epicentre
-
గుజరాత్లో భూకంపం..రిక్టర్ స్కేలుపై..
అహ్మదాబాద్: గుజరాత్లో స్వల్ప భూకంపం సంభవించింది. సూరత్ జిల్లాలో శనివారం తెల్లవారు జామున రిక్టర్‌స్కేలుపై 3.8 తీవ్రతతో భూకంపం నమోందైందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మొలాజికల్ రీసెర్చ్(ఐఎస్ఆర్) అధికారులు తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి తరువాత 12.52 నిమిషాలకు భూమి కంపించినట్లు వెల్లడించారు. సూరత్‌లోని పశ్చిమ నైరుతి తీరాన 27 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొన్నారు. భూ ప్రకంపనలు 5.2 కిలోమీటర్ల లోతులో నమోదయ్యాయి. భూకంప కేంద్రం జిల్లాలోని హజీరా తీరాన అరేబియా సముద్రంలో ఉంది. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి లేదా ప్రాణ నష్టం జరగలేదని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు. గుజరాత్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారం.. రాష్ట్రం అధికంగా భూకంప ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. 1819, 1845, 1847, 1848, 1864, 1903, 1938, 1956, 2001లలో గుజరాత్లో భారీ భూకంపాలు చోటుచేసుకున్నాయి. 2001 కచ్ భూకంపం గత రెండు శతాబ్దాల్లో భారత్‌లో సంభవించిన మూడవ అతి పెద్ద, రెండో అత్యంత విధ్వంసక భూకంపం. ఆ సమయంలో 13,800 మందికి పైగా మరణించారు. 1.67 లక్షల మంది గాయపడ్డారు. కాగా ఈ వారంలోనే టర్కీ, సిరియాలో భారీ భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఎత్తైన భవనాలు పేకమేడల్లా కూలిపోవడంతో వాటి శిథిలాలకింద చిక్కుకొని అనేకమంది ప్రాణాలు విడిచారు. భూకంపం ధాటికి రెండు దేశాల్లో మరణించిన వారి సంఖ్య ఇప్పటి వరకు 20 వేలు దాటింది. ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. చదవండి: కాంగ్రెస్ ఎంపీ రజనీపై సస్పెన్షన్ వేటు -
ఉగ్రవాదాన్ని విస్తరిస్తున్న పాకిస్తాన్‌ను ఇంకా ఏమనాలి?
వియన్నా: భారత్‌లోకి ఉగ్రవాదులను ఎగ దోస్తూ, ఉగ్రవాదాన్ని విస్తరింపజేస్తున్న పాకిస్తాన్‌పై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సమర్థించుకున్నారు. ఆస్ట్రియా జాతీయ వార్తాప్రసార సంస్థ ఓఆర్‌ఎఫ్‌కు సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో జైశంకర్ పలు అంశాలు మాట్లాడారు. ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రస్థానం పాక్‌లో ఉందని మీరు చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలో ఒక భారతీయ దౌత్యవేత్త హోదాలో సమర్థించుకుంటారా అని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు జైశంకర్ బదులిచ్చారు ‘భారత పార్లమెంట్‌పై దాడి, ముంబై వంటి నగరాల్లో దాడి చేసి భారతీయులను, విదేశీ పర్యాటకులను చంపి, రోజూ సరిహద్దు గుండా ఉగ్రవాదుల చొరబాట్లకు ప్రయత్నించే పాక్‌నుద్దేశించి ఇంకా ఏమనాలి? ఇంకాస్త పరుష పదం వాడితే బాగుండేది. ఉగ్రవాదానికి కేంద్రస్థానం అనే పదం మంచిదే’ అని వ్యాఖ్యానించారు. ‘పట్టపగలే నగరాల్లో ఉగ్రవాదులకు సైన్యం తరహాలో యుద్ధతంత్రాలు నేర్పిస్తున్నారు. ఈ విపరీతాలను యూరప్ దేశాలు ఎందుకు నిలదీయవు? భారత్, పాక్ మధ్య మళ్లీ యుద్ధం వస్తుందేమోననే భయం ప్రపంచానికి ఉంటే ముందుగా ఉగ్రవాదంపై ప్రపంచదేశాలు దృష్టిపెట్టాలి’ అని హితవు పలికారు. ఇదీ చదవండి: వీడియో: అన్నా చెల్లెలి అనురాగం.. చెల్లిపై ఉప్పోంగిన ఆప్యాయతతో.. -
భూకంప కేంద్రాన్ని గుర్తించిన అధికారులు
సాక్షి, సూర్యాపేట : ఆంధ్ర, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజామున సంభవించిన భూకంప ప్రకంపనలకు చింతలపాలెం మండలం వెల్లటూరు వద్ద 7 కిలోమీటర్ల లోతులో భూకంప నాబి కేంద్రంగా గుర్తించినట్లు ఎన్జీఆర్ఐ చీఫ్ సైటింస్ట్ నగేశ్ వెల్లడించారు. కాగా తెల్లవారుజామున సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైనట్లు భూకంప కేంద్రం నిపుణులు తెలపారు. ఇక్కడి నుంచి వచ్చిన తరంగాలతోనే ఏపీలోని గుంటూరు, కృష్ణా, తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో భూకంపం సంభవించిందని నగేశ్ పేర్కొన్నారు. కాగా రెండున్నర వారాలుగా ఈ ప్రాంతంలో భూమిలోపల భూకంపాలు సంభవిస్తున్నాయని , పగుళ్ల కారణంగానే భూమి కంపిస్తుందని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు సంభవించిన భూకంపాన్ని స్పెసిఫిక్ జోన్-2గా గుర్తించామని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో భద్రాచలంలో 1969లో రిక్టర్ స్కేల్‌పై 5.3గా నమోదైందని, దాని తర్వాత మళ్లీ భూకంపం రావడం ఇదేనన్నారు. అయితే కట్టడాలు బలంగా ఉండడంతోనే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చీఫ్ సైంటిస్ట్ నగేష్ పేర్కొన్నారు. (కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూప్రకంపనలు) -
భారత్ - మయన్మార్ సరిహద్దులో భూకంపం
మణిపూర్: భారత్ - మయన్మార్ సరిహద్దులో ఆదివారం భూంకంప సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కెల్‌పై 5గా గుర్తించారు. సరిహద్దుల్లోన్ని ప్రజలు మాత్రం భయంలో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్ణం కానీ సంభవించ లేదని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ రోజు ఉదయం 11.08 నిమిషాలకు ఈ భూకంపం సంభవించిందని చెప్పారు. ప్రపంచంలో అత్యధిక భూకంపం సంభవించే ప్రాంతాలలో జాబితాలో ఈశాన్యంలోని ఏడు రాష్ట్రాలు ఆరో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.