Essar company
-
ఆర్సెలర్ నిప్పన్ చేతికి ఎస్సార్ ఆస్తులు
న్యూఢిల్లీ: సొంత(వినియోగ) పోర్టులు, విద్యుత్ మౌలిక ఆస్తుల విక్రయాన్ని పూర్తి చేసినట్లు రూయాల కుటుంబ సంస్థ ఎస్సార్ గ్రూప్ తాజాగా వెల్లడించింది. గుజరాత్‌లోని హజీరా, ఒడిషాలోని పారదీప్‌వద్ద గల ఈ ఆస్తులను ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా(ఏఎంఎన్ఎస్)కు అమ్మివేసినట్లు తెలియజేసింది. వెరసి ఎస్సార్ పోర్ట్స్ అండ్ టెర్మినల్స్(ఈపీటీఎల్), ఎస్సార్ పవర్ లిమిటెడ్(ఈపీఎల్)ను 2.05 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 16,500 కోట్లు) విక్రయించింది. దీంతో రుణరహితంగా మారే బాటలో ఆస్తుల మానిటైజేషన్‌ను పూర్తయినట్లు కంపెనీ పేర్కొంది. డీల్‌లో భాగంగా 270 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు, 25 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంగల హజీరా(గుజరాత్) పోర్టు, 12 ఎంటీ వార్షిక సామర్థ్యంగల పారదీప్(ఒడిషా) పోర్టు ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ సొంతమయ్యాయి. కాగా.. ఆస్తుల మానిటైజేషన్‌తో 25 బిలియన్ డాలర్ల(రూ. 2 లక్షల కోట్లు) రుణ చెల్లింపులను పూర్తి చేయడం ద్వారా గ్రూప్ రుణరహితంగా నిలిచినట్లు ఎస్సార్ క్యాపిటల్ డైరెక్టర్ ప్రశాంత్ రూయా పేర్కొన్నారు. చదవండి: ఊహించని షాక్.. ఒకప్పుడు ఈ కారుకి ఫుల్ డిమాండ్, ఇప్పుడేమో ఒక్కరూ కొనట్లేదు! -
ఎస్సార్ బిజినెస్ పార్క్ విక్రయం
రూ.2,400 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్ఎంజీ కార్ప్ న్యూఢిల్లీ: ఎస్సార్ కంపెనీ ముంబైలోని బిజినెస్ పార్క్‌ను విక్రయించింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లో 1.25 మిలియన్ల చదరపుటడుగుల విస్తీర్ణమున్న ఈక్వినాక్స్ బిజి నెస్ పార్క్‌ను బెంగళూరుకు చెందిన రియల్టీ సంస్థ ఆర్ఎంజీ కార్ప్‌కు విక్రయించామని ఎస్సార్ కంపెనీ తెలిపింది. ఈ డీల్ విలువ రూ.2,400 కోట్లని ఎస్సార్ గ్రూప్‌కు చెందిన అన్షుమన్ రుయా పేర్కొన్నారు. కీలకం కాని ఆస్తుల విక్రయ వ్యూహంలో భాగంగా ఈ బిజినెస్ పార్క్‌ను విక్రయించామని వివరించారు. ఈ బిజినెస్ పార్క్ విక్రయం ద్వారా వచ్చిన నిధులను తమ రూ.80,000 కోట్ల రుణ భారం తగ్గించుకోవడానికి వినియోగిస్తామని తెలిపారు. భారత్‌లో ఇటీవల కాలంలో జరిగిన రెండో అతి పెద్ద ఆఫీస్ మార్కెట్ డీల్ ఇది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇదే బీకేసీలో 4.35 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణమున్న కమర్షియల్ స్పేస్‌ను గోద్రేజ్ ప్రోపర్టీస్ రూ.1,480 కోట్లకు విక్రయించింది. -
గడ్కారీ షికారుపై వివాదం
న్యూఢిల్లీ/ముంబై: కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కారీ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన, ఆయన కుటుంబ సభ్యులు 2013 జూలైలో ఫ్రాన్స్‌లోని ఎస్సార్ కంపెనీకి చెందిన విలాసవంతమైన నౌకలో రెండు రాత్రులు బస చేశారని శుక్రవారం మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై కాంగ్రెస్ తదితర పార్టీలు విమర్శలు సంధించాయి. సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. అయితే తాను ఏ తప్పూ చేయలేదని గడ్కారీ స్పష్టం చేశారు. తన జీవితంలో ఏ ఒక్క కార్పొరేట్ కంపెనీ నుంచీ డబ్బు తీసుకోలేదన్నారు. ఎస్సార్ గ్రూప్ అంతర్గత సమాచారంగా పేర్కొంటూ ఓ ‘ప్రజావేగు’ గడ్కారీ పర్యటన వివరాలు బహిర్గతం చేయడంతో వివాదం మొదలైంది. కార్పొరేట్ కంపెనీలు తమ ప్రయోజనాల కోసం అధికారం, పలుకుబడి ఉన్న వారిని ఎలా లోబరచుకుంటున్నాయో ఈ ఉదంతం చెబుతోందని ఆ ప్రజావేగు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు చెందిన ఎన్జీఓ సీపీఐఎల్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు, కార్పొరేట్లకు మధ్య సంబంధాలపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందంతో కానీ, సీబీఐతో కానీ దర్యాప్తు జరిపించాలని భూషణ్ సీపీఐఎల్ తరఫున పిటిషన్ వేశారు. అన్నీ సొంత ఖర్చులే..గడ్కారీ: వివాదం రేగడంతో గడ్కారీ ముంబైలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. ‘పర్యటన నాటికి మంత్రిని కాను, ఎంపీని కాను, ఎమ్మెల్యేను కాను. పర్యటన ఖర్చులన్నీ నా కుటుంబమే పెట్టుకుంది. నేను నార్వే వెళ్తున్న విషయం తెలిసి ఎస్సార్ కంపెనీ వారు ఫ్రాన్స్ తీరంలో తమ విహారనౌకను చూడాలన్నారు. నేను అలాంటిదాన్ని అంతకుముందు చూడలేదు. వారి ఆహ్వానాన్ని అం గీకరించాను. ఫ్రాంక్‌ఫర్ట్‌కు టికెట్ తీసుకుని వెళ్లాను. తర్వాత ‘సన్‌రేస్’ నౌకను సందర్శిం చాను. వాళ్లు రూ. 500 టికెట్ పెట్టినా అందులోకి వెళ్లి ఉండేవాడిని’ అని తెలిపారు.