ఎస్సార్‌ గ్రూప్‌ వ్యవస్థాపకులు శశి రుయా కన్నుమూత | Shashikant Ruia passed away at the age of 81 after a prolonged illness | Sakshi
Sakshi News home page

ఎస్సార్‌ గ్రూప్‌ వ్యవస్థాపకులు శశి రుయా కన్నుమూత

Published Tue, Nov 26 2024 12:35 PM | Last Updated on Tue, Nov 26 2024 12:35 PM

Shashikant Ruia passed away at the age of 81 after a prolonged illness

ఎస్సార్ గ్రూప్ సహ వ్యవస్థాపకులు శశికాంత​్‌ రుయా(81) వృద్ధాప్య కారణాలతో మంగళవారం  మృతి చెందారు. ఆయన మృతిపట్ల ఎస్సార్‌ గ్రూప్‌ సంతాపం తెలియజేసింది. ‘రుయా జీవితకాలంలో లక్షల మందికి ఉపాధి కల్పించి వారి జీవితాల్లో మార్పునకు కారణమయ్యారు. ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించారు. తన వినయం, ఆప్యాయతతో అసాధారణ నాయకుడిగా ఎదిగారు’ అని ఎస్సార్‌ గ్రూప్‌ ప్రకటన విడుదల చేసింది.

శశి రుయా 1943లో జన్మించారు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. తన సోదరుడు రవి రుయాతో కలిసి 1969లో ఎస్సార్‌ గ్రూప్‌ను స్థాపించారు. ఈ గ్రూప్‌ ద్వారా విభిన్న రంగాల్లో సేవలిందిస్తున్నారు. మొదట ఈ గ్రూప్‌ చేపట్టిన ప్రముఖ ప్రాజెక్ట్‌ల్లో మద్రాస్ పోర్ట్ ట్రస్ట్ ఔటర్ బ్రేక్ వాటర్ నిర్మాణం ప్రధానమైంది. అ‍ప్పట్లో ఈ ప్రాజెక్ట్‌ విలువ రూ.2.5 కోట్లు. దీన్ని విజయవంతంగా పూర్తి చేయడంతో ఎస్సార్ గ్రూప్‌నకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

మొదట కన్‌స్ట్రక్షన్‌, ఇంజినీరింగ్‌పై దృష్టి సారించిన ఎస్సార్ గ్రూప్ క్రమంగా వంతెనలు, ఆనకట్టలు, పవర్ ప్లాంట్‌లతో సహా ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టింది. 1980ల నాటికి ఇది చమురు, గ్యాస్ రిజర్వ్‌లను కొనుగోలు చేసి ఇంధన రంగంలోకి విస్తరించింది. 1990ల్లో స్టీల్‌, టెలికమ్యూనికేషన్స్‌ విభాగంలోకి అడుగుపెట్టింది. క్రమంగా ఎస్సార్ గ్రూప్‌ స్టీల్‌ ఇండస్ట్రీ, చమురు శుద్ధి కర్మాగారాన్ని అభివృద్ధి చేసింది. అప్పట్లో దేశంలో రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌ను రూపొందించడానికి ‘హచిసన్‌(హచ్‌)’తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తర్వాతి కాలంలో టెలికాం వ్యాపారాన్ని విక్రయించింది. చమురు శుద్ధి కర్మాగారాన్ని రష్యాకు చెందిన రోస్‌నెఫ్ట్ ఆధ్వర్యంలోని కన్సార్టియంకు మళ్లించింది.

ఎస్సార్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలోని వ్యాపార విభాగాలు

  • ఎస్సార్ ఆయిల్ యూకే

  • ఎస్సార్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ ప్లోరేషన్ & ప్రొడక్షన్

  • ఎస్సార్‌ పవర్‌

  • ఎస్సార్ పోర్ట్స్

  • ఎస్సార్ షిప్పింగ్

  • ఎస్సార్ స్టీల్

  • ఎస్సార్ మిన్‌మెట్‌

  • మెసాబి మెటాలిక్స్

  • ఎస్సార్ ప్రాజెక్ట్స్

  • బ్లాక్ బాక్స్ కార్పొరేషన్

  • ది మొబైల్ స్టోర్

  • ఎస్సార్ గ్లోబల్ ఫండ్ లిమిటెడ్ (ఈజీఎఫ్ఎల్)

  • ఎస్సార్ క్యాపిటల్

  • ఎక్స్‌పెన్షియా వెంచర్స్‌

ఇదీ చదవండి: మళ్లీ అవకాశం రాదేమో! తగ్గిన బంగారం ధరలు..

పలు హోదాల్లో గుర్తింపు

శశి రుయా దేశీయంగా, అంతర్జాతీయంగా అనేక సంస్థల్లో కీలక పాత్ర పోషించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) మేనేజింగ్ కమిటీలో భాగమయ్యారు. ఇండో-యూఎస్ జాయింట్ బిజినెస్ కౌన్సిల్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఇండియన్ నేషనల్ షిప్ ఓనర్స్ అసోసియేషన్ (ఐఎన్‌ఎస్‌ఏ)కు నాయకత్వం వహించారు. ప్రధానమంత్రి ఇండో-యూఎస్ సీఈఓ ఫోరమ్, ఇండియా-జపాన్ బిజినెస్ కౌన్సిల్‌లో సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2007లో రుయా అంతర్జాతీయ సమస్యలపై పని చేస్తున్న ‘ది ఎల్డర్స్’ కౌన్సిల్‌ చేరారు. ఇందులో డెస్మండ్ టుటు, కోఫీ అన్నన్, జిమ్మీ కార్టర్ వంటి ప్రముఖులున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement