంచి రూ. 2500 చేశారు. అలాగే సీనియర్ సిటిజన్ వార్షిక ఎంట్రీ ఫీజు పాస్ కోసం గతంలో రూ. 1500 ఉండగా వచ్చే ఏడాది నుంచి రూ. 1700 వసూలు చేయనున్నారు.ఇప్పటి వరకు నెలవారి ఎంట్రీఫీజు రూ. 600 మాత్రమే ఉండగా వచ్చే నెల 1వ తేదీ నుంచి రూ. 700 ఉండనుంది. అలాగే రోజువారి ప్రవేశ రుసుము పెద్దలకు గతంలో రూ. 35 ఉండగా ఇప్పుడది రూ. 40కి చేరింది. పిల్లలకు మొన్నటి వరకు ఎంట్రీఫీజు రూ. 20 ఉండగా ఇప్పుడది రూ. 25కు చేరింది. అలాగే పార్కు వేళలను కూడా కుదించారు. ఉదయం 5 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మాత్రమే వాకింగ్, సందర్శకులకు అనుమతిస్తారు. చదవండి: భార్య, ప్రియుడి హత్య కేసు: భర్త అరెస్ట్ -
సరుకు రవాణా వాహనాలకు పాస్‌లు అవసరం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాల మధ్య నడిచే ట్రక్కులు, ఇతర సరుకు రవాణా వాహనాలు, అన్లోడ్ చేసి వెళ్లే ఖాళీ వాహనాలకు పాస్‌లు అవసరం లేదని హోం శాఖ మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలకు సర్క్యులర్ జారీ చేసింది. లాక్డౌన్ నిబంధనలను సడలిస్తూ ఏప్రిల్ 15న జారీ చేసిన ఉత్తర్వుల్లోని నిబంధన 12(1), నిబంధన 12(6)లపై స్పష్టత ఇచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో సరుకు రవాణా వాహనాలు, అన్లోడ్ చేసిన వాహనాలను పాస్‌ల పేరిట అడ్డుకుంటున్నట్లు ఫిర్యాదు లు వచ్చాయని, వీటికి పాస్‌లు అవసరం లేదని, డ్రైవర్‌కు లైసెన్స్ ఉంటే చాలునని తేల్చి చెప్పింది. దేశంలో వస్తువుల సరఫరా సజావుగా సాగేందుకు ఇది తప్పనిసరి అని వివరించింది. రాష్ట్రాలు, జిల్లా యంత్రాంగాలు ఈ ఆదేశాలు పాటించేలా సూచనలు జారీ చేయాలని కోరింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికులను స్వస్థలాలకు పంపే విషయంలో జారీ చేసిన మార్గదర్శకాలను, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. కరోనా ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని, వీరిని రోడ్డు మార్గంలో శానిటైజ్ చేసిన వాహనాల్లో తరలించాలని తెలిపింది. సంబంధిత రాష్ట్రాల అధికారులు ఈ విషయంలో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుకుంటూ ఉండాలని సూచించింది. -
రైతు.. రవాణా.. విక్రయం
సాక్షి, హైదరాబాద్: రైతు పండిస్తాడు.. ఆ పంట మార్కెట్‌కు అక్కడి నుంచి వినియోగదారుడికి చేరాలి. ఇది సామాజిక ఆహారపు గొలుసు. ఇందులో ఎక్కడ లంకె తెగినా ప్రజలు ఇబ్బందిపడతారు. అది తీవ్రరూపం దాలిస్తే వారు దాడులకు దిగే ప్రమాదమూ ఉంది. అదే జరిగితే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది. ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్డౌన్ ఉద్దేశం తలకిందులవుతుంది. కోవిడ్ వైరస్ కోరలు చాస్తున్న ప్రస్తుత తరుణంలో పోలీసులు ఈ విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ఐదు రోజులుగా లాక్డౌన్ కొనసాగుతున్నా 24 గంటలు ఈ ఆహారపు గొలుసును కాపాడేం దుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇందు కోసం గ్రామా ల్లో ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం పెడుతున్నారు. రైతులంతా ముఖాలకు మాస్క్‌లు కట్టుకొని నిర్భయంగా వ్యవసాయం చేసుకోవచ్చని, పండించిన కూరగాయలు, పాలను ఇబ్బంది లేకుండా మార్కెట్లకు తరలించవచ్చని అభయమిచ్చారు. దీంతో రైతులు తాము పండించిన కూరగాయలను మార్కెట్లకు తీసుకొస్తున్నారు. ఈ బాధ్యతను గ్రామస్థాయిలో ఉండే కానిస్టేబుళ్లు తీసుకుంటున్నారు. ఇక తరలించిన పంటలను మార్కెట్లో అధిక ధరలకు విక్రయించకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. తగ్గిన వాహనాల సంఖ్య: హైదరాబాద్‌లో గురువారం వాహన సంచారం బాగా తగ్గింది. పోలీసులు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సాంకేతికతతో పనిచేసే సాఫ్ట్వేర్ సాయంతో కేసులు బుక్ చేస్తామని ప్రకటించారు. 3 కి.మీ. దూరం దాటే ప్రతి వాహనదారుడిపై కేసులు పెడతామని హెచ్చరించడంతో గురువారం హైదరాబాద్‌లో వాహనాల రాకపోకలు బాగా తగ్గాయి. వస్తువుల సరఫరాకు పాసులు: డీజీపీ నిత్యావసర వస్తువులు సరఫరా చేసే వాహనాలకు ప్రత్యేక పాసులు జారీ చేయాలని కమిషనర్లు, ఎస్పీలు, ఎస్‌హెచ్‌వోలకు డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏయే వస్తువులను ఎక్కడికి రవాణా చేస్తున్నారనే వివరాలు సేకరించి పాసులు ఇవ్వాలని సూచించారు. రవాణా వాహనాలకు పెద్ద పోస్టర్లు... కూరగాయలు, బియ్యం, ఇతర వంట సామగ్రిని సరఫరా చేసే వాహనదారులు తమ వాహనాల అద్దాలపై వారు ఏం రవాణా చేస్తున్నారో తెలిపేలా పెద్ద పోస్టర్లు అంటించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. అలాగే పలు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీసులు వాటి కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా లాక్డౌన్ నుంచి డీజీపీ మినహాయింపు ఇచ్చారు. ఉబర్, జొమాటో, స్విగ్గీ, బిగ్ బాస్కెట్, మిల్క్ బాస్కెట్ ప్రతినిధులు యూనిఫారం, ఐడీ కార్డులు వేసుకుంటే చెక్‌పోస్టుల వద్ద ఎలాంటి ఆటంకాలు ఉండవని డీజీపీ ట్వీట్ చేశారు. -
మద్యం టెండర్లపై మంత్రదండం!
► ఔత్సాహిక వ్యాపారులకు బెదిరింపులు ► దరఖాస్తులు వేయవద్దని పరోక్ష హెచ్చరికలు ► అధికార పార్టీ నాయకుడి అనుచరుల ఆగడాలు ► దుకాణాలు దక్కించుకోవడానికి తీవ్ర యత్నాలు! ► దరఖాస్తులకు నేటితో ముగియనున్న గడువు ► జిల్లావ్యాప్తంగా ‘ఎంట్రీ పాసులు’ 883! సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: జిల్లాలోని 239 మద్యం దుకాణాలకు గత ఏడాది 6,267 దరఖాస్తులు వచ్చాయి.. గురువారం సాయంత్రానికి కల్లా గడువు ముగియనున్నా ఈ సంవత్సరం మాత్రం ఇప్పటివరకూ ఆ స్థాయి హడావుడి కనిపించట్లేదు! నేటి సాయంత్రంలోగా దరఖాస్తులు ఆన్లైన్లో దాఖలైతేనే పరిశీలనకు తీసుకుంటారు. బుధవారం సాయంత్రానికి 2,385 దరఖాస్తులు వచ్చాయి. కానీ దరఖాస్తుల ప్రక్రియలో ప్రారంభ దశ ‘ఎంట్రీ పాసు’ దక్కినవి మాత్రం 883 మాత్రమే! మిగతావి పరిశీలన దశలో ఉన్నాయి. అసలు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడానికి నిన్నటి వరకూ అమావాస్య సెంటిమెంట్ గురించి చెప్పినా తెరవెనుక బలమైన కారణం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడి అనుచరుల బెదిరింపులే కారణమని ఔత్సాహికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం సిండికేట్ వ్యవహారాల్లో ఆరితేరిన తన అనుచరులకే దుకాణాలను కట్టబెట్టేందుకు సదరు నాయకుడు వ్యూహం ప్రకారం చక్రం తిప్పుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం సీసాపై రూ.10 నుంచి రూ.20 వరకూ అదనంగా వసూలు చేస్తున్నా ఇప్పటివరకూ మద్యం దుకాణాలపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీనివెనుక అధికార పార్టీ నేతల అనుచరులు సిండికేట్ అవతారం ఎత్తి చక్రం తిప్పడమే కారణమని తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. ఇలా వసూలు చేసింది కోట్ల రూపాయలే ఉంటుందని అనధికార అంచనా. మరోవైపు బెల్ట్‌షాపులు, బ్రాండ్ మిక్సింగ్, కల్తీ మద్యం.. ఇలా రెండు చేతులా సంపాదించేందుకు ఇదో మంచి వ్యాపారంగా మారిపోయింది. దీంతో చాలా మంది ఔత్సాహికులు ఈ వ్యాపారంలోకి దిగేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. దీనికితోడు ఒక వ్యక్తికి ఒకే దుకాణం కేటాయిస్తామంటూ ఎక్సైజ్ అధికారులు చెప్పడం కూడా దానికి ఊతమిచి్చంది. ఈ నేపథ్యంలో ఈ నెల 24న నోటిఫికేషన్ జారీ చేశారు. దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా వస్తాయని ఎక్సైజ్ అధికారులు భావించినా జిల్లాలో అందు కు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేయాల్సి ఉంది. ఈ ప్రకారం మరో రెండు రోజులే సమయం ఉంది. మంగళవారం నాటికి ఆన్లైన్లో 178 మాత్రమే దరఖాస్తులు దాఖలయ్యాయి. బుధవారం ఉగాది కావడంతో కాస్త ఊపందుకున్నాయి. కానీ 2,385 దరఖాస్తులే వచ్చాయి. వాటిలో ప్రాథమిక పరిశీలన పూర్తయ్యి ఎంట్రీపాస్ దక్కింది మాత్రం 883 దరఖాస్తులకే! మిగతావన్నీ పరిశీలనలో ఉన్నాయి. గెజిట్‌లో సవరణలు... శ్రీకాకుళం, పలాస ఎక్సైజ్ విభాగాల పరిధిలో 239 మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటిని వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2019 జూన్ 31వ తేదీ వరకూ నిర్వహించుకునేందుకు లైసెన్స్ జారీ చేయడానికి ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ 2019 మార్చి 31వ తేదీ వరకే కాలపరిమితిని కుదిస్తూ మంగళవారం గజిట్ నంబరు 61ని విడుదల చేసింది. లైసెన్స్ ఫీజు కూడా రెండు సంవత్సరాలకు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క రోజుపైనే దృష్టి... గత ఏడాది కన్నా ఈసారి దరఖాస్తుల సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత నాలుగు రోజుల్లో స్పందన పూర్తిగా కరువైంది. అధికారులు అంచనా వేసినట్లే అధికార పార్టీలో ఓ ముఖ్య నాయకుడి అనుచరులు కూడా ఔత్సాహిక దరఖాస్తుదారులు ఎక్కువ మంది ఉంటారని అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా శ్రీకాకుళం, టెక్కలి, పలాస, రణస్థలం, పాతపట్నం ప్రాంతాల్లో వేరెవ్వరూ దరఖాస్తులు దాఖలు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. తన అనుయాయుల ద్వారా ఔత్సాహికులు ఎవరో తెలుసుకొని మరీ బెదిరింపులకు దిగుతున్నారు. దీనిపై ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్తున్నట్లు తెలిసింది. వాటని్నంటినీ తట్టుకొని గురువారం ఆన్లైన్లో ఎంతమంది దరఖాస్తులు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. బందోబస్తు ఏర్పాట్లు... అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల బెదిరింపులపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో మరోవైపు ఎక్సైజ్ అధికారులు కూడా వేలం ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించడానికి తగిన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ ఆధ్వర్యం లో ఈనెల 31వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి శ్రీకాకుళంలోని వైఎస్సా ర్ కల్యాణ మండపలో లాటరీ ద్వారా వేలం పాట నిర్వహించనున్నారు. ఎక్సైజ్ శాఖ ఇన్చార్జ్ డిప్యూటీ కమిషనర్ పి.శివప్రసాద్, సూపరింటెండెంట్ జి.నాగేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
ప్రవేశం మరింత సులభం
సాక్షి, ముంబై: సందర్శకులకు శుభవార్త. మంత్రాలయ ప్రవేశాన్ని సులభతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 15వ తేదీలోగా పూర్తిచేయాలంటూ సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఇటీవల ఆదేశించారు. మంత్రాలయలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు, సంబంధిత శాఖ మంత్రులతో భేటీ అయ్యేందుకు నిత్యం ముంబైకర్లతోపాటు రాష్ట్రం నలుమూల నుంచి వందలాది సామాన్యులు వస్తుంటారు. ఇలా వచ్చిన వారంతా గంటల కొద్దీ క్యూలో నిలబడతారు. మధ్యాహ్నం రెండు గంటల తరువాత సంబంధిత అధికారులు ఒక్కొక్కరినీ లోపలికి అనుమతిస్తారు. అంతకు ముందు ప్రవేశం పొందేందుకు కౌంటర్ వద్ద గుర్తింపు కార్డు చూపించి ‘ఎంట్రీ పాస్’ తీసుకోవాల్సి ఉంటుంది. లోపలికి పంపించే సమయంలో ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తారు. ఈ తతంగ మంతా పూర్తయ్యేసరికి సందర్శకుడు తాను కలుసుకోవాలనుకున్న అధికారి లేదా మంత్రి ఉంటారనే నమ్మకం లేదు. ఒకవేళ వారు లేరంటే మళ్లీ మంత్రాలయకు మరోరోజు రావాల్సి ఉంటుంది. ఇక నుంచి ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం నాగపూర్‌లో జరుగుతున్న శాసనసభ శీతాకాల సమావేశాలు పూర్తికాగానే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టునున్నారు. ఇందుకు హోం శాఖ, ప్రజాపనుల శాఖ (పీడబ్ల్యూడీ) అధికారులు సమాచార,సాంకేతిక విభాగాలతో చర్చలు జరపనున్నారు. మంత్రాలయ భవనానికి సమీపంలో ఉన్న వాంఖేడే స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కేవలం 20 నిమిషాల్లో దాదాపు 50 వేల మందికి తనిఖీలు నిర్వహించి స్టేడియంలోకి పంపిస్తారు. మంత్రాలయకు పంపించే సందర్శకులకు కూడా ఇదే విధానాన్ని అవలంబించాలనే అంశం తెరపైకి వచ్చిందని సాంకేతిక,సమాచార శాఖ ప్రధాన కార్యదర్శి రాజేశ్ అగ్రవాల్ తెలిపారు. త్వరలో సాధ్యసాధ్యాలను పరిశీలించి స్టేడియంలో అవలంభించే భద్రతా ప్రమాణాలను పాటించేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. తీసుకోనున్న చర్యలివే... ప్రవేశ ద్వారాల సంఖ్య పెంపు అత్యాధునిక తనిఖీ వ్యవస్థ మహిళలు, సీనియర్ సిటిజన్లకు వెంటనే ప్రవేశం -
కేబీఆర్ పార్కు ప్రవేశ రుసుం డబుల్
బంజారాహిల్స్: నగరంలో ప్రముఖ పార్కుల్లో ఒకటైన బంజారాహిల్స్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్కు (కేబీఆర్ పార్కు) ప్రవేశ రుసుంను ప్రభుత్వం భారీగా పెంచింది. ఈమేరకు శనివారం అటవీ శాఖ అధికారులు జీవో నెం.26ను జారీ చేశారు. దీనిప్రకారం ఈ పార్కు లో వాకర్లు వార్షిక ఎంట్రీపాస్ కోసం రూ.1500 చెల్లించాలి. ఇప్పటి వరకు వార్షిక ఫీజు రూ. 800 ఉండేది. ఇక సీనియర్ సిటిజన్ల పాసును రూ.500 నుంచి రూ.1000 కి పెంచారు. నెలవారీ పాసును రూ. 200 నుంచి రూ.400 చేశారు. అలాగే రోజువారి ఎంట్రీ ఫీజును పెద్దలకు రూ.10 నుంచి రూ.20కి, పిల్లలకు రూ.5 నుంచి రూ.10కి పెంచారు. పెంచిన రేట్లు శనివారం నుంచే అమల్లోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే పాసులు తీసుకున్నవారు పెరిగిన మొత్తాన్ని పార్కు కార్యాలయంలో చెల్లించి రసీదు పొందాలని సూచించారు. బోనాల పండుగ సందర్భంగా ఆదివారం పాసుల జారీకి సెలవు కాగా, సోమవారం నుంచి పాసులు పొందవచ్చని వారు పేర్కొన్నారు.